top of page
Dr. Kanupuru Srinivasulu Reddy

శుభమస్తు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Subhamasthu' New Telugu Story Written By Dr. Kanupuru Srinivasulu Reddy


రచన : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి





“కాసేపయినా నోరు మూసుకోనుండవా? చావన్నా రాలేదు. మాకు పట్టిన శని..”


ఇవి ఎవ్వరో శతృవులు, గిట్టని వాళ్ళు, ఇరుగుపొరుగు వాళ్ళు ఛీ కొట్టిన మాటలు కాదు. స్వయాన కడుపున పుట్టిన ఒక్కగా నొక్క కొడుకు తల్లిమీద కురిపించిన ప్రేమ పరంపర, ఆప్యాయత పొంగు.


ఆవిడ, ఏమో అనరాని మాటలు అని కాదు. అదేవిటో ఎలాంటి మంచి చెప్పినా దరిద్రం.. శని.. అని ఉన్న ముగ్గురూ కస్సుమంటారు. ఏవిటో ఆ తల్లి పేద పిచ్చమ్మ అదృష్టం . అర్ధం గాని అపనిందల ఆశీర్వాదాలు.

‘తప్పుమాట అన్నానా!?’ అని బాధ గుండె గూట్లో దాక్కుని గొణగ సాగింది. ‘చిన్నతనం. ఇంకా మంచి చెడులు తెలియని అమాయకుడు.. పిచ్చి మాలోకం నా బిడ్డ’ అని అనుకుంది. ఎనభై సంవత్సరాల పిచ్చమ్మకు యాబై పదులు దాటిన కొడుకు మీద వాత్సల్యం పొంగు కొచ్చింది.


ముప్పై దాటినా, పెండ్లిగాని పెద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగి మనవడు. ఈ మధ్య ఏదో గొడవలో ఇరుక్కుని ఉద్యగం తీసే వేస్తారని, జైలుకు కూడా వెళ్ళాల్సి వస్తుందని విన్నది. పాపం బిడ్డ ! పిచ్చివాడిలాగా అయిపోయాడు. దిగులుగా కూర్చున్న అతన్ని చూస్తే మనసు తరుక్కు పోయేది.


ప్రతి రోజు ప్రతి క్షణం కోటి సార్లు మొక్కుకునేది. భగవంతుడా! కరుణించు. ఉద్యోగం వచ్చి పెండ్లి జరిగితే జీవితం నీకు అంకితమిస్తా అని పరితపించి పోయేది.


మనవడు ఆఫీసు చుట్టూ రోజూ తిరుగుతూనే ఉన్నాడు. విసుకుంటున్నాడు ,తనలో తిట్టుకుంటున్నాడు. దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పాలని ఓదార్చాలని ఎంతగానో ఉంది, కానీ పిలిస్తే అంటరానిదాన్ని చూసినట్లు చూస్తాడు. ఎవరో అమ్మాయిని ఇస్తామని అన్నారు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకు, తన మనవడు చేసే కంపెనీ వాళ్ళు చాలా బాగా తెలుసని, అది జరిగితే దశ తిరిగినట్టేనని గుసలాడుతుంటే వినేసింది. చూడడానికి వెళుతుంటే ‘అంతా శుభమే జరుగుతుంది’, తన ఆప్యాయత ఆతృతను అణు చుకోలేక దీవిస్తే , వెళ్ళినట్టే వెళ్లి తిరిగి వచ్చేసారు. ట్రైను తప్పి పోయిందని నిప్పులు కురిపించారు. వెళ్ళే ముందు నువ్వు శుభం చెప్పకే, అని ఎన్ని సార్లు చెప్పాను అని నోటికొచ్చినట్లు పడ్డాడు కొడుకు.


“పోనీ లేరా ! పిల్లను చూడలేదు. ఇస్తామంటే మాత్రం... ! ఎలా ఉంటుందో ఏమో? మన మంచికే లే!”


ఆ మాటలు విని,” ఎవడిస్తాడే ముదిరిపోయిన బెండకాయకు. వాళ్ళు ఎదో పాపం పోనీ లెమ్మని...” గొంతు పిసకడానికి పోయాడు కొడుకు. ఇది బాగాలేదు, అది బాగాలేదని వచ్చినవన్నీ అడ్డుకొట్టింది కోడలే!


“ నా మనవడికేం తక్కువ..మన్మధుడు. కాక పోతే వెంట్రుకలు కొంచెం పైకి... అక్కడక్కడా నాలుగు తెల్ల వెంట్రుకలు...” అంతే ముగ్గరూ దూకారు పిచ్చమ్మ మీదకు. “ నువ్వే శని. బతికుంటే ఈ జన్మలో పెండ్లి కాదు. తల్లి వై పోయావు.” అంటూ కొడుకు నొసట దబా దబా బాదుకున్నాడు. కోడలు జుట్టు విరబోసుకుని పోలేరమ్మ పూనినట్లు చిందులు వేసింది . మనవడు నిప్పు వెలిగించుకున్నాడు.


బిత్తరపోయి చూసింది. అర్ధమే కాలేదు, వాళ్లకు పిచ్చి ఏమయినా పట్టిందా అని. ఏం తిట్టలేదు, ఎగతాలి చేయ్యలేదు, ఉన్న మాట అంది. ఈ కాలంలో ఇరవై ఏళ్లకే వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి. మరి ఎందుకు వీళ్ళు...? అమాయక శిఖామణులు. వీళ్ళు ఎలా బతుకుతారో? అని దిగులు పడింది పిచ్చమ్మ.


“ అది కూడా పోయిందా? ఇక నాకు పాడి కట్టే వరకు ఈ ముసిల్ది నోరు ముయ్యదు.” అంటూ బాధపడిపోతున్న మనవడ్ని చూసి. వీడు తండ్రి కంటే పిచ్చివాడు అని నవ్వుకుంది పిచ్చమ్మ. చిన్నప్పుడు గోరు ముద్దలు తినిపించాలంటే దొరక్కుండా తిప్పి తిప్పి చంపేవాడు. అలిసి పోయి పట్టిన చెమటనంతా పైట చెరుగుతో తుడిచి, నీళ్ళు తాగించి ఒడిలో వడిసిపట్టి ఎన్నెన్నో కధలు చెప్పి, పిల్లిలా, కాకిలా కూతలు పెట్టి, భూచోడు ఎత్తుకు పోతాడని భయపెట్టి తినిపించి, తన కడుపు నిండినంత తృప్తిగా ఆనందంతో పండిన కన్నీళ్లు తుడుచుకునేది. వాడు చెప్పే ముద్దు ముద్దు మాటలకు మురిసి ముక్కలై, ఈ వయస్సులోనే ఎంత తెలుసు ఈ చిన్ని కుంకకు అని ఆశ్చర్యంతో తలమునకలయ్యేది. ఇప్పుడేవిటి అర్ధంగాగుండా మాట్లాడుతున్నాడు బహుశా చదివినాడు కదా ఇంగిలీసు అందు వలన అయి ఉంటుంది!!


కొడుకు వైపు చూసింది తల పట్టుకు కూర్చొని ఉన్నాడు. పాపం తల నొప్పిగా ఉందేమో.తన దగ్గరున్న అమృతాంజనం డబ్బా కోడలు చేతికి ఇవ్వబోయి, దగ్గరకెళ్ళి చేతికి తీసుకుని నొసట రాయబోతే విసురుగా తల తిప్పుకుని,” నువ్వు కాస్సేపు గమ్మనుంటావా! ఆ మంచం మీద చావు. పడితే మేం ఎక్కడ చచ్చేది.” అని ఆసహ్యంగా విసుకున్నాడు. అరుపుకు ఆశ్చర్యపోయి అంతలోనే నవ్వుకుంది పిచ్చమ్మ.


“అంతా శుభమే జరుగుతుంది. వాళ్లకు ఫోన్ చెయ్యి . ఈ రోజే అంటే, కారులో పో!!”

“దగ్గరుందా ? ఎంత అవుతుందో తెలుసా?” అని అరిచాడు కొడుకు .

“ఎంతయితే ఏముందిరా! కావాలనుకున్నప్పుడు పెట్టాలికదా! నా దగ్గర ఉంది ఇస్తాలే!”


“ఇంకో మాట మాట్లాడావంటే చంపేస్తాను. నీ డబ్బుతో పోతే మా శవాలు తిరిగి వస్తాయి.”

కళ్ళల్లో నీళ్ళు పొంగుకొచ్చాయి పిచ్చమ్మకు. అందుకా పువ్వుల్లో పెట్టి పెంచింది.నా మాట నా డబ్బు అంత దరిద్రం తెస్తుందా? వాటి తోనే కదా మంచి ఉద్యోగం , సొంత యిండ్లు, పదిరూపాయిలు కూడబెట్టగలిగాడు. మరి ఎందుకు నా మీద ఇంత ద్వేషం అసహ్యం. అదంతా తమాషాకు,నిజం కాదు. తానంటే ప్రాణం. అనుకున్నది కలిసి రావడం లేదని విసుగులో!1 ఓర్పు , సహనం తగ్గిందేమో!? పాపం నా బిడ్డ!!


ఎప్పటికో కదిలి ఫోను చేసాడు. రైలు మధ్యలోనే ఇంజెన్ ఫెయిల్ అయి నిలిచి పోయింది. విపరీతమైన వానలు పడుతున్నాయి. మీరు రాకపోవడమే మంచిదయింది. మరో ముహూర్తం చూద్దాం అని చెప్పిన తరువాత కాస్త శాంతించాడు. పిచ్చమ్మ తను చెప్పి నట్టే జరిగిందని సంతోషించింది.


“ ఈవిడ వాక్కు దరిద్రం, ట్రైన్లో ఉన్న వాళ్ళందరికీ కొట్టినట్లుంది. బజారుకు పోయెస్తా! వండి తగలేయ్యాలిగా!” అని అత్తను ఉరిమి చూస్తూ ఒక విసురు విసిరి బయలుదేరింది కోడలు.


“జాగర్తమ్మ. ఆటోలు , మోటారు సైకిళ్ళు, వొళ్ళు తెలియడం లేదు గాడిదలకు.” అంది పిచ్చమ్మ.


మాకు తెలుసులే!” అంటూ విసురుగా వెళ్లినామె, “నా కాలు.. నా కాలు” అని ఏడుస్తూ తిరిగొచ్చేసింది. చూస్తే బొటన వేలు నలిగి రక్తం కారుతుంది. ఆటో కొట్టిందంట ఈమెకు కాలు, మరోక ఆమెకు నడుం విరిగి ఆసుపత్రికి వేసుకెల్లారంట. అంతే శవ పురాణం చదివారు కొడుకు, కోడలు, మనవడు. యాసిడ్ తెచ్చి నోరు మూసుకు పోయేటట్లు చెయ్యాలని తీర్మానించారు. నీ ఆశీస్సులు మాకు దరిద్రం నోరు తెరవకు అని ఎన్ని సార్లు చెప్పాం అని నానా బూతులు తిట్టారు, తల్లి అయిన, నానమ్మ అయిన, అత్త అయిన పిచ్చమ్మను.


తేలిగ్గా పోయింది కదా, మరొకామె చావు బతుకుల్లో ఉంది కదా! మనకు మంచి జరిగిందని ఎందుకు అనుకోలేదు. ఏవిటో వీళ్ళ తిక్క ఎట్లా బ్రతుకుతారో ఏమో? పెద్దల దీవెనలు శుభాలు అవుతాయని కాస్త కూడా ఆలోచించరు. పోనీలే అంటే అన్నారు. వాళ్ళు చల్లగా ఉంటే చాలు అని మొక్కుకుంది పిచ్చమ్మ.


ఆ రోజు అందరూ విపరీతమైన ఆందోళనతో, భయంతో విసుగుతో తను చుట్టూ తిరుగుతున్న వాళ్ళను చూసి ఏం జరిగిందో అడగాలని , ఓదార్చాలని తపించి పోయింది పిచ్చమ్మ. తను పలకరిస్తే మరీ..?.బలవంతంగా నోరు గప్పేట్టుకుంది. ఆ రోజే మనవడి మీద వచ్చిన అభియోగానికి తీర్పు. చెడుగా వస్తే జీవితం నాశనం అయిపోతుంది. మంచిగా రావాలని...శుభాశీస్సులు అందచెయ్యాలని మనసులోని ఆప్యాయత, మమకారం తోసుకు వచ్చాయి.


బయలు దేరబోతున్నాడు. వెళుతున్న మనవడ్ని,’ శుభం జరుగుతుంది. బయపడకు. క్షేమంగా వెళ్లి లాభంగా రా! అని తన ప్రమేయం లేకుండానే అనేసింది. “జరగదు, జరగనే జరగదు , నీ దరిద్రపు నోటితో చెపితే!!” అంతే వెనక్కు తిరిగి చంపేటట్లు చూసి, ముందుకు అడుగు వేసాడు . ద్వారబంధం తలగొట్టుకుంది. ‘అబ్బా’ అంటూ కూర్చునేసి విసురుగా లేచి పిచ్చమ్మ గొంతు పట్టుకుని తన విసుగు, కోపం అంతా చూపించాడు. తల్లి తండ్రి వచ్చి బలవంతగా విడ దీసి , బయటికి పంపారు. తిడుతూనే వెళ్ళాడు .

నేనేమన్నానని..నేనే మన్నానని పొంగు కొస్తున్న కన్నీళ్లను అదుపు చేయలేక పోయింది పిచ్చమ్మ . కొడుకు కోడలు పాడుతున్న శాపనార్ధాల శ్రావ్య గీతాలు వింటూ, అంటే అననీ, శుభం జరిగితే చాలు..జరగాలి అని పదే పదే అనుకుంటూ అలాగే శూన్యం లోకి చూస్తూ చేతులు ఆకాశం వైపు చాపి పడుకునేసింది.

దేవుడుకూడా పరిష్కరించ లేని సమస్యనుంచి బయటపడిన మనవడు ఎగిర గంతులేస్తూ పొంగిపోతూ, పలవరిస్తూ, ఆనందంతో గంతులు వేస్తూ, నానమ్మ నా దేవత ,ఆమె మాట బ్రహ్మా వాక్కు. ఆమె ఆశీస్సులు దేవుళ్ళ వరాల జల్లులు, పాదాలకు రోజూ పూజించాలి అని పొంగిపోతూ వస్తే, విని సంతోషించడానికి....? కింద పడుకోబెట్టి ఉన్న పిచ్చమ్మ...???

***సమాప్తం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి

రచయిత పరిచయం : డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి.. నమస్తే ! నా కధ ప్రచురణకు నోచుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. నా గురించి గొప్పగా ఏమీ లేదు. సాహిత్యం అంటే మక్కువ. ప్రయోగాలు చెయ్యాలని అభిలాష. చాలా సంవత్సరాల ముందు కధలు రాసేవాడిని. అన్నీ కూడా ఆంధ్రప్రభ, ఆంద్ర జ్యోతిలలో ప్రచురితమైనవి. కొన్ని కారణాల వలన సాహిత్యానికి దూరం అయినాను. 2010 నుండి నవలలు, భావకవితలు రాయడం మొదలుపెట్టాను. మరో హృదయం-మరో ఉదయం{నవల} ,గీతాంజలి అనువాదం, నీకోసం అనే భావకవిత్యం, చీకటిలో మలివెలుగు {నవల} ప్రచురించడం జరిగింది.


43 views0 comments

Commenti


bottom of page