కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Kaki Avedana' Written By Kidala Sivakrishna
రచన: కిడాల శివకృష్ణ
ఈ సృష్టి కేవలం మనుషులకు మాత్రమే కాదు. జంతువులు, పక్షులు, అన్ని జీవరాసులూ ఈ ప్రకృతిలో భాగమే. మనతో బాటు వాటిని కూడా బ్రతకనిద్దాం అని తెలియజెప్పే ఈ చక్కటి కథను యువ రచయిత శివకృష్ణ గారు రచించారు
నా పేరు వెంకట్. అందరూ నన్ను విక్కీ అని పిలుస్తారు. మా ఇల్లు ఊరు నడి మధ్యలో ఉంది. మా ఇంటిదగ్గర ఒక పెద్ద కానుగ చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక కాకి గూడు పెట్టుకుని ఉంది. నేను నా మిత్రులతో కలిసి ఆ చెట్టు క్రింద గోలీల ఆట, కర్రా బిళ్ళా, బొంగరాల ఆటలు, కోతి కొమ్మచ్చి ఆటలు ఆడుకునే వాళ్ళం. అయితే ఆ చెట్టు క్రింద ఎంత శుభ్రంగా ఉంచుదాము అని అనుకున్నా ప్రతి రోజూ ఉదయం ముళ్ళు రాలుతూ ఉండేవి. ఆ ముళ్ళ బాధ ఉండకూడదు అని ఆ చెట్టును ఎక్కి ఆ గూడును క్రిందికి పడేసేవాళ్ళం. పడేసిన తరువాత కొన్ని రోజులు మాత్రమే ముళ్ళు పడకుండా ఉండేవి. అలా చాలా సార్లు చేసినా కాకి మాత్రం మరలా తిరిగి గూడును కట్టుకునేది. ఒక రోజు అనుకోకుండా ఒక కాకికి ఆరోగ్యం బాగాలేక కుంటుకుంటూ మా ఇంటిలోకి రాబోయింది. ఆ టైమ్ లో నేను ఒక కర్ర తీసుకుని ఒక్క వేటు వేసే సరికి అది బయటకు వచ్చి పడింది. ఆ పడ్డ కాకి అరుపులకి ఊరిలో ఉన్న కాకులు అన్నీ కలిసి మా ఇంటి చుట్టూ తిరగ సాగాయి. నేకు బయటకు రావాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఆ కాకులు అన్నీ ఒక సైన్యం లాగా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉండేవి. నేను ఎపుడు బయటకు వెళ్ళినా నన్ను తన్నడానికి వచ్చేవి.
ఆ విధంగా కొన్ని నెలల పాటు భయంతో తిరగాల్సి వచ్చింది. అయినా రెండు సార్లు కాకులు తన్నాయి. అలా కొన్ని నెలల తరువాత అవి నన్ను మరిచి పొయ్యాయి. కొన్ని సంవత్సరాల తరువాత ఒక కాకి నీళ్ళ తొట్టిలో పడింది. ఆ కాకిని తీస్తే నన్ను కాకులు అన్నీ తంతాయి అని అనుకున్నా. కానీ కొంత దైర్యంతో తొట్టి దగ్గరకు వెళ్ళి ఆ కాకిని కట్టె సహాయంతో బయటకు తీశాను. అపుడు కాకులు అరవకుండా నిశ్శబ్దంగా వున్నాయి.
ఒక కాకి నా దగ్గరకు వచ్చి “చాలా మంచి పని చేశావు. నీకు రుణపడి ఉంటాము” అని చెప్పింది.
అపుడు నేను “మీకు పెద్ద సహాయం చేయలేదు, చాలా చిన్న సహాయం చేసాను. ఇంకా చెప్పాలంటే.. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం మాత్రమే” అని అన్నాను.
అపుడు కాకి “నీలాగ మాకు సహాయం చేసేవారు కరువయ్యారు. మేము మీకు ఎంత మంచి పని చేసినా మాకు మాత్రం మీరు నాటి నుంచి నేటి వరకు అన్యాయం చేస్తున్నారు” అని చెప్పింది.
అపుడు నేను “ఏమి ఆ అన్యాయం” అని అడిగా.
అపుడు అది “చూడు విక్కీ! మీరు టెక్నాలజీ పేరుతో మా ప్రాణాలను తీస్తున్నారు. అంతేకాకుండా బయట ఎవ్వరూ కూడా నీటిని కానీ, అన్నం కానీ, ఇతర పదార్థాలు కానీ ఉంచడం లేదు మా లాంటి చిన్న ప్రాణులు ఎలా బ్రతకాలి?” అని చెప్పింది.
“సరే! నిజమే కానీ, మీరు మాకు ఏమి మేలు చేస్తున్నారు చెప్పూ” అని అడిగాను.
అపుడు కాకి "ఇంటి ముందు ఉండే చెడు పదార్థాలను,మరియు గడ్డి పీచులను తీసేస్తాం. ఇంటి లోపలికి వచ్చే క్రిమికీటకాలు తినేస్తూ మీకు హాని జరగకుండా చూస్తాము, అంతేకాకుండా మీ ఇళ్లకు చుట్టాలు వస్తే ముందుగా మీకు తెలియజేస్తాం” అని చెప్పింది.
“కాకపోతే నేడు చెట్లు కరువాయే, పక్షి జాతులు అంతరించి పోబట్టే…” అని తన ఆవేదనని చెప్పింది. ఆ కాకి గోడు విన్న నా మనస్సు కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ మాటలు విన్న రోజు నుండి నేను కొంచెం నీటిని, గింజలను ఇంటిపైన వేయడం అలవాటుగా మార్చుకున్నాను. నాలానే మీరు కూడా ఈ విధంగా పక్షులకు సహాయం అందిస్తారని పక్షుల తరుపున కోరుకుంటున్నాను.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
నా పేరు: కిడాల శివకృష్ణ.
వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ కాలీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.
నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
Comentarios