top of page
Writer's pictureKidala Sivakrishna

మరమనిషి కథ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Maramanishi Katha ' New Telugu Story Written By Kidala Sivakrishna

రచన: కిడాల శివకృష్ణ


మనుషుల గురించి ఎన్నో కథలు విని ఉంటారు. కానీ మర మనుషుల గురించి కిడాల శివకృష్ణ గారు రచించిన కథను ఇప్పుడు తెలుసుకుందాం.


చాలా బోర్ గా ఉంది. టైం పాస్ కావడం లేదు అందుకే కథల పుస్తకాల కోసం వెతకడం మొదలు పెట్టాను. చేతికి ఒక కథల పుస్తకం దొరికింది. వెంటనే విషయ సూచికను పరిశీలించాను. అందులో రొటీన్ గా ఉండే కథల పేర్లు మాత్రమే కనిపించాయి.

మరి కొన్ని పుస్తకాలు వెదికాను. ఈసారి మంచి కథల పుస్తకం దొరికింది.

పేజీలు తిప్పి చూస్తే ‘మర మనిషి’ అనే కథ కనిపించింది, అరే.. ఇదేదో కొత్తగా ఉందే అనుకుంటూ చదవడం మొదలు పెట్టాను.


నేను మరమనిషిని కాబట్టి నాకు చెప్పిన పనిని చేయడం మాత్రమే తెలుసు అని అనుకుంటున్నారా?? అస్సలు కాదు. నా అసలు పేరు హరి. నా జీవితం మొత్తం ప్రణాళిక ప్రకారం నడవాలి అన్నది నా లక్ష్యం. ఆ ప్రణాళిక వల్ల నేను మనిషిని కాస్తా మరమనిషి గా అయ్యాను. అయితే అదెలానో తెలుసుకుందాం రండి.


నాకు యాభై లక్షల రూపాయలు సంపాదించాలి అనే కోరిక పుట్టింది. అందువలనే నేను డబ్బు సంపాదించడం కోసం ప్రణాళికను తయారు చేసుకున్నాను. దాని వలన నేను ప్రతి రోజూ నా పనిని సక్రమంగా చేస్తూ, డబ్బును పొదుపు చేయడం మొదలు పెట్టాను. నాకు వచ్చేది పాతిక వేల రూపాయల జీతం. అందులో నా రూం ఖర్చులు బండి పెట్రోల్ ఖర్చులు పోను నాకు పద్దెనిమిది వేల రూపాయల వరకు మాత్రమే మిగులుతుంది. అయితే నాకు సంవత్సరం సంవత్సరం మూడు వేల రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు జీతం పెరుగుతుంది, అయితే జీతం పెరిగినంత మాత్రాన ఖర్చులు పెరగవా ఏంటి? జీతంతో పాటుగా ఖర్చులు పెరిగినా పొదుపు కూడా బాగా పెంచాను. ఇలా ఐదు సంవత్సరాల పాటు కష్టపడితే పది నుండి పదిహేను లక్షల రూపాయల వరకు మాత్రమే ఆదా చేయగలిగాను, అన్ని రకాలుగా కలిపి కూడా.


నేను ఇంకో పదిహేను సంవత్సరాల పాటు కష్టపడితే నేను అనుకున్న డబ్బులు సంపాదించవచ్చును అని అనుకున్నాను. కానీ నాకు యాభై సంవత్సరాల వయస్సు వచ్చినా నేను నలభై ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే సంపాదించగలిగాను. అయితే నేను అనుకున్న విధంగా డబ్బులు సంపాదించగలిన సమయానికి, ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకుంటే నాకంటూ సంతోషం లేదు, ఆనందం లేదు.


ప్రేమలు గానీ, బంధాలు గానీ ఎలాంటి అనుభూతులు గానీ లేవు. అప్పుడు అనిపించింది నేను ఒక మరమనిషి లాగా పని చేశాను అని.

వేరే ప్రదేశానికి వెళ్ళాలి అనుకున్నపుడు ఎలాగైతే పెట్రోల్ పోసి, బైక్ ని తీసుకెళ్తామో అలా అయ్యింది నా పరిస్థితి కూడా.


‘లక్యం అనే ఊరుకు అనే డబ్బు అనే పెట్రోల్ తో వెళ్తున్నాను’ అనే విషయం అర్థం అయింది.

మనం మనుషులమా కాదా???? మనిషి అయితే బంధాలు, బాధ్యతలు, కష్టాలు, నష్టాలు, సుఖాలూ, లాభాలు అన్నీ ఉండాలి కదా, అవ్వనీ లేకపోతే ఎంత డబ్బులు, ఆస్తులు సంపాదించినా జీవితం వ్యర్థమే అని తెలుసుకున్నాను. ఇదండీ నా కథ అందుకే నా కథకి మరమనిషి అని పేరు పెట్టుకున్నాను”


కథ చదవడం ముగించాను


ఈ కథ చదివిన తర్వాత నాలో కొంత వరకు మనం మనిషి లాగా బ్రతుకుతున్నామా???? లేక యంత్రం లాగా బ్రతుకుతున్నామా???? అనే సందేహం కలిగింది. ఎలా అయితే నేమి మనిషి అనేవాడికి బాధలూ ఉండాలి, సుఖమూ ఉండాలి అప్పుడే జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది.


సర్వే జనా సుఖినోభవంతు

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :

నా పేరు: కిడాల శివకృష్ణ.

వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.

నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.







50 views0 comments

Comments


bottom of page