top of page

శ్రీలేఖ పుట్టగానే MBA

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #Narakapuramlo Varthalu, #నరకాపురంలో వార్తలు, #TeluguChildrenStories

RRR - S : (శ్రీలేఖ పుట్టగానే MBA) 

Srilekha Puttagane MBA - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi

Published In manatelugukathalu.com On 01/05/2025

శ్రీలేఖ పుట్టగానే MBA - తెలుగు కథ

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


1)

ముగ్గురు విద్యార్ధినులు RRR: రమ్య, రవళి, రష్మి.. యొక్క.. కాలేజీ చదువులు ముగిశాయి. ముగ్గురు అన్నింటిలో ప్రతిభావంతులు. అన్ని విషయాలలో తెలివైన వారు. పై చదువుల లో ఏ విషయం తీసుకుని అభివృద్ధి చెందాలి?, భవిష్యత్తు పురోగమనం యే దారిలో ???.. అనే విషయం పై తర్జన - భర్జన చేశారు. ఇతరులను, విద్య సలహాదారులను సంప్రదించారు. ఎవ్వరూ వారికి సరిగ్గా సలహా ఇవ్వలేక పోయారు. ఆ ముగ్గురికి (RRR కు) స్నేహితురాలు (బెస్ట్ ఫ్రెండ్) అయిన శ్రీలేఖ (S) కు ఏదో మాటల్లో.. తమ సందిగ్ధం - సమస్య వెలిబుచ్చారు. 


2)

శ్రీలేఖ చిరు నవ్వుతో వారిని (RRR ను) ఓ క్యాబ్ లో.. పక్క ఊరిలో కి ఎడారి ప్రాంతం కు తీసుకు వెళ్ళింది. అక్కడ బాగానే ఉన్నది జనాభా. 


1వ స్నేహితురాలు రమ్య ఇలా అన్నది. "ఇంత వేడిగా ఉన్నది ఈ ఎడారి ప్రాంతం. అలా అని ఇక్కడ జనాభా తక్కువేమి కాదు. కానీ ఈ వేడి లో ఈ మనుషుల ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉండే మార్గం చూడాలి.. అయ్యో పాపం", అన్నది. 


2వ స్నేహితురాలు రవళి ఇలా అన్నది, "పాపం తలకు టోపీలు కూడా వేసుకోరు ఈ వేడి ఎడారి ప్రాంతం లో. గొడుగులు కూడా వాడారు నీడ కోసం. త్రాగే నీరు సరఫరా కూడా సరిగ్గా లేదు ఇక్కడ. ప్రభుత్వం కు, ఇతర పెద్దలకు చెప్పి వీరికి అన్నీ సదుపాయాలు కల్పించాలి.. అయ్యో పాపం", అని. 


3వ స్నేహితురాలు రష్మి ఇలా అన్నది. "ఇక్కడ టోపీల - చెప్పుల - గొడుగులు వ్యాపారం.. త్రాగే మంచి నీరు మరియు మజ్జిగ - కూల్ సాప్ట్ డ్రింక్స్ అమ్మే (సీసాల).. , ఎ. సి లు, రిఫ్రిజిరేటర్ లు, కుండలు మరియు ఫ్యాన్లు అమ్మే - తయారు చేసే వ్యాపారం పెడితే.. కొన్ని రోజుల్లో అభివృద్ధి చెందుతుంది.. బాగా డబ్బు - ఆదాయం - లాభాలు వస్తుంది", అని


3)

వెంటనే శ్రీలేఖ రమ్య ను వైద్య వృత్తి - వైద్య ఔషధ పరిశోధన సంబంధిత చదువు కు - వృత్తికి వెళ్ళ మన్నది. 


రవళి ను సామాజిక సేవ సంబంధిత పై చదువు (ఐ. యేఎస్, కలెక్టర్ లేక ఇతర) ఎన్నుకో మన్నది. 


రష్మి ను వ్యాపార సంబంధిత పై చదువు చేసుకో (ఎం. బి. ఎ).. లేక.. వెంటనే వ్యాపారం మొదలు పెట్టు, .. అలాగే, పార్ట్ టైం లేక ఆన్ లైన్ లో కూడా ఎం. బి. ఎ. పూర్తి చెయవచ్చు అని సూచన ఇచ్చింది. 


అంతే కాదు.. ఆ ఆ విషయాలలో ఉన్న కంప్యూటర్ ప్యాకేజ్ లు కూడా వారు నేర్చుకోవాలి అని కూడా అభిప్రాయం వెలిబుచ్చింది. 


4)

ముగ్గురు అమ్మాయిలు (RRR) తమ (బెస్ట్ ఫ్రెండ్) ఉన్నత స్నేహితురాలు శ్రీలేఖ (S) ను కౌగలించుకుని.. నువ్వు పుట్టగానే ఎం. బి. యే. , .. మంచి సంతోష పూరిత - పరిష్కారాల మేనేజర్ మరియు కౌన్సిలర్ (సలహా దారురాలు) అని కితాబు ఇచ్చారు. 


శ్రీలేఖ చెప్పినట్టే చేశారు. భవిష్యత్తు కార్యక్రమం ఎన్నుకున్నారు. 


5) 

త్వరలోనే ఆ ముగ్గురూ తాము ఎన్నిక చేసుకున్న రంగాలలో బాగా ప్రగతి, అభివృద్ధి, అభ్యుదయం పొందారు. స్థిర పడ్డారు. బాగా సౌభాగ్యం, ఐశ్వర్యం కూడా పొందారు. 


శ్రీలేఖ కూడా త్వరలోనే మంచి అంతర్జాతీయ కౌన్సిలర్ - సలహా దారురాలు గా - అంతర్జాతీయ సంతోష పూరిత నిర్వాహకురాలు గా, 

ప్రపంచ ఆనంద దాయక పరిష్కారాల మేనేజర్ గా.. అభివృద్ధి చెందింది.. అంతర్జాతీయం గా పేరు తెచ్చుకుంది. ధనార్జన (డబ్బులు) కూడా బాగా వెనకేసుకుంది. 


ఆ నలుగురు RRR - S ( శ్రీలేఖ ) కూడా.. వారు కలసి స్థాపించిన సంస్థలకు ఆమె (S) నే ముఖ్య మేనేజర్ - ముఖ్య సలహాదరురాలిగా నియమించారు. 

--------- X X X ----- X X X ------- X X X ---------


నీతి:

I)

మన నైజం, అనుకూలత, ప్రతిభ, ఇష్టం, సానుకూలత ను బట్టి పయనిస్తే.. పై చదువులు - వృత్తి ఎన్నుకుంటే.. సహ వ్యక్తులను ఎన్నుకుంటే.. జీవితం లో చాలా ఎత్తుకు ఎదిగి.. కీర్తి కిరీటాలు అందుకోవచ్చు.. ప్రగతి, అభ్యుదయం, ఐశ్వర్యం, సౌభాగ్యం మరియు మంచి ఆరోగ్యం తో సహా. 


Ii)

మన వృత్తి - చదువుల సంబంధిత కంప్యూటర్ ప్యాకేజీ లు, కోర్సు లు చేస్తే.. మనకి తోడ్పడుతుంది.. ఉన్నత శిఖరాలను అధిరోహించటానికి.. కీర్తి కిరీటాలు ఆసన్నం చేసుకోటానికి


Iii)

ఎక్కడైనా.. ఎప్పుడైనా.. వేరే వైపు.. వేరే దిశ కు వెళ్ళాలి అనుకుంటే.. ఉత్సాహం - ఉల్లాసం - స్ఫూర్తి ఉంటే.. ధైర్యముగా వెళ్ళవచ్చు.. చక్కటి ప్రణాళికతో. 


Iv) 

డబ్బులు అదా చేసే.. డబ్బు పొదుపు గా, జాగ్రత్తగా వాడే.. అలవాటు చేసుకుంటే.. ముందు ముందు.. చాలా విషయాల్లో.. సహాయ పడుతుంది. అవసరానికి పనికి వస్తుంది. 


V) 

స్నేహితులతో, కౌన్సిలర్స్ తో సమస్యలు చర్చిస్తే.. మంచి పరిష్కారాలు రావచ్చు.. ఇతరుల నుండి లేక మన నుండే. 


అందుకే అందరితో స్నేహం గా మెలగాలి. ఎవ్వరితో కీచులాటలు - కొట్లాటలు - కోప తాపాలు పెట్టుకోవద్దు. మృదువుగా మాట్లాడటం.. ప్రతీది, సంతోష పూరిత నిర్వహణ ప్రాజెక్ట్ గా.. ఆనంద దాయక పరిష్కారాల ప్రాజెక్ట్ అవకాశం గా తీసుకోవాలి. 


ఇదెలా సాధ్యం?


ఇష్టం లేని వారితో, దుష్టులతో, ఏడిపిచ్చే వారితో, హీనం గా చూసే వారితో.. దూరం గా మెలగాలి. అప్పుడు శక్తి - యుక్తి మనతోనే ఉంటాయి.. కోపం - బాధ లో ఆవిరి అయిపోదు. మన ఆలోచనా తీరు - ఆరోగ్యం కూడా మంచి గా ఉంటుంది.. ఎల్లప్పుడూ.. అను క్షణం, ప్రతి క్షణం


----------------- చిన్న కథ - నీతి సమాప్తం -------

పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 



మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 






Comentários


bottom of page