top of page
Original_edited.jpg

ఆడవాళ్ళా మజాకా

  • Writer: Addanki Lakshmi
    Addanki Lakshmi
  • Oct 21
  • 7 min read

#అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #AdavallaaMajaka, #ఆడవాళ్ళామజాకా, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Adavallaa Majaka- New Telugu Story Written By Addanki Lakshmi

Published In manatelugukathalu.com On 21/10/2025

ఆడవాళ్ళా మజాకా - తెలుగు కథ

రచన: అద్దంకి లక్ష్మి 


"ఒరేయ్ టింకూ ఈ కాఫీ పట్టుకెళ్ళి మీ అమ్మకి ఇయ్యరా" అన్నాడు వంటింట్లోంచి వెంకటేశం పిల్లవాడిని బ్రతిమాలుతూ.


"నేను ఇవ్వను, నువ్వే వెళ్లు" అంటున్నాడు బొమ్మలతో ఆడుకుంటూ ముద్దుగా. 


 "ఏంటండీ! చిన్న పిల్లాడికి పని చెప్తారు? మీరు వచ్చి ఇవ్వలేరా?" అంటూ ఉరిమింది సుబ్బలక్ష్మి హాల్లో టీవీ చూస్తూ. 


సుబ్బలక్ష్మి పొద్దున్నే లేస్తుంది. 8 గంటలకు టీవీ పెట్టుకుంటుంది. టీవీలో మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే కార్యక్రమం వస్తుంది. దాంట్లో ఆరోగ్యానికి ఏమేమి తినాలో చెప్తారు. అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తుంది సుబ్బలక్ష్మి. 


తర్వాత టీవీ ప్రోగ్రాములు వ్యాయామం గురించి, యోగాసనాలు గురించి చెప్తారు. వెంటనే టివి కట్టేస్తుంది. 


సుబ్బలక్ష్మి యోగాసనాలు చేయ లేదు, పొట్టిగా లావుగా ఉంటుంది. 


వెంకటేశు ఉదయాన్నే లేచి కాఫీ పెడతాడు. టిఫిన్ చేసి మధ్యాహ్నం అన్నం వండుతాడు, తాను డబ్బాలో తీసుకుని వెళ్ళిపోతాడు ఆఫీసుకి ఆదరాబాదరాగా. 


పనిమనిషి వచ్చి గిన్నెలు తోమి, గుడ్డలు ఆరేసి పోతుంది. సాయంత్రం ఇంటికి వచ్చి మళ్లీ వెంకటేశు అన్నం వండుతాడు.


సుబ్బలక్ష్మి చుట్టుపట్ల వాళ్ళ ఇంటికి వెళ్లి కబుర్లు చెబుతూ హాయిగా గడుపుతుంది. మధ్యాహ్నం అంతా టీవీ చూస్తుంది. 


టింకూను స్కూల్లో వేశారు, మధ్యాహ్నం ఒంటిగంటకు స్కూల్ బస్సులో స్కూల్ కి వెళ్తాడు, మూడో తరగతి చదువు తున్నాడు.

 

తల్లిగారాబం, ఎప్పుడూ అల్లరి చిల్లరగా పిల్లలతో ఆటపాటలతో గడుపుతాడు. తండ్రిని అస్సలు లెక్కచేయడు, 


వెంకటేశు తన ఫ్యామిలీని తానే నాశనం చేసుకున్నాడు. 

ఇంట్లో భార్య మీద అధికారాన్ని పోగొట్టుకున్నాడు తెలివి తక్కువ తనంతో.

&&&&_&&_&&&&


"ఏమే సుబ్బీ! కాఫీ తీసుకురా, ఏం చేస్తున్నావ్.. ఏమిటి ఇంత ఆలస్యం, " అంటూ టీవీ చూస్తూ అరుస్తున్నాడు గట్టిగా వెంకటేశు భార్య మీద. 


"వస్తున్నానండి ఇదిగో తీసుకొస్తున్నాను" అంటూ వంటింట్లోంచి భయపడుతూ, మెల్లగా వచ్చింది సుబ్బలక్ష్మి.


"ఏమిటో నా కర్మ! నీలాంటి భార్య దొరికింది. చస్తున్నా నీతో వేగలేక.. అన్నం వండడం రాదు, కాపీ పెట్టడం రాదు. పనీపాటా రాదు, ఎలా పెంచారే, మీ అమ్మానాన్న నిన్ను, " పొద్దున్నే సుప్రభాత సేవ మొదలైంది, 


"ఇదిగోనండి కాఫీ” అంటూ భయం భయంగా తీసుకొచ్చి కప్పు టీపాయ్ మీది పెట్టింది సుబ్బలక్ష్మి.


"అక్కడ పెట్టావ్ ఎందుకు? నా చేతికి ఇయ్యలేవా" అంటూ అరిచాడు వెంకటేష్.


భయపడుతూ "ఇదిగోనండి "అంటూ చేతికి అందించింది సుబ్బలక్ష్మి.


"కాఫీ అప్పుడే చల్లారిపోయింది. వెళ్లి ఇంకొంచెం వేడి చేసి పట్టుకురా" అని అరిచాడు మళ్ళీ.

 

సుబ్బలక్ష్మి వంటింట్లోకి వెళ్లి మళ్లీ కాఫీ కొద్దిగా వెచ్చపెట్టి పట్టుకొచ్చింది. 


"ఆ మొహం చూడు! ఎంతో అమాయకంగా పెడతావు, 

మీ అమ్మానాన్న నాకు అంటగట్టారే. చదువు సంధ్య లేదు.పదో తరగతి పాస్ అయ్యావని చెప్పారు. 

అంతా అబద్ధం. నీకు ఒక్క తెలుగు అక్షరం ముక్క కూడా రాదు. ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నానని చెప్తున్నావు. శుద్ధ మొద్ద అవతారం"


"మా అమ్మ నాయన మీకు అబద్ధం చెప్పలేదండి. అత్తయ్య గారికి మామయ్య గారికి నిజమే చెప్పారు. వాళ్లే మీతో అబద్ధం చెప్పారు. " అంది సుబ్బమ్మ. 


" నోరు ముయ్. ఎదిరించి మాట్లాడుతున్నావా.. ఏంటి అనుకుంటున్నావ్? మొగుడా? మజాకా?" అంటూ ఉరిమాడు. 


"వెళ్లి టిఫిన్ డబ్బా కట్టి పెట్టు. ఆఫీస్ కి మళ్ళీ టైం అవుతుంది. వేడి నీళ్లు పెట్టు” అంటూ ఆర్డర్ ఇచ్చాడు వెంకటేశం. 


సుబ్బలక్ష్మి భయంగా వంటింట్లోకి వెళ్లి టిఫిన్ చేయడం మొదలు పెట్టింది. 


రోజు ఇదే గోల. అస్తమానం సుబ్బలక్ష్మిని వేధిస్తూ ఉంటాడు ఆఫీస్ కి వెళ్లే వరకు. మళ్ళీ ఆఫీసు నుంచి వచ్చిన దగ్గరనుంచి ఇదే వరస.. 


ఈమధ్య ఓ యాడాదైంది పెళ్లి అయి ఇద్దరికీ. అప్పటినుంచి ఇలా సాధించడం మొదలుపెట్టాడు వెంకటేష్. 


అతనికీ పెళ్లి ఇష్టం లేదు. వాళ్ళ నాన్న రెండు సంబంధాలు చూశాడు. ఒక పిల్ల ఇంటర్ పాస్ అయింది. చాలా అందంగా ఉంది. కానీ వాళ్ళు తల్లిదండ్రులకి డబ్బు లేదు. కట్నం ఇవ్వలేము అన్నారు. దాంతో వెంకటేశు తల్లిదండ్రులు ఈ సంబంధం వైపు మొగ్గు చూపించారు. 


సుబ్బలక్ష్మి తల్లిదండ్రులకి ఒక్కతే కూతురు. అపురూపంగా పెంచుకున్నారు, ఎంత కట్నం అడిగితే అంత ఇస్తామని ఒప్పుకున్నారు. ఆమె ఆడిందిఆట పాడింది పాట. చదువు వచ్చేది కాదు. ఎనిమిదో తరగతి ఫెయిల్ అయితే, నేను చదువుకోనమ్మ అని ఇంక ఇంట్లోనే కూర్చుంది. 


ఆ చుట్టుపట్ల పిల్లలతో ఆడుకుంటూ హాయిగా గడిపేది, 

ఆడపిల్ల చదువుకునే ఏం చేస్తుంది. ఉద్యోగం చేయాలా ఊర్లు ఏలాలా అంటుంది తల్లి, 


చాలా సంబంధాలు వచ్చాయి. గాని చదువు లేకపోవడం మూలంగా కుదరలేదు. పైగా నల్లగా బొద్దుగా పొట్టిగా ఉంటుంది. ఏ పెళ్ళికొడుకులకి ఎవరికీ నచ్చదు. 


వెంకటేశు తల్లిదండ్రులు కట్నానికి ఆశపడి ఈ పిల్లను చేసుకున్నారు. వెంకటేశు తాలూకా ఆఫీసులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు.


ఈ పెళ్లి ఇష్టం లేదు. అయినా తల్లిదండ్రులు డబ్బులకు ఆశపడి చేసుకున్నారు. అందుకే అస్తమానం ఆ పిల్లని సాధిస్తూ ఉంటాడు.

 

ఆఫీసుకు తయారయ్యాడు వెంకటేశు. 

"ఏమే టిఫిన్ డబ్బా అయిందా?" అని అరిచాడు. 


టిఫిన్ దోశలు వేసి కొబ్బరికాయ పచ్చడి చేసి ఇచ్చింది, డబ్బా ఇచ్చింది. 


"ఇదిగో నేను ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఇరుగమ్మ పొరుగమ్మతో పిచ్చివాగుడు వాగుకు. నన్ను మా ఆయన తిడుతున్నాడు మా ఆయన కొడుతున్నాడు, అని చెప్పకు. 

ఆ తెలుగు పుస్తకాలు తెచ్చాను బుద్ధిగా చదువుకో. "


"సరేనండీ అలాగే చదువుకుంటాను!" అంది సుబ్బలక్ష్మి.


"అలాగే అలాగే అంటావు నేను అటు వెళ్ళగా చూసి, అందరితో నా మొగుడు ఇలా వేధిస్తున్నాడు నా మొగుడు అలా వేధిస్తున్నాడు. నన్ను కొడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు, అంటూ అందరితో అబద్ధాలు చెప్పుకుంటావు. 


దాంతో వాళ్ళందరూ నీ మొగుడు ఇలాంటి వాడా.. అలాంటివాడా.. అంటూ జాలి పడిపోతారు నీ మీద. నన్ను ఏదో రాక్షసుడిగా చూస్తారు, "


"అలా చెప్పనండి నేనెప్పుడూ. నేను ఇంట్లో కూర్చుని పుస్తకాలు చదువుకుంటాను. ఇంట్లో గిన్నెలు తోముకుని పని చేయించుకుంటాను, బట్టలుతుక్కుని, "


"సరేలే! మాటకు మాటకు సమాధానం బాగానే చెప్తావు

తలుపేసుకో. " అంటూ కోపంగా వెళ్ళిపోయాడు వెంకటేష్, 


సుబ్బలక్ష్మి కళ్ళు నీళ్లు వచ్చాయి మొగుడు వెళ్లిపోయిన తర్వాత తలుపేసుకొని వెంటనే తల్లికి ఫోన్ చేసింది


"అమ్మా! మా ఆయన అస్తమానం నన్ను తిడుతున్నాడే. " అంటూ మొదలు పెట్టింది. ఆయన సాధింపులన్నీ చెప్పింది, 


"ఏడాది అవుతుంది పెళ్లై. ఇప్పటికి కూడా ఇంకా అతనికి బుద్ధి లేదు. ఇలా కాదు.. ఇతనికి మంచి పాఠం చెప్పాలి". అంది తల్లి.


"ఏం చెప్తావే అమ్మా! ఆస్తమానం నన్ను తిట్టిపోస్తున్నాడు. ‘మీ నాన్న అబద్ధం చేసి నాకు పెళ్లి చేశాడు. నీకు చదువు సంధ్య రాదు. శుద్ధి మొద్దు అవతారం’ అని తిడుతున్నాడు” అంటూ ఏడ్చింది సుబ్బలక్ష్మి, 


"అంతేనమ్మా! ఈ మగాళ్ళందరూ.. ఇదొక నాటకం. అమాయకంగా ఉన్న పెళ్ళాన్ని, చచ్చినట్టు పడి ఉంటుందని వేపించుకు తింటారు. 

అదే తెలివితేటలున్న గయ్యాళి పెళ్ళాం దొరికితే, వాళ్లే కాళ్ళు పట్టుకుని పడుంటారు. ఇదీ మగవాడి స్వభావం. 

నువ్వేం బాధపడకు". 


"అమ్మా !నేను ఇక్కడ ఉండనే! ఈ ఆరు నెలలకే నాకు విసుగు వచ్చేస్తోంది. నేను వచ్చి నీ దగ్గర ఉంటాను. అస్తమాను సాధిస్తున్నాడు ". 


"సరేలే! కంగారు పడకు. దీనికి ఒక ఉపాయం ఉంటుంది. ఆలోచించి చెప్తాను!" అంటూ వాళ్ళ అమ్మ ధైర్యం ఇచ్చింది. 


సుబ్బలక్ష్మి కి ఏడు పొస్తోంది.

దినమంతా పనే.

వెంకటేశు ఆఫీసుకెళ్లగానే, గిన్నెలు తోముకోడం, బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం, సాయంత్రం వంట, 

హాయిగా ఆడుతూ పాడుతూ గడిపేది. 

ఇదేమిటి పిచ్చోడు దొరికాడు అనుకుంది.


రోజు భర్త వెంకటేష్ ఆఫీస్ కి వెళ్ళగానే అతడి సాధింపులన్నీ అమ్మకు ఫోన్ చేసి చెప్తూ ఉండేది. రెండు నెలలు తిరిగేసరికి ఉగాది పండగొచ్చింది. వెంకటేష్ ఆనంద పడిపోయేవాడు.. అత్తగారు మామగారు తనని ఉగాది పండక్కి పిలిచి కొత్త బట్టలు పెడతారు అంటు మురిసిపోయాడు.


పండగ మూడు రోజులు ఉందనంగా అత్తగారు పెద్ద పెట్టేట్టుకునే దిగింది

వెంకటేశు సాయంత్రం ఇంటికి రాగానే అత్తగారిని చూసి ఆశ్చర్యపోయాడు


"కొత్త పండగ కదా నేనే మీ ఇంటికి వచ్చేసాను. అమ్మాయి అల్లుడు కాపురం చూద్దామని..” అంది


మర్నాడు పొద్దున్నే సుబ్బి లేవలేదు. సుబ్బితల్లి

"మా అమ్మాయికి జ్వరం వచ్చింది.. 103 జ్వరం" అంది.


"అయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అండి". అన్నాడు.


"వద్దులే నాయనా !నేను కషాయాలు అవి చేసిస్తాను. తగ్గిపోతుందిలే జరమేగా.. పిల్ల బాగా పనిచేసి అలసిపోతోంది. అందుకే వచ్చింది. " అంది అత్తగారు.


మెల్లిమెల్లిగా మొదలైంది "నాయన వెంకటేశు! కాస్త కాపీ చేసి పట్టుకురా.. అమ్మాయికి, నాకు” అనేది.

కొంచెం టిఫిన్ చెయ్యి అనేది. 

“అన్నం కూడా వండేసి వెళ్ళిపో నాయనా" అంటూ వంటిల్లులో పని చెప్పడం మొదలుపెట్టింది. 


సుబ్బిని తన దగ్గరే పడుకోబెట్టుకునేది. ఇంకా జ్వరం తగ్గలేదు అనేది సుబ్బి. 


 అమ్మ అయ్య అంటూ మూలుగుతూ ఉండేది.

పండక్కి ఇద్దరికీ కొత్త బట్టలు తీసుకురా అని చెప్పింది.

చేసేదిలేక వెంకటేశు ఇద్దరికీ చీరలు తీసుకొచ్చాడు.

మొత్తం పండగ హడావిడి అంతా వెంకటేష్ చేతే చేయించింది. ఇల్లు శుభ్రం చేయించడం, తోరణాలు కట్టించడం, ఉగాది పచ్చడి, వంటకి తాను సాయం చేసి మొత్తం పండగ కానిచ్చారు అత్తగారు.

 

ఆవిడ ఎప్పుడు పోతుంది అని చూస్తున్నాడు వెంకటేష్, 


వెంకటేష్ చేత మెల్లిమెల్లిగా అన్ని పనులు చేయించడం మొదలు పెట్టింది అత్తగారు.

 

“మా అమ్మాయికి ఇంకా నీరసం తగ్గలేదు” అంటూ ఉండేది

అత్తగారు వెంకటేశం తో. వంటింట్లోకెళ్లి ఇది ఇట్లా చేయాలబ్బాయి ఈ కూర ఇలా ఉండాలి. ఈ సాంబార్ ఇలా పెట్టాలి అని మెల్లిమెల్లిగా నేర్పించడం మొదలెట్టింది వెంకటేష్ కి.  


“పిల్లదాని ఒంట్లో బాగోలేదు అదెక్కడ పనిచేస్తుంది” అంటూ ఉండేది.


సుబ్బి వేళకి టిఫిన్ తిని అన్నం తింటూ పాలు పండ్లు తింటూ మంచం ఎక్కి పడుకుంది.


మెల్లిగా ఒక 20 రోజులకి వెంకటేష్ కి టిఫిన్ చేయడం అన్నం చేయడం అన్నీ నేర్పింది అత్తగారు.


మధ్య మధ్యలో పిల్లకి అన్ని బోధించేది. 

“మగాళ్లు ఇలా నాటకాలు ఆడతారు వీళ్ళని చెప్పు చేతల్లో పెట్టుకోవాలి లేకపోతే నిన్ను ఏడిపించుకు తింటారు. 

మెల్లి మల్లిగా నువ్వు సాధింపు మొదలు పెట్టు. ఇంక నోరు మూసుకుని పడుంటాడు” అంటూ పిల్లకి అన్ని ఎక్కించి పెట్టింది.


తల్లి ఉండడం మూలంగా వెంకటేష్ కూడా దాన్ని ఏమీ అనలేకపోయేవాడు.


 ప్రేమగా చూస్తున్నట్టు నటించేవాడు. తల్లి వెళ్ళిపోయింది. తర్వాత సుబ్బి పూర్తిగా మారిపోయింది. 


“నాకు కాఫీ చేసి ఇవ్వండి” అంటూ ఉండేది. పొద్దున్న 8:00 వరకు పడుకునేది. లేవమంటే లేచేది కాదు 


సాధింపు మొదలుపెట్టింది సుబ్బి. “నా కర్మ కొద్ది దొరికారు మీరు, నా బతుకంతా ఇలా అయింది. మా అమ్మానాన్న మీలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశారు, " ఇలా సాధింపులు మొదలుపెట్టింది.


ఇప్పుడు వెంకటేష్ నోరు మూత పడింది. ఏదైనా అనగానే ఏడవడం మొదలు పెట్టింది. 


"మీలాంటి మొగుడు నా కర్మకొద్దీ దొరికాడు” అంటుంది అస్తమానం. 

“బాగా కట్నం డబ్బులు తిన్నారు ఇలాంటి బుద్ధిలేని వాడికి ఇచ్చి కట్టబెట్టారు. నా కర్మ కాలింది” అని ఏడుస్తుంది అస్తమానం.


ఇప్పుడు వెంకటేష్ ఇంకేమీ మాట్లాడలేకపోతున్నాడు.

పూర్తిగా అన్నం వండి ఆఫీస్ కి వెళ్తాడు. ఆవిడ టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తుంది. 


సుబ్బి జీవితం పూర్తిగా మారిపోయింది. వెంకటేష్ ఇంట్లో ఎందుకు గొడవలే అని నోరు మూసుకుని ఊరుకుంటున్నాడు.


మాట్లాడితే మీద పడిపోతుంది. 

అనవసరంగా సంసారాన్ని నాశనం చేసుకున్నాడు. 

ఐదు సంవత్సరాలకు టింకు పుట్టాడు. వాడు కూడా అల్లరి. చదవడు, తల్లి గారాబం. 


పిల్లవాడు కూడా తండ్రి చెప్పిన మాట వినడు, వాడి మీద ఈగవాలనివ్వదు సుబ్బి, 

ఇదీ, తన సంసారం!

 

తను అతి తెలివి గా ప్రవర్తించి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. చక్కగా అమాయకంగా ఉండే భార్యని దినమంతా సాధించి, నీవు నచ్చలేదు అంటూ దాన్ని వేళాకోలం చేసి దాని మనసంతా విషంగా మార్చేశాడు.


 =ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమిటి ప్రయోజనం, అంతే! జీవితం అంతా భార్యకి వెట్టి చాకిరీ చేస్తూ గడపవలసి వస్తోంది. 


భర్తని ప్రేమగా గౌరవంగా చూస్తే అది తాను నిలబెట్టుకోలేకపోయాడు. అతి తెలివి అనర్థం, ఆమెని అడ్డమైన హింసలు పెట్టి, ఇదిగో జీవితమంతా అనుభవిస్తున్నాడు.

ఆడవాళ్ళా! మజాకా!

అతి తెలివి చూపిస్తే చక్కటి గుణపాఠం నేర్పిస్తారు. 


&&&&&&_


అద్దంకి లక్ష్మి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి

నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి

జన్మ స్థలం:రాజమహేంద్రవరం

నివాసం: నవీ ముంబయి

విద్యార్హతలు:

బి.ఎ; బి. ఇడి

**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,

బాంబే మునిసిపల్ కార్పొరేషన్


**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.

భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;

విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ

**కుమారుడు:

గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,


**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.

అల్లుడు మధుసూదన్ అమెరికా

వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు


**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,


నిరక్షరాస్యతను నిర్మూలించుటకు సేవా కార్యక్రమాలు నిర్వహించాను. నాటకాలు వ్రాసి విద్యార్థుల నాటకాలు వేయించాను. బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను. సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి.

చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను.


**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,

**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం

**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం

సాహితీ జీవితం_రచనలు

**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను

**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి

ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను


**అనేక సమూహాల్లోని ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు, పద్యాలు ప్రచురించ బడినవి. కవితలకు కథలకు బహుమతులు పొందినాను


నేను రాసిన కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా

**మినీ కవితలు, పంచపదులు, సున్నితాలు, ఇష్టపదులు

**గేయాలు, వ్యాసాలు, నాటకాలు, పద్యాలు, గజల్స్,

కథలు, రుబాయీలు, బాల సాహిత్యం

**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి


*సాహిత్య సేవ

తేనియలు, తొణుకులు, చిలక పలుకులు, పరిమళాలు, మధురిమలు, ముత్యాలహారాలు,ఇష్టపదులు,

సకినాలు, సున్నితాలు, పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,


**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను

**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,

అన్ని గ్రూపుల నుంచి,15 బిరుదులు పొందడం జరిగినది,


ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,, 2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,

రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,

ప్రచురణ: కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page