top of page
Writer's pictureSrinivasarao Jeedigunta

మా గేదె పెంపకం


'Ma Gede Pempakam' New Telugu Story

Written By Jidigunta Srinivasa Rao

'మా గేదె పెంపకం' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


అది 1965 వ సంవత్సరం. గుడివాడలో మా ఇంటికి వంటమనిషి వచ్చింది. ఆవిడకి 65 సంవత్సరాల వయసు వుంటుంది. ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు. ఒకరోజు సాయంత్రం మా ఇంటికి వచ్చి “నేను ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ని. వున్న ఒక్క కూతురిపెళ్లి చేసి నేను ఒక్కదానిని మిగిలిపోయాను. నాకు మీ ఇంటిలో చోటిస్తే మీకు వండిపెట్టి, నేను గుప్పెడు మెతుకులు తింటా”నని కళ్ళు నీళ్లు పెట్టుకుని అడుగుతోవుంటే మా నాన్నగారికి జాలివేసి, మా అమ్మవంక చూసి “నీకు సహాయముగా ఉంటుంది. వుండమందామా” అన్నారు. “ఎవరు లేరంటున్నారు కదా.. వుండమనండి. ఒక గుప్పెడు అన్నం మనతోనే తింటా”రని, ఆవిడ చెయ్యి పట్టుకుని వంటగదికి తీసుకువెళ్ళింది మా అమ్మ. ఆవిధముగా మాయింటిలో ప్రవేశించిన ఆవిడ వెంకాయమ్మగారు మా బామ్మలాగా మమ్మలని చక్కగా చూసుకునేది. అప్పట్లో మాకు పాలు పొసే అమ్మాయితో రోజూ నీళ్ల పాలు పోస్తోంది అని గొడవ వుండేది. ఇది చూసి వెంకాయమ్మగారు మా అమ్మతో " మనమే ఒక గేది ని కొనుకుందాము. ఈ నీళ్ల పాలకు ఇస్తున్న డబ్బుకి చక్కగా గేది ని కొనుక్కుని చిక్కటి పాలు పిల్లలకి ఇవ్వవచ్చు” అన్నారు. “అబ్బే.. మనం గేది ని సాకటం కష్టం, ఎందుకొచ్చిన గొడవ” అని అంటున్న మా అమ్మ తో వెంకాయమ్మగారు “మీకెందుకు.. నేను గేది బాధ్యత తీసుకుని మీకు ఏ యిబ్బందిలేకుండా చూస్తాను" అని ఒప్పించటమేకాక మా నాన్నని ఒప్పించే బాధ్యత కూడా మా అమ్మ కి అప్పగించింది వెంకాయమ్మగారు. చివరికి అతికష్టం మీద మా నాన్నకి నచ్చచెప్పి ఒక మంచి రోజు అదివారం గుడ్లవల్లేరు గొడ్లసంతకి వెళ్ళాము- నేనూ, వెంకాయమ్మగారు. మా పెట్టుబడి వంద రూపాయలు. మా డబ్బుకి గేది కాదు కదా దూడ కూడా రాదని తెలుసుకున్నాక ఏమిచేయాలో తెలియక ఒక చెట్టు నీడలో కూలబడ్డాం. ఇంతలో మమ్మలని చాలాసేపునుంచి గమనిస్తున్న ఒక అతను మా దగ్గరికి వచ్చి “గేది ఎంతలో కావాలి మామ్మగా”రన్నాడు. “మాకు మంచి గేది వంద లో కావాలి, ఇక్కడ అంత మంచి గేదిలు కనిపించటం లేద”న్నారు వెంకాయమ్మగారు తెలివిగా. దానితో ఆ లుంగీకట్టుకుని వచ్చినవాడు, “ఇక్కడ దగ్గరలో మాకు తెలిసినవారు మంచి పాడి గేదిని అమ్ముతామన్నారు, పదండి. అక్కడకి తీసుకువెళ్తా”నని మమ్మలని చాలాదూరం నడిపించి, చివరకి ఒక గుడిసె ముందుకు తీసుకువెళ్లాడు. మేమొచ్చిన అలికిడివిని లోపలనుంచి ఒక బక్కటి అతను వచ్చి, “ఏమిటిరా బావ, బేరం తీసుకువచ్చావా” అని, మమ్మలని తీసుకువచ్చినవాడితో ఏవో గుసగుసలాడి మాదగ్గరికి వచ్చి "మా గేది బాగా పాలు యిస్తుంది అమ్మ గారు, డబ్బు అవసరం పడి అమ్ముతున్నాను” అన్నాడు. “ఎన్ని పాలు ఇస్తుంది పూటకి?” అని వెంకాయమ్మగారు అడిగితే వాడు ఒక నవ్వు నవ్వి “మీకు యిప్పుడే చూపిస్తానుగా” అంటు ఒక పెద్ద చెంబు తీసుకుని గేది వున్నచోటికి తీసుకువచ్చాడు. చెంబునిండా వున్న పాలని చూసి వెంకాయమ్మగారి మొహం చెంబంతైంది. అయితే వాడు ఆ గేది పాలు వారం రోజులనుంచి తీయకుండా ఆపడం, కొంత వాటర్ కలపటం వలన ఎక్కువ పాలుగా చూపించాడు అని తెలియదు. అనుకున్న డబ్బు, మా ఇంటి అడ్రసు ఇచ్చి గేదిని, దూడని త్వరగా పంపమని చెప్పి, బస్ ఎక్కి అర్ధరాత్రికి ఇంటికి చేరుకున్నాము. ఒక గంట తరువాత గేది, దూడ కూడా రావటం, వాటిని చూసి మా నాన్నా చిరాకుగా మొహంపెట్టి ‘ఇంత ముసలి గేదిని కొన్నారేమిటి’ అన్నారు. "అబ్బే ప్రయాణ బడలిక వలన ఆలా కనిపిస్తోంది, మీకెందుకు రేపు ఉదయము గుండు చెంబుడు పాలు తీసి చూపిస్తాను " అన్నారు వెంకాయమ్మగారు. అప్పటికే సిద్ధం చేసిన పచ్చగడ్డి, ఎండుగడ్డి దాని ముందు పడేసి తెల్లవారి ఎప్పుడు అవుతుందా అనుకుంటూ కలత నిద్ర పోయి, తెల్లవారవగానే అందరం గేది వున్న చోటుకి చేరుకున్నాము. ఏమిటో రాత్రి కంటే ఇప్పుడు ఇంకా ముసలిదాని లాగా కనిపించింది. ఇంతలో వెంకాయమ్మగారు పెద్ద గిన్ని పట్టుకుని వచ్చి, పాలు తీయటం మొదలు పెట్టింది. అరగంట అయినా ఒక చుక్క పాలు రాలేదు. "ఏమిటే నీకు బడలిక పోలేదా.. పాలు యివ్వు” అని గేదిని కసరుతో పిండగా పిండగా పావు సేరు పాలు ఇచ్చి మా వంక జాలిగా చూస్తోంది గేది. మా నాన్నకి కోపం వచ్చి "ఇంకా పిండి దాని ప్రాణం తీయకండి. చచ్చు గేదిని కొనుక్కుని వచ్చారు. పైగా గేదిని పెంచిన అనుభవం వుంది అని ఒక నాటకం. " అని నన్ను బయటకి వెళ్ళి పాలు కొనుక్కురమ్మన్నారు. దానికి వెంకాయమ్మగారు "ఈ పావుసేరు చిక్కటిపాలులో ఒక చెంబుడు నీళ్లు కలిపితే మన పాలమ్మయీ యిచ్చే పాలకన్నా బాగుంటాయి, ఇంకా కొనక్కరలేదు. సాయంత్రం తప్పకుండా యిప్పుడివి కూడా కలిపి ఇస్తుం”దని చెప్పి, మా చేత తెలగపిండి, ఉలవలు, కొబ్బరి చెక్క తెప్పించి వంట పని మా అమ్మకి అప్పగించి వీటిని గేదికి తినిపిస్తో కూర్చున్నారు సాయంత్రం దాకా. మేము లంచ్ చేసి కాసేపు పడుకున్నాము.. రాత్రి సరిగ్గా నిద్రలేకపోవటం వలన మాకందరికి మొద్దు నిద్ర పట్టింది. ఇంతలో దొడ్డివైపునుంచి "చచ్చిన్రో నాయనా " అని అరుపు వినిపించితే మేమందరం పరుగున వెళ్లి చూస్తే వెంకాయమ్మగారిని గేది తన్నటం, ఆవిడ ఒక చోట, చెంబు ఒక చోట పడివున్నారు. నవ్వు ఆపుకుంటూ ఆవిడని లేపి బలవంతాన యింట్లోకి తీసుకువచ్చి మంచం మీద కుర్చోపెట్టాం. కానీ పాపం చట్ట కి దెబ్బ బాగా తగిలినట్లుంది ఒకటే మూలుగు. ఇంటిలో వున్న నొప్పి మాత్ర ఇచ్చి “పడుకోండి, ఈ పూట వంట మేము చేసుకుంటా”మని మా అమ్మ అని వంట మొదలుపెట్టింది. చీకటి పడ్డాక వచ్చిన మా నాన్నగారు "ఈ పూట ఎమైనా పాలు ఇచ్చిందా " అని అడిగారు. "ఉదయం కంటే పరవాలేదు, చూద్దాము, నాలుగురోజులు మన తిండి వంటపడితే అదే ఇస్తుంది" అని అమ్మ సర్ది చెప్పింది. రెండవరోజుకి నొప్పి తో పాటు జ్వరం రావటం తో వంటావిడి లేవలేదు. మేమందరం గేదికి కట్టిన తాడుని గట్టిగా పట్టుకోవటం, అలవాటు లేకపోయినా మా అమ్మగారు, పాలు తీయటం. ఒక చిన్న గ్లాసుడు పాలు ఇచ్చి గేది జాలిగా చూడటం, ఇది వరస. ఈ విధముగా కొన్నాళ్ళు చూసి, ఈ గ్లాసుడు పాలకోసం ఎందుకు ప్రయాస, అనుకుని మాకు పాలు పోస్తున్న అమ్మాయిని, ఈ గేదిని దూడని గడ్డితో సహా నువ్వు తీసుకో, డబ్బు ఏమి యివ్వక్కరలేదని చెప్పి, ఎలాగో ఒప్పించి మా దగ్గర నుంచి వదుల్చు కున్నాము. మిగిలిన గడ్డితో చలిమంట వేసుకున్నాము. విచిత్రం యిటు గేది వెళ్లిపోవటం, మంచం మీదనున్న వెంకాయమ్మగారు హుషారుగా మంచం దిగి వంటగది కి వెళ్లటం జరిగిపొయాయి. గేది విషయం మర్చిపోయాము, 2 నెలలతరువాత ఒక సాయంత్రం దొడ్డి తలుపుని తోసుకుంటూ మా గేది, మంద నుంచి తప్పించుకుని వచ్చి వెనుక దొడ్డ్లో వున్న పచ్చ గడ్డి మేస్తోంది. ఇప్పుడు తళతళ మెరుస్తో పుష్టిగా కనిపించింది. ఇంతలో వెనుకనుంచి వెంకాయమ్మగారు ఒక చిన్న చెంబు తీసుకుని వచ్చి, “గేది మనం ఏమి అమ్మలేదు గా, దీనిమీద మనకి హక్కువుంది” అంటు, పాలు తీయటం మొదలుపెట్టారు. విచిత్రం చిన్న గిన్ని నిండి ఇంకో పెద్ద చెంబు కూడా పాలతో నిండిపోయింది. గేది కూడా విజయగర్వంతో మా వంక చూసింది. ఇంతలో మా పాలబ్బాయి పరుగెత్తుకుంటూ వచ్చి “అమ్మ గారు, గేది మంద నుంచి తప్పించుకుంది, యిక్కడకేమైనా వచ్చిందా”ని అడుగుతోనే, దొడ్డివైపునున్న గేదిని చూసి “ఇక్కడకి వచ్చావా, మన ఇల్లు ఇది కాదే” అంటూ తాడు కట్టి తీసుకువెళ్తూ ‘వస్తానమ్మా’ అన్నాడు. “అబ్బాయీ.. ఒకసారి వుండు, ఒక మాట చెప్పు. మోపులు మోపుల గడ్డి, కేజీలకొద్దీ తవుడు పెట్టినా పావుశేరు పాలు యివ్వలేదు మా దగ్గర. అదేమిటి రా నీ దగ్గర రెండు నెలలువుందో లేదో, సేరున్నర పాలు యిచ్చింది, ఏ o మాయ చేసావు అంటే, పాలబ్బాయి నవ్వుతో "బ్రాహ్మిన్స్ కి గేది పెంపకం ఎందుకమ్మా! మేమున్నాముగా, పాలు పోస్తాము. కొనుక్కుని హాయగా తాగండి” అని గేదిని తోలుకుని వెళ్లిపోయాడు. కొసమెరుపు ఏమిటంటే ఆ నెల ౩౦ రోజులకు రోజుకు ఒక రెండు శేరులు చొప్పున 60 కి, మా ఇంటికి గేది తప్పించుకుని వచ్చినప్పుడు మేము పిండుకున్న శేరున్నర పాలకి కలిపి డబ్బు తీసుకున్నాడు పాలబ్బాయి. ***

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.









65 views1 comment

1 comentário


Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
07 de mai. de 2023

Sai Praveena jeedigunta • 14 hours ago

Chala bagundi

Curtir
bottom of page