top of page

అత్త గారు - ఆరోగ్య సూత్రాలు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


'Atthagaru Arogya suthralu' Written By Sita Mandalika

రచన: సీత మండలీక


కల్యాణి వాళ్ళ అత్తగారు పాతకాలం వంటలు చేస్తారు.

ఆవిడ కొత్త వంటలు నేర్చుకొని చేస్తారని , ఆమెకు ఐ పాడ్ కొనిస్తుంది కోడలు.

కానీ అత్తగారి వంటల్లో మార్పు లేదు.

చివరికి ఏమౌతుందనేది ప్రముఖ రచయిత్రి సీత మండలీక గారు రచించిన ఈ కథ చదివితే తెలుస్తుంది.

కల్యాణి , భర్త రఘు ఇద్దరూ ఆఫీస్ లో పెద్ద పదవులలో ఉండడం మూలాన్ని చాలా బిజీ గా ఉంటారు. సాధారణం గా పొద్దున్న 8 .30 కి బయల్దేరిన వాళ్ళు రాత్రి 8 .30దాకా ఇంటికి రారు.

ఆ వేళ కల్యాణి ఆఫీస్ పని ఇంటినుండి చెయ్యాలని నిశ్చయించుకుంది. ప్రొద్దుటినించి మీటింగుల్లో బిజీ గా ఉండడం వలన టీ తాగి రిలాక్స్ అవుదామని మేడ దిగి కిందకివచ్చి చూస్తూ కిచెన్ వరకు వెళ్లకుండా డ్రాయింగ్ రూమ్ దగ్గరే ఆగిపోయింది.కారణం డ్రాయింగ్ రూమ్ లో టీవీ లో భక్తి ఛానల్ లో పూర్తి వాల్యూం లో వినిపిస్తోంది. అత్త గారు మామ గారు సోఫాలో హాయిగా నిద్ర పోతున్నారు.జోల పాటలా ఎందుకో ఆ టీ.వీ. పొద్దున్న8.30కి ఆరంభం అయి మధ్యాహ్నం 12 గంటలవరకు ఆ టీ.వీ. ఆన్ అయి ఉంటుంది. ఏమయినా రుచికరమైన వంటలునేర్చుకుని చేసి పెట్టచ్చు కదా.పాత చింత కాయ పచ్చడి లా ఆరోగ్యం అంటూ అవే కూరలు.

అసలు సంగతి మర్చిపోయేను.ఈ వేళ నా లక్ ఎలా ఉందొ.ఇంట్లో ఉన్నాను కదా నాకోసం ఏమయినా రుచికరమయిన వంటలు చేసేరేమో?ఇన్ని ప్రశ్నలతో ఎంతో ఉత్సాహం తో వంటగదిలో ప్రవేశించి, తయారైన వంట చూసేసరికి కల్యాణికి మొహం తిరిగినంత పనయ్యింది. అన్ని విషయాల్లో తనతో ఏకీభవించిన అత్త గారు ఆహరం విషయం లో మాత్రం తన ధోరణి తనదే.ఆరోగ్యమయిన వంటలంటూ ఆవిడది ఒక అబ్సెషన్.

ఓ మై గాడ్! ఈవిడలో మార్పు రాదు..ఆకు కూర లేకుండా వంట చేయండం

మానేసేరు.ఆకు కూరలతో రక రకాలు చేస్తారు .కొత్త గా పెరుగు పచ్చడి ఆరంభించేరు.

ఈ వేళ తోటకూర పప్పు తోటకూర పెరుగు పచ్చడి.బీన్స్ కూర.పొద్దున్న ఓట్స్ ఉప్మా చేసి దాని నిండా కేరట్ బీన్స్ నింపేసేరు.అంతా హెల్త్ ఫుడ్ తినాలంటారు అబ్బబ్బ..నాలిక రుచి పోతోంది.

అప్పుడప్పుడు ఆదివారం ఒక్క రోజు ఆవిడ కరుణిస్తారు.పూ బ్రేక్ ఫాస్ట్ లో కూర మాకు యోగం. ఆ వేళ లంచ్ లో ఒక వేపుడు, సాయంకాలం టీ తో ఏదో ఒక ఆర్గానిక్ స్నాక్.ఆ ఒక్క రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాము. దాని కోసం కొన్ని వారాలు గడ్డి లాంటి ఫుడ్ తినడమే.

ఏదో ఐడియా వేసి ఈవిడలో మార్పు తేవాలి నాలిక కాయలు కాచి పోతోంది, అనుకుంది కల్యాణి

పాపం కష్టపడుతున్నారని సాయం చేద్దామంటే ఏమైంది?కిచెన్ ఆవిడ సామ్రాజ్యం

ఎవ్వరినీ రానివ్వరు ఈ వయసు లో హాయి గా యాత్రలు చెయ్యడం చుట్టాలింటికి వెళ్లడం లాంటివి చెయ్యచ్చు కదా.ఇక్కడ ఒక వంట మనిషిని పెట్టుకుని హాయి గా కావలిసినవి చేయించుకొని తిందుము కదా . అప్పటికీ బలవంతం చేసి వంట మనిషిని పెడితే అది మూన్నాళ్ళ ముచ్చటే అయింది.అది బాగులేదు ఇది బాగు లేదు శుభ్రం లేదు అంటూ తరిమేసేరు. ఒక సారి చాలా అనుభవం ఉన్న నరసమ్మ గారి పెట్టేము.ఆవిడ వంట చెయ్యడంలో దిట్ట. నెల జీతం కొంచెం ఎక్కువైనా మంచి తిండి తినచ్చులే అని పెట్టేను. ఒక నెల పూర్తవుకుండానే ఆవిడ మీ పనికొక నమస్కారం అని వెళ్లి పోయింది. .ఏ మైందండీ అని అడిగితే వచ్చిన కూరలు నేను మూడు సార్లు కడగాలి. ఆకు కూరయితే నాలుగు సార్లుకడగాలి పైన ఆవిడ మళ్ళీ ఒక సారి కడగాలి ఏ వంటలో ఏమేమిటి ఎంతంత వెయ్యాలో ఆవిడని అడిగి చెయ్యాలి ఇలా అయితే ఇక నేనెందుకమ్మా ఇదే టైం లో నేను మూడిళ్లు చేసుకోగలను అని వెళ్ళిపోయింది.

ఇంక నాకు విసుగొచ్చింది .రఘు ఎపుుడూ అమ్మ వంట బాగానే ఉందంటాడు . అమ్మ హెల్త్ ఫుడ్ అంటే సరదాగా చేస్తుంది వంట అమ్మకి ఒక హాబీ .నువ్వు కూడా ఎడ్జస్ట్ అయిపోయి అమ్మ కి సాయం చెయ్యచ్చు కదా. ఇంక వంట మనిషి వేట మానెయ్ అంటాడు రఘు.

కల్యాణి ఆఫీస్ పని పక్కకి పెట్టి ఐడియాస్ కోసం వెతక సాగింది “ఐ గాట్ ఇట్ ఐ గాట్ ఇట్” అంటూ పెద్దగా ఆరవ సాగింది.

"కల్యాణీ ఏమైందమ్మా" అంటూ అత్త గారు మామ గారు పైకి వచ్చేరు.

" ఏమీ లేదండి ఏదో ఆఫిస్ గురించి" అని సద్ది చెప్పింది.

"భోజనం టైం అయ్యింది కిందికి రామ్మా" అంటూ ఇద్దరూ కిందకి వెళ్ళేరు

“అత్తయ్య గారు ఆకు కూరలతో వెరైటీ గా మీరు బాగా చేస్తారు. కానీ మీరు నేర్చుకుంటే ఒంటికి బలమైనవి రుచికలరమైనవి ఇంకా చాలా ఉన్నాయి. .మీరు నేర్చుకోకూడదూ” అంది కల్యాణి

“ఈ వయస్సు లోనా కల్యాణీ”

“అయినా మీ వయస్సు కేవలం అరవయ్యేగా..ఈ వయస్సు లోనే నేర్చుకునేది. మీరు గ్రాడ్యుయేషన్ చేసేరు.మీ తెలివితేటలకేం తక్కువ? అదే కాకుండా మీలో శక్తి ఉంది అత్తయ్యా”

"నాలో అంత శక్తి ఉందా ?"

“అవునండీ మీలోనే . యు అర్ వెరీ ఆక్టివ్, ఐ మీన్ తొందరగా 5.30 కల్లా లేచి అందరికీ లంచ్ బాక్స్ లలో బలమైన ఆహరం సద్ది ఇంట్లో అన్నీ చూసుకుంటూ పది గంటలకల్లా భకి టీ. వీ ఛానల్ చూస్తున్నారు .ఆ ప్రోగ్రాం తరవాత మీరు ఎన్ని సంగతులో నేర్చుకోవచ్చు” .

“అదే కల్యాణీ "ఈ వయసు లో రామా కృష్ణా అనుకుంటూ ప్రవచనాలు వింటూ

వింటూ కాలం గడపాలి గానీ కొత్త కొత్త విషయాల్లోకి వెళ్లకూడదేమో "

“అయ్యో అత్త గారూ నేను మీకోసం ఒక ఐ పాడ్ కొంటాను. దాని ద్వారా మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు కొత్తవంటలంటేమీకు ఇంటరెస్ట్ పుడుతుంది. నా ఫ్రెండ్ సరళ అత్త గారు ఐ పాడ్ సహాయంతో అన్నిరకాల వంటలు చేస్తున్నారు . సరళ లంచ్ టైం లో పెడుతూ ఉంటుంది అబ్బ ! ..ఎంత రుచి గా ఉంటుందో

వంటేకాక ఆన్ లైన్ లో షాపింగ్ కూడా చెయ్యచ్చు ఒకటేమిటిచాలా విషయాలు నేర్చుకోవచ్చు ”. ఐ పాడ్ గురించి బాగానే పాఠాలు నేర్పేనని మనస్సు లో సంతోషపడింది

కల్యాణి.నాలుగు రోజుల్లో కొత్త ఐ పాడ్ రమణి చేతికి వచ్చింది. రమణి స్వతహాగా చాలా తెలివైంది.భర్త వెంకట రావు దగ్గిర నాలుగు రోజుల్లో ఐ పాడ్ గురించి చాలా విషయాలు వివరంగా తెలుసుకుంది.దానిపై మంచి అవగాహన వచ్చింది. తొందరగా పని పూర్తి చేసుకుని ఐ పాడ్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ కి వెళ్లి తనకి కావలిసిన విషయాలు తెలుసుకునేది.నిజం గా తనకి జ్జ్ఞానోదయం అయినట్లయింది.అది ఒక పెద్ద ఖజానా లా అనిపించింది.ఇక ఏ విషయాలు నేర్చుకోవాలి అని నిశ్చయించుకుంది రమణి

శారీరిక మానసిక ఆరోగ్యానికి వ్యాయాయం ఎంత అవసరమో వేరే చెప్పక్కర్లేదు.వంట పని ఇంటి పని అంట్టూ తాను ఈ విషయంలో ఎంత అశ్రద్ధ చేసిందో అర్ధమయింది రమణి కి. పని తో అలసిపోడం అలసటతో నిద్రపోడం తో వ్యాయామం అస్సలు కుదరడం లేదు.ఆ మధ్య జాయింట్ నెప్పులు వస్తే రఘు అన్ని పరీక్షలు చేయించేడువిటమిన్ డి తక్కువగా ఉందని ఏవో మందులు రాసిచ్చి ఉదయపు నీరెండలోఎంతో డివిటమిన్ ఉంటుందని ఆ టైం లో వాకింగ్ చెయ్యమని సలహా ఇచ్చేడు డాక్టర్. కానీ ఎక్కడ కుదురుతుంది? పిల్లలకి టైం కి పొద్దున్నే వంటయిపోవాలని అశ్రద్ధ చేసేను గాని గూగుల్ లో చుస్తే అర్ధం అయింది డి విటమిన్ ఎంత అవసరమో .ఇక పొద్దున్న వాక్ చెయ్యాలని నిర్ణయించుకుంది రమణి.

ఆ వేళ కొడుకు దీపక్ కి కొత్త పుస్తకాలు కొనాలని ఆఫీస్ నించి తొందరగా వచ్చేసింది కల్యాణి

అదే సమయం లో ఆన్ లైన్ ఆర్డర్ కొరియర్ వచ్చింది .

"ఏమిటిమామయ్యగారు, అత్తయ్యగారు ఆన్ లైన్ లో కుక్కర్ గాని ఆర్డర్ చేసేరా" అని అడిగింది కల్యాణి

“కాదమ్మా పార్సెల్ లో మీ అత్తయ్య వాకింగ్ షూస్ వచ్చేయమ్మా. మొన్ననే ఆర్డర్

చేసింది. దగ్గరలో ఏక్కడో యోగా నేర్పుతారని నెట్ లో చూ సిందట చూసి వస్తానని నీకు

చెప్పమంది”

ఈ కొత్త కొత్త మార్పులకి కళ్యాణి మనస్సులో అలజడి ఆరంభమయ్యింది తాను అనుకున్నదేమిటి ?మంచి వంటలు రుచి చూడచ్చని ఐ పాడ్ కొనిస్తే జరుగుతున్న దేమిటి ? సరళ అత్త గారిని మించిన వంటలు రుచి చూడవచ్చని ఐ పాడ్ కొనిస్తే జరుగుతున్నదేమిటి? తానొకటి తలుస్తే దేముడొకటి తలుస్తాడంటారు ఇదే కాబోలు.

"కల్యాణీ,నువ్వు కూడా వస్తే రేపు యోగా క్లాస్ కి వెళదాము.మన వీధి కి నాలుగు వీధులావతల పార్క్ లో మనకి తెలియదు గాని ఒక ఏడాదై యోగా క్లాస్ లారంభించేరు.ఈ వేళ నేను వెళ్తే అన్ని సంగతులూ తెలిసాయి.చుట్టూ చెట్లు, వాకింగ్ ట్రాక్.మధ్యలో రెండు పెద్ద హాల్స్.అందులో యోగా నేర్పుతున్నారుట.సీనియర్ సిటిజన్స్ కి వేరే సెక్షన్ ఉంది.ఎటువంటి కాలుష్యం లేని చల్లని గాలి లో లేత బాల భానుడి కిరణాల క్రింద వాక్ చెయ్యడం కంటే వేరే ఆరోగ్యానికి వేరే ఏం కావాలి? ఆ పైన యోగా టీచింగ్.నిజం గా తలుచు కుంటే మనసంతా ఆనందం తో నిండి పోయింది. ఇన్నాళ్లు నేను చాలా మిస్ అయ్యెను.ఇదంతా నీ ఐ పాడ్ ధర్మం కదూ”

"అత్తయ్యా ఐ పాడ్ ద్వారా మీరు ఎన్ని విషయాలో నేర్చుకున్నారు కదా మీకు కొత్త వంటలని గురించి కూడా మంచి అవగాహన వచ్చి ఉంటుంది "

"వంటకేముందమ్మా అది మన చేతిలో పనే. ఆరోగ్యమేమహా భాగ్యం కదా.

రోజూవ్యాయాయం చేస్తూ చేస్తూ పౌష్ఠిక ఆహరం రుచిగా వండుకుంటే సరిపోతుంది. ఎప్పటిలాగే పొద్దున్నే లేచి 7.౩౦ కే వంట చేసి యోగా క్లాస్ కి వెళ్తాను. నువ్వు బ్రేక్ ఫాస్ట్ చేసి బాక్సులు సద్దుకుంటే సరిపోతుంది ".

ఇది కలా నిజమా ! 10 రోజుల్లో ఇంత మార్పా ! అయినా మీలాంటి వారికి పాఠాలు నేర్పుదామనుకోడం నా బుద్ధి తక్కువ అనుకుంది కల్యాణి .యోగా తో పాటు అత్తగారి వేషధారణ లో కూడా చాలా మార్పు వచ్చింది .పంజాబీ డ్రెస్, నెత్తిన సిగ , చేతికి వాచీ , పొద్దున్నే7.౩౦ గంటల కల్లా షూ వేసుకుని బయల్దేరుతున్న ఆవిడని చూస్తే ముచ్చట మాత్రం వేసింది .

ఆ వేళ సోమ వారం. "కల్యాణీ" అంటూ సరళ హడావిడిగా వచ్చి "మా అత్తగారిని హాస్పిటల్ లో చేర్పించేం నువ్వు ఆఫీస్ లో నేను రెండు రోజులు రానని చెప్పు.నిన్ను మళ్ళీ సాయంత్రం కలుస్తాను" అని గాబరాగా వెళ్లి పోయింది.

ఆ మర్నాడు సాయంత్రం సరళ వచ్చింది" మా అత్త గారికి షుగర్,బీ.పీ ఉందని బాడీ లో ఐరన్ తక్కువగా ఉందని తేల్చేరు డాక్టర్ గారు.సరిఅయిన ఆహారం తినక పోడం,ఫాటీ, ఆయిలీ ఫుడ్ తినడం వల్ల ఆవిడ జబ్బులతో పాటు బరువు కూడా పెరిగి పోయింది అని ఏవో మందులు రాసి ఇచ్చేడు డాక్టర్.అన్నిటికంటే ముఖ్యం ఏమి తిండి తినాలో అని డైట్ ఫుడ్ లిస్ట్ రాసిచ్చేరు.అది చూస్తే నువ్వు చెప్పిన మీ అత్తగారు చేసే ఫుడ్ అంతా ఉంది.అందుకే నేను ఆంటీ దగ్గర ఆ రెసిపీలన్నీ నేర్చుకుందామని వచ్చేను" అని గుక్కతిప్పుకోకుండా చెప్పింది

అత్తయ్య సరళని కూర్చో పెట్టి ఒక అరగంట ఆరోగ్య సూత్రాలు వల్లించేక మరొక అరగంట ఆవిడ చేసే పౌష్టిక,ఆరోగ్య రెసిపీలన్నీ కాగితం మీద రాయించి పంపింది

ఆ మాట విన్న అసలే పెద్ద కళ్లున్న కల్యాణి కళ్ళు ఇంకా పెద్దవి చేస్తూ సరళ వేపు చూస్తూ ఉండి పోయింది

ఎంతయినా పెద్ద వాళ్ళు అనుభవం మీద చెప్తారు అత్తగారి హెల్త్ ఫుడే మంచిది. అన్న నిర్ణయానికి వచ్చింది.

***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : సీత మండలీక

నేను హౌస్ మేకర్ ని. కొడుకులిద్దరూ అమెరికాలో పెళ్ళిళ్ళై స్థిరపడిపోయాక, భర్త ఎయిర్ ఇండియా లో రిటైర్ అయ్యేక ఇప్పుడు నాకు కొంచెం సమయం దొరికింది

కధలు చదవడం అలవాటున్నా రాయాలన్న కోరిక ఈ మధ్యనే తీరుతోంది


64 views0 comments
bottom of page