top of page

జననీ జన్మభూమి

#తెలుగుకథలు, #అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #Jananijanmabhumi , #జననీజన్మభూమి

ree

Janani janmabhumi - New Telugu Story Written By Addanki Lakshmi

Published In manatelugukathalu.com On 05/10/2025

జననీ జన్మభూమి - తెలుగు కథ

రచన: అద్దంకి లక్ష్మి 


రంగనాథం,రాజ్యలక్ష్మి గారు ఆ పల్లెలో గౌర మర్యాదలగల కుటుంబం. మంచి స్వభావం, ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందిస్తారు.


పది ఎకరాల మాగాణి భూమి, రాకేష్ ఒక్కడే కొడుకు.

అందంగా ఉంటాడు. అగ్రికల్చర్ బీఎస్సీ చదివాడు. తండ్రి తో పాటుగా వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి కొత్త కొత్త రకాల పంటలు పండించడం ఇష్టం. మంచి మంచి జాబ్ ఆఫర్స్ వచ్చాయి, గాని అతనికి వెళ్ళేది ఇష్టం లేదు.


పల్లె వాతావరణం అంటే అతనికి ఇష్టము, పైగా తల్లిదండ్రులకు తానొక్కడే కొడుకు,వాళ్ళు పెద్ద వాళ్ళు అవుతున్నారు కదా! వారిని చూచుకోనే బాధ్యత.


అతనిలో ఒక చిన్న లోపం ఉంది. చిన్నప్పుడు పోలియో వ్యాధి తగలడం వల్ల కాలు కొద్దిగా వంకరగా ఈడ్చి నడుస్తాడు. అయినా నడకకి అంత బాధ లేదు.


రంగనాధానికి ఒక్కతే చెల్లెలు, ఆమె పేరు రమణి. భర్త మూర్తి హైదరాబాదులో యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు.

వారికి అమ్మాయి ఉంది. తన  పేరు గీత. చాలా తెలివైనది, అందంగా ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో డాక్టర్ చదువుతోంది.


ఇక్కడ చదువు అయిన తర్వాత ప్రాక్టీస్ పెట్టుకోమని చెప్పాడు తండ్రి. ఆమెకు నచ్చలేదు. అమెరికా వెళ్లి చదువుకోవాలని కోరిక. అమెరికాలో అన్నా వదిన దగ్గర ఉండి చదువుకుంటుంది.


రాకేష్ కి చిన్నప్పటినుంచి గీత అంటే అభిమానం. ఆమెనే చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు.పెద్దవాళ్లకి వీళ్ళిద్దరిని కలపాలని ఎంతో ఆశ.


రాకేష్ ఒకసారి గీతతో తన పెళ్లి గురించి ప్రస్తావించాడు.

గీత నిర్కర్షగా చెప్పేసింది..

"నీవంటే నాకు ప్రేమ ఉంది గాని బావా! నిన్ను నేను పెళ్లి చేసుకోను, నా భవిష్యత్తు కెరీర్ నాకు చాలా ముఖ్యం. నేను అమెరికా వెళ్లి చదువుకుని అక్కడ జాబ్ చేస్తాను. సారీ.. నా గురించి నువ్వు ఆశలు పెంచుకోకు. నీకు నచ్చిన అమ్మాయిని చేసుకో" అని చెప్పి అమెరికా వెళ్ళిపోయింది.


రాకేష్ మనసు దెబ్బతింది. తల్లిదండ్రులు అతని పెళ్లి విషయము ఎత్తితే,ఇప్పుడు చేసుకోను అంటూ సమాధానం చెప్తాడు.


"నా కాలు వంకరగా ఉన్నది కదా! అందుకే చేసుకోవా?” అని కూడా అడిగాడు


"కాదు బావా! నా చదువు, నా ఫ్యూచర్ నాకు ముఖ్యం, బాగా చదివి డాక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అమెరికా," అని చెప్పేసి చదువుకు వెళ్ళిపోయింది


తల్లిదండ్రులు కూడా 'పిల్లలకు ఇష్టం లేకపోతే మనము చేసేది లేదు. పెళ్లి విషయములో బలవంతము చేయరాదు.’ అనుకుని నిరుత్సాహపడ్డారు,


గీత అక్కడికి వెళ్లి నాలుగు సంవత్సరాలు డాక్టర్ చదివింది. తరువాత అక్కడ డాక్టర్గా పనిచేయడం మొదలుపెట్టింది.


ముచ్చటగా మూడు సంవత్సరాలు పని చేసింది.

తర్వాత ఆమె దృక్పధము మారింది.


విదేశాల్లో డాక్టర్లకి కొదవలేదు, విదేశీయులకి డబ్బులకి అసలే కొదవలేదు. ఏ రోగం వచ్చినా వాళ్ళు తగ్గించుకోగలిగిన స్థితిలో ఉన్నారు. మన ఇండియాలో ఉన్న పరిస్థితి గురించి ఆలోచించుకుందామె.


ఎంతోమంది బీద ప్రజలు ఉన్నారు. వారికి సరి అయిన చికిత్సలు లేక రోగాల బారిన పడుతున్నారు. కొత్త కొత్త రోగాలతో డబ్బు లేక చూపించుకోలేక ఎంతోమంది చనిపోతుంటారు. తన సేవలు నిజంగా మాతృదేశ ప్రజలకు కావాలి. దేశము వచ్చి తన ప్రజలకు సేవ చేయడం ఉత్తమమని ఆమె తెలుసుకుంది. ఇప్పుడు ఆమెకు నిర్దిష్టమైన ఆశయం ఏర్పడింది. తన డాక్టర్ చదువు డబ్బు గడించుకొనుటకు కాదు. కేవలం బీదవారికి సేవ చేయడానికి మాత్రమే!


 వెంటనే నిర్ణయం తీసుకుంది ఇండియా వచ్చి తను ప్రాక్టీస్ పెట్టాలని.


తల్లిదండ్రులకు చెప్పేసరికి వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు,

కూతురు తిరిగి తమ దేశం వచ్చి ప్రాక్టీస్ పెడుతుందని.


తరువాత మరి ఒక విషయం చెప్పింది. 


తాను బావను పెళ్లాడతానని.

తనకు బావ అంటే ఇష్టమేనని.

బావ ఉన్న గ్రామంలో తను క్లినిక్ పెట్టి ఆ గ్రామ ప్రజలకు సేవ చేస్తానని చెప్పింది.

తల్లిదండ్రులు ఎంతో ఆనందపడ్డారు.


రాకేష్ కూడా ఫోన్ చేసి చెప్పింది. 

బావ.. నాది పొరపాటయింది. నేను ఎవరిని ప్రేమించలేదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నాకు ఇప్పుడు అమెరికా నచ్చటం లేదు. వీళ్ళకు సేవ చేయవలసిన అవసరం లేదు.

మన పల్లెలో క్లినిక్ పెట్టి పేద ప్రజలకు సేవ చేయాలని నేను నిర్ణయించుకున్నాను.

నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కాదు నేను అమెరికా వెళ్ళింది. కేవలం చదువుకుందామని.

నన్ను మన్నించు. నా భావాలు నీకు నచ్చితే నన్ను ఇష్టపడితే మనిద్దరం పెళ్లి చేసుకుందాము” అని చెప్పింది,


రాకేష్ కి, తల్లిదండ్రులకి ఎంతో ఆనందమేసింది.

గీత మొదట పెళ్లికి ఒప్పుకోకపోయినా ఇప్పుడు తిరిగి బావనే చేసుకుంటానని చెప్తోంది.


'కుడి ఎడమైతే పొరపాటు లేదు. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి,'


కథ సుఖాంతం అయితే చాలు అని అనుకున్నారు రాకేష్ తల్లిదండ్రులు/


అంతే! ఒక శుభ ముహూర్తములో గీతా రాకేష్ లకు పెళ్లి చేశారు/


ఇప్పుడు ఆ గ్రామంలో ప్రజలందరికీ గీతా క్లినిక్ అంటే అమ్మ ఒడి లాగా అయింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వస్తుంటారు. 


డాక్టర్ అమ్మ డాక్టర్ అమ్మ అంటూ ఆ పేద ప్రజల పిలుపులో ఉండే ప్రేమాభిమానాలు గీత మనసుని పరవశింప చేస్తుంది.

జననీ జన్మభూమికి మించినది ఏదీ లేదు అనుకుంది ఆమె.


&&&&&&_


అద్దంకి లక్ష్మి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి

నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి

జన్మ స్థలం:రాజమహేంద్రవరం

డేట్ అఫ్ బర్త్

3_6_1946.

నివాసం: నవీ ముంబయి

విద్యార్హతలు:

బి.ఎ; బి. ఇడి

**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,

బాంబే మునిసిపల్ కార్పొరేషన్


**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.

భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;

విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ

**కుమారుడు:

గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,


**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.

అల్లుడు మధుసూదన్ అమెరికా

వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు


**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,


నిరక్షరాస్యతను నిర్మూలించుటకు

సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,


నాటకాలు వ్రాసి

విద్యార్థుల నాటకాలు

వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,

సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి


చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,


**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,


**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం


**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం


సాహితీ జీవితం_రచనలు

**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను

**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి


ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను


**అనేక సమూహాల్లోని

ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,

పద్యాలు ప్రచురించ బడినవి

కవితలకు కథలకు బహుమతులు పొందినాను


నేను రాసిన

కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా

**మినీ కవితలు

పంచపదులు

సున్నితాలు

ఇష్టపదులు

**గేయాలు

**వ్యాసాలు

**నాటకాలు

పద్యాలు

గజల్స్

కథలు

రుబాయీలు

బాల సాహిత్యం

**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి


*సాహిత్య సేవ

తేనియలు,

తొణుకులు,

చిలక పలుకులు,

పరిమళాలు,

మధురిమలు,

ముత్యాలహారాలు,ఇష్టపదులు,

సకినాలు,

సున్నితాలు,

పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,


**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను

**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,

అన్ని గ్రూపుల నుంచి,

15 బిరుదులు పొందడం జరిగినది,


ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,

2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,


రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,


1.ప్రచురణ,,,


1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,


Comments


bottom of page