top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 35

Updated: Jan 20

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు


Kachadevayani - Part 35 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 15/01/2026

కచదేవయాని - పార్ట్ 35 తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 


దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. 


కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. వృష పర్వుడిని కలిసి, కచుడు వచ్చినట్లు చెబుతుంది దేవయాని. అతనితో కలిసి, దుర్మిలుడనే మంత్రవేత్త వద్దకు వెళ్తుంది.


కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక కచదేవయాని పార్ట్ 28 చదవండి. 

ఇక కచదేవయాని ధారావాహిక ముప్పై ఐదవ భాగం చదవండి. 


కొంతసేపు ముగ్గురు మౌనంగా ఉన్నారు.


"దుర్మిలా! నీకు గుర్తుందా! ఇంతకు ముందు ఈ దేవతల్ని మనం చాలా సార్లు గెలిచాము. కానీ ఈ కచుడు గురువుగారిని మాయ చేసి మృతసంజీవని విద్యను నేర్చుకున్నాడు.

అప్పటి నుండి మనం దేవతలతో యుద్ధానికి వెళ్ళటం లేదు. దాన్ని అలుసుగా తీసికొని కచుడు మన అంతఃపురం దగ్గరికి వచ్చాడు. ఈ సారి వాడిని ఎలా అయినా పట్టుకోవాలి! " దానవరాజు కంఠం తీవ్రంగా పలికింది.


" అతడు మళ్ళీ మన సీమకు వస్తే అతడిని పట్టుకోవటానికి మార్గమేదయినా ఉందా? " అడిగింది దేవయాని.


"నా దగ్గర ఒక మణి ఉంది.కొంచెం దూరం నుండైనా శత్రువు వైపుకు అంటే ఈ మణి నుండి వచ్చే కిరణాలు శత్రువు మీదకు ప్రసరించేటట్లు ఈ మణిని పెట్టగలిగితే అతడు కాసేపు అచేతనుడవుతాడు. అంటే ఎలా ఉన్నవాడు ఆలాగే నిలబడి పోతాడన్నమాట! "అంటూ దుర్మిలుడు లోపలికి వెళ్లి ఒక చిన్న పెట్టెను తెచ్చాడు.

అందులో ధగధగా మెరుస్తున్న మణి ఒకటి ఉంది. నిమ్మపండంత పరిమాణంలో ఉండే రత్నమది.


ఆ చిన్న పెట్టెను దేవయాని చేతికిచ్చాడు దుర్మిలుడు


"ఈ మణి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసికోవాలి. దీనిని భూమి మీద పెట్టరాదు.భూమిని తాకిన వెంటనే మణిలోని శక్తిని భూమాత ఆకర్షిస్తుంది.అప్పుడిది పని చేయదు."


"కంఠంలో ధరించవచ్చా?"అడిగింది దేవయాని.


"ధరించవచ్చు! అయితే దీనిని ధరించిన వాళ్ళు కొంత స్థితప్రజ్ఞులయితే మంచిది. బలహీనమైన మనస్తత్వం ఉన్న వాళ్లయితే... అంటే కామక్రోధాదుల్లాంటి అరిషడ్వర్గాలతో సతమతమయ్యే వాళ్లయితే మాత్రం ఈ మణిని ధరించకుండా ఉంటే మంచిది. ఈ మణి వలన వాళ్లలో ప్రకోపం ఎక్కువవుతుంది. కాసేపు చేతితో పట్టుకుంటే ప్రమాదం లేదు. కానీ చంచలమైన మనస్తత్వం ఉన్నవాళ్లు జాము కంటే ఎక్కువ సేపు దీన్ని ధరిస్తే ఆ వ్యక్తుల మనస్సుల్లో అనవసరంగా ఉద్వేగం, క్రోధం ఎక్కువవుతాయి. ఆ విపరీతమైన ధోరణిని నివారించటం అసాధ్యం! మణిని తీసి వేసినా దాని ప్రభావం నాలుగైదు రోజులుంటుంది. ఆ ప్రకోపంతో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చెప్పటం కష్టం! ఇది మాత్రం గుర్తుంచుకోవలసిన విషయం! "అంటూ మణి గురించి వివరించాడు దుర్మిలుడు.


"దుర్మిలా! అమ్మాయి ఎవరనుకున్నావు? సాక్షాత్తు గురువుగారి కూతురు. ఎంతో స్థితప్రజ్ఞత, సంయమనం కల గుణవంతురాలు. అమ్మాయి విషయంలో ప్రమాదం లేదు. రాదు కూడా! " అన్నాడు నవ్వుతూ దానవరాజు.


 దేవయానిని మెచ్చుకోలుగా చూశాడు దుర్మిలుడు.


"అవునవును! క్షమించండి మహారాజా! పొరబాటుగా సామాన్యులకు చెప్పినట్లు జాగ్రత్తలు చెబుతున్నాను. గురువుగారు మహానుభావులు. సాక్షాత్తు పరమశివునికి ప్రతిరూపం. ఆ తపశ్శాలి కుమార్తె సామాన్యురాలవుతుందా! తల్లీ! నీవీ మణిని నిరంభ్యంతరంగా ధరించవచ్చు! సందేహించనవసరం లేదు! దీనిని మంత్రించిన వస్త్రంలో చుట్టి ఇస్తాను."అంటూ దుర్మిలుడు అక్కడే ఉన్న ఎర్రటి వస్త్రంలో నుంచి చిన్న ముక్కను చింపి దాన్ని తాడులాగా పేని,మంత్రాలను చదువుతూ ఆ తాడుకు మణిని గట్టిగా ముడివేసి మరలా పెట్టెలో పెట్టి దేవయాని కందించాడు.


"ఇంక వెళ్తామంటూ" లేచాడు దానవరాజు.


రథం దాకా వచ్చి వీళ్ళను సాగనంపాడు దుర్మిలుడు.

రాజధానికి చేరుకున్నారందరు.

రథం దిగింది దేవయాని.


"మహారాజా! నేను శర్మిష్ఠ అంతస్తులోకి మారమంటారా! ఒక్కదాన్నే పై అంతస్తులో ఉంటే...." 


"ఆలాగే తల్లీ! నేనే చెబుదామనుకొంటున్నాను. నువ్వు, శర్మిష్ఠ ఒకే అంతస్తులో ఉంటే బాగుంటుంది. అంతఃపురానికి భద్రతను పెంచుతున్నాను. ఈ సారి ఆ దుర్మార్గుడు వస్తే మాత్రం ప్రాణాలతో తిరిగి వెళ్ళటం కల్ల! చూద్దాము! "


మహారాజు దగ్గర సెలవు తీసికొని అంతఃపురంలోకి వచ్చింది దేవయాని. ఆ రాత్రికే ఆమె తన సామానుతో శర్మిష్ఠ ప్రక్క గదిలోకి మారింది.


===============================================

ఇంకా వుంది..

===============================================

 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page