మహిళా మేలుకో - పార్ట్ 2
- Sudha Vishwam Akondi

- 13 hours ago
- 3 min read
#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #మహిళామేలుకో, #MahilaMeluko, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Mahila Meluko- Part 2/3 - New Telugu Story Written By - Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 08/01/2026
మహిళా మేలుకో - పార్ట్ 2/3 - పెద్ద కథ
రచన: సుధావిశ్వం ఆకొండి
జరిగిన కథ:
పార్క్ లో తనని కలిసిన ప్రకాష్ కు తను ప్రెగ్నెంట్ అయిన విషయం చెబుతుంది తరుణి.
మరుసటి రోజు నుండి అతడు తరుణికి దూరంగా ఉంటాడు.
ఇక మహిళా మేలుకో - పార్ట్ 2 వినండి.
"ఒరే ప్రకాష్! అన్యాయం రా! పాపం తరుణిని మోసం చేయొద్దు రా!, తను నిజంగా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిందిరా! మంచి కుటుంబం లో నుంచి వచ్చిన అమ్మాయి. మొదట ఎలా ఉండేది! నువ్వు అనవసరంగా ఆ నితిన్ గ్యాంగ్ తో చేరి, ఎలాగైనా తనని పడేస్తాను అని ఛాలెంజ్ చేసి తనను ప్రేమలోకి దించావు కదా! తను ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఆ పాపం నీకే చుట్టుకుంటుందిరా! నా మాట వినురా. చిన్నప్పటి నుండి మనం ఫ్రెండ్స్ కదా అందుకే నీ మంచి కోసం చెబుతున్నాను. " అన్నాడు చిన్నప్పటి నుండి ఫ్రెండ్, ఇప్పుడు క్లాస్ మేట్, రూమ్ మేట్ అయిన చంద్రం.
"మొదలుపెట్టావా నీ నీతి వాక్యాలు! కాలంతో పాటు మనం మారాలి. ఇప్పటి ట్రెండ్ ఎలా ఉంది? యూత్ అంటే అంది వచ్చిన ఆనందాన్ని అనుభవిస్తూ ఎంజాయ్ చేయడమే. ఆడవాళ్లు కూడా ఏమీ ఫీల్ అవ్వరు. వాళ్ళూ ఎంజాయ్ చేస్తున్నారు టేక్ ఇట్ ఈజీగా తీస్కుంటున్నారు. ఇక పాపం అంటావా అంతా మనం అనుకోవడం లోనే ఉంది. అలవాటు అయ్యేవరకే అలా అనిపిస్తుంది తరువాత ఏ ఫీలింగ్ ఉండదు. ఈ నీతి నియమాలు మనుషులు పెట్టుకున్నవే. మనం ఎలాగైనా మార్చుకోవచ్చు. అసలు గుళ్లో పూజలు చేసుకునే అర్చకుని కొడుకును మా ఊరివాడు అని తెచ్చి నా రూమ్ మేట్ గా పెట్టుకున్నందుకు నన్ను నేను కొట్టుకోవాలి. వెధవ సోది నువ్వూనూ! నువ్వూ ఎంజాయ్ చేయవు, నన్నూ ఎంజాయ్ చేయనివ్వవు. తరుణి ఎంచక్కా ఏదో గొప్ప డబ్బున్న సంబంధం చేసుకుని పోతుంది కానీ నా బుర్ర తినకు" అన్న ప్రకాశ్ తో చంద్రం,
"ఒరే ఇలా తయారయ్యావేరా? మనం చేసిన పాప ఫలం తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది అప్పుడు నేరం రుజువు అయి పోలీసుల చేతిలో ఏ ఎన్కౌంటర్ అవ్వడమో జరుగుతుంది. ఇలా ఆడవాళ్లను మోసం చేసే వారిని అరబ్ కంట్రీస్ లో అవయవాలు కట్ చేస్తారట తెలుసా! అలాంటి పరిస్థితి మన దేశానికి రావొద్దు. ఆ నితిన్ గ్యాంగ్ తో వెళ్లొద్దు. వాళ్ళు ఎంత మందినో ట్రాప్ చేశారని విన్నా. ఎప్పుడో పోలీసులు పట్టుకుంటే వాళ్ళతోపాటు నువ్వూ అనుభవిస్తావు " అని బెదిరించాడు చివరి ప్రయత్నంగా మారతాడేమో అని.
"పో.. రా! నా బుర్ర తినకు నైట్ అయ్యింది. రేపు కొత్త పిట్టకు వల వేయాలి అనుకున్నాం నేను, నితిన్" అని అంటూ నిద్రపోయాడు.
"ఇలా యువత వెర్రితలలు వేస్తోంది ఎందుకు? ఎవరిది తప్పు? ఇలాంటి పనులు హీరోలు చేసినట్టుగా చూపించే సినిమాలా? చదువుకొమ్మని పంపిస్తే వీడు ఇలా చేస్తున్నాడు. ఆంటీ, అంకుల్ ఎంత బాధపడతారో వీడిలా తయారయ్యాడని తెలిస్తే? రేపు మళ్ళీ చెప్పిచూస్తాను. తరుణి తో కూడా మాట్లాడాలి.. " ఇలా ఆలోచిస్తూ ఎప్పటికో పడుకున్నాడు చంద్రం.
*****
మార్నింగ్ కాలేజీలో నితిన్ గ్యాంగ్ తో వున్నాడు ప్రకాశ్. "ఇలా కాలేజీలో ఉన్న బ్యూటీ లను పడెయ్యడం గొప్పేం కాదురోయి.. ఈ సారి వెరైటీగా బస్టాప్ లోవున్న (మనకు తెలియని) లేడీస్ లో ఒకళ్లను పడేసి అందరం ఎంజాయ్ చేద్దామా ఒకే నా" అన్నాడు నితిన్. అందరూ సై అన్నారు. దగ్గర్లోని ఒక బస్టాప్ లోకి వెళ్లారు. అక్కడ బ్లూ జీన్స్ పై బ్లాక్ టీ షర్ట్ వేసుకుని బస్ కోసం అసహనంగా వెయిట్ చేస్తున్న అందమైన లేడీ ని చూశారు. నితిన్ గ్యాంగ్ టీజ్ చేయాలి, ప్రకాశ్ కాపాడినట్టు గా యాక్షన్ చేసి తరువాత కథ ముందుకు నడిపి తరువాత అందరూ ఎంజాయ్ చేయాలి ఏదైనా తేడా వస్తే నితిన్ చూసుకుంటాడు. ఇదీ ప్లాన్. నితిన్ వాళ్ళ నాన్న పెద్ద పేరున్న వ్యాపార వేత్త అదీ ధీమా.
ప్లాన్ ప్రకారం వెళ్లి టీజ్ చేశారు. ప్రకాశ్ వచ్చి వీళ్ళను తిట్టి బెదిరిస్తే, వాళ్ళు పక్కకు తప్పుకున్నారు. పక్కనే ఉండి చూస్తున్నారు ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అని. ఆ లేడీ ప్రకాశ్ కి పడినట్టే ఉంది ప్రకాశ్ బైక్ దగ్గరికి వచ్చింది ఇక వెళ్తున్నారు మన ప్లాన్ సక్సెస్ అని చేతులు చరుచుకున్నారు.
ఇంతలో బైక్ నడిపే చోట ఆ లేడీ కూర్చుంది ప్రకాశ్ వెనక కూర్చున్నాడు. బైక్ వెళ్ళింది. ఇదేంటి అని చూస్తున్నారు గ్యాంగ్. పోలీసులు వచ్చి పట్టుకుని జీప్ లో వేసుకుని వెళ్లారు, నేనెవరో తెలుసా అని నితిన్ బెదిరించినా వినకుండా.
ఆ తర్వాత ఏమైంది? పోలీసుల నుండి తప్పించుకున్నారా? వాళ్ళ గతి ఏమైంది? తెలుసుకోవాలనుకుంటే
మహిళా మేలుకో part 3 కోసం వెయిట్ చేయండి.
వెయిట్..
సశేషం..
సుధావిశ్వం
ఇది చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి..
సుధావిశ్వం
================================================================
ఇంకా వుంది..
మహిళా మేలుకో - పార్ట్ 3/3 కోసం త్వరలో
================================================================
సుధావిశ్వం ఆకొండి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!
కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది. ప్రస్తుత నివాసం ఢిల్లీ.




Comments