top of page

కాడి ఎద్దే పేదకు పెద్ద దిక్కు


'Kadi Edde Pedaku Pedda Dikku' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally

Published In manatelugukathalu.com On 01/12/2023

'కాడి ఎద్దే పేదకు పెద్ద దిక్కు' తెలుగు కవిత

రచన : సుదర్శన రావు పోచంపల్లి


పేదవాడికి అన్నం బెట్టే - పెద్ద దిక్కే కాడి ఎద్దురా

హలం బట్టి పొలం దున్ని- హంగు జూసి విత్తనమేస్తె

పొట్ట నింపే పడ్డెడన్నం - మట్టి నుండే పుట్టుతుందిరా

మరి వెట్టి చాకిరి - వదలి పెట్టరా

నీలి మేఘం నీకు దైవం- కాలి నడుకే తేరువైతె

పైరు పంటలె - పరువు నీకు

డొక్క నిండని - బుక్కెడన్నం

దొరల కొలువు - దొడ్డ శాపం

పాచి అన్నం- పాత గుడ్డలు

పేచి ఇంకా - పెనవేసుకోక

కండబలం గుండె బలం - కలిగి యుండగ

కాళ్ళ బేరం - మానుకోరా

కలవారి సేవ లింకా - కట్టిబెట్టరా

చేవ నీది చెమట నీది - చేను బెంచెడి శక్తి నీది

రక్తమంతా రంగరించి - శక్తి నంతా ధారబోసి

భయం భక్తితొ మెలుగుచున్న - భజన వాళ్ళదె చేయుచున్నా

బొజ్జ నింపి - పూసెజ్జపైన

బోర్లపండి - పొరలు దొరలకు

నీ గోడు దెలువదు - నీ ఈడు దెలువదు

ధర్మ మెరుగని - దగాకోరుల

ఖర్మ కొదలి - కదలి రారా

నీ ధర్మమెరిగి - నడుచుకోరా

నీవు గూడా మనిషివేరా - నిజం తెలిసి నడుచుకోరా

పేదవాడికి అన్నం బెట్టే - పెద్ద దిక్కే కాడి ఎద్దురా.


-Sudarsana Rao Pochampally

46 views0 comments
bottom of page