కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Ni Kalla Mida Nivu Nilabadu' Written By Kidala Sivakrishna
రచన: కిడాల శివకృష్ణ
స్వంతగా బతికే నేర్పరితనం, ఆస్తిపాస్తులకన్నా ముఖ్యమని తెలియజేసే ఈ కథను యువ రచయిత కిడాల శివకృష్ణ గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
ఇక కథ ప్రారంభిద్దాం
R 15 బైక్ తీసుకొని 90 స్వీడ్ లో వచ్చి మా దగ్గర నిలబెట్టి ఒక్కసారిగా బైక్ ని గట్టిగా
అరిపించాడు.
తరువాత బైక్ మీద నుంచి దిగి “ఏరా బయట కూర్చున్నారు? రండి లోపలికి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేద్దాం. లేకపోతే మీరు ‘జీవితంలో సంతోషంగా గడిపిన క్షణాలు ఎప్పుడు’ అని గుర్తు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది చూడండి” అంటూ కొంచం ఎగతాళిగా మాట్లాడాడు మా మిత్రుడు స్వరూప్.
“నువ్వు చెప్పింది నిజమే కానీ నీకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు?” అన్నాను నేను.
“వాడికి ఎవరో డబ్బులు ఇవాల్సిన అవసరం ఏముంది రా? వాడి దగ్గర డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్ చాలా ఉన్నాయి” అన్నాడు నా మిత్రుడు విశ్వం.
“సరే.. వాడి దగ్గర చాలా డబ్బు ఉంది అంటున్నావు, బాగానే ఉంది. కానీ ఆ డబ్బు ఎవ్వరిది విశ్వం?” అన్నాడు మా మిత్రుడు రాఘవ్.
“అదే కదరా నేను అడిగేది రాఘవ్” అన్నాను నేను.
“అది కాదురా తేజ, నీకు వాడి గురించి అర్థం కాలేదు. వాడు బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టిన వాడు. వాడు తిని తిరుగుతూ ఉంటే చాలు” అన్నాడు విశ్వం.
“సరే రా! నువ్వు చెప్పింది నిజమే. కాదు అనడం లేదు విశ్వం! వాడు బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టిన వాడు కావచ్చు. కాకపోతే నేను సంపాదించిన డబ్బులు నేను ఖర్చు పెడుతున్నాను, ఇంకా నాకు డబ్బు సంపాదించే శక్తి సామర్థ్యాలు, వాటికి అవసరమైన మార్గాలు తెలుసు. మరి స్వరూప్ కి ఏమి తెలుసు? ఇంతవరకు ఎంత డబ్బులు సంపాదించాడు? పోనీ వాడికి డబ్బును సంపాదించే శక్తి సామర్థ్యాలు, మార్గాలు ఓపిక ఉన్నాయా అని అంటున్నాను?” అన్నాను నేను.
“వాడికి డబ్బు సంపాదించాలి అంటే సవాలక్ష మార్గాలు వాళ్ళ వాళ్ళు చూపిస్తారు, వాడికి వాడంతట వాడే కష్ట పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదురా తేజ” అన్నాడు విశ్వం.
“స్వరూప్! నీకు ఎవరు జాబ్ చూస్తారు రా?” అన్నాను నేను.
“నాకు జాబ్ మా అత్త, అన్న, నాన్న చూస్తారు రా తేజ” అన్నాడు స్వరూప్.
“సరే! మీ అత్తమ్మకు మీకు ఏవో గొడవలు పడి కొంచెం దూరం అయ్యారు అనుకో. అప్పుడు ఏమి పరిస్థితి?” అన్నాను నేను.
అంటే “అదేమిరా.. మా నాన్న ఉంటాడు కదా” అన్నాడు స్వరూప్.
“సరే.. మీ నాన్న బయటికి రాలేని పరిస్థితి లేక మరే ఇతర కారణాల వల్ల అయినా చూడలేక పోతే అప్పుడు ఎలా” అన్నాను నేను.
“అంటే మా అన్నయ ఉంటాడు కదా! మా అన్నయ్య చూస్తాడు”
“మీ అన్నయకు పెళ్లి జరిగి మీతో విడిపోతే.. లేక అందరూ కలసి ఉన్నా నీకు జాబ్ చూసేందుకు మీ వదిన వల్ల గానీ మరే ఇతర కారణాల వల్ల గానీ జాబ్ చూడకపోతే, లేక చూడలేకపోతే అప్పుడు ఏమిచేస్తావు” అన్నాను నేను.
“అంటే వాడికి చాలా డబ్బు ఉంది కదా, అంతే కాకుండా ఆస్తి కూడా చాలా ఉంది” అన్నాడు విశ్వం. “సరే! నీకు ఆ ఆస్తిని రెట్టింపు చేయడం పక్కన పెట్టీ ఎలా నిలుపుకోవాలి.. ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా స్వరూప్?” అన్నాను నేను.
“ప్రణాళికలు ఏముంది? డబ్బుతో ఏదో ఒకటి చేస్తాను. ఉంటే ఉంటాది పోతే పోతాది. అంతే” అన్నాడు స్వరూప్.
“అంటే నీకు స్వతహాగా ఏ విధమైన ఆలోచన లేదు అన్నమాట” అన్నాను నేను.
“అంతే కదా! నాకు నువ్వు చెప్పిన విధంగా అయితే జరగదు కదా తేజ” అన్నాడు స్వరూప్.
“జరగకపోవచ్చు కానీ నీకంటూ ఒక బలం అనేది ఏర్పరచుకోవాలి కదా! వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చెస్తారులే, అనే ఆలోచన కాకుండా నీకంటూ ఒక స్వీయ నిర్ణయం తీసుకునే శక్తి సామర్థ్యాలు ఉండాలి కదా, నీ కాళ్ళ మీద నీవు నిలబడే సత్తా నీలో ఉండాలి కదా, ఎవరి తోడూ లేక పోయినా నీవు నడవ గలిగె శక్తి సామర్థ్యాలు ఉండాలి. అప్పుడే జీవితంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది అని నేను చెపుతున్నాను స్వరూప్” అన్నాను నేను.
“ సరే మరి. నేను నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఇప్పుడు నన్ను ఏమి చేయాలి అంటావు తేజ” అన్నాడు స్వరూప్..
“ఈ సినిమాలు, షికార్లు, జల్సాలు పక్కన పెట్టీ బ్రతుకు తెరువు గురించి అలోచించు. ఎందుకంటే మనం చిన్న పిల్లలం కాదు కదా. మనకి పాతిక సంవత్సరాల వయస్సు వచ్చింది. అందుకే చెపుతున్నాను స్వరూప్” అన్నాను నేను.
“సరే తేజ! నేను నువ్వు చెప్పినట్లే చేస్తాను. మరి నేను వెళ్తున్నాను” అని చెప్పి వెళ్ళిపోయాడు స్వరూప్.
స్వరూప్ వెళ్ళిన తర్వాత “అరే.. వాడు బాధ పడుతాడేమో రా” అన్నాడు విశ్వం.
“వాడు ఇప్పుడు బాధపడినా పరవాలేదు కానీ జీవితం మొత్తం బాధ పడకూడదు కాబట్టే చెప్పాను. ఎందుకు అంటే వాడు బాధపడితే నేను చూడలేను రా. అందుకే ఇలా చెప్పాను, అంతే కాకుండా నేను చెప్పింది అక్షరాలా నూటికి నూరుశాతం నిజమే రా. ఏమంటావ్?” అన్నాను నేను.
“నిజమే రా! నేను వెళ్లోస్తాను తేజ” అన్నాడు విశ్వం.
“సరే.. నేను కూడా వెళ్ళాలి” అనీ అందరం ఎవ్వరింటికి వాళ్ళం వెళ్లిపోయాము.
సర్వే జనా సుఖినోభవంతు
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
నా పేరు: కిడాల శివకృష్ణ.
వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.
నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
Comments