కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Pramukhyatha Deniki' Written By Kidala Sivakrishna
రచన: కిడాల శివకృష్ణ
ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఒక విషయం చర్చనీయ అంశంగా మారినప్పుడు,
ఖచ్చితంగా ఆ చర్చ ముగించే సమయానికి ఆ సమస్యకు పరిష్కారం తప్పక దొరుకుతుంది.
అది మూడవ వ్యక్తి రావడం వల్ల అయినా కావచ్చు, లేక ఇతర కారణాల వల్ల అయినా కావచ్చు అనడానికి ఈ కథ చక్కని ఉదాహరణ.
ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది.
ఇక కథ ప్రారంభిద్దాం
సత్య, నంద అనే ఇద్దరు మిత్రులు ఉన్నారు, వీరిలో సత్య బాగా డబ్బు ఉన్న వ్యక్తి. నంద డబ్బు లేని వ్యక్తి.
అయితే వీరు మాట్లాడుకుంటూ ఉన్నారు…
అలా మాట్లాడుకుంటూ ఉండగా ‘మనం మన జీవితంలో దేనికి ఎక్కువగా ప్రాముఖ్యత (ఇంపార్టెన్స్) ఇవ్వాలి’, అనే సందేహం కలిగింది. అంటే ‘డబ్బుకా?? లేక సమయానికా??’ అని వీరిద్దరూ పెద్ద సంశయంలో పడ్డారు.
సత్య మాత్రం ‘సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి’ అని, నంద మాత్రం ‘డబ్బులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి’ అని చర్చిస్తూ ఉన్నారు.
ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి అని చాలా సార్లు, వారికి వచ్చిన ఆలోచన గురించి తమ తోటి వారిని అడిగి తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఒకరేమో డబ్బులకు అంటారు, మరొకరు ఏమో సమయానికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటారు. ఇలా తేలే విషయం కాదు అనుకుని పెద్ద వాళ్ళను అడగాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్న విధంగానే వయస్సులో 50 సంవత్సరాలు పైపడిన వారిని చాలా మందిని అడిగారు. వాళ్ళు వాళ్లకు తెలిసినట్లుగానే కొంతమంది డబ్బుకు అని, మరి కొంత మంది సమయానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పారు.
మరి కొంత మంది ‘బంధాలకు, బాంధవ్యాలు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. జీవితంలో డబ్బుకు, సమయానికి మాత్రమే కాదు’ అనీ చెప్పిన వారెందరో.
ఈ విధంగా తమకు చెప్పిన సమాధానాలను గురించి మాట్లాడుతూ ఉంటే సాగర్ వీరిద్దరి దగ్గరికి వచ్చాడు. సాగర్ కూడా వీళ్లకు మిత్రుడే కానీ అంతగా చనువు ఉండడు అంతే.
‘ఏమి రా చాలా సీరియస్ గా మాట్లాడుతున్నారు’ అని అడిగాడు సాగర్.
అపుడు ‘ఏమీ లేదురా! నేను ఏమో డబ్బుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటున్నాను. సత్య ఏమో సమయానికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటున్నాడు. దాని గురించి మాట్లాడుతున్నాం. ఇంకా చెప్పాలంటే చాలా మందితో కూడా చర్చించాము కానీ మా సందేహం నివృత్తి కాలేదు’ అన్నాడు నంద.
అప్పుడు సాగర్ “మన అవసరాలను బట్టి మనం మనకి తెలియకుండానే అయా అంశాలకు ప్రాధాన్యత ఇస్తాము. అది ఎలా అంటే…
సత్య.. నీకు డబ్బు ఉంది. ఆ డబ్బును రెట్టింపు చేయడానికి సమయం లేదు.
నంద.. నీకు డబ్బు లేదు కానీ సమయం చాలా ఉంది. అందులోనూ నీకు డబ్బు అవసరం కాబట్టి నువ్వు డబ్బుకు ప్రాధానత్య ఇవ్వాలి అంటున్నావ్” అన్నాడు సాగర్.
“సరే గానీ ఇప్పుడు ఫర్ఫెక్ట్ గా చెప్పు.. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో” అన్నారు సత్య, నంద.
“మన జీవితంలో అన్నీ ప్రాముఖ్యతను సంతరించుకునే అంశాలే! కాకపోతే అవసరాలను బట్టి వాటికి ప్రాధాన్యత ఇస్తూ పనులు చేస్తూ ముందుకు సాగితే అనీ సక్రమంగా జరుగుతాయి” అన్నాడు సాగర్.
“సరే రా! నీ వల్ల మా సందేహానికి మంచి సలహా దొరికింది. తరువాత కలుద్దాం” అని వెళ్లిపోయారు, ఎవరింటికి వారు. సాగర్ కూడా సరే అని వెళ్లిపోయాడు.
సర్వే జనా సుఖినోభవంతు
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
నా పేరు: కిడాల శివకృష్ణ.
వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.
నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
Comments