top of page
Original.png

నరసింబా

2 hours ago
3 min read

చంద్రవెలుగులో అమ్మమ్మ పిల్లలకు ప్రహ్లాదుడు, నరసింహస్వామి కథ చెబుతున్న దృశ్యం

Narasimba - Telugu Moral Story | Varalakshmi Yanamandra

నరసింబా - తెలుగు నీతి కథ | వరలక్ష్మి యనమండ్ర  

Published in manatelugukathalu.com on 26/11/2026


ప్రహ్లాదుడి అచంచలమైన భక్తి, నిజం కోసం నిలబడే ధైర్యం, అహంకారానికి లభించిన గుణపాఠమే ఈ కథ. పిల్లలకు భక్తి, ధైర్యం, మంచితనం విలువలను సులభంగా తెలియజేసే అందమైన పౌరాణిక కథ ఇది.


ప్రతి రోజూ లాగనే ఆ రాత్రి కూడా ఐదుగురు గడుగ్గాయలూ భోజనాలయ్యాక అరుగుమీద అమ్మమ్మ చుట్టూ చేరారు. చల్లని వెన్నెల, మెల్లగా వీస్తున్న గాలి.


"అమ్మమ్మా! ఈ రోజు ఎవరి కథ?" అడిగాడు మహి.


"ఈ రోజు బాల ప్రహ్లాదుడి కథ చెబుతాను" అంది అమ్మమ్మ.


"ప్రహ్లాదుడా! ఆయనకు విష్ణువు అంటే చాలా ఇష్టం కదా?" అంది మయూఖ.


"అవును తల్లీ. హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. 


చాలా బలవంతుడు, అంతకన్నా గర్విష్టి. 'నేనే దేవుణ్ణి, అందరూ నన్నే పూజించాలి' అనేవాడు."


"అయ్యో! అలా అనకూడదు కదా అమ్మమ్మా" అన్నాడు కార్తికేయ.


"అదే కదా నాన్నా! ఆ రాజు కొడుకే ప్రహ్లాదుడు. చిన్నప్పటి నుంచీ ఎప్పుడూ 'నారాయణా!' అని స్మరించేవాడు. గురువులు 'రాజుగారే దేవుడు అను' అని ఎంత చెప్పినా వినేవాడు కాదు."

"మరి వాళ్ల నాన్నకు కోపం వచ్చిందా?" అడిగింది మహతి.


"చాలా వచ్చింది. 'ఎవరు నీకు ఇది నేర్పారు?' అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఏమన్నాడో తెలుసా? 'నాన్నా! దేవుడు అందరిలోనూ ఉన్నాడు. ఈ ప్రపంచమంతా ఆయనదే' అన్నాడు."


"వావ్! ధైర్యం ఉంది కదా!" అన్నాడు మిట్టు.


"అవును. కోపంతో రాజు ఎన్నో కష్టాలు పెట్టాడు. అయినా ప్రహ్లాదుడు భయపడలేదు. ప్రతిసారీ నారాయణుడే కాపాడాడు."


"ఎలాంటి కష్టాలు పెట్టాడు?" అడిగాడు మిట్టు.


"ఏనుగులతో తొక్కించాడు, లోయలో, సముద్రంలో, అగ్నిలో పడేశాడు, పాములతో కాటు వేయించాడు. కానీ అన్ని ఆపదల నుండి ఆ నారాయణుడే కాపాడాడు."


"మరి చివరికి ఏమైంది అమ్మమ్మా?" ఆత్రంగా అడిగారు పిల్లలు.


"ఒకరోజు రాజు ఎంతో కోపంతో అడిగాడు. 'నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా?' అని. 


ప్రహ్లాదుడు ప్రశాంతంగా 'ఉన్నాడు నాన్నా!' అన్నాడు. రాజు గదతో స్తంభాన్ని కొట్టాడు. అంతే! పెద్ద శబ్దంతో స్తంభం పగిలింది. అందులోంచి సగం సింహం, సగం మనిషి రూపంలో నరసింహస్వామి బయటికి వచ్చాడు!"


"ఓహ్!" అని మయూఖ భయంతో మహతిని పట్టుకుంది.


"భయపడకు తల్లీ. ఆయన చెడ్డవారిని శిక్షించడానికే వచ్చాడు. తర్వాత ప్రహ్లాదుడు చేతులు జోడించగానే నరసింహుడు శాంతించాడు. ప్రహ్లాదుణ్ణి ప్రేమగా ఆశీర్వదించాడు."


"అమ్మమ్మా, ప్రహ్లాదుడు తన నాన్నకు ఎదురు చెప్పాడు కదా! అది తప్పు కాదా?" అని అడిగాడు కార్తికేయ.


అమ్మమ్మ నవ్వింది. "మంచి ప్రశ్న నాన్నా. ప్రహ్లాదుడు ఎప్పుడూ గౌరవంగానే మాట్లాడాడు. కానీ ఏది నిజమో దాన్ని వదల్లేదు. పెద్దలను గౌరవించాలి. అయితే తప్పు దారిలో వెళ్తుంటే, వినయంగా నిజం చెప్పే ధైర్యం కూడా ఉండాలి."


"అంటే ఎవరైనా తప్పు చెప్పమంటే చెప్పకూడదన్నమాట!" అన్నాడు మహి.

"అవును. గర్వం ఎంత బలమైనదైనా ఒకరోజు కూలిపోతుంది. మంచితనం, నమ్మకం ఉన్నవాళ్లకు దేవుడే తోడు ఉంటాడు."


"నేను కూడా ప్రహ్లాదుడిలా ధైర్యంగా ఉంటా!" అన్నాడు మిట్టు.


"అయితే రేపు చీకట్లో ఒక్కడివే మేడ మీదికి వెళ్లు చూద్దాం" అంది మహతి కొంటెగా.

"అమ్మో! అది వేరే!" అని మిట్టు అనగానే అందరూ పకపకా నవ్వారు.


"అమ్మమ్మా! నేను పెద్దయి నరసింబాని అయ్యి, రాత్రిపూట దొంగలను గోళ్లతో చంపేస్తాను" అన్నది మహతి.


"పగలు ఏం చేస్తావురా?" అడిగింది అమ్మమ్మ.


"పగటిపూట స్తంభంలో ఉంటాను" అన్నది మహతి.


మళ్ళీ అందరూ పెద్దగా నవ్వారు.


అమ్మమ్మ ఐదుగురినీ దగ్గరకు తీసుకుంది. "మీరందరూ నా బుజ్జి ప్రహ్లాదులు!"

ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకుమన్నాయి. 'నారాయణా!' అని చిన్నగా తలచుకుంటూ పిల్లలు హాయిగా నిద్రపోయారు.


- వరలక్ష్మి యనమండ్ర ✒️



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y







వరలక్ష్మి యనమండ్ర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



వరలక్ష్మి యనమండ్ర

పరిచయం: వరలక్ష్మి యనమండ్ర

పేరు: శ్రీమతి వరలక్ష్మి యనమండ్ర 

కలం పేరు: లేదు

స్వస్థలం: అద్దంకి,‌ప్రకాశం జిల్లా

ప్రస్తుత నివాసం: హైదరాబాద్ 

వృత్తి: విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని 

విద్యార్హత: యం.ఏ., బి.ఎడ్.


ప్రచురిత రచనలు / పుస్తకాలు: 6 పుస్తకాలు


1. భారత వాణి (బాల సాహిత్యం, బాల పంచపదులు సంపుటి) 

2. వరాల వీరితోట (వంద కవితల సంపుటి) 

3. వరాల గోరుముద్దలు (బాలసాహిత్యం, బాలగేయాల సంపుటి) 

        తెలుగు యూనివర్సిటీ వారు ఈ పుస్తకానికి పదివేల రూపాయల నగదు పారితోషకం ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి పురస్కారం ఈ పుస్తకానికి దక్కింది. 

కొనిరెడ్డి ఫౌండేషన్ వారి జాతీయ పురస్కారం

4. శ్రీ కృష్ణపదులు(200 ఇష్టపదుల సంపుటి) 

5. మిఠాయి పొట్లం (బాల సాహిత్యం,బాలగేయాల సంపుటి)

6. యనమండ్ర మౌక్తికాలు (పాఠశాల విద్యార్థుల కొరకు నీతి పద్య మాలిక) 

          (400 ఆటవెలది పద్య సంపుటీ)

   7. అమ్మమ్మ కథలు (బాల సాహిత్యం, బాలల కథలు) 


అనేక సంకలనాలలో నా కవితలు ప్రచురితమయ్యాయి. 


పొందిన పురస్కారాలు / సత్కారాలు: వివిధ సమూహాల నుండి పలు పురస్కారాలు, సత్కారాలు, బిరుదులు 

కొన్ని సమూహాలను నిర్వహణ,‌ కొన్ని సమూహాలలో సమీక్షణం 

యనమండ్ర సాహితీ వేదిక .. వ్యవస్థాపక అధ్యక్షురాలను 



నేను వ్రాయుచున్న ప్రక్రియలు: వచన కవితలు, బాల గేయాలు,‌బాలల కథలు , పెద్దల కథలు, పద్యాలు, రుబాయిలు, అష్టాక్షరి గీతికలు, యశోదమ్మ పదాలు(రూపకర్తను), మధురిమలు, చిమ్నీలు, హరివిల్లులు, మణిపూసలు, పంచపదులు, సున్నితాలు, అష్టాక్షరీ గీతాలు, గజల్స్, గేయాలు,పాటలు, అనేక లఘు ప్రక్రిలు వ్రాస్తున్నాను.


ఇష్టాలు: సాహిత్య పఠనం, లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్స్, తోటపని మొదలగునవి.


జీవితాశయం: చేతనైనంత సాయం చేయటం. 







Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page