top of page

కోడలు అయినా కూతురే

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Video link

'Kodalu Ayina Kuthure' New Telugu Story Written By Kidala Sivakrishna

రచన: కిడాల శివకృష్ణ


అంగరంగ వైభవంగా పెళ్లి మండపాన వివాహం జరిగింది. సంధ్య అత్తగారి ఇంట్లో మొదటి సారిగా కుడి కాలు పెట్టి దీపం వెలిగించింది. లెక్కలేనంత సంతోషంతో, చిగురిస్తున్న ఆశలతో మెట్టినింట జీవితాన్ని గడపసాగింది సంధ్య. కాలం గడుస్తుంది. ఇంట్లో నచ్చని సంఘటనలు ఎదురవుతున్నాయి. చిన్నగా గొడవలు జరుగుతున్నాయి, ఒకరోజు సంధ్య తన భర్త మీద గొడవపడుతుంది.


మధ్యలో అత్తామామలు “ఎందుకు గొడవ పడతారులేమ్మా! సంసారం అన్న తరువాత కొన్ని సందర్బాలలో గొడవలు జరుగుతుంటాయి. మామూలే. సర్దుకు పోవాలి” అన్నారు.


“మా గొడవలకు అసలు కారణమేమిటో తెలుసా మీకు?” అంది సంధ్య.


“కారణమేమిటి సంద్యా?” అన్నారు అత్తామామలు.


“ మీరే!” అంది కోపంతో సంధ్య.


“ఏమంటున్నావు అమ్మా! మేము మీ ఇద్దరి గొడవకు కారణం ఎలా అవుతాము? అన్నారు వాళ్ళు.


“ఎలా అంటే మీరు నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు. అదే మా అమ్మ అయితే నన్ను అల్లారు ముద్దుగా చూసుకునేది. మీకు ఒక కూతురు ఉంటే తెలుస్తుంది. ఒక వేళ నేను గానీ మీ కూతురునై ఉంటే ఇలాగే ఉండే వాళ్లేనా అని అడుగుతున్నాను” అంది సంధ్య.


“నీకు ఏమి తక్కువ చేశాము?” బాధగా అన్నారు అత్తా మామలు.


“చూడండి. మీ ముందరే నన్ను ఎలా అరుస్తున్నారో” అంటూ భోరున విలపిస్తుంది సంధ్య.


"అదేమిటమ్మా! మేము నిన్ను కూతురిలాగా చూసుకుంటున్నాము. నువ్వు కూడా మమ్మల్ని కన్న తల్లిదండ్రుల్లా చూసుకుంటున్నావు" అన్నారు వాళ్ళు బాధపడుతూ.


“అదేం కాదు. మీరు నన్ను ఇంట్లో నుండి పంపించేయాలి అనుకుంటున్నారు” అంది సంధ్య.


“మేము ఎందుకు అలా చేయాలనుకుంటాము? మాకు కూతురు అయినా కోడలు అయినా ఒక్కటే. అది నువ్వే కదమ్మా. మీ సంతోషమే మాకు కావలసింది. అవసరమైతే మేమే వెళ్లి పోతాము కానీ నిన్ను వెళ్ళమంటమా..." అన్నారు సంధ్య అత్తామామలు.


“చూశారా అండీ! ఇది అసలు సంగతి” అంది సంధ్య.

సంధ్య అత్తామామలు బిత్తర పోయారు. సంధ్య ఏమి మాట్లాడుతుందొ వాళ్లకు అర్థం కావడం లేదు. వాళ్ళు విషయమేమిటని తమ కొడుకును అడిగారు.


అప్పుడు వాళ్ళ కొడుకు ఒక్కసారిగా చిరునవ్వు నవ్వాడు. “మేము బాధపడుతుంటే నువ్వు నవ్వుతావా” అన్నారు వాళ్ళు కొడుకుతో.


అప్పుడు సంధ్య “అదేం కాదు మామయ్యా! అత్తమ్మా! ‘మీరు నన్ను ఎలా చూసుకుంటున్నారు’ అని మీ అబ్బాయి అడిగితే నేను ‘కన్న కూతురులాగా చూసుకుంటున్నారు’ అని చెప్పాను. అప్పుడు మీ అబ్బాయి నమ్మలేదు. అందుకే ఇదంతా చేయాల్సి వచ్చింది. నా కోసం ఇంటినుండి వెళ్ళడానికి కూడా సిద్ధ పడ్డారు మీరు. మీకు కూతురైనా, కోడలైనా ఒక్కటే. అందుకే నేను కూడా మిమ్మల్ని సొంత తల్లిదండ్రుల్లా భావిస్తున్నాను" అంది సంధ్య.


“నువ్వు మాకు నిజంగానే కూతురువి” వాళ్ళు సంధ్యను దగ్గరికి తీసుకున్నారు.

సంతోషంతో, కిలకిల నవ్వులతో ఇల్లంతా నిండిపోయింది.


నిజానికి చెప్పాలంటే అర్థం చేసుకునే భర్త, కూతురులా చూసుకునే అత్తమామలు దొరకడం చాలా కష్టం. ఒకవేళ అలాంటి వారే దొరికితే జీవితాంతం సంతోషంగా జీవిస్తుంది ప్రతి అమ్మాయి. తల్లిదండ్రుల లాగా చూసుకునే కోడలు దొరకడం కూడా అత్తమామ చేసుకున్న అదృష్టం. అలాంటి ఇంట్లో ఎప్పటికీ దుఃఖాలు ఉండవు, సంతోషాలు తప్ప.సర్వే జనా సుఖినోభవంతు

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :

నా పేరు: కిడాల శివకృష్ణ.

వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.

నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.


317 views0 comments

Commentaires


bottom of page