థాంక్ గాడ్! హి ఈజ్ ఏ గే
- Seetharam Kumar Mallavarapu
- Sep 10
- 3 min read
Updated: Sep 12
#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #ThankGodHeIsAGay, #హిఈజ్ఏగే, #తెలుగుకొసమెరుపుకథ, ##TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Thank God He Is A Gay - New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 10/9/2025
థాంక్ గాడ్! హి ఈజ్ ఏ గే - తెలుగు కథ
రచన: మల్లవరపు సీతారాం కుమార్
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
నా పేరు మృదుల. ఇంటర్ పూర్తయింది. ఎంసెట్ రిజల్ట్స్ కోసం వెయిటింగ్. కాలిఫోర్నియా లోని శాన్ జోస్ (శానోజే అని పలకాలట. తరువాత తెలిసింది).. అక్కడ ఉన్న మా అన్నయ్య, ఒకసారి అక్కడికి రమ్మని చాలా రోజులనుంచి బలవంతం చేస్తున్నాడు. నేను ఖాళీయే కాబట్టి అమ్మానాన్నలు నన్ను కూడా తీసుకొని వెళ్లారు.
చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలన్నీ చూశాం. జన్మాష్టమి సందర్భంగా అక్కడి బృందావన శ్రీకృష్ణుడి ఆలయంలో వేడుకలు జరుగుతున్నాయట. ముందుగా నాటక పోటీలు నిర్వహించి, ఆ రోజు బహుమతులు ఇస్తారట.
మా వదిన చెల్లెలు మోనిక అక్కడే చదువుకుంటోంది. తనకు ఓ నాటకం వెయ్యాలని ఆశ. సమయానికి నేను దొరకడంతో మా ఇద్దరికీ ఒక లవ్ స్టోరీ ప్లాన్ చేసారు. ఆ అమ్మాయి కంటే నేను కాస్త పొడవు ఉండటంతో నాకు అబ్బాయి పాత్ర ఇచ్చారు. అక్కడి తెలుగు అసోసియేషన్ బిల్డింగ్ లో ప్రదర్శన ఇచ్చాము. అందరూ అభినందించారు. నేను సూట్ వేసుకుని అబ్బాయి గెటప్ లో చాలా అందంగా ఉన్నానని అందరూ అభినందించారు.
"నిన్ను అబ్బాయిగా మార్చి, మా చెల్లెలితో పెళ్లి చేస్తాను" అంది మా వదిన.
"ఇంటికి వెళ్ళాక దిష్టి తీస్తాను. అమ్మాయిల కళ్లన్నీ నీమీదే" అంది అమ్మ.
ఇంతలో తన స్నేహితురాలు, ఇంటికి వెళ్తున్నట్లు చెప్పడంతో మోనిక పార్కింగ్ ఏరియా వరకు తోడుగా వెళ్తానంది. నేను కూడా వాళ్లతో వెళ్లాను. ఆ అమ్మాయిని పంపించి ఇద్దరం లిఫ్ట్ దగ్గరకు వెళ్తున్నాము. ఇంతలో ఒక ఆరడుగుల బలిష్టమైన వ్యక్తి మా వైపుకు రావడం గమనించాను. అతను మోనికను కిడ్నాప్ చేసి ఏదైనా అఘాయిత్యం చేస్తాడని భావించాను. నేను అబ్బాయి గెటప్ లో ఉన్నాను కదా.. నా జోలికి రాడని కాస్త ధైర్యం.
"మోనికా! నువ్వు లిఫ్ట్ లో వెళ్లి మనవాళ్లను అలర్ట్ చెయ్యి. నేను ఇతనికి అడ్డం పడతాను" అంటూ అతనికి ఎదురుగా వెళ్ళాను. మోనికను తప్పించాననే కోపంతో మహా అయితే రెండు దెబ్బలు కొడతాడేమో.. కిడ్నాప్ అయితే చెయ్యడు కదా.. అనుకున్నాను.
అతడు నన్ను అమాంతం భుజాల పైకి ఎత్తుకుని పక్కనే పార్క్ చేసి ఉన్న అతడి కార్ లోకి కుదేశాడు. మెరుపు వేగంతో డ్రైవింగ్ సీట్ లో కూర్చొని కారును రోడ్ మీదకు తెచ్చాడు.
వెనకనుండి, "మృదులా.. !" అంటూ అమ్మానాన్నల కేకలు వినపడుతున్నాయి.
"నేను కూడా వెనక్కి తిరిగి, "అమ్మా.. నాన్నా..” అంటూ కేకలు పెడుతున్నాను.
అతను నా వంక సీరియస్ గా చూసాడు. అతని ముఖంలో క్రూరత్వం తాండవిస్తోంది.
'సూట్ వేసుకోగానే అబ్బాయినైపోతానా.. అనవసరంగా అతనికి ఎదురు వెళ్లి రిస్క్ చేసానేమో.. ' అనిపించింది.
కానీ అంతలోనే 'ఏం.. అమ్మాయిలు ఎందులో తక్కువ.. ధైర్యంగా అతన్ని ఎదుర్కోవాలి' అనిపించింది.
డ్రైవింగ్ చేస్తున్న అతని చేతులపై బలంగా రక్కాను. విదిలించి కొట్టాడతను. నేను తలపై పెట్టుకున్న ‘అబ్బాయిల క్రాఫ్ లాంటి విగ్’ ఊడిపోయింది. పొడవైన నా జడ బయట పడింది. అతను నా వంక ఆశ్చర్యంగా చూస్తూ కారును పక్కనున్న చిన్న గల్లీలోకి పోనిచ్చాడు. కారును ఆపి నా వంక పరిశీలనగా చూసాడు.
"ఆర్ యు ఏ గర్ల్?" అడిగాడతను.
"నో. ఐ యామ్ ఏ బాయ్" అన్నాను బింకాన్ని ప్రదర్శిస్తూ. అబ్బాయినయితే వదిలేస్తాడని ఆశ
అతను నన్ను మరోసారి పట్టి పట్టి చూసి, "యూ డర్టీ గర్ల్.. గెట్ అవుట్ అఫ్ మై కార్" అంటూ డోర్ తెరిచి నన్ను బయటకు నెట్టాడు.
నేను కింద పడ్డ వెంటనే అతను కార్ నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. మోచెయ్యి గీరుకోని రక్తం వస్తోంది. అతను నన్ను ఎందుకు వదిలేసాడో అర్థం కాలేదు.
కొంతసేపటికి పోలీసులతోపాటు మా వాళ్ళు అక్కడికి వచ్చారు. నన్ను హాస్పిటల్ కు తీసుకొని వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేశారు.
ఇంటికి వచ్చాక నన్ను పట్టి పీడిస్తున్న సందేహం వదినను అడిగాను. "అతడు నన్ను ఎందుకు వదిలేశాడు..” అని.
"అలాంటి వాళ్ళను ‘గే’స్ అంటారు. చూడ్డానికి గడ్డలు, మీసాలతో ఉన్నా వాళ్ళ దృష్ఠంతా అబ్బాయిల మీదే ఉంటుంది. అమ్మాయిల జోలికి వెళ్లారు. ఇండియాలో తక్కువ కానీ ఇక్కడ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మొత్తానికి అతడు 'గే' కావడం నీ అదృష్టం. క్షేమంగా తిరిగి వచ్చావు. " అంది వదిన.
శుభం
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
Vijaya Dasami 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.
Comments