కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Niluvela Vishame Manavudiki' New Telugu Story Written By Kidala Sivakrishna
రచన: కిడాల శివకృష్ణ
మా మామయ్య కారు దిగి దీనంగా ఇంట్లోకి అడుగులు వేస్తూ వస్తున్నాడు.
ఆ అడుగులను చూసిన నేను “ఎందుకు మామయ్యా ఇంత నీరసంగా ఎదో పోగొట్టుకున్న వాడిలాగా వస్తున్నావు ఇంటికి?” అని అడిగాను.
“హా.. ఏమీ లేదురా రిషీ, ఎదో అలా వస్తున్నాను అంతే” అంటూ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు.
“ఆగు మామయ్యా! ఏమో జరిగింది. చెప్పచ్చు కదా..” అంటూ కాస్త గట్టిగా అడిగాను.
“అవునురా! మన సూఫీని ఎవరో పట్టుకెళ్ళిపోయారు. అందుకే దిగులుగా ఉందిరా రిషీ” అన్నాడు మామయ్య. అసలే మామయ్యకు సూఫీ అంటే చాలా ఇష్టం. అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. మనుషులను అసలే పట్టించుకునే వాడు కాదు మా మామయ్య.
“సర్లే మామయ్యా! ఇంకో కుక్కను తెచ్చుకుందాం” అన్నాను నేను.
“సరేలేరా.. నువ్వు చెప్పినట్లే చేద్దాం” అంటూ ఇంట్లోకి వెళ్లిపోయాడు మా మామయ్య.
మా మామయ్య ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచాడు. ఇద్దరం కలిసి భోజనం చేశాము. తరువాత మామయ్య ఫోన్ పట్టుకుని తన మిత్రులకు, కనిపించకుండా పోయిన సూఫీ గురించి కనుక్కోమని చెపుతున్నాడు.
అప్పుడు నేను “మామయ్యా! ఒక విషయం అడుగుతాను. నువ్వు ఖచ్చితంగా నాకు సమాధానం చెప్పాలి” అని అడిగాను.
“ సరే చెపుతాను. అడగరా రిషీ” అన్నాడు మామయ్య.
“మామయ్యా! అస్సలు మనుషులనే నమ్మము కదా. అలాంటిది వెళ్లిపోయిన కుక్క గురించి అంతగా ఆలోచిస్తున్నావు ఎందుకు చెప్పు?” అని అడిగాను.
అప్పుడు మా మామయ్య “రిషీ! నేను మనుషులను నమ్మను. అది నిజమే. కారణం ఏమిటి, ఎందుకు అంటే మనిషి శరీరం అణువణువూ విషంతో నిండిపోయి ఉంటుంది. తేలుకి కొండిలో ఉంటుంది విషం. పాముకు పంటిలో ఉంటుంది. ఎంతటి క్రూర మృగాలకు అయిన తమ శరీర భాగాలలో ఒక్క అవయవం లో మాత్రమే ఉంటుంది విషం. కానీ మానవులకు అలా కాదురా రిషీ! నిలువెల్లా విషమే.
నా వల్ల ఎంతో సహాయం పొందిన నా స్నేహితులు, బంధువులు నన్ను మోసం చేశారు.
పిడికెడు అన్నం పెట్టినందుకు ఈ కుక్క నేనంటే విశ్వాసంతో ఉంది. అందుకే మానవుడిని నేను నమ్మడం మానేశాను.
అంతెందుకు.. అక్కడక్కడ మోసాలు జరిగేవి మనిషిని మనిషి మోసం చేశాడు అనే పేపర్ లలో, టివీ లలో వస్తుంది. కానీ పెంచుకున్న జంతువు కానీ, పక్షులు కానీ మోసం చేశాయి అని రావడం నువ్వు చూశావా?” అంటూ చెపుతున్న సమయంలోనే సూఫీ ని తీసుకుని మా మామయ్య మిత్రుడు ఇంటికి వచ్చాడు.
ఆ సూఫీని చూసిన మా మామయ్య కళ్ళలో ఎక్కడ లేని ఆనందం నాకు కనిపించింది. సూఫీ కూడా చాలా స్నేహంగా ఉంటూ ఇంటికి కాపలా కాస్తూ మాకు హాని తలపెట్టకుండా జీవిస్తుంది. ఆ రోజు నాకు అర్థం అయింది మనషులను మనం ఎంత తక్కువగా నమ్ముతామో అంత తక్కువగా మోసపోతాము. మనం నష్టాలను ఎదుర్కోము. అందువలన చాలా సంతోషంగా కూడా ఉంటాము అనీ, నాలానే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ....!!!!
సర్వే జనా సుఖినోభవంతు
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
నా పేరు: కిడాల శివకృష్ణ.
వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.
నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
Comments