పరామర్శ
- Mohana Krishna Tata
- 17 minutes ago
- 3 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #Paramarsa, #పరామర్శ, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Paramarsa - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 09/01/2026
పరామర్శ - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"ఏమండీ! రేపటినుంచి మీరు ఆఫీసుకి వెళ్ళిపొండి..మీకు పుణ్యముంటుంది"
"ఎందుకు శాంతి! నేను ఇంట్లో రెస్ట్ తీసుకోవడం, తొందరగా కోలుకోవడం నీకు ఇష్టం లేదా? లేక నేనింట్లో ఉంటె సీరియల్స్ చూడలేకపోతున్నావా?"
"మీరంటే నాకు చాలా ప్రేమండి..కానీ వారం నుంచి ఇక్కడ జరుగుతున్నది చూస్తూవుంటే బాధగా ఉంది..మీకు తెలియనిది కాదు"
"అయితే..ఫ్లాష్ బ్యాక్ చక్రం తిప్పు మరి..ఎందుకు ఆలస్యం"
"తిప్పాను..ఒక వారం రోజుల ముందు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి..."
***
"ఈ రోజు కొత్తబండి కొన్నాను.. ఎలా ఉంది శాంతి?"
"కొత్తది కాదు కదా..సెకండ్ హ్యాండ్ కదండీ..ఎందుకో అంత బిల్డప్"
"తక్కువలో వస్తే తీసుకున్నా..కొత్తదంటే కూడా నమ్మేస్తారు తెలుసా? ఎక్కువ వాడలేదంట దీనిని"
"అవునులెండి...ఇలాంటివి భలే దొరుకుతాయి మీకు..వెతికి మరీ కొంటారు"
"వస్తావా అలా సరదాగా రైడ్ కి వెళ్దాము"
"కొత్తది అయితే వచ్చేదాన్నేమో...దీనిమీద ఎంతమంది కూర్చున్నారో? మీరే వెళ్ళండి..తర్వాత వస్తాలెండి"
"వీకెండ్ లో 'పడితే కాలు విరుగుతుంది' సినిమాకు వెళ్దాము.."
"చూద్దాము.."
భర్త బయటకు వెళ్ళిన కొంతసేపటికి ఫోన్ మోగింది...
"హలో..! శాంతిగారా?"
"ఎవరు..?"
"మేము దోచేయ్ హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాము"
"దోచుకోవడానికి మా దగ్గరేముంది చెప్పండి?"
"మీ ఆయన మా హాస్పిటల్ లో యాక్సిడెంట్ అయి జాయిన్ అయ్యారు...మీరు వచ్చి మీ దగ్గరున్నది మా దోచేయ్ లో కట్టాలి"
"అయ్యో..ఏమైందో?"
హాస్పిటల్ కు చేరిన శాంతి ...భర్త కాలుకు పెద్ద కట్టు చూసి...
"ఏమిటండీ ఇది?" అంటూ ఏడవడం మొదలుపెట్టింది.
"ఇదా...సిమెంట్ కట్టు అంట...నర్స్ చెప్పింది"
"వెధవ జోకులూ మీరూనూ...ఎలా జరిగిందని అడుగుతున్నాను"
"కొత్త బండి మీద గీత పడకూడదని, చెట్టు కొమ్మని తప్పిస్తే, బండి వెళ్లి డివైడర్ ని గుద్దింది..అంతే! తర్వాత ఇక్కడ ఉన్నా"
"ఎందుకండీ ఆ బండికోసం అంత తాపత్రయం..కొత్తదా ఏమైనానా..?"
"నాకు కొత్తదే! ఇందాక బాస్ ఫోన్ చేసారు...పది రోజులు సెలవు అడిగా"
"ఏం చేద్దామని?"
"హాస్పిటల్ లో నర్స్ సేవలు చేస్తుంటే, భలే ఉందిలే శాంతి.."
"ఉంటుంది..ఉంటుంది..నర్స్ చెయ్యి వేస్తే ఐదొందలంట. డాక్టర్ చూస్తే వెయ్యి...మీకు తెలుసా? దోచేయ్ హాస్పిటల్ పేరుకు తగ్గటే ఉంది. మీరు డిశ్చార్జ్ అయ్యారు పదండి ఇంటికి...ఇక్కడ వారం గట్రా ఉంటె, ఆస్తులు అమ్ముకోవల్సిందే" అంది శాంతి బట్టలు సర్దుతూ.
***
"మొత్తం మీద ఇంటికి వచ్చేసాము. మీరు ఇంట్లోనే వారం రెస్ట్ తీసుకోండి సరిపోతుంది. ఇంజక్షన్ అవీ నేనే చేస్తాను. లేకపోతే ఒక సారి గుచ్చినందుకు ఐదొందలా? మా ఆయనకు నేనే గుచ్చుతాను. ఒకసారికి నాకు ఒక వంద ఇప్పించండి..మార్కెట్ లోకి కొత్త చీరలు వచ్చాయంట..వెంటనే అవి నా వొంటిమీద ఉండాలి" అంది శాంతి.
ఇలా ఇంటిలోకి అడుగుపెట్టారో లేదో..పక్కింటి సుబ్బారావు తలుపు కొట్టాడు..
"వచ్చేసావా రఘు! కాలుకు పెద్ద కట్టే వేసారే! కిందటి సంవత్సరం ఇలాగే మా బావమరిదికి ఇలాగే తెల్లటి కట్టు ఒకటి కట్టారు. డాక్టర్ చెప్పిన మాటలు వినకుండా తెగ తిరిగేసాడు తెలుసా? "
"ఏమైంది మరి?"
"కాలు బాగా వాస్తే.. తీసేశారు"
"ఏమిటి కట్టా..?"
"కాదు కాలు"
"అయ్యో..!"
"అందుకే, నువ్వు తిరగకు..అలాగే పడుకో. కాలు లేకపోతె, నీకు సేవలు చెయ్యడానికి చెల్లెమ్మకు చాలా కష్టం కదా"
"అన్నయ్యగారు! మరీ అలా భయపెట్టకండి...మా ఆయన ఎలా ఒణికిపోతున్నారో చూడండి" అంది శాంతి.
సాయంత్రం టైం నాలుగైంది..
"ఇప్పటికి ముప్పయి మంది వచ్చారు మిమల్ని పరామర్శించడానికి..ఏమిటండీ ఈ గోల? కట్టింది ఒక చిన్నకట్టు...దానికి దేవుని దర్శనానికి వచ్చినట్టుగా జనాలు క్యూ కడుతున్నారే"
"నేనంటే ఏమనుకున్నావు...మనం చాలా ఫేమస్"
"కనిపించిన ప్రతివారితోను కబుర్లు ఆడితే...ఇలానే ఉంటుంది మరి! వారికేం పోయింది..చెల్లెమ్మా చేతి కాఫీ అమృతం అని పొగిడి వెళ్ళిపోతున్నారు..టిఫిన్ టైం కు వస్తే, టిఫిన్ పెట్టాలి..చెయ్యలేకపోతున్నాను"
"అమ్మా! నేను ఈ కాఫీ కప్పులు, టిఫిన్ ప్లేట్స్ కడగలేకపోతున్నాను...ఎక్స్ట్రా డబ్బులు ఇప్పించండి" పక్కనుంచి అందుకుంది పనిమనిషి.
"రఘు..!" అంటూ ఇంకో పిలుపు గుమ్మం దగ్గర...
"ఎవరూ..?ఎదురింటి అన్నయ్యగారా? రండి..రండి"
"మా ఆవిడ టిఫిన్ పెడతానన్నా వినకుండా.. నీకేమైందోనని పరిగెత్తుకుంటూ వచ్చాను రఘు..కాలికి పెద్ద దెబ్బే..తలకేమైన తగిలిందా?"
"లేదు.."
"నీ పిచ్చి చూపులు అవీ చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది...ఎందుకైనా మంచిదే ఆ బ్రెయిన్ స్కాన్ గట్రా తీయిస్తే తేలిపోతుంది. ఏదైనా తేడా వస్తే, పిచ్చి ఆసుపత్రి కష్టాలు మా చెల్లెమ్మకు వద్దు. ఇంకొకటి, ఎందుకైనా మంచిది... రెండో కాలు కూడా చెక్ చేసుకో..అదీ పొతే, పాపం వీల్ చైర్ గతి "
"నేనంటే ఎంత ప్రేమండీ అన్నయ్యగారు...మీకు వేడివేడిగా ఉప్మా తెస్తాను ఉండండి.."
"జీడిపప్పు కొంచం ఎక్కువ వెయ్యి తల్లీ...అలాగే వేడిగా కప్ కాఫీ పట్రా"
"కాఫీ, టిఫిన్ సూపర్ గా ఉన్నాయి...మళ్ళీ రెండు రోజులు పోయాక వస్తాను. ఈసారి ఉప్మా కాకుండా..ఇడ్లీ, వడ, దోశపెట్టించు. పాపం రఘుకి బాగుంటుంది...నేనూ తింటాను అనుకో" అంటూ వెళ్ళిపోయాడు.
"రఘుగారు..! " అంటూ మరొకరు.
"ఎవరబ్బా..?"
"మీ బండి కొన్నారుగా ఆ షాప్ ఓనర్ ని"
"నేనంటే ఎంత ప్రేమో.. నన్ను చూడడానికి వచ్చారా? దండ కూడా తెచ్చారే"
"మీరింకా బతికే ఉన్నారా రఘుగారు...?"
"అదేంటి అలా అనేసారు..బతికుంటే ఏమైనా ఇబ్బందా?"
"మీరు కొన్న బండిమీద ఆల్రెడీ నలుగురు పోయారు. అప్పటినుంచి దానిని కొనడానికి ఎవరు డేర్ చెయ్యలేదు. అందుకే బండి పదివేలకు అమ్మేసాము...చివరికి మీరు కొన్నారు..అయితే బతికి బట్టకట్టారు. పూర్తిగా తగ్గేవరకు జాగ్రత్త.." అంటూ చెప్పి వెళ్ళిపోయాడు షాప్ ఓనర్.
***********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
