top of page

అవమానం - సాధన - విజయం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.




Video link

'Avamanam Sadhana Vijayam' New Telugu Story Written By Kidala Sivakrishna

రచన: కిడాల శివకృష్ణ


నా పేరు కిషోర్, నా మిత్రుడి పేరు మహర్షి.

మేము పదవ తరగతి చదువుతున్న రోజుల్లో…

అవి మరచిపోలేని రోజులు. మహర్షి ప్రతి పరీక్ష బాగా రాసేవాడు. అన్నింటిలోనూ మంచి మార్కులు తెచ్చుకునేవాడు. అయితే సడన్ గా ఒక రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో కొంత మంది పిల్లలు బాగా మాట్లాడారు.


కొంత సమయానికి మహర్షిని మా మాస్టర్ లేపి “నువ్వు కూడా మాట్లాడు. బాగా పరీక్షలు రాస్తావు. మంచి మార్కులు సంపాదిస్తావు కదా! నువ్వు కూడా మాట్లాడితే బాగుంటుంది” అన్నాడు.


“సరే సార్!” అనీ స్టేజ్ పైకి వెళ్ళాడు మహర్షి. అక్కడ ఒక్కసారిగా అందరినీ చూసే సరికి మహర్షి భయపడిపోయాడు. ఎందుకంటే మహర్షి ఎపుడూ కూడా స్టేజ్ ఎక్కింది లేదు. ఎపుడైనా ఒకరి ఇద్దరి మధ్య మాట్లాడుతాడు. ఎక్కువ మంది ఉన్నపుడు సరిగ్గా మాట్లాడే వాడు కాదు. అందుచేత మహర్షికి భయమేసేసరికి, మాట్లాడలేక పోవడంతో చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వడం మొదలు పెట్టారు. ఆ నవ్వులను చూసిన మహర్షి, కళ్ళలో సముద్రాన్ని తలపించేలా నీటిని నింపాడు. బాధతో క్రిందకి దిగి సైలెంట్ గా కూర్చుండి పోయాడు.


అప్పుడు చాలా మంది మహర్షిని ఎగతాళి చేశారు. స్టేజ్ పైన జరిగిన అవమానానికి మహర్షి కుమిలి పోతుంటే బయట వారు దెబ్బ మీద కారం చల్లినట్లుగా చేయడాన్ని మహర్షి జీర్ణించుకోలేకపోయాడు. ఎలా అయినా సరే అందరి ముందర బాగా మాట్లాడి ‘శబాష్’ అనిపించుకోవాలి, పోయిన పరువును తిరిగి సంపాదించాలి అని అనుకున్నాడు. మరీ ఎలా చేయాలి ఆ విధంగా అని ఆలోచిస్తూ 'ప్రతి రోజూ మాట్లాడటం మొదలు పెట్టాలి నేను. నేను మాట్లాడేటప్పుడు ఎవరైనా మాట్లాడకుండా వినాలి. అంత బాగా మాట్లాడాలి' అని నిర్ణయించుకున్నాడు. అందుకోసం 'ప్రతి రోజూ ఉదయం సాయంత్రం సాధన చేయాలి', అనుకుంటూ ప్రతి రోజూ ఉదయం సాయంత్రం ఒక్కడే మాట్లాడటం మొదలు పెట్టాడు ఇంటి దగ్గర.


అలా నెల రోజుల తరువాత, తమ తరగతి గదిలో మాట్లాడటం మొదలు పెట్టాడు. తరగతి గదిలో మాస్టార్లు ఎవరూ లేరు అంటే బోర్డ్ దగ్గరకి వెళ్ళడం, మాట్లాడటం.. ఏదైనా ఒక అంశం తీసుకుని చర్చించడం, వివరించడం లాంటివి చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి. కొన్నాళ్లకు ఫేర్వెల్ పార్టీ చేసుకోవడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. అక్కడ పాటలు పాడేవారు, ఆటలు ఆడేవారు, మాట్లాడే వారు పేర్లు రాయిస్తున్నారు.


అక్కడకి వెళ్ళి మహర్షి “నా పేరు కూడా రాసుకోండి. నేను కూడా మాట్లాడుతాను” అన్నాడు.

“నువ్వా! నీ కోసం సమయం కేటాయించడం చాలా వేస్ట్” అన్నారు కొంతమంది.


కాకపోతే సార్ వాళ్ళు, “రాయండి” అన్నారు.


అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాట్లాడే వారికి అవకాశం కల్పించారు. అప్పుడు మహర్షి స్టేజ్ పైకి ఎక్కి నిల్చున్నాడు. చిన్నగా మాట్లాడటం మొదలు పెట్టాడు, మొదట్లో మాట్లాడే సమయంలో కొంత భయంతో గొంతులో వణుకు పుట్టినా మాట్లాడే కొద్దీ భయం తగ్గుముఖం పట్టింది. బాగా మాట్లాడాడు. అందరూ మెచ్చుకున్నారు.


సార్ వాళ్ళు “నువ్వు బాగా మాట్లాడుతున్నావు. కొన్ని అంశాలను బాగా తెలుసుకొని కొన్ని సమావేశాలలో వాటి గురించి మాట్లాడు. మంచి భవిష్యత్తు ఉంటుంది” అన్నారు.


“సరే సార్” అన్నాడు మహర్షి. మహర్షి బాగా మాట్లాడటం ద్వారా అతడిని మోటివేషన్ ఇచ్చే స్వీకర్ గా ప్రతి మీటింగ్ కు డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటున్నారు. ఆ విధంగా వాడు ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. ఆ రోజు మహర్షి ఆ మీటింగ్ అవమాన పడకపోయి ఉంటే ఈ రోజు ఇంత గొప్ప స్థాయిలో ఉండడు, అందుకోసం చాలా సాధన చేశాడు, గొప్పగా విజయం సాధించాడు.

అందుకే చాలా మంది అంటుంటారు ‘అవమానం పదును పెట్టినంతగా పొగడ్తలు పదును పెట్టలేవు. సాధన చేస్తూ ఉంటే రానిది ఏమి లేదు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని అడుగులు వేస్తే తప్పక లక్ష్యాన్ని చేరుకుంటారు.. విజయం సాధిస్తారు’ అని.


సర్వే జనా సుఖినోభవంతు

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :

నా పేరు: కిడాల శివకృష్ణ.

వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.

నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.



101 views0 comments
bottom of page