top of page
Original.png

ఆపరేషన్ ప్రపంచ శాంతి

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #OperationWorldPeace, #ప్రపంచశాంతి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Operation World Peace - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi Published in manatelugukathalu.com on 10/03/2026

ఆపరేషన్ ప్రపంచ శాంతి - తెలుగు కథ

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


1)

ఐక్యరాజ్యసమితి (UNO) అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఆ చర్చా అధిపతి మాధవ్‌తో ఇలా అన్నారు...


“మిస్టర్ మాధవ్, రేపు అన్ని దేశాల ప్రతినిధులు ఇక్కడికి వస్తున్నారు. ప్రపంచ శాంతి చర్చలు చేయడానికి ఇది మంచి అవకాశం. వారి మది నుండి విషపు బీజాలు (యుద్ధం, హింస) అనేవి తీసి, 3 'మంచి' బీజాలు నాటాలి. i) ప్రేమపూరిత - సంతోషపూరిత నిర్వహణ ii) ఆనందదాయక పరిష్కారాల తీరుతో శాంతి చర్చలు మాత్రమే iii) నిర్మాణాత్మక స్వభావం.”


"ఆ తర్వాత వారికి నచ్చజెప్పాలి... దేవుడు చేసిన మనుషులు అన్నాక... ప్రగతి పథం - అభ్యుదయం - శ్రేయస్సు - సుఖశాంతులు దశగా పయనించాలి... లేకుంటే మనకు జంగిల్ లా - జంగిల్ రాజ్... వేటాడి చంపే క్రూర మృగాలకు - రక్తం పీల్చే 'ఆది మానవ' జీవిత విధానానికి... తేడా లేదు అని."


"నీకు కేవలం అర గంట - 30 నిమిషాలు మాత్రమే సమయం దొరుకుతుంది... మరో ప్రపంచ యుద్ధాన్ని నిరోధించ గల శక్తి (పవర్) నీలో ఉంది... ఏం చేస్తావో - ఏమో మరి? Madhav, you have to stop escalation of wars... STOP All wars... Prevent the 3rd world war occurrence... HOW??? Is left to your discretion."

-----

2)

మరునాడు అన్ని దేశాల ప్రతినిధులు (UNO) ఐక్యరాజ్యసమితి ప్రధాన హాలులో సమావేశం అయ్యారు.


సమయం: ఉదయం 11 గంటలు.


మాధవ్ ఏవో 3 చిన్న పుస్తకాలు ఇచ్చాడు ప్రతినిధికి. వారు అయిష్టంగా ముఖం పెట్టి దానిని బల్లల పై పెట్టేశారు. తెరిచి కూడా చూడలేదు.


మాధవ్ రెండోసారి ఏవో చిన్న పుస్తకాలు ఇచ్చాడు అందరికి. ఈసారి ఆదుర్దాగా, ఆసక్తితో చూశారు - చదివారు.


సమయం: ఉదయం 11.05 గంటలు.


కోపం - విసుగు వారి ముఖాల నుండి మటుమాయం అయ్యాయి.


ఇదే అదనుగా మొదట ఇచ్చిన రీడింగ్ మెటీరియల్ - 3 చిన్న పుస్తకాలు చూడమన్నాడు మాధవ్... అభ్యర్థన (వాయిస్) స్వరంతో.


ఈసారి మొదటి 3 చిన్న పుస్తకాలు తెరిచి ఆసక్తిగా చూశారు... గబగబా పేజీలు తిప్పేశారు.అందరి ముఖాలలో చిరునవ్వు వెలిసింది - విరిసింది.


3)

సమయం: ఉదయం 11.20 గంటలు.


మాధవ్‌కు ఇంకా 10 నిముషాల వ్యవధి మాత్రమే ఉంది.


ఇదే అదనుగా... ఈసారి ఇంకో 2 చిన్న పుస్తకాలు ఇచ్చాడు... గబగబా చదవమని అభ్యర్థించాడు.


వారు గబగబా తిరగేసారు.


సమయం: ఉదయం 11.30 గంటలు.


మాధవ్ గది నుండి బయటికి వచ్చేసాడు. అతడి అర గంట


గడువు అయిపోయింది కాబట్టి.మొత్తం ఆరు (6) పుస్తకాలు ఇచ్చాడు మాధవ్... ఒక్కో ప్రతినిధికి... ఒక్క పుస్తకానికి 5 నిమిషాలు చదవడానికి... మొత్తం 30 నిమిషాల గడువును అలా ఉపయోగించుకున్నాడు మాధవ్.


4)

మాధవ్ బయటికి కదలగానే...


తలుపులు వేసుకొని చర్చించుకున్నారు ఆ వివిధ దేశాల ప్రతినిధులు (UNO ముఖ్య హాల్‌లో).


సమయం: మధ్యాహ్నం 1.00 గంట.


తలుపు తెరుచుకుంది.అందరూ షేక్‌-హ్యాండ్ (కరచాలనం) ఇచ్చుకున్నారు - చేసుకున్నారు... స్నేహపూర్వకంగా.


5)

గది బయటికి వచ్చి వారి వారి దేశాల - రాష్ట్రపతులకు - ప్రధానమంత్రులకు ఫోన్ చేసారు... ఏదో మాట్లాడారు.


సమయం: మధ్యాహ్నం 1.15 గంటలు.


ఆశ్చర్యం... ప్రపంచం మొదటి అద్భుతం... 1st WONDER of the world...


అన్ని దేశాలు కాల్పులు విరమించుకున్నాయి."ఇప్పటినుండి ఉట్టి శాంతి చర్చలు మాత్రమే" అని ప్రకటించారు అన్ని దేశాల నాయకులు. కాల్పులు - యుద్ధం ఉండబోవు అని ఒట్టు పూర్వకంగా మీడియా ద్వారా ప్రచురించారు - ప్రసంగించారు.... టీవీ - ఇంటర్నెట్ - మాధ్యమం ద్వారా)5)

మాధవ్ చేసిన మేజిక్ ఏమిటి? వారికి ఏ పుస్తకాలు ఇచ్చాడు?... 5 + 15 + 10... 30 నిముషాలలో ఎలా చదివారు ఆ 3 పుస్తకాలను... ఎలా మంచి - మానవత్వం - శాంతి - దైవత్వం వైపుకు తిరిగారు వారంతా...? ? ?... ఎలా మనసు మార్చుకున్నారు...? ? ?


6)

మాధవ్ ప్రతి దేశ ప్రతినిధికి ఇచ్చిన ఆరు (6) పుస్తకాలు ఏవనగా... జీవిత చరిత్ర పుస్తకాలు... బొమ్మల కథ రూపంలో... Comics or pictures books of life-stories - biographies of


1st, 2nd, 3rd) మహాత్మా గాంధీ - నెల్సన్ మండేలా - మదర్ థెరిసా(Mahatma Gandhi - Nelson Mandela - Mother Theresa biographies... AS comics)4th) ఆర్చీ - బెట్టీ - వెరోనికా ఇతర ప్రేమ కుటుంబం (loving family of Archie - Betty - Veronica etc. comics)5వ పుస్తకం) యేసుక్రీస్తు - విశ్వశాంతి - ప్రేమ - సందేశం (Jesus Christ - life story + universal love & peace message comic)


6వ పుస్తకం)


మొదటి ప్రపంచ యుద్ధం (1914-1918)


రెండవ ప్రపంచ యుద్ధం (1939-1945)


... బొమ్మల పుస్తకాలు...


Comic books (with pictures) of WW I and II


మానవ చరిత్రలో అత్యంత విధ్వంసకరమైన సంఘటనలలో (WW I & II) జరిగిన ధన, ప్రాణ, జన నష్టాల వివరాలతో సహా------------------ WW I:- ------------


I)

మొత్తం మరణాలు (మిలియన్లలో): 15 - 22 (1.5 - 2.2 కోట్లు)... [(సైనికులు: 9 - 11... పౌర: 6 - 13]... [గాయపడినవారు: 20 మిలియన్లకు పైగా సైనికులు)]


...ii)

ధన నష్టం మరియు ఆర్థిక ప్రభావం:- ప్రత్యక్ష ఖర్చు: $125 నుండి $186 బిలియన్లు (1913లో)... పరోక్ష ఖర్చు: (ఆస్తి నష్టం, ఉత్పత్తి తగ్గిపోవడం వంటి నష్టాలు): మరో $151 బిలియన్లకు పైగా


------------- WW II:- ------------


I)

మొత్తం మరణాలు (కోట్ల మంది): 7 - 8.5 కోట్లు


... [(సైనికులు: 2.1 - 2.5... పౌర: 5 - 5.5]... [గాయపడినవారు: 70 మిలియన్లకు పైగా సైనికులు (7 కోట్ల మంది)]


Ii)

ధన నష్టం మరియు ఆర్థిక ప్రభావం:- ప్రత్యక్ష ఖర్చు: (1940లో). [

$1 నుండి $3.5 ట్రిలియన్ల (1 ట్రిలియన్ = 1 లక్ష కోట్లు) డాలర్లు.

]


Iii)

[

ద్రవ్యోల్బణంతో (loss in Current value: 2026లో):

$4 ట్రిలియన్ల కంటే ఎక్కువే ఉంటుంది.


ఆస్తి నష్టం: యూరప్, ఆసియాలోని అనేక నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి... (బ్రిటన్, పోలాండ్‌లలో దాదాపు మూడో వంతు)

]


Iv)

[

అమెరికా ఖర్చు (అత్యధికంగా):- $341 బిలియన్లకు పైగా..., ఇది మొత్తం ప్రపంచ యుద్ధ (II) ఖర్చులో దాదాపు 46%.

]

----------X X X --------X X X ----------X X X ------------


7)

కామిక్స్ - బొమ్మల పుస్తకం మాధవ్ ఇవ్వడం... ఎందుకలా?...కామిక్స్ - బొమ్మల పుస్తకం అయితే క్లుప్తంగా ఉంటాయి చదవడానికి... ఆసక్తికరమైన ఉత్కంఠతతో... పేజీలు తొందరగా తిరగేయవచ్చు... తొందరగా చదవవచ్చు... బోర్ కొట్టకుండా... పదార్థం - సందేశం - సారాంశం తేలికగా గ్రహిస్తారు.


8)

అందరూ మాధవ్‌ను...


"ప్రపంచ శాంతి స్థాపన చేసిన బంగారు మనిషి... లోకోద్ధారకుడు... విశ్వ-బంధు... జగత్- నిర్మాత"


...

అని సంబోధిస్తే... అభినందిస్తే...


మాధవ్ ఇలా అన్నాడు వారితో మరియు మీడియాతో.... చిరునవ్వు చిందిస్తూ...


...


"నాకు ఈ... మహనీయుల జీవిత చరిత్రలు... కామిక్స్ - బొమ్మల పుస్తకం రూపంలో ఇవ్వాలి... క్లుప్తంగా - ఆసక్తికరంగా ఉంటుంది... అనే ఆలోచన ఇచ్చిన వారు


...


మా అమ్మగారు... నా ప్రేమ కుటుంబం సభ్యులు అయిన... బెట్టీ - వెరోనికా... తియ్యటి ఇంద్రధనుస్సు అమ్మాయిలు (SWEET VIBGYOR GIRLS)... వారికే ఈ అభినందనలు అన్నీ"


...

అని నిరాడంబరంగా నవ్వాడు (మాధవ్).


------------------ చిన్న కథ సమాప్తం -------------------------


--------- నీతి --------------


1)

మహనీయుల జీవిత చరిత్రలు... కామిక్స్ - బొమ్మల పుస్తకం రూపంలో ఇవ్వాలి... క్లుప్తంగా - ఆసక్తికరంగా ఉంటుంది చదవడానికి.... ప్రభావవంతమైనదిగా ఉంటుంది.


2)

కామిక్స్ - బొమ్మల పుస్తకం అయితే క్లుప్తంగా ఉంటాయి... ఆసక్తికరమైన ఉత్కంఠతతో... పేజీలు తొందరగా తిరగేయవచ్చు... తొందరగా చదవవచ్చు... బోర్ కొట్టకుండా... పదార్థం - సందేశం - సారాంశం తేలికగా గ్రహిస్తారు.


3)

మంచి విశ్వశాంతి - ప్రేమ - సందేశం చేరుతుంది... మదికి.

మరియు

"చేదు - విషపు - భూత తత్వం - ద్వేషం" "బీజాలు" (సమాజం నుండి వచ్చినవి)... అదృశ్యం అయిపోతాయి మది నుండి.... వెనువెంటనే (మంచి కామిక్స్ - బొమ్మల పుస్తకాలు చదివితే... తేలికగా - ప్రభావవంతమైనదిగా ఉంటుంది కాబట్టి)


----------- నీతి సమాప్తం ------------


పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 


మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page