top of page
Original.png

మహిళా మేలుకో - పార్ట్ 3

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #మహిళామేలుకో, #MahilaMeluko, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Mahila Meluko- Part 3/3 - New Telugu Story Written By - Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 11/01/2026

మహిళా మేలుకో - పార్ట్ 3/3పెద్ద కథ

రచన: సుధావిశ్వం ఆకొండి

జరిగిన కథ:

పార్క్ లో తనని కలిసిన ప్రకాష్ కు తను ప్రెగ్నెంట్ అయిన విషయం చెబుతుంది తరుణి. 

మరుసటి రోజు నుండి అతడు తరుణికి దూరంగా ఉంటాడు. తరుణిని మోసం చెయ్యొద్దని స్నేహితుడు చంద్రం చెప్పినా వినడు. నితిన్ గ్యాంగ్ ప్రోద్బలంతో బస్టాండ్ లో ఒక యువతిని ట్రాప్ చెయ్యాలని చూస్తుండగా పోలీసులు అరెస్ట్ చేస్తారు. 

ఇక మహిళా మేలుకో - పార్ట్ 3 చదవండి


"మీరు చాలా అందంగా వున్నారు. ఎంతటి మగవాడైనా మీకు దాసోహం అనాల్సిందే. ఇంతకీ మీ అందమైన పేరు ఏంటి? " అంటూ మాటలు మొదలుపెట్టాడు ప్రకాష్ ఆ లేడీతో


'అవును మావారు అదే అంటుంటారు. కానీ నేను అలా రానివ్వనుగా" అంది

 " మీకు పెళ్ళయిందా! కాలేజీ స్టూడెంట్ లా వున్నారు. మీ అందం ఎవ్వడినైనా పిచ్చొడిని చేస్తుంది. " అంటూ ఇంకా ఏవో పిచ్చి మాటలు మొదలుపెట్టాడు.

"ఒరే! పెళ్లి అయిన ఆడవారిని కూడా వదలరా? చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకూ వాళ్ళల్లో ఆడతనమే కన్పిస్తుందిరా మీకు చెత్తవెదవల్లారా! పశువులకంటే హీనం మీ బ్రతుకు. మనిషి జన్మ ఎత్తి వావివరుసలు లేకుండా ప్రవర్తిస్తారేంటి రా?" అంటూనే ఉంది


"వెంటనే వావివరుస ఉంటే పర్లేదా? అయితే ఏముంది? రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తే వరుస అదే కలుస్తుంది. కదా ఏమంటావు " ఏక వచనంలోకి దిగుతూ నవ్వాడు.


"నీకు చాలా కొవ్వెక్కి ఇలా మాట్లాడుతున్నావు. నీలాంటి నికృష్టుడిని కన్నందుకు సిగ్గుపడి, వేదనతో నీ తల్లిదండ్రులు చచ్చిపోతారురా! నీ అంతు చూడాల్సిందే. ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకొంటారురా?" అని తిడుతుంటే పగలబడి నవ్వుతుండగా బండి ఆగింది.


వాళ్ళింటి దగ్గర ఆపిందేమో అని తల ఎత్తి చూస్తే పోలీస్ స్టేషన్ అది. ఇదేంటి అని పారిపోవడానికి చూడగా పోలీసులు వచ్చి పట్టుకుని లోపలికి లాక్కెళ్లారు.


"ఏంటి ఇది? నన్నెందుకు తీసుకెళుతున్నారు" అంటుంటే లోపలికెళ్లి చూడగానే తన వాళ్ళ గ్యాంగ్ కన్పించింది.

వాళ్ల ని చూసిన ప్రకాష్ కి విషయం అర్ధం అయీ కానట్టుగా తోచింది.


 "మీ నాన్నకు కాల్ చేయలేదా " అని నితిన్ ను అడిగితే "ఫోన్స్ అన్ని లాక్కుని స్విచ్ ఆఫ్ చేశారురా" అన్నాడు.

ఇంతలో ఇంకో ఇద్దరు పోలీసులు వచ్చి ఫుల్లుగా కోటింగ్ మొదలుపెట్టారు.

"ఎందుకు కొడుతున్నారు మేమేం చేశాం? ఆవిడ ఎవరో లిఫ్ట్ అడిగి మోసం చేసి మా ప్రకాష్ ను తెచ్చింది" అంటున్న గ్యాంగ్ తో...


 వాళ్ళు...

" ఆవిడ మా స్పెషల్ టీమ్ హెడ్ జ్వాల. మన ముఖ్యమంత్రి వాహినిదేవి గారు మీలాంటి మగ మృగాళ్ల ఆటకట్టించడానికి ప్రవేశపెట్టిన కొత్త పథకం గురించి మీకు తెలియదా? ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేవారిని, అవకాశం దొరికితే చాలు స్త్రీలను లైంగిక వేధింపులు గురి చేసే బాస్టర్డ్స్ ని పట్టుకుని, కంప్లైంట్స్ ఇవ్వడానికి వెనుకాడే ఆడపిల్లలకు సరియైన న్యాయం చేకూర్చి, ఆడపిల్లల ఆక్రందనలే ఆవేశాగ్ని జ్వాలలుగా మీలాంటి వారి పైన సంధించే అస్త్రం ఈ ' మహిళా! మేలుకో!' పథకo.

ఎవరు సగటు ఆడపిల్లలో, ఎవరు స్పెషల్ టీమ్ డిటెక్టివ్ లో తెలియక ఆడపిల్లను టీజ్ చేయాలన్నా, వేధించాలనుకున్నా జడుసుకోవాలి మీలాంటి వాళ్లు. ఆడవాళ్ళ సత్తా ఏంటో తెలిసిందా? మీకు సరియైన శిక్ష మహిళా న్యాయస్థానం తెలుస్తుంది పదండి" అంటూ లాక్కెళ్లారు భయంతో క్షమించి వదిలివేయమని బ్రతిమాలుతున్న గ్యాంగ్ మాటలు పట్టించుకోకుండా.


"ఆడపిల్లలను లైంగిక విలాస వస్తువుగా భావించే మృగాళ్లు అందరూ భయపడే విధంగా ఈ ప్రత్యేక మహిళా న్యాయస్థానం సంచలనాత్మకమైన తీర్పును ఇవ్వబోతోంది. ఇంతటి ఘాతుకాలకు పాల్పడిన ఈ గ్యాంగ్ కి మళ్ళీ అలాంటి పనులు చేయడానికి వీలులేకుండా శస్త్రచికిత్స చేసి నపుంసకులు గా మార్చాల్సిందిగా ప్రభుత్వ ఆసుపత్రి వారిని ఆదేశించడం జరిగింది. "అని న్యాయస్థానం తీర్పునిచ్చింది.


గ్యాంగ్ ని బలవంతంగా లాక్కెళ్లారు. ప్రకాష్ కి అప్పుడు తరుణి గుర్తుకు వచ్చింది. ఎంతో ప్రేమగా చూసుకుని, ఏది కావాలంటే అది కొనిచ్చిన అమ్మానాన్న గుర్తొచ్చారు. బాగా ఏడుపు వచ్చి పశ్చాత్తాపం కలుగసాగింది. కానీ ఏమీ లాభం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే అనుకున్నాడు. ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్తుంటే వణుకు వచ్చింది.

" నో! వద్దూ.. నేను మారిపోతాను నన్ను మన్నించండి. తరుణి! సారీ!" అంటూ గట్టిగా భూనభోంతరాళాలు అదిరిపోయేట్టు కేకలు వేస్తున్నాడు.


*********


"ఏమైందిరా ప్రకాష్? "అని తట్టి లేపాడు చంద్రం. ఉలిక్కిపడి లేచాడు.

భయంతో లేచి కూర్చున్నాడు. శరీరం భయంతో వణికిపోతోంది. గొంతు తడారి పోతోంది. నాలుక పిడుచకట్టుకుపోతోంది.


"ఏంటిరా? నిద్రలోంచి లేచి అలా వణికి పోతున్నావు? అరుపులు, కేకలు వేస్తూ లేచావు పీడ కల ఏమైనా వచ్చిందా?" ఆతృతగా అడిగాడు చంద్రం.

" అవునురా నిజంగా పిడకలే. నిన్న నువ్వు నా మేలుకోరి అన్న మాటలే కలగా వచ్చింది.ఇక నాకు బుద్ధి వచ్చిందిరా. నువ్వు చెప్పినట్టే అమ్మవాళ్లకు చెప్పి తరుణిని పెళ్లిచేసుకుంటాను. ఇక ఆ గ్యాంగ్ తో తిరుగను. ఇప్పటివరకు గ్యాంగ్ ఉంటే ఏదో హీరోలా ఉంటుందని ఫీల్ అయ్యాను. ఫైనల్ పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. నువ్వు హెల్ప్ చేయి. బాగా చదివి ఇక ఏదైనా జాబ్ చూసుకుని, తరుణితో వెళ్లి అమ్మానాన్నలను చూస్కుంటానురా. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా లక్ రా" అంటూ వచ్చిన భయంకరమైన కల వివరించాడు.


"నువ్వు మారినందుకు చాలా హ్యాపీగా ఉందిరా. నిన్న అంతా ఎంత టెన్షన్ పడ్డానో! అంటూ మనసులో

" హే! భగవాన్! నా మనవి ఆలకించి నా మిత్రుడు మారేటట్టు చేశావా తండ్రీ!, నీకు శతకోటి నమస్కారాలు" భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకుని తేలికపడిన మనసుతో నిద్రకు ఉపక్రమించాడు చంద్రం.


"హమ్మయ్య ఇలా నిర్ణయించుకున్నాక మనసు హాయిగా ఉంది. రేపు తరుణిని కలిసి సారీ చెప్పి ఫ్యూచర్ ప్లాన్ వివరించాలి అని అనుకుని హాయిగా నిద్రపోయాడు ప్రకాష్.

సమాప్తం

మీకందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను.

చదివి, నచ్చినవారు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి..

***

సుధావిశ్వం ఆకొండి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!

 కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది.  ప్రస్తుత నివాసం ఢిల్లీ.




bottom of page