top of page

స్త్రీల వెతలు

#BandariSujatha, #బండారిసుజాత, #స్త్రీలవెతలు, #SthreelaVethalu, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Sthreela Vethalu - New Telugu Story Written By Dr. Bandari Sujatha

Published In manatelugukathalu.com On 21/10/2025

స్త్రీల వెతలు - తెలుగు కథ

రచన: డా. బండారి సుజాత 


“ఏమైందే? అలా ఎందుకు ఉన్నావు?” అని పలకరించింది స్పందన.


“ఈ మధ్య కడుపునొప్పి చాలా ఎక్కువైందమ్మా. డాక్టర్ దగ్గర మందులు వాడుతున్నా, అయినా నొప్పి తగ్గడం లేదు,” అంది చందన.


“డాక్టర్ ఏమన్నారు?” అని అడిగింది స్పందన.


“‘మందులు వాడండి చూద్దాం’ అన్నారు. రెండు నెలలు అయింది — అదే మందులు వాడుతున్నా నొప్పి తగ్గడం లేదు. భరించలేకపోతున్నాను,” అంది చందన.


“ఏమైనా టెస్టులు చేయించావా?” అని అడిగింది స్పందన.


“ఆప్పుడు చేసిన టెస్ట్ ప్రకారం మందులు రాసారు. కొంత తగ్గినట్టు అనిపించింది కానీ ఈ పది రోజులుగా మళ్లీ ఎక్కువైపోయింది. మా ఆయన ఊర్లో లేరు. పిల్లల స్కూల్, ఇంటి పనులతో డాక్టర్ దగ్గరకు వెళ్లడం కుదరలేదు,” అంది చందన.


“ఎందుకు బాధపడుతున్నావు? నేనొస్తా పద!” అంది స్పందన.


“లేదమ్మా, అమ్మ రమ్మంది. రేపు వస్తుంది. మా ఆయన కూడా రేపే వస్తాడు. వాళ్లు వచ్చిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్లుదామనుకుంటున్నా,” అంది చందన.


“మన విజయ గుర్తుందా?” అని అడిగింది చందన. “అదేం అయ్యిందో తెలుసా? గర్భసంచి తొలగించారట!”


“ఎందుకమ్మా?” అని ఆశ్చర్యపోయింది స్పందన.


“బ్లీడింగ్ చాలా ఎక్కువవుతుందట. పదిహేను రోజులకోసారి నెలసరి వచ్చేది. వయసు పెరుగుతుంటే అట్లనే ఉంటుందని అనుకుందట. మన అందరికీ దాదాపు ఒకే వయసుకదా,” అంది చందన.


“ముగ్గురు పిల్లలు, ఇంటి పని, అలసట — దాంతో మానసికంగా కూడా బాధపడేది. ఏ పని చేయలేకపోయేది. భర్త ‘ఇదేం నీకిదే పనా!’ అని విసుక్కుంటుండేవాడు. చివరికి భయంతో డాక్టర్‌ దగ్గరకు వెళ్లింది. స్కానింగ్‌ లో గర్భసంచిపై పుండు చూపిందట. మందులు వాడినా తగ్గలేదట. ఆపరేషన్‌ లేకపోతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్‌ చెప్పడంతో గర్భసంచి తొలగించుకుంది,” అంది చందన.


“అవన్నీ నీకు ఎలా తెలుసు?” అని అడిగింది స్పందన.


“ఆమధ్య మన ఊరికి వెళ్లాను కదా! అప్పుడు ఆమె విశ్రాంతి తీసుకోవడానికి వాళ్ల అమ్మింట్లో ఉంది. నేను కలిసా,” అంది చందన.


“అమ్మా! ఆపరేషన్ తర్వాత ఆమె బాగుందా?” అని స్పందన అడిగింది.


“అవును, ఇప్పుడు బాగుంది. కానీ ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించుకుంటోంది. మన వయసు దాటాక ఈ సమస్యలు వస్తూనే ఉంటాయంటోంది,” అంది చందన.


“అయ్యో! నీకు చెప్పలేదు కదా — మొదట నీలాగే కడుపునొప్పితో మొదలైందట. గర్భసంచి మీద పుండు, గడ్డలు — మందులతో తగ్గకపోవడంతో పెద్దవయ్యాయి. చివరికి తొలగించుకోవాల్సి వచ్చింది,” అంది స్పందన.


“విజయ ఫోన్ నంబర్ ఉందా? మాట్లాడాలి. ఇల్లు, పిల్లలు, రోగాలు — వీటితోనే సరిపోతుంది. చాలా రోజులైంది మాట్లాడి,” అంది చందన.


“ఇస్తా. నీకు తెలుసు కదా, నేను కూడా ఆబాధలే పడ్డాను. ఇప్పటికీ మందులు వాడుతూనే ఉన్నాను,” అంది పార్వతి సంభాషణలో చేరుతూ.


“నీకు మందులతోనే తగ్గిపోయిందికదా!” అంది చందన.


“అవును, కానీ ఒక్కోక్కరికి ఒక్కో రకంగా వస్తుంది ఈ జబ్బులు,” అంది పార్వతి.


“ప్రభావతత్తమ్మ గుర్తుందా?” అని అడిగింది పార్వతి.


“అవును, ఆమెకు కూడా ఇలాంటి సమస్యలే వచ్చాయట. బీపీ, షుగర్‌తో పాటు గర్భసంచిపై గడ్డలు కూడా. చివరికి ఆపరేషన్ తప్పలేదు. ఆమె చెప్పింది — ‘రక్తాన్ని గడ్డలు పీల్చేసుకుంటున్నాయట’ అని. సమయానికి తెలిసింది కాబట్టి కాపాడుకున్నారు. సాధారణంగా ఈ విషయాలు చివరి దశలోనే తెలుస్తాయి. అందుకే ప్రతి స్త్రీ నలభై దాటాక ఏడాదికి ఒకసారి చెక్ చేయించుకోవాలి,” అంది పార్వతి.


“అదేనమ్మా,” అంది చందన. “నీలాగే మందులతో తగ్గుతుంది అనుకున్నాను కానీ ఈ మధ్య నొప్పి భరించలేకపోతున్నాను. ఒకవేళ తొలగించాల్సి వస్తే సరే అని అనుకుంటున్నా.”


“రేపటికి శేఖర్ వస్తాడు కదా!” అంది పార్వతి.


“లేదమ్మ, ఈ రాత్రే వస్తానన్నాడు. పిల్లలను బడికి పంపి రేపు ఉదయాన్నే డాక్టర్ దగ్గరకు వెళ్తాను,” అంది చందన.


చందన తల్లికి ఇంటి పనులన్నీ వివరంగా చెప్పి, పిల్లలకు ఏం పెట్టాలో, ఏం తినాలో లిస్టు ఇచ్చింది.


“నువ్వు టెన్షన్ పడకు అమ్మా, నేనే చూసుకుంటాను,” అంది పార్వతి.


మరుసటి రోజు చందన భర్తతో కలిసి ఆసుపత్రికి వెళ్లింది. టెస్టులు చేయించుకుంది.

డాక్టర్ చెప్పింది — “మందులతో తగ్గుతుందనుకున్నా ఆలస్యం అయితే క్యాన్సర్ ప్రమాదం ఉంటుంది. ఈ రోజు సాయంకాలం టెస్టులు చూసి నిర్ణయం తీసుకుందాం.”

“ఆపరేషన్ తర్వాత నొప్పులు, లావు అవ్వడం, తిమ్మిర్లు వస్తాయంటున్నారు. నిజమేనా?” అని అడిగింది చందన.


“అవును,” అంది డాక్టర్ సుచరిత. “గర్భసంచి లేదా అండాశయాలు తీసేసిన తర్వాత హార్మోన్ మార్పులు వస్తాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల నిద్రలేమి, వేడి పుడమి, మానసిక ఆందోళన, చిరాకు మొదలైనవి వస్తాయి. క్రమంగా వ్యాయామం చేయడం, నడక, పోషకాహారం తీసుకోవడం వల్ల తగ్గుతాయి.”


“గర్భసంచిలో మాత్రమే సమస్య ఉంటే అండాశయాలను ఉంచవచ్చు. అలా చేస్తే ఇలాంటి సమస్యలు తక్కువగా వస్తాయి,” అంది డాక్టర్.


“ధన్యవాదాలు మేడం, చాలా విషయాలు చెప్పారు,” అంది చందన.


“మేము చెప్పేది ఒకటే — స్త్రీలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇంటి పనులు, ఉద్యోగం, ఆర్థిక సమస్యలతో ఆలస్యం చేస్తే, చికిత్స కూడా కష్టం అవుతుంది,” అంది డాక్టర్.


టెస్టులు చేసి బయటకు రాగానే చందన స్పందనకు ఫోన్ చేసి, “రేపు ఫలితాలు వస్తాయి, చెప్తాను,” అంది.


భర్త “ఏం భయపడకు” అన్నాడు.


“భయపడి చేసేదేముంది,” అని నవ్వింది చందన.


కారు ఎక్కి తల్లి, కూతురు ఇంటి వైపు బయలుదేరారు —


స్త్రీల ఆరోగ్యం అంటే కేవలం బలం కాదు, జాగ్రత్త కూడా కావాలి.


.. సమాప్తం .. 


డా.బండారి సుజాత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం : https://www.manatelugukathalu.com/profile/bandari

Dr.Bandari Sujatha

పేరు : డా.బండారి సుజాత

(ప్రభుత్వ విశ్రాంత తెలుగు ఉపాధ్యాయిని)


విద్యార్హతలు : M.A(adm), B.ed, M.A (Tel), M.phil, P.hd.


తల్లిదండ్రులు: కీ.శే : బండారి లక్ష్మి,సమ్మయ్య.


సహచరుడు: ఆకుతోట ఆశయ్య

(రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ )


D.O.B :18-08-1958


వృత్తి: స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) విశ్రాంత ఉపాధ్యాయిని.


ప్రవృత్తి : కవితలు ,కథలు , వ్యాసాలు, వివిధ ప్రక్రియలలో సాహిత్యం రాయడం, చదవడం, అవసరార్ధులకు సహాయ మందించడం.

Comments


bottom of page