ఈ వయసులో కూడానా
- Addanki Lakshmi

- Sep 13
- 4 min read
Updated: Oct 18
#తెలుగుకథలు, #అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #EeVayasuloKudana, #ఈవయసులోకూడానా
వారంవారం కథల పోటీలో బహుమతి పొందిన కథ

Ee Vayasulo Kudana - New Telugu Story Written By Addanki Lakshmi
Published In manatelugukathalu.com On 13/09/2025
ఈ వయసులో కూడానా - తెలుగు కథ
రచన: అద్దంకి లక్ష్మి
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
“అత్తయ్యా, ఈ కాలు యిటు పెట్టు, పారాణి కూడా పెడతాను”
అత్తగారు సుశీలమ్మకి రెండు చేతులకి, రాధ గోరింటాకుతో మంచి డిజైన్ల పెట్టింది. ఆవిడకి కాళ్ళకి పారాణి కూడా పెట్టుకోవడం చాలా ఇష్టం. అందుకే కాళ్ళకు చక్కగా పారాణి పెడుతోంది రాధ.
ఇంతలో రాధ ఫ్రెండ్స్ లీలా, సుధ హడావిడిగా వచ్చారు.
“కూర్చోండే! అత్తయ్యకి గోరింటాకు పెట్టేసి, మనం షాపింగ్ కి పది నిమిషాల్లో వెళదాం” అంది రాధ.
వాళ్ళిద్దరూ సోఫాలో కూర్చుంటూ, "ఏంటి అమ్మమ్మ గారు.. మీకు ఈ వయసులో కూడానా ఈ గోరింటాకు పిచ్చి” అంటూ పకపకా నవ్వారు.
ఆవిడ ముందు కొంచెం సిగ్గుపడ్డారు.
తర్వాత, "అవునమ్మా! నాకు చిన్నప్పటినుంచి గోరింటాకు సరదా ఉండేది పెట్టుకోవాలని. ఆషాడ మాసం వస్తే అతివలందరూ పెట్టుకుంటారు కదా. ఐదోతనం అంటారు
ముచ్చటగా”
"అవును, అమ్మమ్మ గారు. కానీ అది పెట్టుకుని ఒక గంట సేపు కూర్చోవాలంటే విసుగు వస్తుంది” అంది లీల.
“అత్తయ్య గారిది పెద్ద కుటుంబం, ఎన్నో చిన్న చిన్న కోరికలు కూడా ఆవిడకి తీరేవి కాదు. చిన్నతనంలో పెళ్లయ్యి అత్తవారింటికి వెళ్లేసరికి అన్ని బాధ్యతలు నెత్తిన పడ్డాయి”
అంది రాధ.
సుశీలమ్మ గతంలోకి వెళ్ళిపోయింది.
తల్లిదండ్రులు బాగా ఆస్తిపాస్తులు ఉన్నవారు. ముగ్గురు అన్నదమ్ములు, ఒకతే చెల్లెలు/ ముద్దు మురిపాలతో పెంచుకున్నారు.
ఆ కాలంలో ఎక్కువ చదువులు లేవు. పదహారేళ్ళకే పక్క పల్లెలో ఉన్న పరంధామయ్య కొడుకుకిచ్చి పెళ్లి చేశారు. అత్తగారు పద్మావతి గయ్యాళి. ముగ్గురు కూతుళ్లు తర్వాత గోపాలం. ఇంట్లో ఆవిడ పెత్తనమే.
పెళ్లై వెళ్ళిన వెంటనే ఎన్నో బాధ్యతలు సుశీలకు, ఆడపడుచులు, అత్తగారు తిని కూర్చుంటారు. ఒక్క పని చేయరు. సుశీల నాలుగు గంటలకు లేవాలి. కల్లాపు చల్లాలి ముగ్గులు వేసి ఇంట్లో అందరూ లేచేసరికి కాఫీలు టిఫిన్, తర్వాత వంట, రోజంతా పని. రాత్రి 11 అవుతుంది పడుకునేసరికి.
గోపాలం, పరంధామయ్య పొలాలకు వెళ్ళిపోతారు. అత్తగారు ఆడపడుచులకు సేవ. సాధిస్తూ ఉంటారు.. సుశీల చేసిన పనులకు వంకలు పెడుతూ.
కోడలు కొడుకు సఖ్యంగా యుండటం చూడలేని అత్తగారు, కొడుకుని గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తుంది. తల్లి ఏం చెప్తే అదే వేదం గోపాలం కి.
పండక్కి అందరూ కొత్త బట్టలు తీసుకుంటారు. సుశీలకి కొనరు. కొత్త బట్టలు వేసుకుని పువ్వులు పెట్టుకొని పేరంటాలకి పెళ్లి వస్తుంటారు అత్తగారు, ఆడపడుచులు. సుశీలకు పూర్తిగా ఇంటి బాధ్యతే. తల్లో పువ్వులు కూడా పెట్టుకోవడానికి వీలుకాదు.
“ఏమిటా సింగారం” అంటూ అత్తగారు కేకలేస్తుంది.
ఎన్నోసార్లు భర్త దగ్గర ఏడిస్తే “మా అమ్మ అంతే. వినకపోతే మరీ రెచ్చిపోతుంది. ఎందుకొచ్చిన గొడవ” అంటాడు గోపాలం.
తలలో మల్లెపూలు పెట్టుకుని, చక్కటి చీర కట్టుకొని ముస్తాబయ్యే సంతోషమే లేకపోయింది పెళ్లయిన తర్వాత సుశీలమ్మ కి.
ఆషాడ మాసం వస్తే గోరింటాకు ఆడవాళ్లు అందరూ పెట్టుకునేవారు. ఈమెను పెట్టుకొనిచ్చేది కాదు అత్త.
ఎప్పుడో మాటల్లో, “అత్తయ్య.. నాకు గోరింటాకు ఇష్టం” అంది.
అంతే! దాంతో “నీకెందుకే.. పని చేసుకో. నీవు గోరింటాకు పెట్టుకుని గంట సేపు కూర్చుంటే ఇక్కడ పని ఎవరు చేస్తారూ” అంటుంది కోపంగా.
పుట్టింట్లో ఎంతో అపురూపంగా పెరిగిన సుశీల జీవితం నరకప్రాయం అయిపోయింది. ముగ్గురు ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసి వాళ్ళకి పురుడు పుణ్యాలు జీవితంలో
ఒక్క చిన్న ఆశ కూడా నెరవేర లేదు.
చక్కటి డిజైన్లు గాజులు వేసుకుంటూ ఉండేవారు ఆడబిడ్డలు అత్తగారు.
“అత్తయ్య.. నాకు ఆ డిజైన్ కావాలంటే “నీకెందుకే.. ఇవి బాగా రేటు ఉన్నాయి” అంటూ ఎర్రటి గాజులు నాలుగు వేయించేది.
నాలుగు రోజులు పుట్టింటికి వెళ్తానని ఏడిస్తే భర్త, అత్తగారు
“నీవు పుట్టింటికి వెళ్లి హాయిగా కూర్చుంటే ఇక్కడ పని ఎవరు చేస్తారే” అని పంపించేవారు కాదు
చిన్న చిన్న ఆశలు కూడా నెరవేరని దరిద్రపు జీవితం అయిపోయింది, తల్లిదండ్రుల దగ్గర బంగారు బొమ్మలా ముద్దు ముచ్చటగా పెరిగిన సుశీలకు.
జీవితమంతా అలా నిరాశ స్పృహలుగా గడిచిపోయింది.
సంవత్సరాలు గిర్రున తిరిగాయి.
భర్త కూడా పోవడంతో ఇప్పుడు ఒక్కగానొక్క కొడుకు, కోడలు దగ్గర ఉంటోంది.
తల్లి పడిన బాధలన్నీ కొడుకుకి తెలుసు. భార్యకి ముందే చెప్పాడు ‘అత్తగారిని చక్కగా చూసుకో ఆమె చాలా కష్టపడింది జీవితంలో’ అని.
కొడుకు కోడలునెత్తిమీద పెట్టుకుని చూసుకుంటారు ఆమెని.
ఆవిడ కోరికలన్నీ చక్కగా తీరుస్తారు. చిన్న చిన్న కోరికలు తీరడానికి వయసుతో పనిలేదు. అలా గడిచిపోయింది ఆ సుశీలమ్మ జీవితం.
విషయాలన్నీ వాళ్ళిద్దరికీ వివరించింది.
కోడలు రాధ ఎంతో మంచి పిల్ల. తన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది. కనీసం ఈ పెద్ద వయసులో నైనా నా కోరికలన్నీ తీరుస్తోంది.
“ఇదిగో! నాకు ఉయ్యాల ఊగడ మంటే ఇష్టమని ఈ హాలులో ఉయ్యాల వేయించింది” అంటూ ఆమె ఎంతో సంతోషంగా చెప్పింది.
“అయ్యో అమ్మమ్మ గారు.. ఎన్ని కష్టాలు పడ్డారు మీరు.
ఇప్పుడు చక్కటి కోడలు దొరికింది. హాయిగా శాంతి గా ఉండండి” అన్నారు లీలా సుధ.
రాధ చేతులు కడుక్కుని తయారై వచ్చింది.
“మా అత్తయ్యకి గోరింటాకు, ఆకు తెచ్చి రుబ్బి పెడితేనే ఇష్టము ఇప్పుడు వస్తున్న ఆ కోన్ గోరింటాకు ఇష్టం ఉండదు” అంటూ నవ్వింది రాధ
“అత్తయ్య.. మేమలా షాపింగ్ కి వెళ్లి వస్తాము. టీవీ పెట్టుకుని చూస్తుండండి, మీ మనవడు, అబ్బాయి వస్తే కాఫీ టిఫిన్ ఉంది తీసుకోమనండి. ఓ గంటలో వచ్చేస్తాము బై అత్తయ్య”
అంటూ రాధ, స్నేహితులిద్దరిని తీసుకుని వెళ్ళిపోయింది.
పూర్వం ఉమ్మడి కుటుంబాలు అంటూ గొప్పగా చెప్పేవారు.
కానీ జాలీ దయ కరుణ సానుభూతి ప్రేమానురాగాలు, ఇంటి కోడళ్ళ విషయములో కరువు గానే ఉండేవి.
ఆడవాళ్ళందరికీ చిన్న చిన్న సరదాలు కోరికలు ఉంటాయి.
డబ్బు ఉండి కూడా తీరని ఆడ వాళ్ళు చాలామంది ఉండేవారు.
***
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,




Comments