top of page
Original.png

జానకి తెలివి

#అనిసాతబస్సుమ్, #AnisaTabassum, #JanakiThelivi, #జానకితెలివి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Janaki Thelivi - New Telugu Story Written By Anisa Tabassum Sk Published in manatelugukathalu.com on 25/02/2026

జానకి తెలివి - తెలుగు కథ

రచన: అనిసా తబస్సుమ్ SK


ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం. పచ్చని పొలాలు, తాటి చెట్లు, మెల్లగా మంచుతెరలు తొలుగుతూ సూర్యోదయం అవుతున్న వేళ. అదే ఊరిలో తన కుటుంబం నివసిస్తుంది జానకి.


జానకి పెద్దగా చదువుకోకపోయినా 10వ తరగతి వరకు పూర్తిచేసింది. తెలివైనది, మంచి మనసున్న ఇల్లాలు జానకి.


జానకి భర్త రంగ, వ్యవసాయదారుడు. కష్టాల్లో ఉన్న వారికీ తోడు నిలిచే వ్యక్తి, జానకిని కేవలం ఇంటి ఇల్లాలిగా కాకుండా ఇంటి మహాలక్ష్మిగా చూసే గుణమున్న మనిషి రంగ. జానకి, రంగలకు ఇద్దరు పిల్లలు, ఇద్దరూ స్కూల్‌లో చదివే పిల్లలే.


రంగ ఆదాయం ఏదో చాలి చాలన్నట్టు ఉండేది. పిల్లల ఫీజులకు, ఇంటి ఖర్చులకు, పొలం మందులకు సరిపోయేది. ఒక్కోసారి డబ్బు సర్దలేక రంగ ఇబ్బంది పడేవాడు. భర్త కష్టాన్ని గుర్తించిన జానకి, అలాగైనా తన భర్తకి ఆర్థికంగా తోడుగా నిలవాలనుకుంది.


ఏం పనిచేస్తే బాగుంటుందో, ఏ పని మొదలుపెట్టాలో అన్న ఆలోచనలతో సతమతం అవుతున్న జానకికి టీవీలో వచ్చిన ఊరగాయ యాడ్ చూసి ఒక ఆలోచన వచ్చింది.


మరుసటి రోజు ఎంతో ఉత్సాహంతో తెల్లవారగానే లేచి ఇంటి ముందు ముగ్గు వేసి. జడలో పువ్వులు పెట్టుకుని, పూజ చేసి. గబ గబా వంట పూర్తి చేసి, పిల్లలకు లంచ్ బాక్స్ లు కట్టి వాళ్ళు స్కూల్‌కి వెళ్లాక. తన భర్తకి కాఫీ అందిస్తూ తన తలపెట్టాలి అనుకుంటున్న పని గురించి చెప్పడం మొదలు పెట్టింది. జానకికి తాను చేయాలనుకుంటున్న పనికి కాదనలేకపోయాడు రంగ. ఏమైనా తనకు తోడుగా నిలవాలనుకున్నాడు.


మంచి రోజు చూసుకొని, గ్రామంలో మహిళల కోసం స్వయం సహాయక సంఘం సహాయంతో తన వ్యాపారం మొదలుపెట్టింది. మొదట కొంచెం భయం ఉన్నా, భర్త ప్రోత్సాహంతో, సహాయంతో ముందుకు నడిచింది జానకి.


పికిల్స్, పప్పుల పొడులు, అప్పడాలు, చిరుతిండ్లు చేసి అమ్మడం ప్రారంభించింది. కొద్దికొద్దిగా ఆమె ఆత్మవిశ్వాసం పెరిగింది. వ్యాపారం బాగా సాగుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంది. తాను అనుకున్నట్లుగా తన భర్తకు ఆర్థికంగా తోడు నిలిచింది. తన ఇంట్లో మొదలు పెట్టిన వ్యాపారం పెరగడంతో వేరుగా షెడ్‌లో ప్రారంభించింది. నలుగురు ఆడవారికి ఉపాధి కలిపించే స్థాయికి ఎదిగింది జానకి.


ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న మాటలు నిజం చేస్తూ, ఏ మాత్రం అహంకారం, పొగరు లేకుండా ఒక సాధారణ ఇల్లాలిగా అటు తన భర్త, పిల్లలను చూసుకుంటూ ఇటు వ్యాపారం చూసుకుంటుంది జానకి.


తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. అందరికీ ఆదర్శంగా మారింది. గ్రామంలో అందరూ ఆమెను మెచ్చుకున్నారు.


Thank you❤


-*అనిసా తబస్సుమ్ Sk(Anisa Tabassum SK)


అనిసా తబస్సుమ్ SK  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కథ సమాప్తం


అనిసా తబస్సుమ్ SK


3 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Nice story anisa garu, but inkoncham drama expect chesamu.👏

Like
Shaik Anu
Shaik Anu
Mar 06
Replying to

Sure andi , thank you

Like

Shaik Anu
Shaik Anu
Feb 25
Rated 5 out of 5 stars.

❤❤

Like
bottom of page