రెండో వైపు
#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #RendoVaipu, #రెండోవైపు #బామ్మకథలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #TeluguChildrenStories, #తెలుగుబాలలకథలు

బామ్మ కథలు - 43
Rendo Vaipu - Telugu Moral Story|Vasundhara Rani Munipalle Published in manatelugukathalu.com on 14/03/2026
రెండో వైపు - తెలుగు నీతి కథ | వసుంధర రాణి మునిపల్లె
చింటూ ఆ రోజంతా కష్టపడి బంకమట్టితో ఒక ఏనుగు బొమ్మను చేశాడు. దాన్ని ఇంటి ముందు అరుగు అంచున.ఎండకి పెట్టి మురిసిపోతుంటే, వాసు సైకిల్ మీద వస్తూ అదుపు తప్పి అరుగును బలంగా ఢీకొట్టాడు. ఆ దెబ్బకి బొమ్మ కింద పడి ముక్కలైపోయింది.
చింటూకి పిచ్చి కోపం వచ్చింది. "రేయ్! కావాలనే నా బొమ్మను విరగ్గొట్టావు కదూ! పో.. వెళ్ళిపో ఇక్కడి నుంచి!" అని గట్టిగా అరిచాడు. వాసు ఏదో చెప్పబోతుంటే, "నువ్వేం చెప్పక్కర్లేదు.. వెళ్ళు!" అని తోసేశాడు. వాసు కళ్ళల్లో నీళ్లు తిరిగినా, చింటూ అరుస్తుంటే భయపడి సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు.
సాయంత్రం బామ్మ దగ్గర కూర్చుని చింటూ ఇంకా వాసుని తిడుతూనే ఉన్నాడు. "వాడు పరమ వేస్ట్ బామ్మా.. కావాలనే నా బొమ్మను పడేశాడు" అన్నాడు.
బామ్మ నిమ్మకాయ రసం ఇస్తూ మెల్లగా అడిగింది, "అవును చింటూ.. వాడు కావాలనే చేశాడంటావా? అసలు వాడు సైకిల్ మీద వస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు?"
"నేను అరుగు పక్కనే ఉన్నాను బామ్మా.. వాడు నేరుగా వచ్చి నా బొమ్మనే గుద్దాడు" అన్నాడు కోపంగా.
"మరి వాడు నిన్ను చూశాడా?" అని అడిగింది బామ్మ.
"చూశాడు.. కానీ అప్పుడు రోడ్డు మీద ఒక కుక్కపిల్ల అడ్డం వచ్చింది. దాన్ని తప్పించబోయి నా వైపు వచ్చాడు" అని చింటూనే జవాబు చెప్పాడు.
బామ్మ నవ్వుతూ, "అంటే వాడు కుక్కపిల్లను కాపాడబోయి ఇటు వచ్చాడన్నమాట. మరి అప్పుడు వాడి సైకిల్ బ్రేకులు పడ్డాయా?"
చింటూ కొంచెం ఆలోచించి, "లేదు బామ్మా.. వాడు గట్టిగా నొక్కాడు కానీ సైకిల్ ఆగలేదు. అసలు వాడి సైకిల్ కి బ్రేకులే సరిగ్గా ఉండవులే" అన్నాడు మామూలుగా.
అప్పుడు బామ్మ అంది, "చూశావా చింటూ! ఇందాకటి నుంచి నువ్వు 'నీ బొమ్మ విరిగిపోయింది' అనే ఒక వైపే చూస్తున్నావు. కానీ నువ్వు చెప్పిన దానిలోనే రెండో వైపు కూడా ఉంది. వాడు ఒక కుక్కపిల్లను కాపాడబోయాడు, పైగా వాడి సైకిల్ బ్రేకులు సరిగ్గా లేవు. ఆ కంగారులో వాడు పడిపోకుండా ఉండటానికే అరుగును ఆసరాగా చేసుకున్నాడు. ఆ దెబ్బకి నీ బొమ్మ పడిపోయింది తప్ప, వాడు కావాలని చేయలేదు కదా?"
చింటూ ఒక్క నిమిషం ఆగి ఆలోచించాడు. "అవును బామ్మా.. వాడు పడిపోయినప్పుడు వాడి మోకాలికి కూడా దెబ్బ తగిలింది. నేను అది పట్టించుకోకుండా వాడిని తిట్టాను" అని మెల్లగా అన్నాడు.
"అదే చింటూ.. మనకి జరిగిన నష్టాన్ని చూసి కోప్పడటం సులభం. కానీ ఎదుటివాడు ఆ పని ఎందుకు చేశాడో ఒక్క నిమిషం ఆలోచిస్తే అసలు గొడవే ఉండదు. దాన్నే రెండో వైపు చూడటం అంటారు" అని బామ్మ సర్ది చెప్పింది.
సమాప్తం.
వసుంధర రాణి మునిపల్లె గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.





Comments