top of page
Original.png

ప్రాణవాయువు

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారి ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.

పర్యావరణ కథ, తెలుగు బాలల కథ, చెట్ల ప్రాముఖ్యత, ఆక్సిజన్ విలువ, Save Trees Telugu Story, Environmental Awareness, Child Education Story, School Garden Story, Nature Conservation, Telugu Moral Story, World Environment Day, Green Environment, Oxygen Importance, Inspirational Telugu Story

ప్రాణవాయువు కథలో మొక్కలను సంరక్షిస్తున్న కిరణ్ మరియు పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరిస్తున్న దృశ్యం
ప్రాణవాయువు కథలో మొక్కలను సంరక్షిస్తున్న కిరణ్ మరియు పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరిస్తున్న దృశ్యం

Prana Vayuvu - Telugu Inspirational StoryAddanki Lakshmi

ప్రాణవాయువు - తెలుగు ప్రేరణాత్మక కథ | అద్దంకి లక్ష్మి

Published In manatelugukathalu.com On 07/06/2026

 

పిల్లల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందిస్తూ, చెట్ల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని అందించే ఈ కథ మనందరికీ ఆలోచింపజేస్తుంది.


కిరణ్ స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ సోఫా మీద పడేసి కూర్చుని ఏడుస్తున్నాడు. 


సుజాత ప్లేట్లో టిఫిన్ తీసుకొచ్చి పిల్లవాడికి పెట్టింది.


"నాకొద్దులే, ఆకలి లేదు." అన్నాడు.


“ఏమైందిరా స్కూల్లో?” అని అడిగింది తల్లి.

కిరణ్ కోపంగా గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు.


ఇంతలో పక్క ఫ్లాట్ లో వీడితో నాలుగో తరగతి చదువుకుంటున్న రవి వచ్చి,

  

“ఆంటీ ఆంటీ! మరి ఏం జరిగిందంటే...

వీడు ఎప్పుడూ చెప్పిన మాట వినడు. స్కూలు గార్డెన్ లోని పూల మొక్కల

ఆకులు తెంపి కింద పడేస్తాడు. ఈరోజు స్కూల్ గార్డెన్ లో ఇంటర్వెల్ కి అలా చేస్తుంటే, మా క్లాస్ పిల్లలు టీచర్‌కి కంప్లైంట్ చేశారు.

టీచరు వీడిని ఒక గంట సేపు బయట నుంచోబెట్టాడు, పనిష్మెంట్ ఇచ్చాడు. అందుకే కోపం వచ్చింది, అప్పటినుంచి ఏడుస్తున్నాడు,”

అని చెప్పి వెళ్ళిపోయాడు. 


సుజాత మెల్లగా పిల్లవాణ్ణి సముదాయించి టిఫిన్ పెట్టి బయటకి ఆటలకు పంపింది.


నిజానికి  కిరణ్ హుషారుగా ఉంటాడు. అన్ని విషయాల్లో  చెప్పిన మాట వింటాడు. కానీ వాడికి ఇదో చెడ్డ అలవాటు.


మొక్కలు చూస్తే చాలు చెయ్యి అటు వెళ్లిపోతుంది. ఆకులు తెంపేస్తాడు, పువ్వులు పీకేస్తాడు. అలా తెంపకూడదు వద్దురా అంటే వినడు.


ఈ పిల్లవాణ్ణి ఎట్లా దారికి తీసుకురావాలని సుజాత ఆలోచనలో పడింది. గార్డెన్ కి వెళ్ళినప్పుడే కాదు బడిలో కూడా ఇలా చేస్తున్నాడు కదా!


ఇంతలో ఎదురుగుండా వాటాలో హడావిడి ప్రారంభం అయింది.


పక్క ఫ్లాట్ లో ఉన్నవాళ్లు, ఆడవాళ్లు, మగవాళ్ళు, పిల్లలు అందరూ అక్కడికి చేరారు. ఏమిటి అంటూ

కిరణ్ కూడా తల్లితో కంగారుగా పరిగెత్తుకుని వచ్చాడు.


పక్కవాటాలోని అంకుల్ కి

ఊపిరి ఆడటంలేదు, ఆక్సిజన్ అందక కంగారు పడుతున్నారు. డాక్టర్ గురించి ఫోన్ చేశారు.


అంబులెన్స్ వచ్చింది, ఆయనను హాస్పిటల్ కి తీసుకెళ్లారు.

మామగారితో పాటు కొడుకు, కోడలు వెళ్ళారు. పిల్లలిద్దర్నీ సుజాతకి అప్పజెప్పి వెళ్లారు.


ఒక్కసారి బిల్డింగ్ వాళ్ళందరూ విచారంలో మునిగిపోయారు.


కిరణ్ భయపడిపోయాడు.

సుజాత ఇంటికి వచ్చిన తర్వాత కిరణ్ కి చక్కగా స్వచ్ఛమైన గాలి గురించి వివరించి చెప్పింది...


“ప్రాణవాయువు లేకపోతే ప్రాణాలకే ముప్పు.

చూశావా కిరణ్! జీవులన్నింటికీ గాలి, నీరు కావాలి.

చెట్లను నరికేసి పెద్దపెద్ద భవంతులు కడుతున్నారు.

దీనివల్ల వాతావరణంలో ప్రాణవాయువు తక్కువై,

ప్రాణం మీదకు వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

అందుచేత చిన్నపిల్లలు మీరందరూ తెలుసుకోవాలి. చెట్ల వల్ల మనకు ఎన్ని ఉపయోగాలో! చెట్లను నాటాలి.

చెట్లే ప్రగతికి మెట్లు.

ఒకప్పుడు కరోనా సమయంలో ఆక్సిజన్ దొరక్క ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

ఇప్పుడు నీకు తెలిసింది కదా! ప్రాణవాయువు యొక్క ప్రాముఖ్యత.

మొక్కలను పెంచాలి గాని వాటిని త్రుంచి, కొట్టి నాశనం చేయరాదు.

మొక్కలను సంరక్షించుకోవాలి. పర్యావరణం రక్షించాలి. చల్లటి గాలిని ఇస్తాయి. కూరగాయలు, పండ్లు, పూలు ఇవన్నీ మనకు మొక్కల వల్ల లభిస్తాయి. మొక్కలు పెంచుకుని రక్షించాలి గాని, పచ్చగా ఉండే మొక్కను తెంపకూడదు,” అంటూ కిరణ్‌కి వివరించింది.


ఈ సంఘటనతో కిరణ్ కి కనువిప్పు కలిగి, పాఠశాలలోని గార్డెన్ లో మొక్కలను చక్కగా పెంచుతూ చెట్లను సంరక్షిస్తూ మిగతా విద్యార్థులను కూడా సక్రమమైన మార్గంలో ఉంచేవాడు.


జీవితంలో ఒక్కొక్క సంఘటన, పిల్లలలోనూ పెద్దలలోనూ ఎంతో మార్పు తెస్తుంది.


***

అద్దంకి లక్ష్మి గారి కొన్ని ఇతర రచనలు:


అద్దంకి లక్ష్మి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి

నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి

జన్మ స్థలం:రాజమహేంద్రవరం

డేట్ అఫ్ బర్త్

3_6_1946.

నివాసం: నవీ ముంబయి

విద్యార్హతలు:

బి.ఎ; బి. ఇడి

**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,

బాంబే మునిసిపల్ కార్పొరేషన్


**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.

భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;

విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ

**కుమారుడు:

గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,


**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.

అల్లుడు మధుసూదన్ అమెరికా

వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు


**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,


నిరక్షరాస్యతను నిర్మూలించుటకు

సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,


నాటకాలు వ్రాసి

విద్యార్థుల నాటకాలు

వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,

సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి


చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,


**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,


**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం


**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం


సాహితీ జీవితం_రచనలు

**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను

**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి


ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను


**అనేక సమూహాల్లోని

ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,

పద్యాలు ప్రచురించ బడినవి

కవితలకు కథలకు బహుమతులు పొందినాను


నేను రాసిన

కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా

**మినీ కవితలు

పంచపదులు

సున్నితాలు

ఇష్టపదులు

**గేయాలు

**వ్యాసాలు

**నాటకాలు

పద్యాలు

గజల్స్

కథలు

రుబాయీలు

బాల సాహిత్యం

**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి


*సాహిత్య సేవ

తేనియలు,

తొణుకులు,

చిలక పలుకులు,

పరిమళాలు,

మధురిమలు,

ముత్యాలహారాలు,ఇష్టపదులు,

సకినాలు,

సున్నితాలు,

పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,


**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను

**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,

అన్ని గ్రూపుల నుంచి,

15 బిరుదులు పొందడం జరిగినది,


ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,

2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,


రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,


1.ప్రచురణ,,,


1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page