top of page

ఆత్మాభిమానం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Athmabhimanam' Written By Kidala Sivakrishna

రచన: కిడాల శివకృష్ణ

ఆత్మాభిమానం చేసే పని మీద ఆధారపడదు.

మనం ఆ పనిని గౌరవించడంలో ఉంటుంది అని తెలియజెప్పే ఈ కథను యువ రచయిత కిడాల శివకృష్ణ గారు రచించారు


అతడి పేరు నందగోపాల్, అతడు వ్యవసాయం చేస్తూ తన జీవితాన్ని గడిపేవాడు. అలా అని అతడు చదువుకోలేదు అనుకోకండి. ‘అగ్రికల్చరల్ బీఎస్సీ( Ag. BSc) చేశాడు. అంత చదివినా పొగరు మాత్రం ఆవగింజంత కూడా లేదు అంటే ఎంత వినయ విధేయతలు కలిగిన వాడో మనం అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా కొన్ని రోజులు వేరే ప్రాంతంలో ఉద్యోగం చేసి ఇంటికి తిరిగి వచ్చాడు.


అలాంటి వ్యక్తి తన పని ఏదో తను చేసుకుంటూ ఉంటే గ్రామంలో ఉండే ప్రజలు

‘నందా కి పని చేయడం చేతకాక వచ్చాడు’ అని కొందరూ,

‘పని చేస్తాడు కానీ అక్కడ ఉండలేక వచ్చాడు’ అని మరి కొందరు అనేవారు.

‘సరే.. పని చేయడం చేత అవుతుంది అనుకుంటే వెళ్లి చేయవచ్చు కదా’ అని మరికొందరి అభిప్రాయం.


ఇదిలా ఉంటే నందగోపాల్ కి మిత్రుడు అయిన హరీష్ కు ఈ విషయం గురించి తెలిసింది, హరీష్ నందగోపాల్ దగ్గరికి వచ్చి “ఊరిలో కొంతమంది నీకు పని చేయడం చేతకాక వచ్చావు అని అనుకుంటున్నారు, మరికొందరు పని చేయడం చేత అయినా అక్కడ ఉండలేక వచ్చావు అని అనుకుంటున్నారు” అన్నాడు.

“నువ్వేమి అనుకుంటున్నావు రా హరీష్?” అన్నాడు నందగోపాల్.

“అవును.. వాళ్ళు వీళ్ళు కాదు, నేను అడుగుతున్నాను. నువ్వు ఎందుకు జాబ్ మానేసి వచ్చావు రా నందగోపాల్?” అన్నాడు హరీష్.

“అంటే.. దాని గురించి ఎందుకులేరా..! సమయం వచ్చినప్పుడు నేనే నీతో చెపుతాను” అన్నాడు నందగోపాల్.


“అదంతా కాదురా! నాకు ఇప్పుడే చెప్పాలి” అన్నాడు హరీష్.

“తరువాత చెపుతాను అన్నాను కదరా” అన్నాడు నందగోపాల్.

“కొంపతీసి క్రైమ్ సినిమాలలో చూపించే విధంగా ఏమైనా తప్పుడు పనులు చేసి నువ్వు ఇక్కడికి వచ్చావా?” అన్నాడు హరీష్.

“లేదురా నేను ఏలాంటి వాడినో నీకు తెలియదట్రా” అన్నాడు నందగోపాల్.

“నువ్వు ఇప్పుడు సరైన సమాధానం చెప్పకపోతే ఏమి అయినా అనుకోవాల్సి వస్తోంది” అన్నాడు హరీష్.


“ఏంలేదురా. నాకు వ్యవసాయం చేయడం అంటే ఇష్టం అందుకే జాబ్ వదిలేసి వచ్చాను” అన్నాడు నందగోపాల్.

“ఈ విషయం నేను నమ్మాలా?” అన్నాడు హరీష్.

“నాకు నువ్వు ప్రాణ స్నేహితుడివి రా. నీకు నేను ఎందుకు అబద్దం చెపుతాను చెప్పు” అన్నాడు నందగోపాల్.

“నేను నమ్ముతాను సార్! ఊరిలో జనాలు ఏమనుకుంటారు? వాళ్ళ నోళ్ళు మూయించడం ఎలా రా” అన్నాడు హరీష్.


“వాళ్ళు ఎపుడూ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు గానీ నువ్వేమి అనుకుంటున్నావు అనేది నాకు అవసరం రా హరీష్” అన్నాడు నందగోపాల్.

“అదంతా సరే గానీ నీకు అంత మంచి జాబ్ వదిలేసి వచ్చినందుకు బాధగా లేదట్రా? ఇక్కడ నీ ఆత్మాభిమానాన్ని వదులుకొని ఎలా కాలం గడుపుతున్నావు రా” అన్నాడు హరీష్.


“నిజానికి చెప్పాలంటే నాకు ఇక్కడే ఆత్మాభిమానం పెరిగింది. ఎందుకు అని అంటే ఇక్కడ ఎవ్వరి క్రిందా పనిచేయాల్సిన అవసరం లేదు. నా పని నేను చేసుకుంటున్నాను. నాకు నేను బాస్, నాకు నేనే వర్కర్. అదే అక్కడ అయితే నాకు పైన ఒక బాస్ ఉంటాడు, నాకు ఖచ్చితంగా పని పూర్తి చేయాలి అని ఒక టార్గెట్ ఉండేది. దాని వల్ల నాకు మనశ్శాంతి కరువైంది. నిజానికి చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అంతే కాకుండా ఇతరులకు కీడు తలపెట్టకుండా ఎవ్వడి పనిని వాడు గొప్పగా ఫీల్ అయి చేస్తే చాలు, ఏ పని చేస్తున్నా సిగ్గు పడాల్సిన అవసరం లేదు.


ఎవడి పని వాడికి గొప్ప. అంతే కానీ వాళ్ళు ఏమి అనుకుంటారో.. వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటూ ఉంటే మనం జీవితంలో సంతోషంగా జీవించలేము, వాళ్ళు ఎపుడూ ఏదో అనుకుంటూనే ఉంటారు” అన్నాడు నందగోపాల్.


“నువ్వు చెప్పింది నిజమే రా. సరే నేను వెళ్ళొస్తాను” అని వెళ్ళిపోయాడు హరీష్.

సర్వే జనా సుఖినోభవంతు

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :

నా పేరు: కిడాల శివకృష్ణ.

వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.

నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.


217 views0 comments
bottom of page