top of page

తప్పు బయట పడాల్సిందే

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Thappu Bayata Padalsinde' New Telugu Story Written By Kidala Sivakrishna

రచన: కిడాల శివకృష్ణ

‘మనం తప్పులు చేస్తూ తప్పించుకుంటూ ఉంటే ఎప్పటికైనా ఆ తప్పు

తెలియాల్సిందే. మనం బయట పడాల్సిందే!’ అని మా సోషల్ మాస్టారు చెబుతుండే వాడు.

అది కాస్తా నా మిత్రుడి అనుభవం ద్వారా నిజమని నిరూపించబడింది.

అదెలాగో తెలుసుకుందాం రండి.

భాస్కర్ అనే వ్యక్తి నా మిత్రుడు. అతడు మార్కెట్ ఫీల్డ్ లో సేల్స్ ఆఫీసర్ గా పని చేసే

వాడు. మొదట్లో అతడు చాలా బాగా పని చేసేవాడు. అతడు దాదాపు ఒక సంవత్సరం కాలం వరకు

ఒక్క తప్పుడు పని కానీ, మిస్టేక్స్ గానీ లేకుండా పని చేశాడు. అతడి పనితనం చూసి టీమ్

లీడర్ గా ప్రమోట్ చేశారు. దానితో అతడికి సాలరీ పెరిగింది. పని తగ్గింది కానీ బాధ్యతలు విపరీతంగా పెరిగాయి.

అయితే భాస్కర్ సంవత్సరం పాటు బాగా పని చేశాడు. దాని తరువాత అతడికి కొంచెం పొగరు, నిర్లక్షం పెరగడంతో పాటుగా కొంత దుర్భుద్ధి కూడా పెరిగింది. దానితో అతడు తన టీమ్ వాళ్ళతోనే అన్ని పనులు చేయిస్తూ కొంత వరకు కంపెనీని మోసం చేయడం ప్రారంభించాడు. అంటే వస్తువులు ఎక్కువ ధరలకు అమ్మడం, తరువాత కొన్ని వస్తువులను ఎవ్వరికీ తెలియకుండా అమ్ముకోవడం.. లాంటి పనులు చేసేవాడు.

తప్పులు మీద తప్పులు, మోసం మీద మోసం చేస్తూ కంపెనీకి లాస్ తెచ్చి పెట్టాడు. అలా నెలలు గడిచి ఇయర్ ఎండింగ్ వచ్చింది. అప్పుడు మేనేజర్ విజిటింగ్ కోసం వచ్చారు. ఆ సమయంలో మేనేజర్ కి సందేహం వచ్చింది.

ఆయన ఆ సందేహంతో “స్టాక్ మొత్తం కరెక్ట్ గా ఉందా?” అని అడిగాడు.

అప్పుడు భాస్కర్ “కరెక్ట్ గానే ఉంది సార్! ఏమీ పరవాలేదు. నేను చూసుకుంటాను” అన్నాడు.

ఆ మాటలు విన్న మేనేజర్, “లేదు భాస్కర్! స్టాక్ ని కౌంట్ చేద్దాం” అన్నాడు.

“లేదు సార్! అవసరం లేదు. నేను ఉన్నాను కదా” అని మేనేజ్ చేశాడు భాస్కర్. ఐనా మానేజర్ కి సందేహం తీరలేదు. అందుకనే తరువాత రెండు రోజులకు స్టాక్ ఇంచార్జ్ ని కౌంటింగ్ కి పంపాడు.

స్టాక్ ఇంచార్జ్ వెళ్ళి “స్టాక్ కౌంట్ చేయాలి” అన్నాడు.

“అవసరం లేదు సార్! నేను చూసుకుంటాను” అన్నాడు భాస్కర్.

“నాకు అదంతా తెలియదు భాస్కర్! సార్ వాళ్ళు నన్ను స్టాక్ వెరిఫై చెయ్యమన్నారు. నేను చేయాల్సిందే” అన్నాడు ఇంచార్జ్.

“సరే సార్! చేయండి” అన్నాడు భాస్కర్.

చేస్తూ ఉంటే చాలా వస్తువులు తక్కువ వచ్చాయి. ఇంచార్జ్ వెళ్ళి ఆ తక్కువ వచ్చిన వస్తువుల గురించి చెప్పేశాడు. వెంటనే భాస్కర్ ని ఆఫీస్ కి పిలిపించుకున్నారు.

“ఏమిటిది భాస్కర్? లాస్ట్ టైం నేను వచ్చినపుడు అంతా ఫర్ఫెక్ట్ గా ఉంది అన్నావుగా.. మరెందుకు

ఇప్పుడు ఇంత మోసం… ఇన్ని అబద్ధాలా..” అన్నాడు మేనేజర్.

“సార్! అది..” అని అబద్ధాలు చెప్పబోయాడు భాస్కర్.

“ఐనా నువ్వు తప్పు చేస్తున్న సమయంలో నీకు తెలియదా?? తప్పు ఎప్పటికైనా బయట పడుతుందని” అన్నాడు మేనేజర్.

నాది తప్పయింది సార్! ఇంకోసారి ఇలా చేయను. ఇక మీదట పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతాను” అన్నాడు భాస్కర్.

“నిజానికి నిన్ను జాబ్ నుంచి తీసేయాల్సింది కానీ నువ్వు ఇంతకు మునుపు బాగా పని చేశావు కాబట్టి

ఈ ఒక్కసారి అవకాశం ఇస్తున్నాము. ఇక మీదట ఇలా జరిగితే అంతటికీ బాధ్యత వహించి డబ్బు కట్టి జాబ్ ను వదిలి పోవాల్సి ఉంటుంది” అని చెప్పారు.

“సరే సార్” అని భాస్కర్ తన పనిలోకి వెళ్ళిపోయాడు. బాగా ఆలోచించి జరిగింది గుర్తు చేసుకుని చాలా బాధపడ్డాడు. అప్పుడు తెలుసుకున్నాడు.. ‘మోసం గానీ, తప్పు పనులు గానీ ఎంత దాచాలని అనుకున్నా అవి దాగవు. బయట పడతాయి. మోసం చేస్తే ఆటోమేటిక్ గా తప్పుడు మాటలు చెప్పాలి. అదే మనం నిజాయితీగా ఉంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు’ అనీ.

చూశారు కదా మిత్రులారా.. ఈ విధంగా నేను, ‘తప్పులు చేస్తే ఖచ్చితంగా బయటపడతాయి’ అనే

విషయం గురించి తెలుసుకున్నాను.

అందుకనే అన్నారు మన పెద్దలు ‘తప్పులు చేయకు.. తిప్పలు పడకు అనీ....!!!! ‘

సర్వే జనా సుఖినోభవంతు

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :

నా పేరు: కిడాల శివకృష్ణ.

వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.

నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.


35 views0 comments
bottom of page