top of page
Original.png

అమ్మకు సాష్టాంగ పడి నమస్కరిద్దాం

#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #అమ్మకుసాష్టాంగపడినమస్కరిద్దాం, #AmmakuSashtangaPadiNamaskariddam, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Ammaku Sashtanga Padi Namaskariddam - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published in manatelugukathalu.com on 27/02/2026

అమ్మకు సాష్టాంగ పడి నమస్కరిద్దాంతెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

 

బృందావనమ్మకు 70 సంవత్సరాలు పూర్తయి నాలుగు రోజులైంది. ఆ కాలనీలో ఆ వయసు వారికి ఘన సన్మానం చేయడం అలవాటు. అలాంటివారు మాతృమూర్తిగా తమ జీవిత విజయాలు ఆ సందర్భంలో ప్రసంగించవలసి ఉంటుంది. అయితే తన జీవితంలోనే కాదు చాలా మంది మాతృమూర్తుల జీవితాలు అపజయంతోనే ముగుస్తున్నాయి. అలాంటిటప్పుడు రేపు సన్మానానికి వెళ్లాలా వద్దా, వెళితే ఏం ప్రసంగించాలి... అన్న విషయం గురించి బృందావనమ్మ మంచం మీద పడుకుని సీలింగ్ ఫ్యాన్‌ను చూస్తూ ఆలోచిస్తుంది.


''నా జీవితం మాట అటు ఉంచితే.. సినిమాలు చూస్తున్నాం, కథలు, నవలలు చదువుతున్నాం. తల్లి పాత్రకు ఎంత అన్యాయం జరిగిందో చూపిస్తున్నారు.


కొడుకులు ఎంత దుర్మార్గంగా తల్లులను హింసిస్తున్నారో పేపర్లలో చదువుతున్నాం, టీవీలో చూస్తున్నాం.


తల్లి స్థానం స్థానభ్రంశం అయింది. కొందరు మనుషులు భార్యకు ఇచ్చిన స్థానం తల్లికి ఇవ్వడంలో బాగా వ్యత్యాసం చూపిస్తున్నారు. దేశకాలమాన ఆర్థిక పరిస్థితులలో విపరీతమైన పెనుమార్పులు వచ్చాయి. దానితో మనిషి స్వార్థపూరితుడు అయిపోయాడు. ఈ స్వార్థం అనే రెండక్షరాలు ముందు తల్లి నెత్తి మీద పడ్డాయి, తల్లిని కాస్త అణగదొక్కాయి.


తల్లి బతుకు కరిగిపోతున్న కొవ్వొత్తులా తయారయ్యింది. కుటుంబం కోసం తన చివరి రక్తపు బొట్టును కూడా తల్లి ధారపోస్తున్నట్టు చిత్రీకరించినప్పటికీ, మళ్లీ ఇక్కడ కొడుకుల వల్ల బాధలు పడి అనాధ ఆశ్రమాలలో చేరపోతున్నట్టు, బలవన్మరణాలు చేసుకుంటున్నట్టు మనకు తెలుస్తున్నవన్నీ యదార్థంగా జరిగినవే.


ఇదంతా రేపటి సన్మాన సభలో చెప్పి మాతృమూర్తి స్థానం ఎంత కృంగిపోయిందో వివరించాలి. తల్లులకు జరుగుతున్న అపజయాలు యావత్ ప్రపంచానికి తెలిసేలా గట్టిగా ఏకరువు పెట్టాలి'' అని మనసులో నిశ్చయించేసుకుంది బృందావనమ్మ.


అంతే.. ఆమె నుదుటి మీద ఎవరో గట్టిగా చరిచినట్టు అనిపించింది. లేచి కూర్చుంది. తన ఎదురుగా ఉన్న చెక్క కావడిపెట్టి మీద మరొక అపరిచిత వ్యక్తి కూర్చుని నవ్వుతుంది. ఆమె కొంచెం ముసుగు వేసుకొని ఉంది.


''ఎవరు నువ్వు. చెప్పా పెట్టకుండా ఇంట్లోకి వచ్చేసావ్ ఏమిటి'' కంగారుగా ప్రశ్నించింది బృందావనమ్మ.


''పిచ్చిదానా.. నేనెవరో తర్వాత చెబుతాను గాని తల్లుల పరువు తీయడానికి సిద్ధపడ్డావు నువ్వు. నా మాటలు నువ్వు పూర్తిగా విని రేపు సన్మాన సభలో ఏం మాట్లాడాలో నిర్ణయించుకో వెర్రిదాన.. ప్రస్తుత సమాజంలో మాతృమూర్తికి అత్యున్నత స్థానమే దక్కుతుందని ఖచ్చితంగా చెప్పవే.


అవును మరి. అతి పవిత్రమైన మన సంస్కృతి,


సాంప్రదాయాలు విలువలు కలిగినవి. భారత,


రామాయణ గ్రంథాలు వంట పట్టించుకుని పెరిగిన వాళ్ళం మనo. తల్లిని బాధ పెట్టి నరకయాతనలు పెట్టిన సంఘటనలు మన ఇతిహాసాలలో చాలా తక్కువే. ఒకటి రెండు సంఘటనలు ఉన్నా అవి కొడుకుల దుష్టత్వానికి ప్రతీకగా చిత్రించారు కానీ, తల్లికి మాత్రం తక్కువ స్థానం ఇవ్వలేదు అమాయకపు దాన.


శ్రీరామచంద్రుడు తల్లి మాటను జవదాటకుండా తన జీవిత యవ్వనం, అధికారం మొత్తం త్యజించాడు అంటే, తల్లి పాత్రకు ఎంత మహోన్నత స్థానం కల్పింప బడిందో అర్థం చేసుకోలేకపోయావు నువ్వు.


బాలకృష్ణుడు యశోద దగ్గర పెరిగినప్పుడు ఆమెను సరదాగా ఆట పట్టిస్తూనే తన మహిమలు చూపిస్తూ తండ్రికన్నా ఎక్కువగా తల్లికే విలువ ఇచ్చాడు.


బాలనాగమ్మ కథలో కూడా చిన్నారి బాల వర్దిరాజు


తల్లి కోరిక తీర్చడం కోసం తండ్రిని శిలావిగ్రహరూపం నుండి విముక్తి కలిగించి వెనుకకు తీసుకు రావడం కోసం ఆ చిన్న వయసులోనే ఒంటరిగా వెళ్లి విజయం సాధించుకు వచ్చాడు కదా. అంటే తల్లి మాట ఎంత గొప్ప విలువైనదో మనం అర్థం చేసుకోవచ్చు.


సత్యహరిశ్చంద్రుడి కొడుకు లోహితాశ్యుడు కూడా


అడవిలో తల్లితోపాటు ఉండి అష్టకష్టాలు పడి తల్లి


కి ఎంతో గౌరవం ఇచ్చి తల్లి మాట ప్రకారం కట్టెలు తెచ్చేందుకు అడవికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తల్లి మాటకి ఇక్కడ ఎంతో గౌరవం దక్కింది.


అంత ఎందుకే మన గాంధీగారు బారిష్టర్ చదువు కోసం ఇంగ్లాండ్ వెళుతూ ఎట్టి పరిస్థితులలో మద్యము,


మాంసము ముట్టనని తల్లికి మాట ఇచ్చి ప్రతిజ్ఞ చేసి వెళ్లాడు కదా. తల్లి మీద గౌరవంతో ఆ మాట నిలబెట్టు కుని వచ్చాడు కదా.


ఇలా చెప్పుకుంటూ పోతే పురాణ గాధలు, నాటకీయ కథలు, యదార్థ సంఘటనలు తల్లి విలువను పెంచేవి చాలా ఉన్నాయి. అవన్నీ ఎలా మర్చిపోయావు. రేపు నీ సన్మాన సభలో నీ ఇష్టం వచ్చినట్లు వాగేద్దాం అనుకుంటున్నావా.


ఏ ఒక్క రచయిత తల్లికి అన్యాయం చేయలేదు.


మాతృదేవోభవ.. అన్న పదం విలువ వాళ్లకు తెలిసి ఉండబట్టే తల్లిని ఉన్నత స్థానంలో కూర్చుండబెట్టారు.


బాధ పెట్టడం అనేది పరాకాష్టగా చిత్రీకరించి..''తల్లిని బాధలు పెట్టడం వల్ల చివరికి మీరు మట్టికొట్టుకు పోతారు రా వెధవల్లారా.'' అంటూ మెసేజ్ ఇచ్చేరు.


తల్లిని హింసిస్తున్న సంఘటనలు నిజానికి లక్ష మంది లో ఒకటి జరిగి ఉండవచ్చు. కానీ మనిషి ఆలోచన


ఎలా చేస్తాడు.. అంటే నూటికి 99 సంఘటనలు అలాంటివే సమాజంలో జరుగుతున్నాయి అనే ఊహలో వెళ్లిపోతున్నాడు. అలాంటి ఊహలే తల్లి స్థానాన్ని బాగా క్రిందకు నెట్టివేసింది ఈ మధ్యకాలంలో. ఇప్పటి కంప్యూటర్, ఎలక్ట్రానిక్ విధానాన్నిబట్టి ఈ పరిస్థితి దాపురించింది. ఇది అత్యంత భయంకరమైన పరిస్థితి. జనాభా విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు ఎక్కడో ఒకచోట హింస సంఘటన జరిగితే జరిగి ఉండవచ్చు. కానీ ప్రతి ఊరిలోనూ ప్రతి వీధిలోనూ ప్రతి ఇంటిలోనూ అలాగే జరిగిపోతున్నాయే మోనని ఆలోచిస్తుంటాడు.


ఒక న్యూస్ పేపర్ లో తల్లిని బాధలు పెట్టిన కొడుకు అన్న హెడ్డింగ్ చూస్తే అదే పేపర్లో ఉన్న మిగిలిన మామూలు సాధారణ వార్తలు చదవడం మానేసి అక్కడ ఆగిపోతాడు ప్రతి పాఠకుడు. దీనికి మరి నాలుగు తోకలు తగిలించి పక్క వాడికి మహా ప్రళయం జరిగిపోయినట్లు చెప్పడం వాడికి సరదా. ఆ విధంగా కూడా కొంత తల్లి పాత్రను డ్యామేజ్ చేస్తున్నారు. జరిగింది ఐదు పైసలు అయితే రూపాయి అంత చేసి చెప్పుకుంటున్నారు.


తింగరదాన.. రేపు నీ సన్మానసభలో చెప్పాలనుకుంటున్నట్టు తల్లి పాత్రపట్ల మరీ అంత గడ్డు పరిస్థితి, మరీ అంత చులకనభావం మాత్రం లేదు. ఆమె గౌరవం దక్కించుకుంటూ గౌరవం పొందుతూనే ఉంది.


ఆ మధ్య ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఒక యువ కుడు వృద్ధురాలయిన తన తల్లిని కావడిలో పెట్టి మోసుకుంటూ తీర్థయాత్రలు తిప్పిన వార్త న్యూస్ పేపర్లో చూశాం. ఈ దశాబ్ద కాలంలో ఇలా జరగడం ఎంత గొప్ప విషయం.


మరో వార్త ఈ మధ్య సామాజిక మాధ్యమాలలో చూడలేదా.. ఒక కొడుకు త్వరగా కూరగాయలు అమ్మే తొట్టి బండి లాంటి దానిమీద వృద్ధురాలైన 90 ఏళ్ల తన తల్లిని బండి తోసుకుంటూ 150 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లి వైద్యం చేయించాడట.


ఇంకో కొడుకు పట్నంలో చనిపోయిన తన తల్లిని భుజం మీద మోసుకుంటూ 75 కిలోమీటర్లు తీసుకొచ్చి తన ఊరులో సంస్కారాలు చేసే చేశాడట.


ఇలాంటి ఒక్క సంఘటన చాలు తల్లి పట్ల పాజిటివ్


తరంగాలు పెరగడానికి.


అమ్మ కన్నా మించిన దైవం లేదు. తల్లి మొట్టమొదటి ప్రత్యక్షదైవం. తల్లిని గౌరవిస్తూ బ్రతికే వాడికి అన్న వస్త్రానికి లోటు ఉండదు.. అన్న విషయం తెలిసిన వాళ్ళు 99% మంది ఉన్నారు. అందుకనే మన భారతదేశం ఇంకా ఇలా కళకళలాడుతూ పచ్చగా ప్రపంచ పటంలో హాయిగా ఆనందంగా కనిపిస్తుంది ఓ బృందావనమ్మ.


***


ఆ వెర్రిచూపులు ఏమిటే పిచ్చిదానా. రేపు తప్పకుండా వెళ్ళు కానీ తల్లి పాత్రను దిగజార్చి మాట్లాడకు. ఏమన్నా తేడా జరిగిందో నీ డొక్కచింపి డోలు కడతా . ఇక నేను వస్తా.''


అలా వివరించి ముఖం మీద ముసుగు తొలగించుకుని వెళ్ళిపోతున్న ఆమెను బాగా పరికించి చూసింది బృందావనమ్మ. ఆమె కూడా తనలాగే ఉంది. ఆమె చెప్పింది అంతా నిజమే మరి.


రేపు తన సన్మాన సభలో ఆమె చెప్పిందే ప్రసంగించాలని ఒక నిర్ణయానికి వచ్చి అలా నిద్రలోకి జారిపోయింది బృందావనమ్మ.


 సమాప్తం


నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page