కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Kavalsindemiti' New Telugu Story Written By Kidala Sivakrishna
రచన: కిడాల శివకృష్ణ
సుమన్ మనోహర్ అనే ఇద్దరు మిత్రులున్నారు. వారిద్దరూ డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. మనోహర్ ఆస్తి పరుడు. ఆస్తితో పాటుగా అహంకారం కూడా తోడైయింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతే కాకుండా మనోహర్ జల్సా రాయుడని చెప్పవచ్చు.
సుమన్ మాత్రం సమాజం ఏమనుకుంటుంది, ఇతరులు ఏమి అనుకుంటున్నారు, ఎవరికి మన వల్ల ఇబ్బంది కలగనుంది అని ఆలోచించి ఆచి తూచి అడుగు వేసి ముందుకు కదిలే వ్యక్తి. మనోహర్ మాత్రం ఇలాంటివి అన్నీ ఆలోచించే వ్యక్తి కాదు. తనకి నచ్చిన పనిని మాత్రమే చేయడం తెలుసు మనోహర్ కి. అయితే మనోహర్ తను చేసే పని వల్ల తనకేమీ లాభం ఉంది అని మాత్రమే ఆలోచిస్తాడు. సుమన్ మాత్రం మనకి మంచి పేరు వస్తుందా, చెడ్డ పేరు వస్తుందా అనీ మాత్రమే అలోచించే మనస్తత్వం ఉన్న వ్యక్తి.
ఒకరోజు ఇద్దరికీ ఒక పని చేయాల్సి వచ్చింది. ఆ పనిని పది మందికి ఉపయోగపడేలా చేయాలి అనీ సుమన్, అలా వద్దు మనకు మాత్రమే లాభం వస్తె చాలు అంటున్నాడు మనోహర్. ఆ పనేమిటి అంటే పాతిక లక్షల రూపాయల ప్రాజెక్ట్ చేతికి వచ్చింది. ఆ పాతిక లక్షలు ఖర్చు చేసి ఊరికి మంచి చేయాలన్నది సుమన్ పట్టుదల. ఎందుకంటే దానితో పాటుగా మంచి పేరు వస్తుంది, ప్రజల అవసరాలను తీర్చిన వారిగా ఉంటుందన్న ఆలోచన దీనికి కారణం.
మనోహర్ మాత్రం “మనము పదిహేను లక్షల రూపాయలు ఖర్చు చేసి మిగతాది మనం షేర్ చేసుకుందాం. దాని మనకి ఆదాయంతో పాటుగా, మన ఊరి పనులను అవకతవకలుగా అయినా సరే, చేసినట్లు అవుతుంది” అంటున్నాడు.
“నువ్వు చెప్పినట్ల చేస్తే మనుషుల జీవితాలతో ఆడుకునట్లు అవుతుంది రా మనోహర్” అన్నాడు సుమన్.
“అయితే కానీ! మనకు పోయేదేముంది?” అన్నాడు మనోహర్.
“అలా చేసేట్లయితే నాకు ఆ షేర్ అవసరం లేదు. నాకు ఇచ్చే డబ్బులేవో ఊరి కోసం ఖర్చు పెట్టీ నీవు తీసుకోవాలని అనుకుంటున్న డబ్బులు నువ్వు తీసుకో రా మనోహర్” అన్నాడు సుమన్.
“అలా కాదురా! నీవు కూడా తీసుకుంటే బాగుంటుంది రా. మనమేమి పనులు చేయము అని చెప్పడం లేదు నేను. పనులు చేస్తూ మనం కూడా డబ్బులు సంపాదించుకుందాం” అన్నాడు మనోహర్.
“అరే.. నీకు కావాల్సిందేమిటిరా మనోహర్? డబ్బులా.. పేరు ప్రతిష్టలా.. ఊరు బాగుండటమా?” అన్నాడు సుమన్.
“నాకు మొదటగా డబ్బు ముఖ్యం, తరువాత పేరు కావాలి” అన్నాడు మనోహర్.
“అరే.. నీకు చాలా డబ్బు ఉంది. పేరు అంటావా.. ఈ డబ్బులు ఖర్చు చేసి ఊరికి మంచి పనులు చేస్తే ఆటోమేటిక్ గా పేరు వచ్చేస్తుంది కదరా. నీకు కావాల్సింది ఇదే కదా” అన్నాడు నిటూర్పుతో సుమన్.
“నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కాకపోతే నాకు ఈ డబ్బుతో పాటుగా పేరు ప్రఖ్యాతలు కావాలి” అన్నాడు మనోహర్.
“అరే.. అందుకనే కదరా నువ్వు తీసుకోవాలనుకున్న ఐదు లక్షల రూపాయల తీసుకొని మంచిగా పనులు చేయించు” అన్నాడు సుమన్.
“సరే” అని చెప్పి ఊరిలోని పనులను ఇరబై లక్షలు ఖర్చు పెట్టి పూర్తి చేయిస్తున్న సమయంలో తన మిత్రుడు అయిన సుమన్ ను గుర్తు చేసుకున్నాడు. ‘సుమన్ తనకి ఏమి లేకపోయినా తాను తీసుకోవాల్సిన డబ్బులను కూడా ఊరి కోసం ఇచ్చేశాడు. ఇంత ఉండి కూడా నేను మంచి కోసం డబ్బును ఖర్చు చేయకుండా నా స్వార్థం కోసమే పెట్టాను’ అని చింతిస్తూ మిగిలిన ఐదు లక్షల రూపాయలను కూడా ఖర్చు చేసి ఊరికి మంచిగా పనులు పూర్తి చేయిస్తూ ఉంటే ఆ పనులను చూసిన ఊరి ప్రజలంతా తనను మెచ్చుకోవడం గమనించాడు.
అప్పుడు మనోహర్ సుమన్ దగ్గరికి వెళ్లి “నువ్వు చెప్పడం వల్లే నాకు చాలా మంచి పేరు వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది రా” అంటూ “మన ఊరిలో ఇంకా ఏమైనా పనులు చేయాలి అనుకుంటే నాకు చెప్పు. అవసరమైతే మన సొంత డబ్బులు ఖర్చు చేసి అయినా మంచి పనులు చేద్దాం” అన్నాడు.
“సరే రా! అలాగే చేద్దాం” అంటూ ఇద్దరూ కలసి ముందుకు కదులుతూ ఊరి కోసం మంచి పనులను చేస్తూ ప్రజల మన్నలను పొందుతూ సంతోషంగా జీవిస్తూ ఉన్నారు స్నేహితులు ఇద్దరూ....!!!!
సర్వే జనా సుఖినోభవంతు
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
నా పేరు: కిడాల శివకృష్ణ.
వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.
నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
Comments