top of page

కష్టం విలువ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Kashtam Viluva' Written By Kidala Sivakrishna

రచన: కిడాల శివకృష్ణ

శేఖర్ ఒక గ్రామానికి చెందిన వ్యక్తి.

నిరుద్యోగిగా ఉన్న అతను స్వంత ఊరిలో కూలిపనులు చెయ్యడం నామోషి గా ఫీల్ అవుతాడు.

సిటీ లో ఒక పనిలో చేరుతాడు.

కానీ అక్కడ అవమానాలు ఎదురవుతాయి.

చివరికి స్వంత ఊరిలోనే ఏదో ఒక పని చేసుకుని, గౌరవంగా బ్రతక వచ్చని తెలుసుకుంటాడు.


నా పేరు శేఖర్. నేను ఇంటర్మీడియట్ పూర్తి చేసాను. డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. తరువాత కొన్ని రోజులు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాను.

ఇంట్లో వాళ్ళు ఏదో ఒక పనికి వెళ్ళు అని చెప్పేవారు. నేను మాత్రం మా సొంత పొలంలో పనికి మాత్రమే వెళ్ళేవాడిని. వేరేవాళ్ళ పొలం పనులకు వెళ్ళాలి అంటే కొంచం మొహమాటంగా ఉండేది.

ఇంట్లో పరిస్థితులకు మా అమ్మ నాన్న పనికి వెళ్లాల్సిందే అని చెప్పడం మొదలు పెట్టారు. నేను మాత్రం ‘వెళ్ళను’ అని చెప్పా.

అపుడు ‘ఎక్కడ అయినా జాబ్ లో జాయిన్ అవు... నీకు ఇక్కడ పని చేయడం ఇష్టం లేకపోతే’ అని చెప్పారు.

అపుడు నేను సరే అని హైదరాబాద్ కు జాబ్ కోసం వెళ్ళ వలసి వచ్చింది. సిటీకి వెళ్ళాను. అక్కడ ఒక జాబ్ కన్సల్టెన్సీ వాళ్ళను కలిశాను. వాళ్ళు ఒక సినిమా థియేటర్ లో జాబ్ ఇప్పించారు. డ్యూటీకి కరెక్ట్ టైంలోపే వెళ్ళేవాడిని. అలా 15 రోజులు గడిచాయి. తరువాత చిన్నగా నాకు ప్రెజర్ పెరిగింది. థియేటర్ వాళ్ళు పని పెంచారు.

నాకు మాత్రం చాలా విసుగు పుడుతుంది. ఏమి చేస్తాం.. చేసేదేమీ లేదు కాబట్టి అలానే సర్దుకొని

వెళ్ళేవాడిని. సడెన్గా ఒక రోజు పెద్ద ఆఫీసర్, కుటుంబం మొత్తాన్ని తీసుకుని సినిమాకు వచ్చాడు. ఆయన నాకు ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఆర్డర్ ను (డెలివరీ) ఆయనకు ఇచ్చేలోపు చాలా సమయం పట్టింది. చాలా ఐటమ్స్ చల్లబడి పొయాయి.

ఆయన నన్ను తిట్టడం మొదలు పెట్టాడు. అంతలోపు మా సూపర్ వైజర్, మేనేజర్.. అందరూ వచ్చారు. ఆయన మాత్రం ‘ఈ ఐటమ్స్ నేను ఏమి చేసుకోవాలి? నాకు వదు. నాకు ఫ్రెషగా వేడిగా

వుండాలి, అపుడే నేను తీసుకుంటాను’ అని చెప్పి ‘లేకపోతే నా ఎమౌంట్ నాకు ఇవ్వండి’ అని అంటున్నాడు.

ఆ ఐటమ్స్ అన్నీ క్రిందపడేశాడు. వాటి విలువ దాదాపు 2760 ఉంటుంది. వాటి విలువ 2760 మాత్రమే కావచ్చు కాకపోతే వాటిని తయారు చేయడానికి దాదాపు 3 నెలలు పడుతుంది రైతన్నలకు అదే కాక నా జీతంలో ఆ విలువలో (అంటే 2760) లో సగం కట్ చేసి ఇచ్చారు. అప్పటికే విసుగు వచ్చిన నాకు డబ్బు విలువ తెలిసి వచ్చింది. ఆ జాబ్ ను వదిలి మా ఊరికి వెళ్లి పోవడం మంచిది అని అనిపించింది. అనుకున్న విధంగానే మా ఊరికి వెళ్లి మోహమాటం లేకుండా పని చేసుకోసాగాను.

అయినా సొంతంగా సంపాదిస్తే తప్ప తెలిసి రాలేదు డబ్బు విలువ, కష్టం విలువ. దాదాపు నేను నాలుగు రోజుల కష్టం ఒక్క క్షణం లో వెళ్లిపోయిన ఆ సమయంలో అర్థం అయింది. ఇంటి దగ్గర ఎందుకు పని చేయమన్నారో. ఇంకా నాకు అర్థం అయింది ఏమిటి అంటే నీతి నిజాయితీగా ఏ పని చేసినా తప్పులేదు అని. అందుకనే మా ఊరిలోనే పని చేసుకుంటూ సంతోషంగా జీవితం కొనసాగిస్తున్నాను. ఈ విధంగా నేను కష్టం విలువ తెలుసుకున్నాను.

కష్టే ఫలి

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం :

నా పేరు: కిడాల శివకృష్ణ.

వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ కాలీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.

నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.


161 views0 comments
bottom of page