కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Maranam Okkate Saranama' New Telugu Story Written By Kidala Sivakrishna
రచన: కిడాల శివకృష్ణ
“అవునూ.. మన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. నేను పాస్ అయ్యాను, మరి మన ఫ్రెండ్స్ అందరూ పాస్ అయినట్లేనా” అన్నాడు కిరణ్.
“అవును. అందరూ పాస్ అయ్యారు కానీ మనతో పాటు చదివిన నరేష్ గాడు మాత్రం పాస్ అవ్వలేదు రా కిరణ్” అన్నాడు గణేష్.
అప్పుడు కిరణ్ “నరేష్ గాడు పదవతరగతి లో నెంబర్ వన్ కదరా! వాడెలా ఫెయిల్ అవుతాడు రా గణేష్?” అన్నాడు .
అప్పుడు గణేష్ “నిజమే! అయితే ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కాలేదురా కిరణ్” అన్నాడు.
“ఏమైంది వాడికి?” అన్నాడు కిరణ్.
అప్పుడు గణేష్ “అంటే.. వాడు రిజల్ట్ వచ్చినప్పటినుంచి కనిపించడం లేదు అంటున్నారు వారి ఇంట్లోవాళ్లు రా కిరణ్” అన్నాడు.
కిరణ్ అప్పుడు “అవునా! వాడు పాస్ అయ్యాడా లేక ఫెయిల్ అయ్యాడా? అసలు కారణమేమిటో తెలుసా” అన్నాడు.
గణేష్ “నాకు మాత్రం ఏమి తెలుసురా” అన్నాడు.
“ఆగు. ఇక్కడికి రాజేష్ వస్తున్నాడు. వాడికి తెలిసి ఉంటుంది. అడిగి కనుక్కుందాం” అన్నాడు కిరణ్.
“సరే రా” అన్నాడు గణేష్.
రాజేష్ వచ్చి “నేను పాస్ అయ్యాను. మీరు పాస్ అయ్యారా?” అని అడిగాడు.
“మేము పాస్ అయ్యాము రా. మరి నరేష్ గాడు కనిపించటం లేదు అట కదా! ఏమి జరిగింది?” అన్నారు.
అప్పుడు రాజేష్ “అవును. మీరు చెప్పింది నిజమే! వాడు కనిపించడం లేదు. వాడి రిజల్ట్ నేను చెక్ చేశాను. ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు” అన్నాడు.
“ఫెయిల్ అయితే ఏముంది? తరువాత రాసుకుంటాడు.. అంతే కదా! దానికే కనిపించకుండా పోవడం ఆశ్చర్యం” అని అన్నాడు కిరణ్.
అప్పుడు రాజేష్ “అంటే.. వాళ్ళ ఇంట్లో కొంచం ప్రెజర్ ఉంది రా, వాడు ఖచ్చితంగా పస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి అని. ఎందుకంటే పదో తరగతి లో వాడే ఫస్ట్ కదా!” అన్నాడు.
“నిజమే అనుకో! కాకపోతే మరీ అంతలా ప్రెజర్ పెట్టడం అవసరమంటావా? వాడికి పాటలు పాడటంలో ఆసక్తి ఉంది. మ్యూజిక్ మీద ఆసక్తి ఉంది. పరీక్షలలో ఫెయిల్ అయితే తిట్టాలా వారి ఇంట్లో?” అన్నాడు కిరణ్.
“అంటే.. ముందు చదువుకుంటే తర్వాత ఎలా అయినా అవుతుంది కదా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచం మొండి పట్టు పట్టారు” అన్నాడు గణేష్.
అప్పుడు కిరణ్ “చదవడం అవసరమే. కాకపోతే చదివిన ప్రతి ఒక్కరూ జాబ్ చెయ్యడం లేదు కదా! ఎంత మంది మంచి చదువులు చదివి ఖాళీగా లేరు చెప్పు? అంతే కాకుండా చదివిన చదువుకి తగ్గటు జాబ్ చేస్తున్నవారు ఎంత మంది ఉన్నారు చెప్పు గణేష్??” అన్నాడు కిరణ్.
“నువ్వు చెప్పింది నిజమే రా కిరణ్” అన్నాడు రాజేష్.
వీరు ఇలా మాట్లాడుకుంటుంటే నరేష్ మరణ వార్త వినిపించింది.
ఆ వార్త విన్న ముగ్గురూ చిన్నబోయారు.
“చూశారా! నరేష్ గాడి తల్లిదండ్రులు వాడిని అంతగా ప్రెజర్ చేయకుంటే వాడు మరణించే వాడా?” అన్నాడు కిరణ్.
“కాదురా. కాకపోతే మన జీవితం బాగుండాలని పెద్ద వాళ్ళు చెపుతారు కదా” అన్నాడు గణేష్.
“అవును రా. మన కోసమే చెప్పేది. కాకపోతే ఎదో ఒక పని చేసి బ్రతుకుతారు కదా.. మార్కులు రాకపోతే ఏమౌతుంది చెప్పు” అన్నాడు రాజేష్.
“అయినా నరేష్ గాడు ఇంత పని చేయాల్సింది కాదు రా! వాడికి చావడం తప్ప మరోదారి కనిపించలేదా? మరణమే శరణమనిపించిందా వాడికి..” అన్నాడు కిరణ్.
“ఇది కాదు కదా జీవితం అంటే.. ఒక పరీక్ష ఫెయిల్ అయితేనే జీవితం అంతా అయిపోయినట్లేనా” అన్నాడు రాజేష్.
“కొంచం ఆలోచించాల్సిందిరా నరేష్ గాడు” అంటూ, “సరే పదండి.. చూసి వద్దాం” అంటూ ముగ్గురు నరేష్ ఇంటికి కదిలారు.
సర్వే జనా సుఖినోభవంతు
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
నా పేరు: కిడాల శివకృష్ణ.
వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.
నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
Comentarios