top of page

చెదిరిన స్వప్నం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Youtube Video link

'Chedirina Swapnam' New Telugu Story

Written By Kidala Sivakrishna


రచన: కిడాల శివకృష్ణ


సముద్రపు అలలు తాకుతూ పద్దెనిమిది సంవత్సరాల వయస్సు గల ఒక కోమలిని తాకిన ఆ గాలి, విహరిస్తూ నా తనువును తాకి పోతూ ఉంటే, ఆ తాకిడికి చలించి పోయిన నా మనస్సు, నా తనువును కూడా మరిచి పోయింది.


అటువంటి సమయంలో చంద్రుని వెన్నెల కాంతులను కూడకలుపుకుని నక్షత్ర కాంతిని విరజిమ్ముతూ, నా చెలి వయ్యారంగా హంస వలే అడుగులో అడుగు వేస్తూ నన్ను చేర వస్తోంది.


అటువంటి సమయంలో తన కాలి అందెల సవ్వడికి నా హృదయం తాళం వేస్తూ, మనస్సులో రగిలించేను కొరికలేన్నో, తను చేరువయ్యే కొలది నాకు ఊపిరి కూడా ఆడనంత ఉత్సాహంతో తనువు తనను చేర వెళ్తోంది. కను రెప్ప కాలంలోనే తనను చేరుకున్న నా దేహం తన దేహంతో మల్లెతీగలా పెనవేసుకోవాలని తపన పడుతుంది.


అటువంటి సమయంలో తను, తన మృదు హస్తాలతో నా హృదయాన్ని తాకింది. ఆ తాకిడికి తాళలేని నా మనస్సు విరహయాతన పడుతూ కోర్కెను తీర్చమని ఆరాటపడుతోంది.


అప్పుడు నా మనస్సులోని మాటలు గొంతులోకి వచ్చి, “కల్యాణీ! నీ కరములతో బంధించి, కాముడికి మనశ్శాంతిని కల్గించు” అని చెప్పితిని.


నా మాటలు విన్న కళ్యాణి “ఆగాగు.. నేను నా ఇంటిలోని వారి నుండి తప్పించుకు వచ్చేందుకు ఎంత ఆరాట పడ్డానో నీకు తెలియదు. గృహాన్ని దాటిన తర్వాత వచ్చే ఆటంకాలను ఎదుర్కునేందుకు విల్లును ధరించి బాణాలను లక్షంవైపు ఎక్కుపెట్టిన మన్మధుడిని వెంట పెట్టుకొని వచ్చాను.


ఇంత కష్టతర సమయంలోనైనా నీ కోసం వస్తే నీవు విరహంతో విర్రవీగుతావా..?? ఎంతటి అపరాధం” అంటూ వయ్యారాలు ఒలికింది.


“అలా కాదు కళ్యాణీ! నిన్ను చూసిన మన్మధుని మనస్సే చెలిస్తే, నీచ మానవుడిని.. నా మనస్సు చలించడంలో వింత ఏముంది సఖీ?” అంటూ దగ్గరకు తీసుకున్నాను.


“ఈ మాటలకు ఏమీ తక్కువ లేదులే కృష్ణా! నాకు సమయం సమీపించుచున్నది. నేను వెళ్ళాలి” అంది కళ్యాణి.


“సమయముదేముందిలే.. కదిలే కాలచక్రాన్ని నిలువరింప తరమా కళ్యాణీ!” అని యంటిని.


“అవునవును. కాలచక్రమును నిలువరింపగలేరు కానీ చేజిక్కిన చెలిని నిలుపుతురు మీ మగమహారాజులు మరీ” అంది కళ్యాణి.


“సరి సరి.. కానీ నా అధరములు అడుగుచున్నవి నీ అధరామృతాన్ని తాకే సమయమెన్నడు అని” అన్నాను నేను.


నీ కరముల బందీలో ఖైదీ అయిన నన్ను ఇంకా బ్రతిమాలడమేల, నీకు ఏమైనా మతి చలించినదా అని యోచనలో పడియుండి పోయింది నా మనస్సు” అంది కళ్యాణి.

నిన్ను చూసిన తరుణం నుంచి ఊహాప్రపంచంలో విహరిస్తోంది నా మనస్సు, అందుచేత వర్తమానంలో ఏమి జరుగుతుందో గ్రహించలేక నీ ఆజ్ఞ కోసం వేచి చూస్తూ యుండిపోయింది నా తనువు” యంటిని నేను.


“సర్వం అర్పించిన అనంతరం కార్యాన్ని మొదలెట్టక మీనమేషాలు లెక్కిస్తూ కాలాన్ని గమనంలోకి వెలేస్తే తర్వాత నేనేమీ చేయలేను” అంది కళ్యాణి.


“అయితే ఉపేక్షించక మొదలెట్టెదను కార్యార్థినై” యంటూ తనను నా కరములతో, నా దేహాన్ని తన దేహంతో పందిరికి మల్లెతీగ వలే అల్లుకుపోతూ, తన డొంక పై నా హస్తాన్ని వేసితిని.


అట్టి సమయమున తను నా నుండి ఎందుకో దూరం కావాలనే యోచనలో ఉన్నట్లు నా హృదయం తెలుపుతున్నట్లు సందేశం వచ్చింది.


“ఏమైంది? ఎందుకు విచారిస్తూ ఉన్నావు” అంటిని.


అట్టి తరుణంలో “ఏమీ లేదు. నేనిప్పుడు నీ అంతరంగంలో మునగలేను. అందుకు సమయం వేరే యున్నది. కాస్త నీ బందిఖానా నుండి విముక్తి కల్గించు” అంటూ కన్నీటిని కార్చింది.


“ఏమి.. ఎప్పుడు ఆ సమయం??, ప్రస్తుతం సమస్య ఏమి యని నా మదిని చింతించుచూ యుంటిని” అన్నాను.


“మన కలయిక ఇదియే తొలి మరియు చివరి కలయికగా మిగిలిపోవును. ఎందుకనగా నాకు పెళ్ళి చూపులు జరుగుతూ ఉన్నవి. కావున అటుల జరగకూడదు అనిన యడల మన కళ్యాణము జరగవలెను. అనంతరం మనలను ఆపే శక్తి దేవుడికి కూడా ఉండజాలదు” అంది కల్యాణి.


“సరే.. మరి మన తక్షణ కర్తవ్యం తెలుప కోరుతుంటిని” అన్నాను నేను.


మన పెద్దలను సంప్రదించి అంగీకారం ఒంది కలువుట మంచిది” అన్నది.

“సరి.. వెళ్దాము” అని బయలు దేరాను.


మా మామ ఇంటికి వెళ్లి “మామగారూ!” అని పిలిచాను.


ఆ సమయంలో నా మిత్రుడు “మామా.. అరే మామా..” యని నన్ను నిద్ర నుండి మెలకువలోకి తీసుకువచ్చాడు.


“మామా! నా మామ గారు, నా ప్రేయసి కళ్యాణి ఎక్కడ..” అన్నాను, ఇంకా నిద్ర మత్తు వదలక.


నీవు నిద్రలో కలలతో ఊహా ప్రపంచాన్ని చూసి వచ్చినట్లున్నావు, ఇక్కడ ఎవ్వరూ లేరు” అన్నాడు నా మిత్రుడు.


“సరే లేరా! బంగారంలాంటి కలను, చూడ ముచ్చటగా ఉండే అపురూప సౌందర్యవతిని, నా సుందర స్వప్నాన్ని.. చెదిరిన స్వప్నంగా చేశావు కదరా! ఎలా అయితేనేమి.. వింత అనుభూతిని కల్గించింది ఆ స్వప్నం” అన్నాను నేను.

సర్వే జనా సుఖినోభవంతు

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :

నా పేరు: కిడాల శివకృష్ణ.

కలం పేరు:- రాయలసీమ కన్నీటి చుక్క....✍️✍️✍️✍️

వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.

నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.


46 views0 comments

Comments


bottom of page