top of page

వన్ ది మనీ



 'Won The Money' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 12/08/2024

'వన్ ది మనీ' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


ఒకప్పుడు మనిషికి, మనిషికి మద్య దగ్గర సంబంధం ఉండేది. ఒకరికొకరు చెయ్యి అందించుకుని కులము, మతము భేదం లేకుండా నిస్కల్మషంగా బతికేవారు. అప్పట్లో మనిషికి ఉన్న విలువ డబ్బుకు లేదు. కేవలం డబ్బు అవసరానికి మాత్రమే వాడేవారు. కష్టానికే నమ్ముకుని బతుకుబండి లాగేవారు. అలాగే అప్పట్లో పెద్ద పెద్ద ఆసుపత్రులు కానీ. . ఖరీదైన మందులు కానీ లేవు అయినా. . ! ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేవారు. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాళ్ళు. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటే చాలు తాము కష్టపడైనా మరలా డబ్బు సంపాదించుకు బతుకగలరు. అలాగే కల్తీ అనే మాటే వాడుకలో ఉండేది కాదు. డబ్బు సంపాదించేవాళ్ళే కానీ ఏనాడూ డబ్బు కోసం బతకలేదు. 


నేడు పరిస్థితి మారింది. ఎక్కడ చూసిన, ఎవడిని అడిగిన డబ్బే రాజ్యమేలుతుందని చెబుతాడు. ఒక పేదవాడిని తీసుకుని చూసినా. . కుటుంభం పోషణ విషయంలో తాను పేదవాడు కానీ. .  దురలవాట్ల కోసం ఎంత డబ్బైన, ఎలాగైనా సంపాదించగల నేర్పరి. ఇక్కడే అర్థం అయిపోతుంది ఒక మనిషి కంటే, ఒక కుటుంబం కంటే డబ్బే ఎక్కువ అని. 


అభివృద్ధి చెందుతున్న మన దేశంలో డబ్బు ఉంటే చాలు అన్ని ఉన్నట్లే, ఏదైనా సాదించేసినట్లే అని ఊహించుకుంటున్నారు. అందుకే నేడు అధిక డబ్బు సంపాదనలో పడి విలువైన, ఆనందదాయకమైన జీవితాన్ని, ఇష్టమైన మనుషులను కోల్పోతున్నారు. 


భగీరథ పెద్ద కోటీశ్వరుడు. తండ్రి నుండి వచ్చిన వారసత్వ ఆస్తి మరియు అతని సంపాదన నెలకు కోట్లలో ఉండటంతో దేశంలో టాప్ ఐదుగురు కోటీశ్వరుల్లో భగీరథ ఒకడు. అయితే ఆ మిగిలిన నలుగురితో పోలిస్తే భగీరథ కొంచెం అహంకారమైన మనిషి. కోట్ల ఆస్తులకు అధిపతినని ప్రపంచంలో ఏది కోనాలన్నా కొనగలిగే సత్తా తనకు ఉందని విర్రవీగుతుండేవాడు. 


భగీరథ ఆ విధంగానే డబ్బుతో ఇరువై రెండేళ్ళకే తనకు నచ్చిన ఒక అందగత్తెను పెళ్ళి చేసుకున్నాడు. ఆ అందగత్తె పేరు స్వప్నిక చారు. ఆమె పెళ్ళి చూపులప్పుడు అందవికారంగా ఉండే భగీరథని అతని ముఖం మీదే చెప్పేసింది నిన్ను నేను పెళ్ళి చేసుకోలేనని. 


భగీరథ మాత్రం చారు తల్లిదండ్రులకు కోట్ల ఆస్తులు కావాలో. . నా అందం కావాలో నిర్ణయించుకోండని చెప్పటంతో ఆమె తల్లిదండ్రులు బలవంతంతో భగీరథని వివాహమాడింది. అయితే. . ! కోట్లు ఆస్తులకు అధిపతినని కూసే భగీరథకు తాను అందగాడిని ఎందుకు కాలేదు. . ? కోట్లు ఖర్చు చేసైనా ముఖాన్ని మార్చలేమని అలాగే ఎన్ని కోట్లు ఉన్నా ఒక అమ్మాయి మనసు గెలవలేకపోయాననే ఆలోచన అతడికి రాలేదు. ఎందుకంటే. . ! అతనికి అవన్నీ పట్టవు. ఆ ఆలోచన రానీయకుండా డబ్బు అడ్డు పడింది.


అహంకారపూరితమైన భగీరథ ఆ తర్వాత కూడా చారు మనసు గెలుచుకోలేకపోయాడు. చారు కేవలం తల్లిదండ్రులు కోసం భగీరథతో కాపురం చేస్తుంది అంతే. ఎంత అహంకారం ఉన్నా భగీరథకు మాత్రం చారు అంటే ఎనలేని పిచ్చి. కొంతకాలానికి భగీరథ చారులకు కొడుకు పుట్టాడు. ఆ ఆనందంతో దేశంలో పలు ముఖ్యమైన వారికి ఆతిధ్యం ఇచ్చాడు. అంగరంగవైభవంగా నామకరణం జరిపించాడు. కొడుకు పేరు అఖిలేష్ గా నామకరణం చేశాడు. 


కాలం శరవేగంగా ముందుకు వెళ్ళింది. భగీరథలో ఏ మాత్రం అహం తగ్గలేదు. కొడుకు, భార్యలపై మాత్రం అమితమైన ప్రేమ చూపేవాడు. కొడుక్కి పెళ్ళి కుదిర్చాడు. అతడి పెళ్ళికైతే ప్రపంచ అధినేతలను కూడా ఆహ్వానించాడు. అంతటి డబ్బుగలవాడినని చాటి చెప్పుకున్నాడు. కోట్లు రూపాయల ఆస్తులు ఉండటం వలన కొడుకు వయసుకు మించి బరువు పెరిగాడు. అతడి బరువును చూసి కాకుండా డబ్బుని చూసి పెళ్ళి చేసుకుంది అఖిలేష్ భార్య. అంతటి బరువు వలన నడకలో కూడా చాలా తేడా వచ్చింది. ఇలాగే అఖిలేష్ కి ముప్పై ఏళ్ళు రావటంతో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ప్రపంచంలో ఎక్కడైనా వైద్యం చేయించుకునే సత్తా ఉన్న భగీరథ అదొక లెక్కా. . అనుకున్నాడు. 


కొన్ని రోజులకు సమస్యలు తీవ్రతరం కావటంతో మొదట బ్రిటన్ లో ఓ ప్రముఖ వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళాడు భగీరథ. అక్కడ ఎన్ని కోట్లు ఖర్చు చేసినా నయం కాకపోవడంతో ఆస్ట్రేలియా. . , తర్వాత పారిస్, జపాన్, దక్షిణమెరికా, సింగపూర్, చైనా ఇలా అన్ని దేశాలు తిప్పాడు. అయితే అఖిలేష్ అతి బరువు వలనే ఈ సమస్యలు వచ్చాయని కొవ్వు తీసివేస్తే అతడి ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పటంతో భగీరథ కంగుతిన్నాడు. 


"ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు నా కొడుకుని బతికించండ"ని ప్రాధేయపడ్డాడు. 


కానీ. . . ! అఖిలేష్ సమస్యలు నయం కావాలంటేముందు అతడి బరువు తగ్గించాలి. బరువు తగ్గించాలంటే సర్జరీ ద్వారా అధిక మొత్తంలో కొవ్వు తీసివేయాలి. అది జరిగితే అతడి ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేక వైద్యులు వెనుకంజవేయటంతో చేసేదేమీ లేక కొడుకుని తీసుకుని ఇంటిబాట పట్టాడు భగీరథ. 


కొన్ని రోజులకు చారు వర్షం కురుస్తున్న వేళ ఇంటి ఆవరణలో ఉండగా దగ్గరలో ఒక పిడుగు పడటంతో ఆమె తూలి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళినా. . చారు కోమాలోకి వెళ్ళిపోయిందని వైద్యులు చెప్పటంతో ఏమీ చేయలేని నిస్సహాయతలోకి పోయాడు భగీరథ. 


ఏంటీ. . ? కోట్ల ఆస్తికి అధిపతి కదా. . కొడుకు, భార్యకు ఇలాంటి పరిస్థితి వచ్చినా. . ఏమీ చేయలేకపోయాననే ఆలోచన భగీరథకు వచ్చింది. 


 గతంలో తాను ఎంత దిగజారాడో, డబ్బు వ్యామోహంలో తనలోని ఎంత అహం ఉందో, కోట్లు వస్తున్న కూడా ఏనాడూ పరుల కోసం రూపాయి ఖర్చు పెట్టలేదని గుర్తు చేసుకున్నాడు. 


లక్షల కోట్లు ఉన్నా. . ! ప్రపంచ దేశాల్లో అన్ని ఆసుపత్రులు తిరిగినా. . ! తనకు ఇష్టమైన వ్యక్తి ప్రాణం కాపాడలేకపోయానని జ్ఞానోదయం అయింది. ఎంత డబ్బు ఉన్నా. . , ఎన్ని కోట్లు ఉన్నా. . ! ప్రాణాన్ని డబ్బుతో ముడి పెట్టలేమని తెలుసుకున్నాడు. 


ఇప్పుడు తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తం ఖర్చు చేసినా. .  ఎన్ని దేశాలు తిరిగినా. . ఎందరు వైద్యులను కలిసినా. . తన కొడుకుని, భార్యను యధాస్థానంలోకి తీసుకురాలేరని భగీరథకు అర్థం అయింది. 


ఇన్నాళ్లు. . భగీరథ డబ్బుతో ఎందరో మనుషులను, ప్రపంచ దేశాలను గెలిచాడు. చివరకు డబ్బు చేతిలో భగీరథ ఓడిపోయాడు. బతకటానికి డబ్బు అవసరమే కానీ. .  డబ్బు కోసం ఎప్పుడు జీవించేవారు డబ్బుతో ప్రాణాన్ని, మానాన్ని కోనలేరు. డబ్బు కంటే ఆరోగ్యం ముఖ్యం. అది సక్రమంగా ఉంటే డబ్బు తర్వాత సంపాదించుకోవచ్చు. 


భగీరథకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది కానీ. . తనకు ఇష్టమైన మనుషులను మాత్రం కాపాడలేకపోయాడు. 

**** **** **** **** **** ****

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

నా పేరు పిట్ట.గోపి నేను శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఎం ఏ సోషల్ వర్క్ పూర్తి చేశాను. నాకు సమాజాన్ని,సమాజంలో మనుషులను గమనించటం అలవాటు. ముఖ్యంగా సమాజంలో జరిగే ఏ చిన్న మంచి-చెడులనైనా.. మంచి కథలుగా మలచటంలో నాకు నేనే సాటి.వ్రృత్తిరిత్య నేను వ్యవసాయ కుటుంభంలో మద్యతరగతికి చెందిన వ్యక్తిని.ఇప్పటికే నేను రాసిన కథలు 90కి పైగా మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ లో ప్రచూరితం అయ్యాయి.అలాగే ప్రతిలిపిలో కూడా నా కథలు అచ్చయ్యాయి. నా కథలు బహుమతులుకు ఎంపికకాకున్నా..(లాప్టాప్ లేదు) ఫోన్ లోనే టైపింగు చేయాలన్నా కథలు పంపాలనే ఆశక్తి తగ్గిపోతుంది. కానీ..! సమాజంలో జరిగే సంఘటనలకు అక్షరరూపం ఇచ్చి పదిమందికి తెలపాలనేదే నా అభిలాష. నా కథల్లో మంచి చెడులను పాఠకులు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం



37 views0 comments

Comments


bottom of page