మనశ్శాంతి కరువాయే

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

https://youtu.be/_WuI2sTh-40

'Manassanthi Karuvaye' New Telugu Story Written By Kidala Sivakrishna

రచన: కిడాల శివకృష్ణ

ఆఫీస్ నుంచి చిరాకుగా ఇంటికి వచ్చాడు కాంతయ్య.

“రావే శారదా! ఇంత కాఫీ నా మొహాన కొట్టు” అన్నాడు నీరసంతో.


“హా! వస్తున్నానండీ..” అంటూ, “ముందు మీరు వెళ్ళి ముఖం, కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని రండి. అంతలోపు తీసుకొస్తాను” అంది శారద.


సరే అని బాత్ రూమ్ లోకి వెళ్లి శుభ్రం చేసుకొని వచ్చాడు కాంతయ్య.


“ఇదిగో తీసుకోండి” అంటూ కాఫీ కప్పును చేతికందించింది శారద.


“అబ్బా! ఒక్కటే టెన్సన్స్ శారదా ఆఫీసులో..” అన్నాడు కాంతయ్య.


“ఏమి టెన్సన్స్ అండీ? మీ పని మీరు చేసుకొని వస్తె ఇంత టెన్సన్స్ ఉండవు కదా” అంది శారద.


“నా పని సమస్యలు కావు శారద! మా కొలీగ్స్ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా అయిపోయింది” అన్నాడు కాంతయ్య.


“అసలేమిటి మీ సమస్య?” అంది శారద.


“మా ఆఫీస్ లో ఒక్క పోకిరి వెధవ ఉన్నాడు. వాడు ఎండీ గురించి తప్పుగా మాట్లాడాడు. అందువల్ల సమస్యలు మొదలయ్యాయి” అన్నాడు కాంతయ్య.


“అవునా! సమస్యలు ఎందుకు మొదలయ్యాయి?” అంది శారద.


“అంటే ఆ విషయాన్ని వేరే ఎంప్లాయ్ దగ్గర అన్నాడట,.అతడు మరో వ్యక్తికి చెప్పాడు. అతడు వెంటనే యండి సార్ గారికి ఆ విషయం గురించి చెప్పాడు. అందువల్ల యండి సార్ అతడిని పిలిపించి ‘నీతో ఎవరు చెప్పారు’ అని అడిగాడు. అప్పడి నుండి మొదలయ్యింది చర్చ” అన్నాడు కాంతయ్య.


“అవునా! అంత వరకు ఎందుకు సాగింది చర్చ?” అంది శారద.


“అంటే ఒకడు వేస్ట్ గాడు ఉన్నాడులే! వాడినిండే వెళ్ళింది అంత వరకు” అన్నాడు కాంతయ్య.


“అవునా.. మొదటగా ఎంప్లాయ్, యండిని తిట్టడం తప్పు. ఆ విషయాన్ని వేరే వ్యక్తికి చెప్పడం ఇంకా పెద్ద తప్పు. అయితే, ఆయన మీ యండికి చెప్పడం చాలా పెద్ద తప్పు. నిజానికి చెప్పాలంటే మీ యండికి అయినా తెలివి ఉండాలి కదా.. అందరినీ విచారించకుంటూ ఉంటాడా.. పని పాట లేదా? కంపెనీ అన్నాక అందరూ పాజిటివ్ గా ఉండరు కదా! నిజానికి చెప్పాలంటే ఆ విషయాన్ని అక్కడే వదిలేసినా బాగుండేది. లాగుకుంటూ వస్తే అందరికీ నష్టమే కదా” అంది శారద.


“వాళ్ళకే కాకుండా మాకు కూడా క్లాస్ పీకాడు యండి. అందువల్ల మనశ్శాంతి లేకుండా పోయింది శారదా” అన్నాడు కాంతయ్య.


“మనశ్శాంతి పోకుండా ఎలా ఉంటుంది? ఎక్కడ విషయాలు అక్కడ వదలక పోతే ఇలాంటి తల నొప్పి పనులే ఎదురవుతాయి” అంది శారద.


“నువ్వు చెప్పింది నిజమే కానీ నన్ను ఏమి చేయమంటావు” అన్నాడు కాంతయ్య.


“ఏమి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరి దగ్గర విన్న మాటలు అక్కడే వదిలేయండి. ఆఫీస్ విషయాలు ఇక్కడ గుర్తు చేసుకోకండి. ఇక్కడి విషయాలు అక్కడ గుర్తు చేసుకోకండి. అప్పుడే ప్రశాంతంగా ఉంటారు. దాని వల్ల మనశ్శాంతిగా ఉంటారు” అంది శారద.


శారద చెప్పింది నిజమే అనిపించింది.వెంటనే ఆఫీసుకు సంబంధించిన ఆలోచనలు వదిలేసాడు.


“సరే శారద.. నువ్వు చెప్పింది నిజమే కానీ, నాకు ఆకలి అవుతోంది. పద.. వెళ్ళి భోజనం చేద్దాం” అన్నాడు కాంతయ్య.


కిచెన్ లోకి వెళ్లి పోయారు కాంతయ్య, శారద ఇద్దరూ కలిసి....!!!!



సర్వే జనా సుఖినోభవంతు

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


https://www.manatelugukathalu.com/post/results-of-weekly-prizes-958

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

మరణం ఒక్కటే శరణమా

కోడలు అయినా కూతురే

అవమానం - సాధన - విజయం

తప్పు బయట పడాల్సిందే

ఆఖరి చూపు కొరకు ఆఖరి ఉత్తరం

నిజం తెలుసుకోండి

కన్న ప్రేమ

నీ కాళ్ళ మీద నీవు నిలబడు

ఆత్మాభిమానం

ప్రాముఖ్యత దేనికి

ఉపాయం

దృఢ సంకల్పం

డబ్బు విలువ

పెళ్లి చూపుల సందడి

కష్టం సుఖం

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు

ఈ కథకు మీరే పేరు పెట్టండి

నిర్లక్ష్యం

ఆసక్తి

కష్టం విలువ

కాకి ఆవేదన

రచయిత పరిచయం :

నా పేరు: కిడాల శివకృష్ణ.

వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.

నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.





28 views0 comments