top of page

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

'Anukunnadi Okkati Ayinadi Okkati' New Telugu Story Written By Kidala Sivakrishna

రచన: కిడాల శివకృష్ణ

అమర్ సిమెంట్ వ్యాపారం మొదలు పెట్టాడు. మొదలు పెట్టిన తరువాత ఆరు నెలల పాటుగా పెద్దగా సేల్స్ జరగలేదు. అందువలన అమర్ అప్పు చేసి రూమ్ రెంట్ కట్టుకుంటూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు.


తరువాత కాలంలో ప్రజలలో నమ్మకం కలిగి సేల్స్ పెరిగాయి. సంవత్సర కాలం పాటు నష్టం లేకుండా, లాభం లేకుండా రూమ్ రెంట్ లకి మెటీరియల్ కి సరిపోతుంది. ఆ విధంగా రెండున్నర సంవత్సరాలు గడిచిన తరువాత మూడవ సంవత్సరంలోకి అడుగులు వేస్తున్న సమయంలో లాభాలు మొదలు అయ్యాయి.

కస్టమర్స్ బాగా పెరిగారు. ప్రతి ఒక్కరితో సత్ సంబంధాలతో వ్యాపారం చేస్తూ తన పనేమో తాను చేస్తూ ఒక్కరి గురించి పట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నాడు అమర్. ఇలా రోజులు గడిచే కొద్దీ తన షాప్ లో వస్తువుల సంఖ్యను కూడా పెంచుతూ వస్తున్నాడు.


అంటే కడ్డీలు, గిన్నెలు మొదలైన వస్తువులు, సిమెంట్ తో పాటుగా ఇంటికి వాడే పరికరాలను ఇలా పెంచుతూ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఇదంతా గమనిస్తున్న వేరే షాప్ వాళ్ళు కళ్ళెర్ర చేశారు. ఎలాగైనా సరే.. అమర్, సిమెట్ షాప్ ను తీసేసే విధంగా చేయాలని తమకున్న కుళ్ళు బుద్ధిని బయటకు తీశారు. అనుకున్న విధంగానే వేరే షాప్ వాళ్ళు అమర్ దగ్గర నుంచి సిమెంట్ ఇతర వస్తువు తీసుకుపోతున్న వారితో పొత్తు కుదుర్చుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు.


ఈ విధంగా ప్రయత్నాలు కొనసాగుతుంటే అమర్ సిమెంట్ ను ఉంపాయోగించి ఒకాయన ఇంటిని కట్టిస్తున్నాడు. ఆయన ఇంటిని కట్టడానికి వస్తున్న బేల్దారితో పాతిక వేల రూపాయల ఇచ్చి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. పాతిక వేల రూపాయల డబ్బులు తీసుకున్న బేల్దారి పనివాడు ఆపోజిట్ వారు చెప్పిన విధంగానే సిమెంట్ ను కలుపుతున్న సమయంలో సిమెంట్ లోకి బెల్లం కలిపాడు. ఆ బెల్లం కలపడం వలన ఆ సిమెంట్, స్లాబ్ వేసినపుడు సెట్ కాకుండా పోతుంది అనే విషయం వీరికి తెలియడంతో ఆ పని చేయించినట్లు పనివాడు తెలుసుకున్నాడు.

స్లాప్ వేయడం పూర్తి అయ్యింది, ఇరవై నాలుగు గంటలు గడిచిపోయాయి. కొన్ని చోట్ల మాత్రమే స్లాబ్ సెట్ అయ్యింది. మిగతా ప్రాంతాల్లో బెల్లం సరిగ్గా పడకపోవడంతో సెట్ కాలేదు. మొత్తానికి ఇంకా సమయం వేచి చూస్తే, సెట్ అయ్యే అవకాశం ఉంటుంది అని అనుకున్నారు ఇంటి యజమానులు.

ఎంత సమయం వేచి చూసినా కూడా ఆ సిమెంట్ స్లాబ్ సెట్ కాకపోవడంతో సమస్య ఏమిటి అని ఇంటి ఓనర్స్ ఆలోచిస్తున్నారు. అప్పుడు అమర్ కు వ్యతరేకంగా ఉన్నవారు పని వాడికి డబ్బులు ఇచ్చి ఉండటంతో “సిమెంట్ లో లోపం వలన ఇంకా స్లాబ్ సెట్ కాలేదు, అమర్ డూప్లికేట్ సిమెంట్ ను మనకు ఇచ్చాడు” అని చెప్పాడు.

ఆ మాటలు విన్న ఇంటి యజమానులు అమర్ షాప్ దగ్గరికి చిర్రెత్తిపోయి వచ్చారు.

“ఏమయ్యా అమర్! నీవు ఇచ్చిన సిమెంట్ చాలా బాగుంటుంది, తొందరగా సెట్ అవుతుంది అని మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేశావు, అంతా డూప్లికేట్ సిమెంట్ ఇచ్చి..” అంటూ అనరాని మాటలు అంటూ ఉన్నారు.

ఈ సంఘటన మొత్తం చూస్తున్న అమర్ వ్యతిరేకులు చాలా సంతోషంగా, ‘అమర్ సిమెంట్ షాప్ తీసేస్తాడు’ అని అనుకున్నారు.

అమర్ మాత్రం చాలా ఓపికతో “మీరు పెద్దగా ఇబ్బంది పడకండి, నేను ఇచ్చిన సిమెంట్ క్వాలిటీ సిమెంట్ అని నిరూపిస్తాను” అని, “అలా చేయలేక పోతే మీరు తీసుకు పోయిన సిమెంట్ బస్తాలకు డబ్బులు వెనక్కి ఇస్తాను. లేదంటే సిమెంట్ మరలా ఇస్తాను” అని చెప్పాడు.

ఆ మాటలకు ఇంటి ఓనర్స్ సరే అన్నారు. అప్పుడు వెంటనే అమర్ తన సిమెంట్ కంపెనీ యాజమాన్యాన్ని పిలిపించాడు. పిలిపించి టెస్టింగ్ చేయించాడు. ఆ టెస్టింగ్ లో ‘సిమెంట్ లో ఎవరో బెల్లం కలిపారు. అందు వలన స్లాబ్ సెట్ కాలేదు అని తేల్చి చెప్పారు.

“చూశారు కదా! నేను ఇచ్చిన సిమెంట్ లో క్వాలిటీ ఏ మాత్రం తగ్గలేదు. కాబట్టి దానికి నేను బాధ్యున్ని కాదు. సిమెంట్ లోకి ఎవరు బెల్లం కలిపారో వారే బాధ్యత వహించి మీకు నష్టం అయిన డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది” అని చెప్పాడు అమర్.

అప్పుడు ఇంటి ఓనర్స్, వారి ఇల్లు కట్టే పనివాడిని “సిమెంట్ లో బెల్లం ఎవరు కలిపారు?” అని అడిగితే చిట్ట చివరకు 'అమర్ వ్యతిరేకులు తనకి పాతిక వేల రూపాయలు ఇచ్చి ఆ పని చేయించారు' అంటూ చెప్పాడు.

వెంటనే ఆ ఇంటి ఓనర్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని వాళ్ళ సిమెంట్ షాప్ లను మూయించేశారు. అమర్ వ్యతిరేకులేమో అమర్ సిమెంట్ షాప్ మూయించేయాలి అనుకున్నారు. కానీ చివరకు నిజం తెలియడంతో అమర్ షాప్ కి మంచి పేరు వచ్చి, వ్యాపారం అభివృధి పెరిగింది.

వీళ్ళకేమో షాప్ లు మూసేసి జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

అందుకనే అనేది చెరపకురా చెడేవు అని.

సర్వే జనా సుఖినోభవంతు

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :

నా పేరు: కిడాల శివకృష్ణ.

వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.

నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.47 views0 comments

Commentaires


bottom of page