top of page

దృఢ సంకల్పం


'Drudha Sankalpam' Written By Kidala Sivakrishna

రచన: కిడాల శివకృష్ణ

ఎన్నో కష్టాలు, నష్టాలు వచ్చినా మనసులో దృఢ సంకల్పం ఒక్కటి ఉంటే ఖచ్చితంగా విజయం మనలను తప్పక చేరుతుంది. అది ఎలా అని సందేహమా.. అయితే ఒక యువకుడు సాధించిన విజయ గాథను మనం తప్పక తెలుసుకోవాలి.

మహా నగరంలో డిగ్రీ పూర్తి చేసిన సత్య అనే అబ్బాయి ఉన్నాడు. డిగ్రీ పూర్తి అయిన అనంతరం తన మామ కూతురిని వివాహం చేసుకోవాలని తన మామను సంప్రదించాడు.

“నీవు చదువు చదువావు కానీ డబ్బును సంపాదించలేదు” అని వాళ్ళ మామ హేళన చేశాడు.

ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని ఎలాగైనా డబ్బును సంపాదించాలి అనే లక్షంతో ముందుకు అడుగులు వేశాడు సత్య. డిగ్రీ చదువుతో ఉద్యోగం కోసం చాలా కంపెనీలు తిరిగాడు. కొన్ని

కంపెనీలలో ఉద్యోగం చేశాడు, అయినా సంతృప్తి చెందలేదు. ఎందుకంటే జీతం ఎక్కువగా ఉన్న చోట తినడానికి తిండి సరిగ్గా ఉండదు. తిండి సరిగ్గా ఉన్న చోట జీతం ఖర్చులకు కూడా సరిపోదు. ఈ విధంగా చాలా రోజులు జీవితాన్ని గడిపాడు. మరి కొన్ని చోట్ల అన్నీ బాగున్నా ఉద్యోగం కోసం చాలా కష్ట పడినా అవకాశం వచ్చేది కాదు.

ఈ విధంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ అలసిపోని మొండితనంతో ఎందరో మహానుభావుల ప్రేరణతో తన లక్షసాధనవైపు అడుగులు వేస్తున్నాడు, అటువంటి సమయంలో సొంతంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు ఏర్పాటు చేసుకున్నాడు. అనుకున్న విధంగానే కొన్ని రోజులు వ్యాపారాన్ని చేస్తూ నష్టాలు వచ్చినా వదలక ముందుకు సాగాడు. బట్టల వ్యాపారం, పశువుల వ్యాపారం, నగల వ్యాపారం, ఇలా చాలా రకాల వ్యాపారాలు చేసి ఆఖరికి

ఉండే స్థిరాస్తిని కూడా పోగొట్టుకున్నాడు.

కొన్నాళ్లకి తన మిత్రుడు టమోటా పళ్ల మార్కెట్లోకి పనికి వెళ్దాం రా అని పిలిచాడు. అలా పనికి వెళ్ళడం మొదలు పెట్టాడు. రోజుకి వెయ్యి రూపాయల వరకు డబ్బులు వచ్చేవి. ఈ విధంగా ఆరు

ఏడు నెలల కాలపరిమితిలోనే అక్కడ ఉండే యజమానులకు నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. చాలా రోజులు వారి క్రింద గుమాస్తాగా పనిచేశాడు. కొన్నాళ్లకి టమోటా పళ్ల వ్యాపారం కూడా చేయనారంబించాడు. ఆ టమోటాకు మంచి ధరలు పలకడంతో చాలా డబ్బును సంపాదించాడు. ఈయన అభివృద్ధిని చూసిన ఆయన మామగారు తన కూతురిని ఇచ్చి వివాహం జరిపించాడు. మొత్తానికి తను అనుకున్నా లక్ష్యాన్ని సాధించాడు సత్య. ఈ విధంగా అందరికీ

ఆదర్శప్రాయంగా ఎదిగాడు సత్య.

తన మామ కూతురిని పెళ్లి చేసుకోవాలని కోరికతో, సాధించాలని లక్షంతో ముందుకు

అడుగులు వేస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు సత్య. ఈ విధంగా మన లక్షాని సాధించాలని దృడ సంకల్పంతో ముందుకు అడుగులు వేద్దాం, అనుకున్నది సాదిధాం.


సర్వే జనా సుఖినోభవంతు

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

డబ్బు విలువ

పెళ్లి చూపుల సందడి

కష్టం సుఖం

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు

ఈ కథకు మీరే పేరు పెట్టండి

నిర్లక్ష్యం

ఆసక్తి

కష్టం విలువ

కాకి ఆవేదన

రచయిత పరిచయం :

నా పేరు: కిడాల శివకృష్ణ.

వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ కాలీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.

నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.


165 views0 comments
bottom of page