top of page

నిజం తెలుసుకోండి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Video link

'Nijam Thelusukondi' New Telugu Story Written By Kidala Sivakrishna

రచన: కిడాల శివకృష్ణ


ఆఫీస్ లో చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు విఫలమై కిరణ్ ను జాబ్ లో నుంచి తప్పించ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కిరణ్ చాలా బాధపడుతున్నాడు జాబ్ పోయినందుకు. ఎందుకంటే అతడికి చాలా దగ్గరగా ఉన్న అంటే వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉన్న కంపెనీలోనే ఉద్యోగం కదా! తిరగడానికి ఇతర విషయాలకు అనుకూలంగా ఉండేది.

అయితే తనేదో తప్పు చేస్తే వెళ్లాల్సి వస్తే అంత బాధ ఉండేది కాదేమో, ఎవరి మాటలో విని మానేజర్ కిరణ్ ను జాబ్ కు రిజైన్ చేయమనడమే అతడిని చాలా కంటతడి పెట్టిస్తున్న విషయం. అయితే ఇంతలో తన కొలీగ్ మంజు వచ్చాడు.

వచ్చి బాధపడుతూ కూర్చున్న కిరణ్ ను “ఎందుకు ఇక్కడ కూర్చొని బాధ పడుతున్నావు?”

అని అడిగాడు.

అప్పుడు కిరణ్ “నన్ను జాబ్ కి రిజైన్ చేయమని మానేజర్ చెప్పాడు. నా మీద ఎవరో

తప్పుడు అభిప్రాయం కలిగేలా చెప్పారంటా. అందుకోసం ఇక్కడ ఆలోచిస్తూ కూర్చున్నా!” అని

చెప్పాడు.

“నీ గురించి అలా చెప్పే అవసరం ఎవరికి ఉంది చెప్పు? ఇంతకీ ఏమని చెప్పారట నీ

గురించి” అన్నాడు మంజు.

“పని సరిగ్గా చేయడం లేదని, వేరే విషయాలకు ఎక్కువగా సమయం కేటాయిస్తున్నానని, ఎవ్వరికీ సరిగ్గా సమాధానం ఇవ్వడం లేదని చెప్పారట” అన్నాడు కిరణ్.

“అవును మానేజర్ కి తెలియదా నీవు ఎలాంటి వాడివి అనే విషయం?” అన్నాడు మంజు.

“ నేను అదే మాట అడిగాను. కాకపోతే ఒక్కసారి బ్యాడ్ గా కంప్లైంట్ వెళ్ళిన తరువాత నేను ఏమి చేయలేను అన్నాడు రా మంజు” అన్నాడు కిరణ్.

“సరే కిరణ్! మనం మానేజర్ దగ్గరికి వెళ్దాం. ఆయనను అడుగుదాం మీకు ఎవరు చెప్పారు.. నేను చేసిన తప్పేంది? అందుకు సాక్ష్యం ఏమిటి.. అని. సరే నా కిరణ్?” అన్నాడు మంజు.

“సరే రా మంజు! వెళ్దాం” అన్నాడు కిరణ్.

అనుకున్న విధంగానే ఇద్దరూ కలిసి మానేజర్ దగ్గరికి వెళ్లారు. వారి రాకను గమనించిన మానేజర్ “ఏమి ఇలా వచ్చారు మంజు? చెప్పు కిరణ్! ఏమిటి సంగతులు? సంతకం పెట్టినావా రిజైన్ లెటర్ మీద..” అన్నాడు.

“ ఆ విషయం గురించే మాట్లాడడానికి వచ్చాము సార్” అన్నాడు మంజు.

“ఏమి మాట్లాడాలి మంజు? అంతా అయిపోయింది కదా! ఖచ్చితంగా రిజైన్ చేయాల్సిందే.. తప్పదు. ఎందుకంటే అంత బలంగా నెగిటివ్ గా చెప్పారు కిరణ్ మీద” అన్నాడు మానేజర్.

“సరే సార్! ఎవరు చెప్పారు? ఏ తప్పు జరిగిందని చెప్పారు?” అన్నాడు మంజు.

“కిరణ్ తన టీమ్ వాళ్లకు సరిగ్గా సపోర్ట్ చేయడం లేదంట. ఏదైనా సమస్య ఉంటే చూడటం లేదంట” అన్నాడు మానేజర్.

“ఎవరు సార్ చెప్పింది?” అన్నాడు మంజు.

“అవ్వన్నీ చెప్పకూడదు మంజు. కంపెనీ రూల్స్ ఒప్పుకోవు” అన్నాడు మానేజర్.

“సరే సార్! ఎవరో పిలిపించి ఏ విషయంలో సరిగ్గా రెస్పాన్స్ కాలేదు అడగండి ఎదుగానే” అన్నాడు మంజు.

“నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీ ఉద్యోగం కూడా ఊడే అవకాశం ఉంటుంది మంజు” అన్నాడు మానేజర్.

“సరే సార్! కానీ ఒక్కసారి మీరు ఎవరికి రెస్పాన్స్ కాలేదో వారిని పిలిపించి మాట్లాడించి ఎక్కడైనా తప్పు జరిగింది అని నిరూపిస్తే మేము ఇద్దరం రిజైన్ చేసి వెళ్ళిపోతాము” అన్నాడు మంజు.

అప్పుడు వెంటనే “నారాయణని పిలిపించండి” అన్నాడు మానేజర్.

సరే అని నారాయణని పిలిచారు.

“చెప్పు నారాయణ! కిరణ్ ఎందులో నీకు సపోర్ట్ ఇవ్వలేదు?” అన్నాడు మానేజర్.

కిరణ్ మంజు ని అక్కడ చూసిన నారాయణ అబద్ధం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు.

అపుడు మానేజర్ “నిజం చెప్పు” అన్నాడు.

“సార్! మాకు కిరణ్ సపోర్ట్ గానే ఉన్నాడు. కాకపోతే మాకు అవకాశాలు రావు. మేము టీమ్ లీడర్ గా

ఎదగలేము అనే ఆలోచనతో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అంతే కానీ మరే ఇబ్బందులూ లేవు సార్” అన్నాడు నారాయణ.

“సరే! నువు వెళ్ళు నారాయణ” అన్నాడు మానేజర్.

“ఆగు నారాయణ! నీవు చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసా? పొరపాటున మేము ఇక్కడికి రాకపోయినా, అడగకపోయినా ఎంత నష్టం కలుగుతుంది చెప్పు, మా జీవితాలకు” అన్నాడు మంజు.

“ సారీ సార్! తప్పైయింది” అంటూ నారాయణ వెళ్ళిపోయాడు.

“నిజం తెలుసుకొని నిందించాలి సార్. ఊరికే ఎవరు ఏమి చెప్పినా విని గుడ్డిగా

ఫాలో అవ్వకూడదు” అన్నాడు మంజు.

“సరే! మీరు వెళ్లి మీ వర్క్ చేసుకోండి” అన్నాడు మానేజర్.

“అలా కాదు సార్! మీరు ఎవరు ఏమి చెప్పినా నమ్మకూడదు. దాని గురించి పూర్తిగా నిజం తెలుసుకొన్న తరువాతనే నిర్ణయం తీసుకోవాలి. ఊరికే రిజైన్ చేయండి అంటే పద్ధతి కాదు. ఇంకా చెప్పాలంటే చెప్పిన వెంటనే ఎలా నమ్మేస్తారు మీరు? ఎక్కడ విషయాలు అక్కడ మరిచిపొండి. అప్పుడే ఈ సమస్యలు తగ్గుతాయి. మనశ్శాంతిగా ఉంటారు” అన్నాడు మంజు.

“సరెలేవయ్య! చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. పట్టించుకోకూడదు. మీరు ముందు వర్క్ లోకి వెళ్ళండి” అన్నాడు మానేజర్.

“మరి రిజైన్ లెటర్ సార్” అన్నాడు మంజు.

“అవ్వన్నీ మీ కళ్లముందే చింపేస్తున్నాను. వెళ్ళండి. సమస్యేమి లేదు కదా!” అన్నాడు మానేజర్.

“సరే సార్! అని యధావిధిగా వర్క్ లోకి వెళ్లిపోయారు కిరణ్, మంజు ఇద్దరూ....!!!!

అందుకనే అనేది. మన పెద్దవాళ్ళు ఎక్కడ విషయాలు అక్కడ వదిలేయాలి, ఎక్కడ ఉండాల్సిన

వస్తువులు అక్కడ ఉంచాలి అనీ....

సర్వే జనా సుఖినోభవంతు

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :

నా పేరు: కిడాల శివకృష్ణ.

వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.

నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
52 views0 comments

Commentaires


bottom of page