'Upayam' Written By Kidala Sivakrishna
రచన: కిడాల శివకృష్ణ
నాగయ్య అనే రైతుకు నాలుగు ఒంగోలు జాతికి చెందిన గిత్తలు ఉన్నాయి. ఆ నాల్గింటిలో ఒక్కటి చాలా పొగరు బట్టిన గిత్త, ఆ గిత్త వేరే గీత్తలతో నిలకడగా ఉండేది కాదు. ప్రతి గిత్తను పొడవడం, వాటికి పెట్టిన తిండిని బెదిరించి తినేసేది. వాటితో పాటు మిగిలిన గిత్తలను ఎగతాళి చేస్తూ ఉండేది.
అలా ఒక రోజు మిగిలిన ఎద్దులతో "చూడండి మీరు ఎంత అమాయకులు నాలాగ మీరు ఉండలేరు, నేనే మీ కంటే అందంగా ఉంటాను, నాకు భయపడి ఎవ్వరూ నా దగ్గరకు కూడా రారు, ఇంకా మిమ్మల్ని కొట్టడం చేస్తారు తరువాత మీరు లాగలేని బరువులను నా సాయంతో లాగిస్తారు" అని వెకిలి నవ్వు నవ్వుతూ అంది.
ఇలాంటి మాటలకు విసిగిపోయిన ఎద్దులు ఒక ఉపాయాన్ని ఆలోచించాలి అనుకున్నాయి . ఒక రోజు ఎప్పటి లాగానే ఎగతాళి చేయడం మొదలు పెట్టింది.
అప్పుడు మిగిలిన ఎద్దులు "అవునవును. నువ్వే పెద్ద అందగత్తెవి మరి, అందులోనూ బలశాలివి, నీకు ఎదురు తిరిగే ధైర్యం ఎవ్వరికీ లేదు. మరి అంత గొప్ప దానివి, కాకపోతే నీకు కొంచం అదృష్టం కూడా చాలా తక్కువే. దురదృష్టం కూడా చాలా అంటే చాలా ఎక్కువే. అందుకే కదా ఇలా ఇంటిదగ్గర ఉన్నావు" అన్నాయి.
ఆ మాటలు విన్న ఆ ఎద్దు మది ఖంగుతింది. ఆ బాధలోనే "ఇంతకూ మీరు ఏమీ చెప్పాలనుకుంటున్నారు, నేను ఏమి దురదృష్టంలో ఉన్నాను నాకు అర్థం కావడంలేదు" అంది పోగరుబట్టిన గిత్త.
"ఏమి లేదు. మేము బయటకు పని నిమిత్తం వెళ్తాము కదా. అందుకు ఆరోగ్యంగా ఉంటాము, అదే కాకుండా మాకు పూజలు చేస్తారు, మంచి మంచి తిండి పెడతారు, ఇక్కడ అయితే వీళ్ళు పెట్టిందే తినాలి. అక్కడ అయితే మాకు నచ్చిన గడ్డిని తింటాము. ఇలాంటి మంచి అవకాశాలను నువ్వు కోల్పోతున్నావు, ఇంకా చెప్పాలంటే మాకు మంచి పేరుప్రతిష్టలు కూడా వస్తాయి, అందరూ గుర్తించగలరు మమల్ని" అన్నాయి.
ఆ మాటలు విన్న ఆ పొగరు బోతు గిత్త తన కోపాన్ని పక్కన పెట్టాలని నిర్చయించుకుంది, అనుకున్న విధంగానే తన కోపాన్ని పక్కన పెట్టడం వలన అందరూ దానిని పనికి ఉపయోగించడం అంతే కాకుండా ఇంత గడ్డిని పెట్టీ బాగా శ్రమపెటసాగారు. కొంత కాలానికి దానికి బాగా అలుపు నొప్పులు వచ్చినాయి.
అప్పుడు అది మిగిలిన ఎద్దులతో "మీరు అన్నీ చెప్పారు, కానీ ఈ కష్టం నొప్పులు గూర్చి చెప్పలేదే" అని అడిగింది.
అప్పుడు మిగిలిన ఎద్దులు "అవును మరి! మేము పని చేసి ఇంటికి అలసి సొలసి వస్తె నీవు ఇంటి దగ్గర ఉండి మమల్ని పొడవడానికి వస్తావా...!! నీకు తిక్క కుదిరింది కదూ, ఎవ్వరి పని వాళ్ళు చేయాలి. వేరే వాళ్ళని ఎగతాళి చేస్తూ ఉంటే ఇలానే ఉంటుంది. మరి నీకు ఇలానే జరగాలి" అన్నాయి మిగిలిన ఎద్దులు అన్నీ.
ఈ విధంగా ఆ పొగరు బోతు గిత్తకు బుద్ధి చెప్పాయి. అందుకనే అనేది.. ఎవ్వరి పని వాళ్ళు చేయాలి, వేరే వాళ్ళని ఎగతాళి చేస్తే ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.
సర్వే జనా సుఖినోభవంతు
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
నా పేరు: కిడాల శివకృష్ణ.
వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.
నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
Comments