top of page

ఆఖరి చూపు కొరకు ఆఖరి ఉత్తరం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link



'Aakhari Chupu Koraku Aakhari Uttharam' New Telugu Story Written By Kidala Sivakrishna

రచన: కిడాల శివకృష్ణ


కాలింగ్ బెల్ మోగింది.కంగారుగా తలుపులు తెరిచి చూస్తే ఎదురుగా పోస్ట్ మాన్.

చేతిలో కవర్ పట్టుకుని “రాజు అంటే మీరేనా?” అన్నాడు పోస్ట్ మాన్.

“అవును. నేనే చెప్పండి” అన్నాడు రాజు.

“మీకే ఉత్తరం” అన్నాడు పోస్ట్ మాన్.


సరే అని పేపర్ మీద సంతకం చేసి కవర్ని తీసుకున్నాడు రాజు. ఆ కవర్ ఇంటి నుంచి వచ్చింది. కవర్ని ఓపెన్ చేసి చదవనారంభించాడు.

అందులో "నాయనా! మాకు వయస్సు అయిన విషయం మీకు తెలిసిందే. మాకు ఇవి ఆఖరి రోజులు అనిపిస్తోంది. అక్కడ కోడలు, పిల్లలూ క్షేమంగా ఉన్నారా? క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. అన్నట్లు చెప్పడం మరిచిపోయాము. ఇంటికి మరియు ఆస్తులకు సంభంధించిన దస్తావేజులు మీ పేరు మీద తయారుచేయించాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని మీరు తీసుకెళ్ళండి.


నీ సంతోషం కోసం మేము ఏమీ చేయలేకపోయాము. అందుకు మమల్ని క్షమించు. నీవు అడిగిన వాటిని ఇవ్వలేకపోయాము. అందుకు మన్నించు. ఎందుకంటే మేము ఉన్న పరిస్థితుల్లో మీకు అన్నం పెట్టి బ్రతికించుకోవడం మాకు లక్షంగా ఉండేది. కానీ ఆస్తులు కూడబెట్టేంత స్థోమత మాకు లేకపోయింది. నిజానికి చెప్పాలంటే మీరే మాకు ఆస్తిపాస్తులు. ఇదంతా సరే కానీ ఇంతకుముందు పండుగలకు పబ్భాలకి వచ్చేవారు. ఇప్పుడేమి రావడం లేదు? మా మీద కోపంతో రావడం లేదు అని మీ అమ్మ నా మీద కోపడుతుంది.


‘కోపం తగ్గాక వస్తారు’ అని చెప్పి కోపాన్ని చల్లబరిచాను. మీరు ఎలాగైనా సరే ఇంకో వారం రోజుల లోపు ఇంటికి రావాలని అడుగుతున్నాను. ఎందుకంటే అంత కంటే ఎక్కువ రోజులు బ్రతుకుతామో లేదో కూడా అర్థం కావట్లేదు. చనిపోయేలోపు ఆఖరి సారు చూడాలి చూడాలి అని అనుకుంటున్నాము. బహుశా ఇదే ఆఖరి ఉత్తరం కావచ్చు మా వైపు నుంచి.

-కన్నీటి చుక్కలతో నీ కన్నవారు”

అంటూ రాసిన ఉత్తరం చదివి రాజు మనస్సు చిన్నపోయింది. తన తల్లిదండ్రులను, వారు చేసిన కష్టాన్ని ఒక్కసారిగా తలచుకున్నాడు.


‘నాకోసం మా తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు కదా! నేను చాలా సందర్భాలలో వారిని కష్టపెట్టాను’ అనీ ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నాడు రాజు. వెంటనే తమ సొంత గ్రామానికి ప్రయాణమయ్యాడు భార్య పిల్లలతో సహా. ఇంటికి చేరుకున్నారు అందరూ. రాజు యెక్క భార్యా పిల్లలును చూసిన రాజు తల్లిదండ్రులు కంటతడి పెట్టారు. అందరినీ దగ్గరికి తీసుకున్నారు. అప్పటికే నాలుగు రోజులు గడవడంతో రాజు తల్లి నీరసించి మంచం పట్టింది.

“ఓ నాలుగు రోజులు ఉండండి” అంటూ తల్లిదండ్రులు చెప్పడంతో అక్కడే ఉన్నారు రాజు వాళ్ళందరూ.


పిల్లలను చూసిన సంతోషంలో ఒక రోజు ఎక్కువగా బ్రతికిన రాజు తల్లి, “చివరి క్షణంలో మిమ్మల్ని ఆఖరి చూపు చూడకుండానే పోతానని బెంగ ఉండేది. ఇప్పుడు నాకు ఆ బాధ తీరింది. నేను ఇక మరణించినా నాకు ఆనందమే” అంటూ మరణించింది.


వారు మరణించే లోపు రాజు తన తల్లిదండ్రుల ప్రేమని అర్థం చేసుకున్నాడు కాబట్టి, వారిమీద ప్రేమతో వ్యవహరించాడు కాబట్టి, మరణ సమయంలో కూడా వారు సంతోషంగా వెళ్లిపోయారు, అలా కాకుండా అందరిలాగా మూర్ఖత్వంతో ఉంటే… చాలా మంది చేస్తుంటారు కదా తల్లిదండ్రులు మరణించినా ఆఖరి చూపుకు కూడా నోచుకోని వారి లాగా మిగిలిపోయే వానిని..

‘ ఆ విషయములో నేను అదృష్టవంతుడను’ అంటూ ప్రతి ఒక్కరి దగ్గర గర్వంగా చెప్పుకుంటుంటాడు రాజు.


నిజానికి పిల్లల సంతోషం పెద్దలు కోరుకుంటారు. అలాంటప్పుడు పెద్దల సంతోషాన్ని పిల్లలే కదా అర్థం చేసుకోవాల్సింది!


సర్వే జనా సుఖినోభవంతు

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :

నా పేరు: కిడాల శివకృష్ణ.

వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.

నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.






73 views1 comment

1 Comment


kanumala harikrishna • 14 hours ago

Super

Like
bottom of page