కచదేవయాని - పార్ట్ 70

Kachadevayani - Part 70 - Telugu Mythological Serial | T. V. L. Gayathri
కచదేవయాని - పార్ట్ 70 - తెలుగు ఇతిహాస ధారావాహిక | T. V. L. గాయత్రి
Published In manatelugukathalu.com On 29/09/2026
దేవయానితో వివాహానికి ఘడియలు దగ్గరపడుతున్నా యయాతి ముఖంలో పెళ్లికళ కనిపించలేదు. శర్మిష్ఠతో కలిసి రాజ్యాన్ని వదిలి పల్లెలోనే కొత్త జీవితం ప్రారంభించాలనే ఆలోచన అతడి మనసులో ఎలా రూపుదిద్దుకుందో టి. వి. యెల్. గాయత్రి గారి ‘కచ దేవయాని’ 70వ భాగంలో చదవండి.
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. శర్మిష్ఠ ప్రేమించింది యయాతిని అని తెలుసుకుంటుంది దేవయాని.
తనకు యయాతితో వివాహం జరిపించమని తండ్రిని కోరుతుంది. శుక్రాచార్యుని సహాయం కోసం దేవయానిని వివాహం చేసుకోవడానికి సమ్మతిస్తాడు యయాతి. శర్మిష్ట ముఖంలో దుఃఖపు ఛాయలు బయటపడక పోవడంతో దేవయాని అసంతృప్హి చెందుతుంది,
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 57 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 58 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 59 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 60 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 61 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 62 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 63 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 64 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 65 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 66 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 67 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 70 చదవండి
యయాతిని పెండ్లికుమారుడిగా చేసి ఉత్సవాలు చేస్తున్నారు నహుష చక్రవర్తి కుటుంబ సభ్యులు.
విందులు, వినోదాలలో పాల్గొంటున్నా గంభీరంగా ఉంటున్నాడు యయాతి. అతడి ముఖంలో విషాద ఛాయలు... అతడిలో పెళ్లికళ లేకపోగా జీవితఖైదు పడిన ముద్దాయి లాగా కనిపిస్తున్నాడు.
అతడి కుటుంబానికి, పరివారానికి అతడి మానసిక పరిస్థితి అర్థమవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయతతో చూస్తున్నారు.
రాత్రి పూట మాత్రం ముతక దుస్తులను ధరించి, నులక మంచం మీద ఒంటరిగా నిద్రపోతున్నాడు యయాతి.
వివాహపు ఘడియలు దగ్గరపడుతున్నాయి.
ఆ రోజు రాత్రంతా ఆలోచిస్తూ గడిపాడు యయాతి.
ఇంకా తెల్లవారలేదు. ఆకాశంలో చిరు చీకట్లు ముసురుకొని ఉన్నాయి.
భుజం మీద కండువా వేసుకొని బయలుదేరాడు యయాతి. అతడు గదిలో నుంచి బయటకు రాగానే అంగరక్షకుడు రుద్రబాహు గబగబా అతడి దగ్గరికి వచ్చాడు.
రాజభవనం బయటికి వచ్చాడు యయాతి.
"ప్రభూ! రథాన్ని సిద్ధం చేయమందురా?" అని అడిగాడు రుద్రబాహు.
"గుర్రాన్ని తీసుకురా!" అన్నాడు యయాతి.
గుర్రాన్ని ఎక్కి దౌడు తీయించాడు.
అతడితో పాటు రుద్రబాహు కూడా మరో గుర్రాన్ని ఎక్కి అనుసరించాడు.
రాజధాని ప్రధాన ద్వారం దగ్గర వీళ్ళను ఆపారు కావలి వాళ్ళు.
"ఎవరనుకున్నారు? యయాతి రాకుమారుడు! పక్కకు జరగండి!" అని గదమాయించాడు రుద్రబాహు.
నివ్వెర పోయారు కావలివాళ్ళు.
అసలు రాజకుమారుడేనా? కాసేపటికి పోల్చుకున్నారు వాళ్ళు.
నిజమే! ఆ వేషం ఏమిటి?
అయోమయంగా చూస్తున్న వాళ్ళతో
"యువరాజు మారు వేషంలో రాచకార్యార్థం బయటకు వెళుతున్నారు. మీరు ఎవ్వరితో ఈ విషయం చెప్పరాదు!" అన్నాడు రుద్రబాహు.
కావలివాళ్ళు వంగి దండాలు పెట్టి దారి ఇచ్చారు.
రాజధాని బయటకు వచ్చారు.
"ఎక్కడికి వెళ్తున్నాము ప్రభూ?" అని అడిగాడు రుద్రబాహు.
"తెలీదు!" అని గుర్రం డొక్కలో కాలితో ఒక్కటి కొట్టాడు యయాతి.
గుర్రం పరుగు తీస్తున్నది.
దాదాపు రెండు గంటలపాటు ప్రయాణం చేశారు వాళ్ళు.
సూర్యుడు వెలుగు చిమ్ముతున్నాడు.
జనపదాలు కనిపిస్తున్నాయి.
పొలాల్లో రైతులు వరినాట్లు వేస్తున్నారు. అక్కడ ఆడవాళ్లు కూడా ఉన్నారు.
గుర్రాన్ని దిగాడు యయాతి.
"ఇక్కడి వాళ్లకు నా పరిచయం గురించి చెప్పొద్దు!" అన్నాడు రుద్రబాహుతో.
"అలాగే ప్రభూ!" అన్నాడు రుద్రబాహు.
యయాతి పొలాలకు దగ్గరగా నడుస్తున్నాడు.
రుద్రబాహు గుర్రాలను అక్కడున్న చెట్టుకు కట్టేసి వచ్చాడు.
"ఏ రాజ్యం వాళ్ళు మీరు?" అని యయాతిని ప్రశ్నించాడు ఒక రైతు.
"ప్రతిష్ఠానపురం. సైనికులం," ముక్తసరిగా జవాబిచ్చాడతడు.
"అబ్బో! మీ యువరాజు ఎంత గొప్పవాడయ్యా! ఒంటి చేత్తో యుద్ధాన్ని గెలిపించాడు కదా!" అన్నాడా రైతు ఆనందంగా.
మాట్లాడలేదు యయాతి.
ఇంతలో నలుగురైదుగురు రైతులు వీళ్ళ దగ్గరికి వచ్చారు.
"మీకు బోలెడు బహుమానాలు వచ్చుంటాయిగా! మొత్తానికి మీరంతా గొప్ప వీరులు. మా ఊళ్ళో మీ యువరాజు కథలే చెప్పుకుంటున్నారు. దేవలోకం నుంచి విమానాన్ని తెచ్చాడంటగా!" అన్నాడు మరొక రైతు.
యయాతి మాట్లాడకుండా అక్కడున్న గట్టు మీద కూర్చున్నాడు.
పచ్చటి పొలాల మీద గాలి చల్లగా అతడి శరీరాన్ని తాకుతున్నది.
పొలం మడిలో కాళ్ళు పెట్టాడు. చల్లటి బురద.
అలాగే కూర్చున్నాడు.
ఇంతలో ఒక పెద్దావిడ అక్కడికి వచ్చింది.
"అబ్బాయ్! మీ ఇద్దరు మా పల్లెకు ఏం పని మీద వచ్చారు?"
ఆవిడ వైపు చూశాడు యయాతి.
ఆ పెద్దావిడ కళ్లల్లో ఆప్యాయత కనిపించింది.
"ఎటు వెళ్లాలో తెలియక ఇటు వచ్చాము!" అన్నాడు యయాతి.
"ఎక్కడికెళ్లాలో తెలియకుండా బయలుదేరారా? ఏమిటి విషయం?" అన్నాడు ఒక రైతు.
"మా వాళ్ళను వదిలి ఎక్కడికన్నా వెళ్దామని!"
చుట్టు పక్కల వాళ్లకు ఇంకా అయోమయంగా ఉంది.
పెద్దావిడ వచ్చి యయాతి పక్కన కూర్చుంది.
"అబ్బాయ్! నువ్వు నా కొడుకు లాంటి వాడివి. నీ కష్టం ఏమిటో చెప్పు! చేయగలిగినంత సాయం చేస్తాము!" అంది పెద్దావిడ.
యయాతి మాట్లాడకుండా పొలంలోని బురదను చేత్తో తీసి మోచేతుల దాకా పూసుకుంటున్నాడు.
"ఏమిటబ్బాయ్! మాట్లాడవు?" అని రుద్రబాహు వైపు చూశాడు మొదటి రైతు.
రుద్రబాహు మౌనంగా ఉన్నాడు.
"సరిపోయింది! మీలో మీరు బాధపడితే కష్టం తీరుతుందా? మాతో చెబితే తీర్చుతాము!" అంది ఒక పడుచు పిల్ల.
యయాతి వాళ్ళను చూశాడు. అమాయకమైన పల్లె ప్రజలు.
తన మనసులో ఉన్న బాధను వీళ్ళతో చెప్పుకుంటే నష్టం ఏమీ లేదు అనిపించింది అతడికి.
"నేనొక అమ్మాయిని ప్రేమించాను. నా కర్మ ఏమిటంటే ఆ అమ్మాయితో నా పెళ్లి జరగటం లేదు...."
అక్కడున్న వాళ్లకు నవ్వు వచ్చింది.
"ఓస్ ఇంతేనా! దీనికే మీవాళ్ళని వదిలేసి పోతున్నావా?" అంది పెద్దావిడ.
కొంతమంది చిన్నగా నవ్వుతున్నారు.
విస్మయంగా వాళ్ళ వైపు చూశాడు యయాతి.
"ఇది పెద్ద కష్టం కాదా?"
"ఎందుకు కాదు? అవుతుంది. కానీ దీనికోసం పెద్దగా ఏడవక్కర్లేదు. మీవాళ్లకు గట్టిగా చెప్పు!"
నిట్టూర్చాడు యయాతి.
"అవన్నీ అయ్యాయి. నేను మరో అమ్మాయిని చేసుకోవాల్సి వస్తోంది!"
చుట్టూ ఉన్న వాళ్ళు సానుభూతిగా చూశారు.
"ఓ పని చెయ్! ఎవ్వరికీ చెప్పకుండా నీకిష్టమైన అమ్మాయిని ఇక్కడికి తీసుకురా! మేము పెళ్లి చేస్తాం! అంతగా అయితే మీవాళ్లు ఒప్పుకొనే దాకా మా దగ్గరే ఉండండి!" అంది పడుచుపిల్ల.
"మీ దగ్గరా? ఎలా ఉంటాను? నాకు యుద్ధం చేయటం తప్ప మరొక పని చేతకాదు."
"ఇదిగో ఈ పొలంలో పని చేసుకోండి! మా దగ్గరే ఒక గుడిసె వేసుకోండి! హాయిగా ఉండండి! ఓ సంవత్సరానికి పిల్లో పిల్లవాడో పుడితే మీవాళ్లే పరిగెత్తుకొని వస్తారు! చూస్తూ ఉండు!" అంది పెద్దావిడ.
"పొలం పనా? నాకు చేతకాదేమో! నా కాబోయే భార్యకు కూడా రాదు! ఎలాగా?" అన్నాడు తలవంచుకొని.
"ఇదిగో! ఈ నారు పట్టుకో!" అన్నాడు ఒక యువకుడు నారుకట్టను యయాతికి ఇస్తూ.
నారుకట్టను తీసుకున్నాడు యయాతి.
"మడిలోకి దిగు! మేము ఎట్లా నాటుతున్నామో అట్లాగే నాటుకుంటూ వెళ్ళు!" అని ఆదేశించింది పడుచుపిల్ల.
మడిలోకి దిగాడు యయాతి.
పక్కవాళ్ళను చూసి నారు నాటడం మొదలు పెట్టాడు.
రుద్రబాహు కూడా మడిలోకి దిగబోయాడు.
"నువ్వు గట్టు మీదే ఉండు!" అన్నాడు చిన్నగా యయాతి.
అలాగే గట్టు మీద నిల్చున్నాడు రుద్రబాహు.
ఒక గంట గడిచింది.
ఎండ మిటమిటలాడుతోంది.
"ఇప్పుడు చెప్పు! పొలంలో పని చేయడం వచ్చింది కదా! ఇంకేమిటి కష్టం?" అంది పెద్దావిడ.
నిజమే! ఇంకేముంది?
యయాతి మనసు తేలికపడింది.
"నేను వెళ్లి అమ్మాయిని ఇక్కడికి తీసుకొని రానా?" అన్నాడు వాళ్ళని అనుమతి కోరుతున్నట్లు.
"తీసుకురా! నీకేం భయం లేదు! మిమ్మల్ని మేము చూసుకుంటాము!" అన్నాడు ఇందాకటి యువకుడు.
"తీసుకురా! నీకేం భయం లేదు!మిమ్మల్ని మేము చూసుకుంటాము!"అన్నాడు ఇందాకటి యువకుడు.
మడిలో నుంచి బయటికి వచ్చాడు యయాతి.
బావి దగ్గర స్నానం చేశాడు.
ఆ పల్లె వాళ్ళు ఇచ్చిన దుస్తులను కట్టుకున్నాడు. ఇప్పుడు అతడికి జీవితం మీద ఆశ పుడుతోంది.
'ఈ పల్లెలో ఉంటే ఎవరికీ తెలియదు. ఒకవేళ తెలిసినా రాజ్యాన్ని వదిలేసి వ్యవసాయం చేసే వాడిని దేవయాని ఛస్తే పెళ్లి చేసుకోదు.
తను శర్మిష్ఠ సుఖంగా....'
ఉత్సాహంగా ఈలవేస్తూ కూనిరాగం తీశాడు.
"వెళ్లిరానా మరి?" అన్నాడు గుర్రాన్ని ఎక్కి.
అక్కడున్న వాళ్లంతా నవ్వుతూ చేతులూపారు.
రాజధాని వైపు గుర్రాన్ని పరిగెత్తించాడు యయాతి. అతడి వెనకాలే రుద్రబాహు.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 71 త్వరలో
===============================================
T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.







Comments