కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Dabbu Viluva' Written By Kidala Sivakrishna
రచన: కిడాల శివకృష్ణ
సత్య తన నాన్నతో గొడవ పడి తను ఉండే గ్రామాన్ని వదిలి, పట్టణానికి వలస వచ్చాడు. ఈ విధంగా వెళ్ళడం వలన సత్యకు డబ్బు విలువ తెలిసి వచ్చింది.
‘అసలు ఎందుకు గొడవ పడవలసి వచ్చింది? ఏ విధంగా డబ్బు విలువ తెలుసుకున్నాడు…’ అని మీ సందేహమా?
అయితే మన కథలోకి వెళ్ళాల్సిందే....!!!!
శివరామ్ కుమారుడు సత్య.
శివరామ్ కూడా కొంత వరకు చదువుకున్న వ్యక్తి కావడంతో చదువు కోసం ఎంత డబ్బు అయినా తన కొడుకు కోసం ఖర్చు పెట్టదలచినవాడు. అయినా సత్య డబ్బును ఎక్కువగా ఖర్చు చేసే స్వబావం కలవాడు. చదువు కోసం కాకుండా అనవసరమైన వాటికి డబ్బులను ఖర్చు చేసే వాడు. ఈ విషయం తెలుసుకున్న శివరామ్ తన కొడుకుకు డబ్బులు ఇవ్వడం తగ్గించాడు.
ఇది గమనించిన సత్య రెండు, మూడు సార్లు “డబ్బులు తక్కువగా ఇస్తున్నావు. నాకు సరిపోవడం లేదు నాన్నా!” అని చెప్పాడు.
అయినా సరే, కారణం ఏమిటో తెలుసుకుని కరెక్టుగా లెక్క వేసి, సరిపడేoత డబ్బులు మాత్రమే సత్య కు ఇచ్చేవాడు. ఈ విధంగా ఇవ్వడం వలన సత్యకు కోపం వచ్చింది.
ఆ కోపం తోనే ఒక రోజు తన తండ్రి శివరామ్ తో గొడవ పెట్టుకున్నాడు.
శివరామ్ అదే కోపంతో “నువ్వు డిగ్రీ పూర్తి చేశావు కాబట్టి నువ్వు ఉద్యోగం వెతుక్కుని డబ్బు సంపాదించు. నీకు కేవలం ఆరు నెలలు సమయం ఇస్తున్నాను. ఇంతలోపు నువ్వు ఉద్యోగం సంపాదించాల్సిందే. లేకపోతే నేను చెప్పిన చోట నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవాల్సిందే. అంతే కాకుండా ఆరు నెలల తర్వాత నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేను” అన్నాడు.
ఆ మాటలు విన్న సత్య “అందుకోసం ఆరు నెలలు ఎందుకు? ఆరు రోజుల సమయం ఇవ్వు చాలు. పట్టణానికి వెళ్ళిపోతాను. నాకు డబ్బు సంపాదించడం తెలుసు”న్నాడు.
“సరే వెళ్ళు. అవసరం అయితే డబ్బులు తీసుకువెళ్ళు” అన్నాడు శివరామ్.
“నీ డబ్బులు నాకు అవసరం లేదు” అన్నాడు సత్య.
“సరే నీ ఇష్టం ఇక” అన్నాడు శివరామ్.
సత్య పట్టణానికి వెళ్ళిన తరువాత చాలా కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఏదో ఒక కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగం పొందాడు. ఆ కంపెనీలో 10 గంటలు పని, 10 వేల రూపాయలు జీతం అన్నారు. సత్య సరే అన్నాడు. ‘ఇంకేముంది.. నాలుగైదు వేలు ఖర్చులు పోను ఐదువేల వరకు డబ్బులు మిగులుతాయి’ అని అనుకున్నాడు. అలా ఒక్క నెల గడిచింది. నెలలో ఆరు వేల రూపాయలు మాత్రమే చేతికి అందాయి. ఆ డబ్బులు భోజనం ఖర్చులకి సరిపోయాయి. రెండవ నెల ఏడు వేలు మాత్రమే చేతికి వచ్చాయి. అదేమిటి అని కంపెనీ వాళ్ళను ప్రశ్నించాడు. వాళ్ళు నీకు ఇంతే జీతం ఇచ్చేది. ఇష్టం అయితే జాబ్ చేయి.. లేకుంటే లేదు’ అని చెప్పేశారు. ఆ మాటలు విన్న సత్య సరే అని ఆలోచన చేసి ఆ జాబ్ వదిలేశాడు. వేరే కంపెనీలలో జాబ్ కోసం ప్రయత్నం చేయడం మొదలు పెట్టాడు.
పది పదిహేను రోజులు గడిచాయి. ఒక్క పూట అన్నం తినడానికి కూడా డబ్బులు లేవు. అలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చిన డబ్బుతో కడుపు నింపుకునేవాడు. ఆ సమయంలోనే డబ్బును ఎందుకు వాళ్ళ నాన్న తక్కువగా ఖర్చు పెట్టేవాడో తనకు ఇప్పుడు తెలిసి వచ్చింది. ఆ విధంగా కాలం గడుపుతూ నెల రోజుల్లో ఒక కంపెనీలో జాబ్ సంపాదించి అందులో జాయిన్ అయ్యాడు సత్య. జాబ్ లో జాయిన్ అయ్యాడు కానీ అక్కడ అన్నం బాగుండదు. అయినా వాళ్ళ నాన్న దగ్గర మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చి బాధపడుతూ ఇంటికి తిరిగి వెళ్ళలేక అక్కడే ఉద్యోగం చేయసాగాడు.
ఈ విషయాన్ని అంతటినీ తెలుసుకున్న తన తండ్రి శివరామ్ "నీవు అక్కడ ఉండి అంత కష్ట పడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చెయ్యి. మన ఊరి దగ్గర ఉండే కంపెనీలో జాబ్ చూశాను. అందులో జాయిన్ అవ్వు” అని కబురు పంపాడు సత్యకు.
సత్య కాస్త భయంతోనూ, బాధతోనూ ఇంటికి వచ్చాడు. వచ్చిన తరువాత తన తండ్రితో “నన్ను క్షమించు నాన్నా! నేను తప్పు చేశాను. ఇప్పుడు నాకు డబ్బు విలువ, మీ విలువ తెలిసి వచ్చింది” అని కంటతడి పెట్టాడు.
“సరే లేరా! ఇప్పటికైనా నువ్వు డబ్బు విలువ తెలుసుకున్నావు. నాకు అదేచాలు. పదరా భోజనం చేయడానికి” అన్నాడు శివరామ్.
“సరే!” అని ఇద్దరూ కలిసి భోజనం చేశారు. తరువాత రోజు కంపెనీలో జాయిన్ అయ్యాడు సత్య. ఆ రోజు నుండి ఇంటి దగ్గర ఉండి జాబ్ చేస్తూ, డబ్బును పొదుపుగా ఉపయోగిస్తూ తన తల్లిదండ్రులతో సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.
ఈ విధంగా సత్య డబ్బు విలువ తెలుసుకున్నాడు.
సర్వే జనా సుఖినోభవంతు
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
నా పేరు: కిడాల శివకృష్ణ.
వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ కాలీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.
నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
留言