top of page

పెళ్లి చూపుల సందడి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Video link

'Pelli Chupula Sandadi' Written By Kidala Sivakrishna

రచన: కిడాల శివకృష్ణ

ప్రేమ వివాహం మంచిదా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా?

ప్రేమ వివాహం చేసుకున్నాక పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలా లేక పెళ్లయ్యాక భార్యతో ప్రేమ మొదలెట్టాలా

మీ సందేహాలకు సమాధానం కోసం యువ రచయిత కిడాల శివకృష్ణ గారి ఈ కథ చదవండి.


మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నాము.

మా మధ్య కొన్ని సందర్బాలలో అనేక విషయాలు చర్చయాంశాలుగా మారుతుంటాయి.

ఆ విధంగా ఒక రోజు పెళ్లి గురించి టాపిక్ వచ్చింది.


అయితే “పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోవడం మంచిది” అని సత్య అన్నాడు.


“లేదురా! ముందు ప్రేమించి పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడుతావు” అని అంటాడు నందగోపాల్.

ఈ విధంగా వారిద్దరి మధ్య చర్చ పెరిగి పెద్దది అయ్యింది. అందువల్ల నా దగ్గరకు వచ్చి “నువ్వు చెప్పురా! నీవు పెళ్లి చేసుకున్నావు కదా” అని అడిగారు.


అపుడు నేను "మీరు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నారా ఇపుడు?” అని అడిగాను.


“లేదురా! కాకపోతే ఏది బాగుంటుందో తెలుసుకోవాలి కదా” అన్నారు.

“ఇంకా చెప్పాలంటే నువు హాపీగా ఉన్నావు కదా.. అందుకే” అని అడిగారు.


“సరే! జరిగింది చెపుతాను. తరువాత మీకు ఎలా నచ్చితే అలా చేయండి” అన్నాను.

నా ఇద్దరు మిత్రులు సరే అన్నారు,

అపుడు నేను చెప్పడం మొదలు పెట్టాను.“ఉదయం లేచి శుభ్రంగా స్నానం చేసి రెడీ అయ్యి బయటకు వచ్చాను. ఇంట్లో అంతా సందడిగా ఉంది.

“ఏమి తాతయ్య? ఎందుకు ఇంత హడావుడి” అని అడిగాను నేను.

అపుడు మా తాతయ్య “నీ పెళ్లి చూపులు కదరా! అందుకే ఇంత హడావిడి’ అన్నాడు.

“ఫిక్స్ అయిన మ్యాచ్ కి అంపెరింగ్ చేసినట్లు ఉంది” అన్నాను నేను.

“అరే నీకు అలానే ఉంటుంది రా మనవడా.” అన్నాడు మా తాతయ్య.


“నా మాట ఎవ్వరూ వినరే?” అన్నాను నేను.


“ఏమి వినాలి రా?” అన్నాడు మా నాన్న.


“అంటే… ఏమీ లేదు నాన్నా” కాస్త భయపడుతూ అన్నాను నేను.


అపుడు మా నాన్నమ్మ వచ్చి “ఏమి రా… మీ నాన్న దగ్గర భయపడి దాస్తున్నావా? నా దగ్గర చెప్పు.. పర్లేదురా” అంది.


“ఏమీ లేదు నాన్నమ్మా! నేను ఒక్కడినే వెళ్లి చూసి మాట్లాడి వద్దాము అని అనుకున్నాను. అంతలోనే ఇంత ఏర్పాట్లు చేశారు” అన్నాను.

“దానికేమి ఉంది? మాట్లాడు” అంది మా నాన్నమ్మ.


“అంటే అక్కడ అందరూ ఉంటారు కదా” అన్నాను నేను.


“ఏమీ పర్లేదు. నేను మీ ఇద్దరూ మాట్లాడేందుకు ఏర్పాట్లు చేస్తాను” అంది నాన్నమ్మ.

“సరే.. ఏమి చేస్తాం! చేసేది ఏమీ లేక వెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి వెళ్ళాము. వెళ్ళిన తరువాత కొంత సమయానికి ఆమెను తీసుకు వచ్చారు, ఆమె వస్తూ వస్తూ కాఫీ తీసుకుని వచ్చింది, కాఫీ తాగిన అరగంట లోపు కొన్ని స్వీట్స్ తీసుకొచ్చి ముందుంచారు.


మా నాన్నమ్మ దగ్గరికి వెళ్లి “అమ్మాయితో మాట్లాడే ఏర్పాట్లు చేపిస్తాను అని చెప్పి నిశ్శబ్ధంగా ఉంటే ఎలా నాన్నమ్మ” అని అడిగాను.


“సరే లేరా! తొందర పడక.. ఉండు, నీకు అమ్మాయి నచ్చిందా” అని అడిగింది మా నాన్నమ్మ.


“నచ్చింది. కాకపోతే తనతో మాట్లాడితే ఇంకా క్లారిటీగా ఉంటుంది” అన్నాను నేను.


మా నాన్నమ్మ వెళ్లి “మా అబాయి అమ్మాయితో మాట్లాడాలి అని ముచ్చట పడుతున్నాడు” అని చెప్పి మమల్ని ఒక గదిలోకి పంపింది.


అక్కడికి వెళ్లిన తరువాత నేను ఆ అమ్మాయిని “నీ పేరు ఏమిటి” అని అడిగాను.


“నా పేరు కళ్యాణి” అని అంది ఆమె.


“సరే! నేను మీకు నచ్చానా?” అని అడిగాను.

అపుడు తను “ముందు మీ పేరు చెప్పండి” అంది.


అపుడు నేను “నా పేరు కృష్ణ” అని చెప్పి, “ఇంతకూ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు” అని అడిగాను.


అపుడు కళ్యాణి “హా.. నచ్చారు” అని అంది.


“ నిజంగానే మీరు నిజం చెపుతున్నారా.?” అని అడిగాను నేను.


అప్పుడు తను “ఎందుకు ఇంతలా అడుగుతున్నారు?” అని అడిగింది.


“నేను మీకు నచ్చకపోతే చెప్పండి. నేను ఆపగలను ఈ పెళ్లిని” అని చెప్పాను.


అపుడు తను “మీరు ఏ ఆలోచనలతో ఇలా అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదండి” అంది.


అపుడు నేను “ఏమీ లేదు. నీకు నేను నచ్చి పెళ్లి చేసుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత భారంగా ఉన్నా, పూరి గుడిసెలో ఉన్నా, గంజి నీళ్ళూ పోసినా కూడా నన్ను నువ్వు భరిస్తావు. అంతే కాకుండా మా అమ్మానాన్నలతో సర్దుకుని పోతావు. అదే నేను నచ్చక పోయినా, మీ పెద్దల ఒత్తిడి వల్ల పెళ్లి చేసుకున్నావు అనుకో, నేను ఏమి చెప్పినా నీకు విరక్తిగానే వుంటుంది. అంతే కాకుండా మా అమ్మానాన్నల మీద గొడవలు కూడా పెట్టుకోవచ్చు. అందుకే అడిగాను. అంతే కాకుండా నచ్చని వారితో సంసారం చేయడం కష్టం కదా! తరువాత అందరం బాధపడాల్సి వస్తుంది” అన్నాను నేను.


“నిజమేనండి! నేను కూడా మా ఇంట్లో చెప్పుకోగలను నచ్చకపోతే” అంది కళ్యాణి.


“ సరే.. ఇంకా ఏమైనా అడగాలి అనుకుంటున్నారా?” అని అడిగాను నేను.


“అవును” అంది ఆమె.


“ఏమడగాలి?” అన్నాను నేను.


“అంటే మీరు ఏమీ అనుకోరు కదా” అంది ఆమె.


“ఏమీ అనుకోను, చెప్పండి” అన్నాను నేను.


“మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి అడుగుతున్నాను నేను. చితికి చేరే వరకు చిరునవ్వుల ప్రేమను కురిపిస్తాను అని మాటివ్వగలరా” అని అడిగింది కళ్యాణి.


అపుడు నేను “నిస్సందేహంగా చెప్పగలను. ఖచ్చితంగా ప్రేమగా చూసుకోగలను” అని అన్నాను.


ఆ విధంగా ఒక మాట మీదకు వచ్చి నమ్మకంతో జీవిస్తూ ఉన్నాము. అందువల్ల సంతోషంగా ఉన్నాము” అని నా ఇద్దరూ మిత్రులతో చెప్పాను నేను.


అపుడు సత్య “నీ పెళ్లి చూపులు గురించి చెప్పింది చాలు కానీ నీ అభిప్రాయం ఏమిటి? ఎలా చేస్తే బాగుంటుంది అని అడుగుతున్నాము” అన్నాడు.


“ప్రేమ పెళ్లైనా ,పెద్దలు కుదిర్చిన పెళ్లైనా వచ్చే బార్య, భర్తను అర్థం చేసుకుంటే భర్త జీవితం బాగుంటుంది, భార్యను భర్త అర్థం చేసుకుంటే, బార్య జీవితం బాగుంటుంది.

కాకపోతే పెద్దలు కుదిర్చిన పెళ్లి అయితే కొంచెం సెక్యూరిటీ గా ఉంటుంది రా జీవితానికి. మిగతాది అంతా సేమ్ గానే ఉంటుంది” అన్నాను నేను.

“నిజమే రా! మొత్తానికి పెద్దలు కుదిర్చిన పెళ్లి అయితే బాగుంటుంది అని ఇండైరెక్ట్ గా చెప్పావు కదరా” అన్నాడు నందగోపాల్.


“పెద్దలు ఏమీ చేయరు రా! వాస్తవానికి అంతా మన చేతుల్లోనే ఉంటుంది. కాకపోతే మనం వాళ్ళ మీద పడి ఏడుస్తాం” అన్నాను నేను.


“ సరే రా. ఏమి చేయాలో మాకు అర్థం అయింది. మేము వెళ్లివస్తాం” అని వెళ్లిపోయారు నా ఇద్దరు మిత్రులు.


“విన్నారు కదా అండి! ఈ విధంగా మా చర్చనీయ అంశం ముగిసింది.


సర్వే జనా సుఖినోభవంతు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :

నా పేరు: కిడాల శివకృష్ణ.

వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ కాలీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.

నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.


96 views0 comments

Comments


bottom of page