top of page

ఈ కథకు మీరే పేరు పెట్టండి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Ee Kathaku MirePeru Pettandi' Written By Kidala Sivakrishna

రచన: కిడాల శివకృష్ణ

మొబైల్ ఫోన్లు గొడవ పడుతూ ఉంటే మేము 'మీ సమస్య ఏమిటి?' అని అడిగాము వాటిని…

అపుడు అవి ఇచ్చిన సమాధానం విని నా మది ఖంగు తినింది.

ఇంతకి ఆ సమాధానం ఏమిటి అని మీ మదిలో ప్రశ్నార్థకం ఏర్పడింది కదూ....!!!!

సరే వినండి, మాకు చెప్పిన సమాధానం! కానీ సమాధానం తెలుసుకోవాలి అంటే అసలు ఏమి జరిగిందో తెలుసుకోవాలి కదా.

శివకృష్ణ గారు రచించిన ఈ కథ లో తెలుసుకుందాం రండి....!!!!!


ఒక రోజు నేను నా మిత్రులతో కలిసి ఈత కొట్టడానికి బావి దగ్గరకు వెళ్ళాను.

అందరి బట్టలు, మొబైల్స్ ఒకచోట ఉంచాం.

అందరివీ 4 జి మొబైల్స్ అయితే ఒక మిత్రుడిది మాత్రం కొత్త 5 జి మొబైల్.

తరువాత మేము ఈత కొట్టడానికి వెళ్లిపోయాము.

అపుడు 5 జి మొబైల్, 4 జి మొబైల్ ను చూస్తూ “ఏమిటి నీ బాడీ అంత రఫ్ గా ఉంది?” అంది.

అపుడు 4 జి మొబైల్ “ఆ.. మరి నువ్వు పెద్ద సాఫ్టు అయినట్లు! స్మార్ట్ ఫోన్లు అన్న తరువాత అనీ ఒక్కటే. సరేనా?” అని చెప్పింది.

అపుడు 5 జి మొబైల్ “అలా ఎలా అవుతుంది? ప్రజలందరూ మానవులే కానీ వాళ్ళలోనే ఉన్నోళ్లు, లేనోళ్ళు అని కొట్టుకోడం లేదూ” అని చెప్పింది.

అపుడు 4 జి మొబైల్ “వాళ్ళు అలాగే ఉండవచ్చు. మనకెందుకు కోపతాపాలు? అంది.

అపుడు 5 జి మొబైల్ “నేను నీలా కాదు. నాకు వాళ్ళ కంటే పొగరు ఎక్కువ. 5 జి స్వీడ్, 6 జిబి రామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, ఫాస్ట్ చార్గింగ్… మొత్తానికి చెప్పాలంటే బాగా ఉన్న భూస్వామి లాంటి దానిని అని చెప్పింది.

అపుడు 4 జి మొబైల్ “ఎంత ఉన్నా భూస్వామి కూడా రోజుకు మూడు సార్లు మాత్రమే అన్నం తింటాడు. ఇంకా చెప్పాలంటే ఎక్కువ తింటే కూడా అరగదు భూస్వాములకు” అంది.

ఆ మాటలు విన్న 5 జి మొబైల్ “నన్ను తయ్యారు చేసింది మానవుడు అయినా, నేను మాత్రం మానవుడిని నాకు నచ్చిన విధంగా మలుపులు తిప్పుతున్నాను. అంటే నాకు మానవులు మానిసలు, అయినా నీకేమి తెలుసు 2k వీడియోస్ ప్లే అయ్యేదానివి. నేను 4k వీడియోస్ ప్లే అయ్యేదానిని” అని అంది.

ఆ మాటలకు 4 జి మొబైల్ “నీకు సరి పడే నెట్ వర్క్ స్వీడ్ ఇంకా రాలేదుగా” అనింది.

అపుడు 5 జి మొబైల్ “నీకు తెలిసినట్లు లేదు. మొన్ననే 5 జి నెట్ వర్క్ కు ప్రభుత్వం ఢిల్లీ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలుసా?” అంది.

“ఆ! ఇంకా 2,3 సంవత్సరాలు సమయం పడుతుంది. అంతటా వ్యాపించాలంటే” అంది 4 జి మొబైల్.

అపుడు 5 జి మొబైల్ “ఆ...... మన దొంగ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయిగా.. ఇంకో 10 నెలలు లేదా సంత్సరకాలంలో మొత్తం వ్యాపింపజేస్తారు చూడు” అంది.

“అయినా ఏమి చేస్తాములే.. ఉన్నపుడు అనుభవించాలి కానీ ఎప్పుడో వస్తుంది అంటే అంత వరకు మనం ఉంటామో ఉండమో ఎవ్వరికీ తెలుసు” అంది 4 జి మొబైల్.

అపుడు 5 జి మొబైల్ “ఆ.. ఎపుడూ అంతేలే. మీకు చేతకాక మా మీద పడి ఏడుస్తారు” అంది.

అపుడు 4 జి మొబైల్ “ఏమి మాట్లాడుతున్నావ్? నీ మీద పడి ఏడుస్తున్నామా.. నువ్వంటున్నావే ‘ఏమీ లేని వాళ్ళం’ అని…

మేము లేకపోతే మీ 5 జి జనరేషన్ కు బీజం పడేది కాదు తెలుసా? అలాగే ప్రతి పనికీ ఉన్నోడికి లేనోడు మాత్రమే అవసరం. అంతే కాకుండా లేని వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తూ బ్రతుకుతున్నారు నీలాంటి వాళ్ళు” అని అంది.

ఈ విధంగా ఒకదానికొకటి గొడవ పడుతూ, మాటకు మాట అనుకుంటూ ఉన్నాయి. ఇదిలా ఉంటే

మేము బావిలో దాదాపు గంట సేపు ఈత కొట్టిన తరువాత మా మొబైల్స్ కోసం వచ్చాము.

అపుడు మా మొబైల్స్ లో చార్జింగ్ 50 శాతం తగ్గింది. అవి ఒక్కటే అరుస్తున్నాయి.

అప్పుడు వాటిని చూస్తూ "మేము వాడకుండానే మీ ఛార్జింగ్ సగం ఎలా అయిపొయింది?" అని అడిగాము.

అప్పుడు ఆ మొబైల్స్ వాటి మధ్య మొదలైన గొడవ గురించి చెప్పాయి.

అపుడు మేము అనుకున్నాము మనుషులకు పట్టిన పిచ్చే వీటికి కూడా పటింది అనీ.

ఇదండీ జరిగిన సంగతి.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


56 views0 comments

Comments


bottom of page