top of page
Original.png

కాపురం కుదుటపడిన శుభ సమయం

24 minutes ago
6 min read

కాపురం కుదుటపడిన శుభ సమయం నీతిదాయకమైన కథలో సత్యనారాయణ వ్రతం సందర్భంగా భార్యాభర్తల మధ్య గొడవను గమనిస్తున్న హైందవి

Kapuram Kudutapadina Subha Samayam | Telugu Moral Story | Nallabati Raghavendra Rao

కాపురం కుదుటపడిన శుభ సమయం | తెలుగు నీతి కథ | నల్లబాటి రాఘవేంద్ర రావు

Published in manatelugukathalu.com on 27/10/2026


భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు, మనస్పర్థలు దాంపత్య జీవితంలో సహజమే. అయితే అహాన్ని పక్కనపెట్టి పరస్పర అవగాహనతో ముందుకు సాగడమే నిజమైన అన్యోన్య దాంపత్యమని తెలియజేసే నీతిదాయకమైన కథ “కాపురం కుదుటపడిన శుభ సమయం”.



"సంతోషీ... హలో... నిన్నే! టిప్ టాప్‌గా తయారై ఎక్కడికెళ్తున్నావే?" అడిగింది హైందవి తన పక్క వీధి ఫ్రెండ్ సంతోషిని.


"శ్రీనగర్ కాలనీలో మా పెదనాన్న గారబ్బాయి, అంటే మా అన్నయ్య-వదిన పీటల మీద కూర్చుని సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారే... అక్కడికి! అవునూ, మీ ఆయనతో నీకు ఇంకా గొడవలు తగ్గలేదా? పుట్టింటికి వచ్చి ఆరు నెలలయింది నువ్వు..." అడిగింది సంతోషి.


"నా మొగుడు ఈ వేళో రేపో తీసుకువెళ్లడానికి వస్తాడేమోనని చూస్తున్నాను. వచ్చాక మా వాళ్లచేత నాలుగు చీవాట్లు పెట్టించి అప్పుడు వెళ్తా!"


"ఇలా చాలాసార్లు చేశావు. చిన్న గొడవే అన్నావు కదా, మాట మాట పట్టింపుతో జీవితం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? ఓ మెట్టు నువ్వే దిగి వెళ్లొచ్చు కదా!"


"సరే... ఆ విషయం నేను చూసుకుంటాను కానీ, నీతో పాటు నేను వ్రతానికి రావచ్చా?"


"దాందేముంది... మా పక్క వీధిదానివే కదా! నా బంధువుల అమ్మాయి అని చెప్తానులే రా. 


ఒక విషయం... అక్కడ మా అన్నయ్య, వదిన 24 గంటలు దెబ్బలాడుతుంటారు. 


వాళ్ల వ్యవహారం చూసినవాళ్లకు 'బాబోయ్! ప్రపంచమంతా మునిగిపోతుందేమో' అన్నట్టు అనిపిస్తుంది. అసలే నీది మొగుడి సమస్య... దానికి మళ్లీ మరో సమస్య తోడైనట్టవుతుంది నీ బుర్ర! తట్టుకోగలిగితే రా."


ఇద్దరూ శ్రీనగర్ కాలనీ చేరారు. సత్యనారాయణ వ్రతం జరుగుతోంది. చాలామంది జనం ఉన్నారు.


ఓ పక్కన జనం అందరూ చూస్తున్నారనే ధ్యాస కూడా లేకుండా, పీటల మీద కూర్చున్న ఆ భార్యాభర్తలిద్దరూ ప్రతి విషయానికీ చిరుబుర్రులాడుకుంటున్నారు. 


'నేనంటే నేనంటూ' ఒకరికి ఒకరు తగ్గకుండా రెచ్చిపోతున్నారు. వ్రతం దగ్గర కూర్చున్నవాళ్లు, "వామ్మో... మనకు ఈ పూట భోజనాలు ఉండవేమో!" అనుకుంటూ భయపడిపోతున్నారు.


హైందవికి వాళ్లిద్దరినీ చూడటం అదే మొట్టమొదటిసారేమో... చాలా కంగారుపడి చెమటలు పట్టినట్టయిపోయింది. తను, తన భర్త పోట్లాడుకునే పోట్లాటకు వందరెట్లు ఎక్కువగా ఉంది వీళ్లిద్దరి పోరాటం! అక్కడున్న పురోహితుడు, "ఇది తప్పు, పీటల మీద కూర్చొని ఇలా దెబ్బలాడుకోకూడదు," అని వారిస్తూనే ఉన్నారు.


ఒకానొక సందర్భంలో ఆ ఇద్దరూ "సత్యనారాయణ వ్రతం ఆపు చేసేసి పీటల మీద నుండి లేచిపోదాం!" అన్నంత టాప్ లెవెల్‌గా పోరాడుకోవడం మొదలుపెట్టారు.


అక్కడికి తాళలేక, "నేను వెళ్లిపోతానే బాబూ!" అంటూ పైకి లేచింది హైందవి.


"అరే, నేను ముందే చెప్పాను కదా! వ్రతానికి వచ్చి ప్రసాదం తినకుండా, భోజనం చేయకుండా ఎలా వెళ్తాం? కాసేపు తట్టుకో," అంది సంతోషి.


మొత్తానికి పీటల మీద కూర్చున్న ఆ భార్యాభర్తలు కాసేపటికి మళ్లీ పూజ యథావిధిగా చేయడం మొదలుపెట్టారు. 


చాలా ప్రశాంతంగా వ్రతం పూర్తయింది. ఆ భార్యాభర్తలిద్దరూ చాలా ఆనందంగా, సంతోషంగా మాట్లాడుకుంటూ, ఒకరినొకరు వేళాకోళాలు కూడా ఆడుకుంటూ... వచ్చినవాళ్లందరికీ భోజనాలు వడ్డిస్తూ, సరదాగా ప్రసాదాలు పంచిపెడుతూ, బహుమతులు, రవికల గుడ్డలు ఇస్తూ సాగనంపారు.


"మా ఇద్దరినీ చూసి మీరు ఏమైనా భయపడ్డారా? మేము ఎప్పుడూ అలాగే దెబ్బలాడుకుంటాం," అంటూ వాళ్ల మీద వాళ్లే జోకులు వేసుకుంటూ నవ్వుకోవడం చూసి వచ్చినవాళ్లందరికీ తెగ ఆశ్చర్యం వేసింది.


ఇంటికి తిరిగి వస్తూ... "ఇదేమిటి? జోడు పొట్టేళ్లులా పోట్లాడుకున్న వాళ్లిద్దరూ మళ్లీ మరునిమిషమే జీడిపాకంలా కలిసిపోయారేమిటి?" ఆశ్చర్యంగా అడిగింది హైందవి.


"దాన్నే 'అన్యోన్య దాంపత్యం' అంటారు, కానీ దాని అర్థం నీకు తెలియదులే రా రా!" అంది సంతోషి హైందవి చేయి పట్టుకుని లాగుతూ.


హైందవి ఏమీ మాట్లాడలేదు. ఇంటికి వచ్చిన అరగంటకే సూట్‌కేస్‌లో తన బట్టలు సర్దుకుని, అత్తవారింటికి తన భర్త దగ్గరకు ఒంటరిగా బయలుదేరింది.


దారిలో కనబడిన సంతోషి, "ఓయ్... ఓయ్ నిన్నే! ఒసేయ్ హైందవి... చేతిలో అంత పెద్ద సూట్‌కేస్ ఉంది? మమ్మల్నందరినీ వదిలేసి ప్రయాణమై వెళ్తున్నావు... ఎక్కడికే?" అంటూ అడిగింది.


వినబడినా వినబడనట్టు చాలా స్పీడ్‌గా వెళ్తోంది హైందవి. ఆ బరువైన సూట్‌కేస్‌తో బస్సు స్టాండ్ వైపు చాలా ఆత్రుతగా పడుతున్నాయి ఆమె అడుగులు!


సమాప్తం



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


నల్లబాటి రాఘవేంద్ర రావు గారి కొన్ని ఇతర రచనలు:




నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


నల్లబాటి రాఘవేంద్ర రావు

నల్లబాటి రాఘవేంద్ర రావు








నల్లబాటి రాఘవేంద్ర రావు

రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page