top of page
Writer's pictureKidala Sivakrishna

ఆసక్తి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి







Video link

'Asakthi' Written By Kidala Sivakrishna

రచన: కిడాల శివకృష్ణ

నాకు రాని క్రికెట్ ఆటను నేను చాలా బాగా ఆడుతూ మా జట్టులో మొదటి స్థానంలో ఉన్నాను. అసలు రాని ఆటని ఆడటం ఒక ఎత్తు అయితే అందులో మొదటి స్థానంలో ఉన్నాను అని అంటున్నాడు ఏమి అని మీ సందేహమా.???? అయితే నా కథలోకి వెళ్ళాల్సిందే...

ఈ కథను యువ రచయిత కే. శివకృష్ణ గారు రచించారు.



నా పేరు అభి. నేను ఒక మారుమూల ప్రాంతాల్లో నివసించే పేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని. నేను ఎక్కువగా పాఠశాలలో చదువులకు ప్రాధాన్యం ఇచ్చేవాడిని. అస్సలు ఆటల మీద ధ్యాస పెట్టేవాడిని కాదు. నా మిత్రులు కూడా అందరూ రమ్మని అడిగేవారు, అయినా కూడా నేను వెళ్ళేవాడిని కాదు. అలా పాఠశాల చదువు పూర్తి అయ్యింది. తరువాత కళాశాల చదువు మొదలు అయింది. అక్కడ ఆటలు ఆడటానికి ఆట ప్రాంగణం అస్సలు లేదు. అక్కడ ఆటలు ఆడే అవసరం లేదు. అందులోనూ నాకు ఆసక్తి లేకపోయే. అలా కళాశాల చదువు కూడా పూర్తి అయ్యింది. తరువాత డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి, ప్రైవేట్ జాబ్ లు ఇప్పించే ఒక శిక్షణా సంస్థలో జాబ్ కోసం జాయిన్ అయ్యాను. అక్కడ మూడు నెలల కాల పరిమితి. అయితే ప్రతి శనివారం మధ్యాహ్నం నుంచి ఆటల సమయం. ఆ సమయంలో కొన్ని రోజులు నేను బయటకు వెళ్ళకుండా ఉండేవాడిని. ఒక వేళ వెళ్ళినా చూస్తూ కూర్చుండేవాడిని. అలా రెండు నెలల కాల పరిమితి గడిచి పోయింది. తరువాత ఒక రోజు క్రికెట్ ఆట ఆడటానికి పిల్లలతో పాటు మా సార్ గారు కూడా వచ్చారు. నేను పక్కన కూర్చుని ఉంటే నన్ను పిలిచాడు.

“ఏమి సార్” అని అడిగాను.

అపుడు ఆయన ఏమీ మాట్లాడ కుండా “అక్కడకు వెళ్లి నిలబడి ఆటను ఆడు” అని చెప్పాడు. నేను కాదు అనలేక సరే అని చెప్పి అక్కడికి వెళ్లి నిలబడి ఉన్నాను.


నేను అక్కడ నిల్చున్న కొద్ది క్షణాల్లోనే నాకు ఆట మీద ఆసక్తి మొదలైంది. ఆ రోజు ఆటని చాలా బాగా ఆడాను. అక్కడి నుంచి వెళ్లిన తరువాత సార్ని ఇలా అడిగాను.


“ఎందుకు సార్.. నాకు ఆసక్తి లేదని తెలిసినా మీరు ఆటలోకి దింపి మొదటగా నాకు బ్యాటు ఇచ్చి ఆట ఆడించారు?” అని అడిగాను.


అపుడు ఆయన “నీకు ఆట మీద ఆసక్తి వచ్చినప్పుడు ఆడటానికి ఎవ్వరూ ఉండకపోవచ్చు. అసలు నీకు ఆట మీద ఆసక్తి రాకపోవచ్చు.

మనం మనకి ఆసక్తి వచ్చినపుడు పని చేయాలి అంటే పని చేయలేము. పనిని చేస్తూ ఉంటే ఆసక్తి అదే వస్తుంది. ఆ విషయాన్ని నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. నువ్వు నాలా అవ్వకూడదు అనే నేను ఇలా చేయాల్సి వచ్చింది. మరి చెపితే సరిపోతుంది కదా అని నువ్వు అనవచు. కాకపోతే నువు వినవు అని అర్థం అయింది. అందుకే అలా చేశాను. నిజంగా చెప్పు. నీకు ప్రాక్టికల్ గా చెప్పక పోయి ఉంటే అర్థం చేసుకునే వాడివా??” అని అడిగాడు.

అపుడు నేను “నిజమే సార్! నేను వినేవాడిని కాదు. చాలా కృతజ్ఞతలు సార్. చాలా మంచి సందేశం, సమాచారం నాకు అందించారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను” అని చెప్పాను.

అప్పటి నుంచి ప్రతి రోజూ ఆటను ఆడటం మెదలు పెట్టాను. ఆట మీద ఆసక్తి పెరిగింది. ఆటలో నేను మంచి పేరు తెచ్చుకున్నాను. అప్పటి నుంచి ప్రతి ఆటను గెలుస్తూ ఉన్నాను. ఇది అండి నా కథ.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం :

నా పేరు: కిడాల శివకృష్ణ.

వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ కాలీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.

నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.



81 views0 comments

Comments


bottom of page