top of page

కన్న ప్రేమ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

https://youtu.be/Y5OflIFzcCU

'Kanna Prema' Written By Kidala Sivakrishna

రచన: కిడాల శివకృష్ణ


గొడవ మొదలైంది.

చిన్న చిన్న వస్తువులు పగిలిపోతూ నాశనం అవుతున్నాయి.

అంతే కాకుండా గట్టిగా అరుపులు కూడా బయటకు వస్తున్నాయి.

ఆ అరుపులలో “మీరు నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు నాన్నా! నాకు అంతా తెలుసు. నా జీవితాన్ని నేను సంతోషంగా గడపగలను” అన్నాడు అమర్.

“గడపగలవు. కాకపోతే మేము ఉన్నపుడే ఆ జీవితాన్ని అందంగా మలచుకుంటే మాకు చాలా

సంతోషంగా ఉంటుంది రా” అన్నాడు అమర్ తండ్రి గారు.

“మీ సంతోషం నాకు అక్కర్లేదు” అన్నాడు అమర్.

“అలా ఎందుకు అంటున్నావు రా! మీ నాన్న కూడా నీ మంచి కొరకే కదా చెపుతున్నాడు” అంది అమర్ వాళ్ళ అమ్మ గారు.

“నువ్వు కూడా ఏంది అమ్మ నాన్నకు సపోర్ట్ చేస్తున్నావు? నేనేమీ పని

చేయని అని చెపుతలేనుకదా” అన్నాడు అమర్.

“నిజమే రా. కాకపోతే నాన్న చెప్పేది నీ సంతోషం కోసం రా” అంది అమర్ అమ్మ గారు.

“సంతోషం కోరుకుంటే నెమ్మదిగా చెప్పాలి గానీ, కొసరి కొసరి గట్టిగా అరిచి తిట్టుకుంటూ చెప్పకూడదు అమ్మా” అన్నాడు అమర్.

“సరే లేరా! ఇప్పుడేమైంది.. నిన్ను జాబ్ చేయమని చెప్పాడు.. అంతే కదా. నువ్వు జాబ్ చేయి” అంది అమర్ అమ్మ గారు.

“నాకు నచ్చాలి కదా అమ్మ” అన్నాడు అమర్.

“ముందు నువ్వు వెళితేనే కదా తెలుస్తుంది నచ్చుతుందో లేదో” అంది అమర్ అమ్మ గారు.

“సరే వెళ్తాను. నాకు నచ్చక పోతే జాబ్ వదిలేస్తాను” అన్నాడు అమర్.

“సరే రా.. నీ ఇష్టం. ముందు అయితే నువ్వు జాబ్ కోసం వెళ్ళు. నచ్చక పోతే వదిలేస్తువు గానీ” అంది అమర్ అమ్మ గారు.

“సరే అమ్మా” అంటూ తన మిత్రుడు అయిన హరీష్ కు కాల్ చేసి “ఇంటికి రారా. జాబ్ ఇంటర్వ్యూ కి వెళ్లాలి” అన్నాడు అమర్.

“సరే రా. నేను వస్తున్నాను. పది నిమిషాలు ఉండు” అన్నాడు హరీష్.

‘సరే’ అన్నాడు అమర్.

పది నిమిషాల తరువాత హరీష్ వచ్చి “రారా పోదాం ఇంటర్వ్యూ కి” అన్నాడు. వెళ్తూ మధ్యలో హరీష్ ఇలా అన్నాడు “అరే! నువ్వు అసలు జాబ్ చేయను అని చెప్పేవాడివి కదరా.. మరి ఇప్పుడెందుకు వెళ్తున్నావు” అన్నాడు.

“ ఏమి లేదురా. ఇంట్లో వాళ్ళు చేయాలని పట్టు పట్టి బలవంతం చేస్తే సరే అని చెప్పి వస్తున్నాను” అన్నాడు అమర్.

“అదంతా బాగుంది కానీ నీవు ఏమి అనుకుంటున్నావు మీ వాళ్ళ గురించి?” అన్నాడు హరీష్.

“ఏమి అనుకుంటాను రా.. వాళ్ళ బరువు దింపుకోవాలి అనుకుంటున్నారు. తొందరగా నేను జాబ్ లో జాయిన్ అయితే డబ్బులు వస్తాయి కదా! అంతే కాకుండా తొందరగా పెళ్లి చేసి కష్టాలలో తోయాలి అనుకుంటున్నారు” అన్నాడు అమర్.

“అలా ఎందుకు అంటున్నావు రా! వాళ్ళు చెప్పేది నీ సంతోషం కోసం కదా రా. నువ్వు తొందరగా జీవితంలో బలపడితే వాళ్ళు ఉన్నపుడే పెళ్లి చేసి మీ పిల్లలకు వచ్చే సమస్యలను వాళ్ళు పరిష్కరించేందుకు కృషి చేస్తారు. అందుకనే వాళ్ళు తొందరగా స్థిరపడాలని అంటారు. అంతే గానీ మరే ఇతర కారణాల వల్ల అయితే కాదురా అమర్” అన్నాడు హరీష్.

“అదేం లేదు రా. వాళ్ళు అంతే! మనలను అర్థం చేసుకోరు. వాళ్ళ మాటనే జరగాలి.. నెగ్గాలి అంటారు” అన్నాడు అమర్.

“వాళ్ళు చెప్పింది చేస్తే తొందరగా స్థిరపడతావు. అందువల్ల ఎటువంటి సమస్యలు వచ్చినా తట్టుకోగలవు అనే ధైర్యం తో చెపుతారు. అంతే! అది కన్న ప్రేమ రా. మనకి ఇప్పుడు వాళ్ళు ఎన్ని చెప్పినా అర్థం కాదు, వాళ్ళు లేని సమయంలో అర్థం అవుతుంది ఎందుకు చెప్పునారో అనే విషయం” అన్నాడు హరీష్.

“సరే రా.. నిజమే కావచ్చు. మరి నన్ను ఇప్పుడు ఏమి చేయాలి అంటావు చెప్పు?” అన్నాడు అమర్. “ఏమి లేదురా వాళ్ళు చెప్పిన విధంగానే జాబ్ సాధించి, అందులో జాయిన్ అవ్వు. తరువాత వాళ్ళు ఎంత సంతోషపడతారో నీకు అర్థం అవుతుంది” అన్నాడు హరీష్.

“సరే రా” అన్నాడు అమర్. జాబ్ వచ్చింది ఇంటికి వెళ్ళి తన తల్లదండ్రులకి జాబ్ వచ్చిన సంగతి

చెప్పాడు అమర్.

అప్పుడు తన తండ్రి “ఏమైనా బాధపడ్డావా? నేను నీ సంతోషం కోసం చెప్పినా..

అంతే! ఇంకేమి లేదు. నిన్ను కష్టపెట్టాలనీ కాదు. మీరు మా ప్రాణం రా! మీరు బాధపడితే మేము ఎలా సంతోషంగా ఉంటాము రా?” అన్నాడు అమర్ నాన్న గారు.

“సరే నాన్న! నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాను” అన్నాడు అమర్.

“నువ్వు మమ్మల్ని బాధపెట్టడం ఏమిటి రా? అలా ఏమి లేదు. ఏమి మనస్సులో పెట్టుకోకుండా జాగ్రత్తగా జాబ్ చేసుకో” అన్నాడు అమర్ తండ్రి గారు.

“సరే నాన్న” అని అమర్ బయటికి వచ్చి తన మిత్రుడు తో “నువ్వు చెప్పింది నిజమే రా, నాకు అర్థం అయింది. ఇకనుంచి వాళ్ళు చేపిన పని చేస్తాను” అని చెప్పి వెళ్ళిపోయాడు అమర్. ఈ విధంగా తన తల్లిదండ్రుల కన్న ప్రేమను అర్థం చేసుకున్నాడు అమర్.

సర్వే జనా సుఖినోభవంతు

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

నీ కాళ్ళ మీద నీవు నిలబడు

ఆత్మాభిమానం

ప్రాముఖ్యత దేనికి

ఉపాయం

దృఢ సంకల్పం

డబ్బు విలువ

పెళ్లి చూపుల సందడి

కష్టం సుఖం

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు

ఈ కథకు మీరే పేరు పెట్టండి

నిర్లక్ష్యం

ఆసక్తి

కష్టం విలువ

కాకి ఆవేదన

రచయిత పరిచయం :

నా పేరు: కిడాల శివకృష్ణ.

వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.

నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.



55 views0 comments
bottom of page