top of page

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

https://youtu.be/GLo4kKcttAA

'Pulini Chusi Nakka Vathalu Pettukunnatlu' Written By Kidala Sivakrishna

రచన: కిడాల శివకృష్ణ

ఒకరు ఏ పని చేస్తే మిగతా వారు కూడా దాన్నే అనుసరించడం చేస్తుంటారు.

'వాళ్ళు ఎందుకలా చేస్తున్నారు? అందువలన ఉపయోగం ఏమైనా ఉంటుందా' అని ఆలోచించాలని తెలియజెప్పే ఈ కథను యంగ్ రైటర్ శివకృష్ణ గారు రచించారు.


అశ్విన్ తన తాతయ్య ఉండే సొంత గ్రామానికి సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవుల నిమిత్తం వచ్చాడు. తన తాతయ్య ఆ గ్రామ ప్రజలతో, పెద్దలతో, మిత్రులతో కలిసి సభలకు, ఇతర కార్యక్రమాలకు, వెళ్తుండే వాడు. ఇంటి దగ్గర ఇరుగూ పొరుగూ వారితో కూడా చిన్న చిన్న అంశాల గురించి చర్చిస్తూ ఉండేవాడు. మన అశ్విన్ కూడా తన తాతయ్య దగ్గర కూర్చుని ఇంటి దగ్గర జరిగే చర్చలలో పాల్గొనేవాడు. ఇటీవలి కాలంలో మరీ ఎక్కువగా ఈ చర్చలు జరిగాయి. ఈ చర్చలలోనే తన తాతయ్య నోటి వెంట కొన్ని కొన్ని సామెతలు వస్తూ ఉండేవి, అయితే మన అశ్విన్ ఆ సామెతలకు వివరణ ఇమ్మని కోరుతూ ఉండేవాడు.

ఈ విధంగా ఒక రోజు సడెన్ గా తన తాతయ్య నోటి వెంట ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు’ అన్న సామెత వచ్చింది. 'ఈ సామెతను మంచి ఉదాహరణతో వివరించాలి' అని

అశ్విన్ కోరాడు.

అపుడు తన తాతయ్య “సరే నీకు చెపుతాను. కానీ మనం సాయంత్రం మన పొలాల దగ్గరకు వెళ్దాం” అని చెప్పాడు. అపుడు అశ్విన్ 'సరే' అని చెప్పి, తనకు నిజమైన పులిని మరియు నక్కని చూపిస్తాడేమో అని తెగ సంబర పడిపోయాడు.

సాయంత్రం కాగానే "ఇక వెళ్దాం తాతయ్యా!" అని అడిగాడు.

అపుడు అశ్విన్ తాతయ్య “సరే వెళ్దాం!” అని చెప్పాడు. ఇద్దరూ కాలి నడకన బయలుదేరారు.

మార్గమద్యంలో కొంత మంది పంటలకు పురుగుల మందులను మరియు పూత మందులను పిచికారి చేస్తున్నారు.

ఆ రైతులను పలుకరిస్తూ, ప్రతి సారీ అశ్విన్ ని “ఈ పంట ఏలా ఉంది గమనించు” అని చెప్పేవాడు.

అశ్విన్ కూడా చాలా శ్రద్ధగా, సరదాగా చాలా పంటలను పరిశీలించాడు.

అలా కొన్ని పంటలను పరిశీలించిన తర్వాత అశ్విన్ ని తన తాతయ్య “ఏమి గమనించావు” అని అడిగాడు.

అపుడు అశ్విన్ “చాలా రకాల పంటలను మరియు పురుగు మందులను, పంటలలో మొలుస్తున్నవి, పూత దశలో ఉన్నవి, పింద దశలో ఉన్నవి, కోతకు వచ్చిన వాటిని

గమనించాను తాతయ్యా!” అని సమాధానం చెప్పాడు.

“మరి వీళ్ళందరూ ఒక్కటే సారి మందులను పిచికారి చేయడం మంచిదేనా కాదా.??” అని ప్రశ్నించాడు.

“అపుడు అశ్విన్ మంచిది కాదు తాతయ్యా! అవసరాన్ని బట్టి మందులను పిచికారి చేయాలి” అని చెప్పాడు.

అపుడు తాతయ్య “నువ్వు చెప్పింది నిజమే అశ్విన్ కాక పోతే రైతులు ఒకరినొకరు పోల్చుకుంటూ వాడు వేశాడని వాడు వేస్తాడు, వీడి వేశాడని వాడు వేస్తాడు, ఓకే రకమైన పంటలను. అదే కాకుండా

పంట పొలాలకు ఉపయోగించే మందులను కూడా అవసరాన్ని బట్టి కాకుండా వాడు కొడుతున్నాడు అని వీడు, వీడు కొడుతున్నాడు అని వాడు పిచికారి చేస్తున్నారు, అందువలన పంటల దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది” అని తాతయ్య చెప్పాడు.

అపుడు అశ్విన్ “సరే తాతయ్యా! నాకు అర్థం అయింది ఏమిటి అంటే వాళ్ళు చేస్తున్నారు అని మనం చేయటం వలన నష్టం జరిగే సందర్భంలో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు అనే ఈ సామెతను వాడుతారు అన్నమాట” అని అశ్విన్ అన్నాడు.

“కరెక్ట్ గా చెప్పావురా అబ్బాయి” అని అశ్విన్ తాతయ్య “రారా! ఇంక ఇంటికి వెళ్ళిపోదాం” అన్నాడు.

వాళ్ళు ఇంటికి వెళ్లిపోయారు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

ఈ కథకు మీరే పేరు పెట్టండి

నిర్లక్ష్యం

ఆసక్తి

కష్టం విలువ

కాకి ఆవేదన

రచయిత పరిచయం :

నా పేరు: కిడాల శివకృష్ణ.

వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ కాలీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.

నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.



639 views0 comments
bottom of page