కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Bus Conducter' New Telugu Story Written By Kidala Sivakrishna
రచన: కిడాల శివకృష్ణ
నా పేరు నాని. నేను విశాఖపట్టణంలో డిగ్రీ చదువుతున్నాను. మా కాలేజీకి హాలిడేస్ ఇవ్వడం
వలన నేను మా ఊరు అయిన మాదాపురానికి తిరుగు ప్రయాణం చేయాల్సి వచ్చింది. అప్పుడు
విశాఖపట్టణం లో బస్సు ఎక్కడానికి బస్ స్టేషన్ కి వెళ్ళాను. అక్కడ చాలా దూర ప్రయాణం వెళ్ళే బస్సులు మాత్రమే కనపడ్డాయి.
అప్పుడు ఒకాయనను "నేను వస్తాను సార్! మా ఊరి స్టేజ్ దగ్గర స్టాపింగ్ ఉందా?" అని అడిగాను.
అప్పుడు ఆయన "లేదు బాబు" అన్నాడు.
అలా నాలుగైదు మందిని అడుగగా ఒకాయన "మీ ఊరి దగ్గర నిలబెడతాను. కానీ నెక్స్ట్ స్టేజ్ వరకు టిక్కెట్ తీసుకోవాలి" అని అన్నాడు.
నాకు ఆ నెక్స్ట్ స్టేజ్ కి చాలా దూరం. అందులోనూ డబ్బులు చాలా ఎక్కువగా
అడుగుతున్నాడు.
అందువలన "నేను రాలేను సార్" అని చెప్పాను.
అప్పుడు వేరే బస్, స్టేషన్ లోకి వచ్చింది. ఆ బస్ కండక్టర్ ని అడుగగా "సరే బాబూ! మీ ఊరు స్టేజ్ దగ్గరే నిలబెడతాను. వేరే స్టేజ్ వరకు కూడా టిక్కెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నాకు మీ ఊరికి వెళ్తే ఎంత ఛార్జ్ చేస్తారో అంత కంటే నాకు వంద రూపాయలు ఎక్కువగా ఇవ్వాలి" అని చెప్పాడు.
అప్పుడు నేను డబ్బులు ఇవ్వలేక "నాకు అవసరం లేదు సార్" అని ఆ బస్ లో ఎక్కకుండా అక్కడే దాదాపు పాతిక నిమిషాలు వేచి చూస్తే ఒక్క బస్ వచ్చింది. అది మా ఊరి స్టేజ్ దగ్గర నిలబడే బస్ కావడంతో చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే నేను ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని. అదీ కాక బస్ చాలా ఫ్రీగా ఉంది జనాలు లేకుండా. అందువల్ల ఇంకా ప్రశాంతంగా అనిపించింది. ఇదిలా ఉంటే నాకు ఒక సందేహం కలిగింది.
అప్పుడు బస్ కండక్టర్ దగ్గరికి వెళ్లి "సార్! మీకు టిక్కెట్ ఇచ్చి డబ్బులు చేంజ్ ఇచ్చే సమయంలో షార్టేజ్ లు వస్తాయా?" అని అడిగాను.
అప్పుడు ఆయన "అవును బాబూ! వస్తుంటాయి. చేతినుండి కట్టుకోవాల్సి ఉంటుంది ఆ మొత్తాన్ని" అన్నాడు.
"అవునా.. అలా అయితే మీరు చాలా నష్టపోతారు కదా! మరి ఎలా కవర్ చేస్తారు?" అని అడిగాను. "కవర్ చేసేది ఏమి ఉండదు. వచ్చే సాలరీలో తీసి డబ్బులు కట్టాలి" అన్నాడు కండక్టర్.
"అవునా! మరి రాత్రి టైం లో చెకింగ్ కి ఎవ్వరూ రారు కదా.. ఆ టైమ్ లో ఎక్కించుకున్న వారితో డబ్బులు తీసుకొని టిక్కెట్ కొట్టకపోతే సరిపోతుంది కదా" అన్నాను నేను.
"సరిపోతుంది కానీ..... అలా చేయడం చాలా తప్పు బాబు! రెండొందలు మూడొందల రూపాయల కోసం చూసుకుంటే ఉద్యోగమే పోతుంది బాబూ" అన్నాడు బస్ కండక్టర్.
"అలా ఎందుకు జరుగుతుంది సార్? ఎవ్వరూ చెకింగ్ కోసం రారు కదా" అన్నాను నేను.
"రారు. కాకపోతే మన టైం బాగోలేకనో టిక్కెట్ తీసుకున్న వాళ్ళ టైం బాగోలేకనో ఆ రోజే చెకింగ్ కి వచ్చారు అనుకో.. ఏమిటి పరిస్థితి? నా ఉద్యోగం పోతుంది కదా! అందుకే ఎలాంటి మోసం చేయకుండా ఉండాలి. గడిచే జీవితం ఎలా అయినా గడుస్తుంది. మనం మన పనిని సక్రమంగా చేస్తూ ఉండాలి. అంతే! దేవుడు ఎక్కడో ఒక చోట మనకు దారి చూపుతాడు. అంతే కానీ మోసం చేస్తే ఎక్కువ రోజులు మర్యాదగా జీవించలేము" అన్నాడు బస్ కండక్టర్.
ఆయన మాటలు విన్న నేను ఇది నిజమే కదా అని చాలా ఆశ్చర్యపోయాను.
దీని వలన 'ఎప్పటికీ మోసం జయించలేదు, ఎప్పటికయినా బయట పడుతుంది.
సత్యమే జయిస్తుంది' అని తెలుసుకున్నాను అందుకనే నేను ఎవ్వరినీ మోసం చేయకుండా
బ్రతకాలని నిర్ణయించుకున్నాను.
సర్వే జనా సుఖినోభవంతు
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
నా పేరు: కిడాల శివకృష్ణ.
వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.
నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
మనం ఎవ్వరినీ మోసం చెయ్యకుండా, నిజాయితీగా బ్రతకాలి. సందేశాత్మకంగా ఉంది.
కథ బాగుంది.