top of page
Original.png

అసలైన పండగ

#PadmavathiDivakarla, #పద్మావతిదివాకర్ల, #AsalainaPandaga, #అసలైనపండగ, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Asalaina Pandaga - New Telugu Story Written By Padmavathi Divakarla

Published In manatelugukathalu.com On 09/01/2026

అసలైన పండగ - తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

ముప్ఫై ఐదేళ్ళు ఉపాధ్యాయుడిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఉద్యోగ విరమణ తర్వాత ప్రస్తుతం స్వంత ఊళ్ళో విశ్రాంత జీవితం గడుపుతున్నాడు శివరాం. అతని భార్య అన్నపూర్ణమ్మ పేరుకు తగ్గ ఇల్లాలు. వాళ్ళ పెద్దకొడుకు ప్రకాశ్ ముంబైలోను, చిన్నకొడుకు బెంగుళూరులోనూ ఉన్నారు. అమ్మాయి ప్రమీల, అల్లుడు ప్రమోద్ వాళ్ళు ఉంటున్నది ముంబైలో. ముగ్గురూ మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు.


"ఏమండీ! పిల్లలకి ఫోన్ చేసారా? సంక్రాంతి పండక్కి వస్తామన్నారా?" కొంగుకు తడి చేతులు తుడుచుకుంటూ భర్తను అడిగింది అన్నపూర్ణమ్మ.


వాలుకుర్చీలో కూర్చొని పేపరు చదవడంలో లీనమై ఉన్న శివరాం తలెత్తాడు. "ఆఁ..! ఫోన్ చేసి చెప్పాను. రావడానికి ప్రయత్నిస్తామన్నారు. అయినా ఈ పల్లెటూర్లో వాళ్ళకెలా తోస్తుంది చెప్పు! సంవత్సరమంతా ఏ పండగ వచ్చినా క్రమం తప్పకుండా పిలుస్తూనే ఉన్నాం మరి! పెద్దవాడు ప్రకాశ్ వస్తే, చిన్నవాడు ప్రశాంత్ రాడు. వాళ్ళిద్దరూ వస్తే అమ్మాయి ప్రమీల రాదు. అందరూ ఒకేసారి వచ్చి ఎన్నాళ్ళయిందో అయినా నీ చాదస్తం కానీ, వాళ్ళకి మాత్రం వీలవద్దూ? అంతేకాక, మనకీ కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నీకు తెలుసుకదా! పిల్లల్ని అడగకపోయినా అప్పుడప్పుడు డబ్బులు పంపుతున్నారనుకో?.." మధ్యలో ఆగాడు శివరాం.


"ఆర్థిక సమస్యలు ఎప్పుడూ ఉండేవేలెండి. పండక్కి పిల్లలూ, మనవలూ వస్తే ఇల్లంతా కళకళలాడదూ! అసలు మీరే కదా అందరితో కలిసి పండుగ జరుపుకుందాం అన్నారు." అందామె.

"ఆర్థిక సమస్యలు ఎలాగోలా తట్టుకోవచ్చు. నీకా ఆరోగ్యం సరిగ్గా లేదు. కీళ్ళ నొప్పులు, బీపీ ఉన్నాయి. వచ్చినవాళ్ళందరికీ నువ్వే వండి వార్చాలి. పిండివంటలు, మనవలకోసం చిరుతిళ్ళు చెయ్యాలి. బాగా అలిసిపోయి నీ ఆరోగ్యం పాడవుతుందని నా భయం! అందుకే ఈ సారి పిలవడం మానేద్దామా అనుకున్నాను. కానీ..."


"కానీ..." అతని ముఖం వైపు చూసిందామె.


"మనమా అంత దూరం ఎవరింటికీ వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా మామూలుగా అయితే మనల్ని చూడటానికి కూడా రారు. అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, పండగ పేరుపెట్టి వాళ్ళని పిలవడం! కాకపోతే నీకే శ్రమంతా!" అన్నాడు శివరాం.


ఆ మాటలకి నొచ్చుకుందామె. "అబ్బే! నాకేం శ్రమండీ! పిల్లలికి, మనవలకి చేసి పెట్టడం కూడా ఒక శ్రమేనా! ఇకనుండి వంటమనిషిని పెట్టుకుందాంలెండి. కానీ పండక్కి పిల్లల్ని పిలవడం మాత్రం మానవద్దు. ఆ వంకైనా మనం వాళ్ళని చూడగలుగుతున్నాం కదా! అందుకే కాబోలు భగవంతుడు మనకు ఇన్ని పండుగలు ఇచ్చింది, కనీసం ఒక పండగకైనా వస్తారని!" అన్న అన్నపూర్ణమ్మవైపు సాలోచనగా చూసాడు శివరాం.


వారంరోజుల్లో సంక్రాంతి పండగ వచ్చింది. ఈసారి ముగ్గురూ తల్లితండ్రుల్ని చూడటానికి రావడంతో శివరాం, అన్నపూర్ణమ్మ దంపతుల ఆనందానికి అంతేలేదు! కుటుంబ సభ్యులందరితో ఇల్లు కళకళలాడింది. వాళ్ళిద్దరికీ ఎక్కడలేని శక్తీ వచ్చింది. 'అసలైన పండగ ఇదే!' అనిపించింది వాళ్ళిద్దరికీ.


సమాప్తం


పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:


పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page